షణ్ముఖుని రూపవిశిష్టం 💥🙏
⚜️🕉️🚩 ఓం షణ్ముఖాయ నమః🌹🙏
🌼🏵️🌼🏵️🌼🏵️🌼🏵️
🍁గురుస్వరూపుడు సుబ్రహ్మణ్యుడు🍁
పరమ పురుషుడు – శివుడు (లేదా విష్ణువు),
అవ్యక్త శక్తి – ఉమాదేవి (లేదా లక్ష్మి)
వీరిరువురి సంయోగమైన సమ న్యాయమూర్తి కుమారస్వామి.
కుమారస్వామిని అర్చించడం అంటే, పార్వతీ పరమేశ్వరులను (లక్ష్మీ నారాయణులను) ఆరాధించడమే.
కాలకాలుడు శంకరుడు.
"కాలాగ్ని" అని పిలువబడే ఈ అఖండ రుద్రమూర్తి యొక్క తేజస్సే "సంవత్సరాగ్ని",
ఈ సంవత్సరాన్ని ఆధారం చేసుకొనే కాలగణన సాగుతుంది.
ఈ సంవత్సరాగ్నికి సంకేతమే – పన్నెండు చేతులు, ఆరు ముఖాలు.
ద్వాదశ హస్తాలూ పన్నెండు మాసాలకు,
ఆరు ముఖాలూ ఆరు ఋతువులకూ సంకేతాలు.
స్వామి కూర్చున్న మయూరం "చిత్రాగ్ని" అనబడే అగ్నితత్వమే వర్ణాలకు సంకేతమిది.
అగ్ని, అమృతాల సమైక్యమూర్తి (అగ్నీ సోమాత్మకం) సుబ్రహ్మణ్యుడు.
స్వామి చేతిలో ఉన్న శక్తి ఆయుధం, అమ్మవారు ఇచ్చినదే.
"శివజ్ఞాన ప్రదాయిని" అయిన శ్రీమాత
ఇచ్చిన ఆ శక్తి బలం – జ్ఞానం.
"అహంకారం స్కందం" అని చెప్పబడ్డ ప్రకారం...
సృష్టిలోనూ, ప్రతి జీవులలోనూ "నేను" అనే భావనే స్కందుడు.
మనస్సుతో కలిపి అయిదు జ్ఞానేంద్రియాలూ ఉన్న "అహంకారమే" కుమారస్వామి.
ఇచ్చ, జ్ఞాన, క్రియ – ఈ మూడు ఈ ఆరు ముఖాలతో సాగుతున్నాయి.
ఇచ్ఛా, జ్ఞాన, క్రియా రూప మహిశక్తిధరం భజే!
శివశక్తి జ్ఞానశక్తి స్వరూకమ్!! (శివపురాణం)
మహా మహిమాన్వితమైన షట్కోణం షణ్ముఖునికి ప్రతీక.
అన్ని కోణాలనుండి సమగ్రంగా విషయ జ్ఞానం సాధించగలిగే నిశితమైన బహుముఖప్రజ్ఞే "షణ్ముఖీ ప్రతిభ"
బ్రహ్మ, విష్ణు, శివాత్మక పరబ్రహ్మ శక్తిగా సుబ్రహ్మణ్యుని "మురుక" అన్నారు.
"ము" కారస్తు ముకుంద:స్యాత్
"రు" కారో రుద్రవాచక:!
"క" కారో బ్రహ్మనాదీ చ మురుకో గుహవాచకం!! (స్కందపురాణం)
రహస్యమైన బ్రహ్మజ్ఞానమే ‘గుహ’ రూపం.
అదే గురురూపం.
🍁"స్కందపురాణం"లో కుమారస్వామి జననం గురించి ఇలా వివరించబడింది.
శివుడు ధ్యాన నిష్టలో వున్న సమయంలో ఆయన తపస్సును భంగపరచడానికి మన్మధుడు వచ్చాడు.
మన్మధుడు ఉపయోగించిన కామశరాలు శివునిపై పడగా కోపించిన శివుడు తన జ్ఞాననేత్రం తెరిచాడు.
దాంతో మన్మదుడు భస్మమయ్యాడు.
పరమేశ్వరుని జ్ఞాననేత్రం నుంచి కదలిన జ్ఞానాగ్ని మన్మదుని భస్మం చేసి, ఆకాశాన పయనిస్తుండగా దాన్ని వాయువు సంగ్రహించి తాళలేక, మోయలేక అగ్నిదేవునికిచ్చాడు.
అగ్నిదేవుడు కూడా శివుని తేజాన్ని తనలో నిలుపుకోలేక గంగాజలంలో పడేశాడు.
ఆ దివ్యతేజాన్ని గంగ కూడా తనలో నిలుపుకోలేక శరవణంలో పడేసింది.
ఆ రెల్లుపొదలో కుమారస్వామి ఆవిర్భవించాడు. అందువల్ల కుమారస్వామి #శరవణుడు అని కూడా అంటారు.
మంగళకరమైన శివుని మూడవ కంటినుంచి ఉద్భవించిన జ్ఞానకిరణమే కుమారస్వామి జన్మకు కారణమైంది.
🍁రూప విశిష్టం:
కుమారస్వామికి ఆరు తలలు వుండడం చేత షణ్ముఖుడు అనే పేరు వచ్చింది.
సుబ్రహ్మణ్యస్వామి జ్ఞానస్వరూపం.
అందుచేతనే అజ్ఞాన స్వరూపులైన రాక్షసులను హతమార్చాడు.
అజ్ఞానానికి ఆరు తలలుంటాయి. అవే – కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం అనే "అరిషడ్వర్గాలు"
ఆ ఆరు దుర్గుణాలున్న అజ్ఞాన రాక్షసిని ఆరుతలలు ఉంటే తప్ప చంపలేరు.
దైవ సంపదయైన ఆరు తలలు కలిగి అసుర సంపదకు సంభవించిన అరిష్టడ్వర్గాలనే ఆరు తలలను తుంచివేయాలి.
ఇదే షణ్ముఖుని రూపవిశిష్టం.
సేకరణ... 💐⚜️
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment