💥💥 దక్షిణామూర్తి స్తోత్రం💥💥

 ⚜️🕉️🚩 ఓం శ్రీ గురు దక్షిణామూర్తయే నమః🌹🙏

💥🌼💥🌼💥🌼💥🌼💥


ఇంట్లో ఒక దక్షిణామూర్తి చిత్ర పటము పెట్టి, ప్రతీ రోజూ 10 నిమిషాలు ఆయన ముందు కూర్చుని, ఆయన స్తోత్రమును కానీ, మంత్రమును కానీ చేస్తే... 

అపమృత్యువు తొలగిపోతుంది.

మేధా శక్తి పెంపొందుతుంది.

ధారణ, స్పష్టత కలుగుతాయి.

కేవలము విద్యార్ధులకు మాత్రమే కాదు, అన్ని వయసుల వారికీ ఇది వర్తిస్తుంది.

మంచి ఆలోచనలు కలుగుతాయి.

సత్వ గుణం వృద్ధి చెందుతుంది.

ప్రారబ్ధ కర్మలు, దుష్కర్మల ఫలితం క్షీణిస్తుంది.

ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి.


స్తోత్రము లేదా మంత్రము చదవలేని వారు ఉంటే కేవలము శ్రీ దక్షిణామూర్తి చిత్రపటాన్ని అలా చూస్తూ కూర్చున్నా విశేష ఫలితము ఉంటుంది.

రాబోవు జన్మలలో కూడా దక్షిణామూర్తి అనుగ్రహం వలన మంచి విద్య వస్తుంది.


"దక్షిణామూర్తి స్తోత్రం" చాలా మహిమాన్వితమైనది.

విద్య ఎంతో బాగా వస్తుంది. ఎన్నో సమస్యల్ని దూరం చేస్తుంది.

కేవలం విద్య మాత్రమే కాదు.. విద్యార్థులకు విద్యని..

సాధకులకు జ్ఞానాన్ని.. అటుపిమ్మట సిద్ధ స్థితిని కూడా ఇవ్వగలిగే మహిమాన్విత స్తోత్రం.

ఏ స్తోత్రములు చదవాలో తెలియక సమస్యలని ఎదుర్కొనే శక్తి లేనప్పుడు ఒక్క దక్షిణామూర్తి స్తోత్రం సంపూర్ణంగా సకల సమస్యలకు పరిష్కారం చూపుతుంది. 


💥💥 దక్షిణామూర్తి స్తోత్రం💥💥


ధ్యానమ్

మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్త్వం యువానం|

వర్షిష్ఠాన్తే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్ఠైః |

ఆచార్యేన్ద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం|

స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే || 1 ||


వటవిటపిసమీపే భూమిభాగే నిషణ్ణం

సకలమునిజనానాం జ్ఞానదాతారమారాత్ |

త్రిభువనగురుమీశం దక్షిణామూర్తిదేవం|

జననమరణదుఃఖచ్ఛేదదక్షం నమామి || 2 ||


చిత్రం వటతరోర్మూలే వృద్ధాః శిష్యా గురుర్యువా |

గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తుచ్ఛిన్నసంశయాః || 3 ||


నిధయే సర్వవిద్యానాం భిషజే భవరోగిణామ్ |

గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః || 4 ||


ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే |

నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః || 5 ||


చిద్ఘనాయ మహేశాయ వటమూలనివాసినే |

సచ్చిదానందరూపాయ దక్షిణామూర్తయే నమః || 6 ||


ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే |

వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః || 7 ||


ఇతి శ్రీ ఆదిశంకరాచార్య విరచితం "దక్షిణామూర్తి స్తోత్రం సంపూర్ణం



సేకరణ... 💐🙏


Comments

Popular posts from this blog

వైశాఖ అమావాస్య శని జయంతి.

ఓం శ్రీ లక్ష్మి నృసింహస్వామినే నమః 🌹🙏

🌺🏵️🌼పూలపండుగ.. బతుకమ్మ🌹🙏