గో మహిమ గురించి శివపార్వతుల సంభాషణ 💥

 ⚜️🕉️🚩 సకల దేవతల నిలయం #గోమాత 🌹🙏

💥🌷💥🌷💥🌷💥🌷💥


గోమాత🐄 దర్శనము చేయునప్పుడు చదివే శ్లోకాలు:--


నమో గోభ్యః శ్రీమతీభ్యః సౌరభేయాభ్య ఏవచ l

నమో బ్రహ్మనుతాభ్యశ్చ పవిత్రాభ్యో నమోనమః ll


🍁భావం:-

శ్రీమంతంబులై కామధేను సంతతులైన బ్రహ్మాదులచే స్తుతించబడిన పవిత్రములైన గోవులకు నా నమస్కారము.


గావో మమాగ్రతః నను గావో మే సంతు పృష్టతః l

గావో మే హృదయం నిత్యం గవాం మధ్యే వసామ్యాహం ll


🍁భావం:--

గోవులు నాముందు-వెనుకలందు యుండుగాక. గోవులే నా హృదయము. గోవుల మధ్యయందు నేను నివసించుచున్నాను.


సర్వ దేవమయే దేవి సర్వ దేవైరలం కృతే l

మమాభిలషితంకర్మ సఫలం కురు నందిని ll


🍁భావం:--

ఓ గోమాతా ! సర్వదేవతాస్వరూపిణి, సర్వదేవతలచే అలంకరింపబడినదానా ! నా కోర్కెలను సఫలం చేయుము.


💥 గో మహిమ గురించి శివపార్వతుల సంభాషణ 💥


ఒకానొకప్పుడు పార్వతీదేవి కైలాసమున పరమశివుని భక్తితో పూజించి, నాథా ! స్త్రీలు తెలిసి తెలియక ముట్లు, అంటు కలిపిన దోషం, పెద్దలను, బ్రాహ్మణులను, భక్తులను దూషించిన దోషం, పరులను హింసించిన దోషం, పరులను హింసించిన పాపం ఏ విధముగా పరిహారమగునో చెప్పవలసినదిగా ప్రార్థింపగా...


దయామయుడగు పరమశివుడు "ఓ పార్వతీ! గోవునందు సమస్త దేవతలు కలరు. అట్టి గోవును పూజించిన సర్వపాపములు నశించును.


ఆ గోవు నందు

పాదములు - పితృ దేవతలు,

కాళ్ళల్లో -  సమస్త పర్వతాలు, మారుతీ కూడా కలరు.

నోరు - లోకేశ్వరం, నాలుక - నాలుగు వేదములు,

భ్రూమధ్యంబున - గంధర్వులు, దంతాన -  గణపతి, ముక్కున - శివుడు, ముఖమున - జ్యేష్ఠాదేవి,

కళ్ళలో - సూర్య చంద్రులు,

చెవులలో -  శంఖు-చక్రాలు,

కొమ్ములలో - యమ, ఇంద్రులు ఉన్నారు.

కంఠమున - విష్ణువు, భుజమున - సరస్వతి,

రొమ్మున - నవగ్రహాలు, 

మూపురమున - బ్రహ్మదేవుడు,

గంగడోలున - కాశీ, ప్రయాగ నదులు ఉండును. 

ఉదరమున - పృధ్వీ దేవి,

వెన్నున - భరద్వాజ, కుబేర, వరుణ, అగ్ని మొదలగు దేవతలు ఉన్నారు.

తోకన - చంద్రుడు, తోక కుచ్చున - సూర్య కిరణములను,

తోలు - ప్రజాపతి, రోమావళి -త్రిశంత్కోటి దేవతలు

పిరుదుల యందు - పితరులు,

కర్రి - కావేరిబోలు, పొదుగు -  పుండరీకాక్షుని బోలు,

స్తనాలు - సప్త సముద్రాలు,

పాలు - సరస్వతి నది, పెరుగు - నర్మదా నది,

నెయ్యి - అగ్ని, బొడ్డున - శ్రీకమలం,

కడుపులో - ధరణీ దేవతలు,

గోమయంలో - శ్రీ మహాలక్ష్మి కలదు.

గోపాద ధూళి - సమస్త పుణ్య నదులు, తీర్థములు కన్నా గొప్పది.


కావున ఓ పార్వతీ ! ఈ గోమాహాత్మ్య వర్ణనను ఉదయం పఠిస్తే బ్రహ్మ హత్యా మహాపాతకములన్నియు తొలగును.


ప్రతి అమావాస్యనాడు పఠిస్తే మూడు నెలల మహా పాపములు తొలగును.


నిత్యము సంధ్య వేళ పఠించిన మహాలక్ష్మి అనుగ్రహము కలుగును.

గోవును ఎవరైతే మనస్ఫూర్తిగా పూజిస్తారో వారి

మూడు తరాల పితృదేవతలు తరించెదరు.


గోవుకు తృప్తిగా మేత, సెనగలు, బెల్లం తినిపించిన సమస్త దేవతలు తృప్తి పడెదరు.


గోవుకు మనసారా నమస్కరించిన మంచి ఫలితము

నిచ్చును.

గోవుకు ఐదు సార్లు ప్రదక్షిణం చేసిన భూ ప్రదక్షిణంతో

సమానం.

గోవును పూజించితే సమస్త దేవుళ్ళను పూజించి

నట్లగును.

గోమాతను దర్శించి గో ప్రదక్షిణం చేయవలెను.


గోవులకు సేవ చేయడం వలన ఎన్నో జన్మలలోని పాపాలు నశిస్తాయి, మంచి సంతానం కలుగుతుంది, సులభంగా దైవ అనుగ్రహం లభిస్తుంది, అష్టైశ్వర్యాలు కలుగుతాయి, ఎల్లపుడూ శుభమే జరుగుతుంది.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

ఓం శ్రీ లక్ష్మి నృసింహస్వామినే నమః 🌹🙏

వైశాఖ అమావాస్య శని జయంతి.

💥సింహాచల చందనోత్సవం💥