రామ, శివుల మధ్య జరిగిన సంభాషణే "శివగీత"గా ఆవిర్భవించింది.

 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏

🌷🌼🌷🌼🌷🌼🌷🌼🌷


💥💥 శివగీత 💥💥


సీతమ్మ కోరిక తీర్చేందుకు "మాయలేడి"ని తీసుకురావటానికి వెళ్లాడు రామయ్య.

ఇదే అదనుగా చేసుకుని కపటవేషంతో సీతమ్మను అపహరించాడు రావణుడు.

తిరిగి వచ్చిన రామయ్య ఆశ్రమంలో సీతమ్మ కనబడక పోయేసరికి ఎంతో ఆవేదన చెందాడు.

సీతమ్మ తోడు లేకుండా జీవించడం వ్యర్థమని భావించి ఆత్మత్యాగంతో జీవితాన్ని ముగించాలని అనుకున్నాడు.


ఇంతలో అక్కడకు "అగస్త్య మహర్షి" వచ్చాడు.

జరిగిన విషయం తెలుసుకుని రాముడిని ఊరడించాడు.

మోహాన్ని విడిచిపెట్టమని చెబుతూ "పాశుపత దీక్ష" ఉపదేశించాడు. దీన్ని "విరజా దీక్ష" అని కూడా అంటారు.

రామచంద్రుడు తదేక దీక్షతో శివార్చన చేస్తూ తపస్సులో లీనమయ్యాడు.

ఆ తీవ్ర తపస్సుకు మెచ్చిన శివుడు ప్రమథ గణాలతో సహా ప్రత్యక్షమయ్యాడు. 


భీకరమైన ప్రమథ గణాల శబ్దాలకు కలవరపడిన రాముడు.. అదంతా రాక్షసమాయ అనుకుని తన చాపాన్ని ఎక్కుపెట్టాడు.

శస్త్రాస్త్రాలను ప్రయోగించాడు.

విచిత్రంగా అవన్నీ ఓ మహాతేజస్సులో ఐక్యమయ్యాయి.

చివరకు రాముడి చేతి నుంచి కోదండం కూడా జారిపోతుంది.

అమ్ములపొది శరీరం నుంచి తనంతట తానుగా విడిపోతుంది.

ఈ హఠాత్పరిణామానికి నివ్వెరపోయాడు రామయ్య.

ఆ మహా తేజస్సు ముందు మోకరిల్లాడు.


పరమేశ్వరుడు పార్వతీసమేతంగా ప్రత్యక్షమై రాముడికి దివ్యమైన ఆయుధాలు ప్రసాదించాడు.

శివప్రసాదంగా వీటన్నిటినీ స్వీకరిస్తూనే తన సందేహాలను నేరుగా శివుడినే అడిగాడు రామయ్య.

మరింత దయతో వాటన్నిటికీ ఓపికగా సమాధానాలు చెప్పాడు  శివుడు.

ఇలా రామ, శివుల మధ్య జరిగిన సంభాషణే "శివగీత"గా ఆవిర్భవించింది. 


భగవద్గీతను నరుడికి నారాయణుడు ఉద్బోధిస్తే,

శివగీతను నారాయణుడికి హరుడు ఉపదేశించాడు.


భగవద్గీత అర్జునుడికి కర్తవ్యాన్ని వివరిస్తే..

శివుడు వివరించిన గీతాసారం శ్రీరాముణ్ణి కార్యోన్ముఖుణ్ణి చేసింది. 


నారాయణుడైనా నరుడుగా జీవనం సాగిస్తున్న శ్రీరాముడు ఆవేదనతో కూలబడ్డాడు.

సీతా వియోగాన్ని తట్టుకోలేనంటూ ఆత్మ త్యాగానికి సిద్ధపడ్డాడు.


"కామ క్రోధాదయ స్సర్వే దహ్యంత్యేతే తనుం మమ

అహంకారోపి మే నిత్యం జీవనం హంతుముద్యతః"


అరిషడ్వర్గాలు నా దేహాన్ని దహించివేస్తున్నాయి.

నా కర్తవ్య నిర్వహణకు అవసరమైన మార్గాన్ని ఉపదేశించండి అంటూ శివుడిని ప్రార్థించాడు. 


పరమేశ్వరుడు ఊరడించాడు.

ఆత్మవివేకం కలిగించాడు.. అదే శివగీతగా సమస్త మనవావళికి మార్గ నిర్దేశం అయ్యింది.


ఇలా రామ, శివుల మధ్య జరిగిన సంభాషణే "శివగీత"గా ఆవిర్భవించింది.

వ్యాసమహర్షి రచించిన పద్మ పురాణం, ఉత్తరఖండంలో శివగీత వివరించబడినది.


దేహం జడపదార్థం. పాంచభౌతికమైంది.

జీవుడనే వాయువు దేహం నుంచి బయటకు రాగానే మిగిలేది కేవలం భస్మరాశి మాత్రమే.

అది కూడా చివరకు గంగ పాలవుతుంది.

నశించనిది ఆత్మ మాత్రమే.

దానికి చావు పుట్టుకలు లేవు.

బూడిదకుప్పగా మిగిలే భౌతిక శరీరం కోసం ఎందుకంత తీవ్రంగా ఆవేదన చెందుతావంటూ పరమేశ్వరుడు శ్రీరామచంద్రమూర్తికి చేసిన జ్ఞానబోధేే "శివగీత"


భవబంధాల సంకెళ్లలో బందీగా మారిన మానవుడిని ఊరడించి, అతడిలో కర్తవ్యదీక్షను తట్టిలేపే చైతన్య గీతికగా శివగీత కనిపిస్తుంది.


నవవిధ భక్తి మార్గాల్లో శరణాగతి అత్యుత్తమమైందని మహర్షులు చెబుతారు. ఇందుకు ప్రతీకగా ఈ గీత.. శివ శరణాగతితో ప్రారంభమై శివ శరణాగతితోనే ముగుస్తుంది. 


తనను శరణు కోరినవారి యోగక్షేమాలను పరమేశ్వరుడే చూసుకుంటాడు.

అంతటి దయాళువు పరమేశ్వరుడు.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️




Comments

Popular posts from this blog

వైశాఖ అమావాస్య శని జయంతి.

ఓం శ్రీ లక్ష్మి నృసింహస్వామినే నమః 🌹🙏

🌺🏵️🌼పూలపండుగ.. బతుకమ్మ🌹🙏