భారతీయ సంస్కృతికి ఇతిహాసాలు రెండు. వాల్మీకి మహర్షి ప్రణీతమైన రామాయణము. శ్రీ వేదవ్యాస భగవానుడు అనుగ్రహించిన శ్రీమహాభారతము.

 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏

🌷🌼🌷🌼🌷🌼🌷🌼🌷


💥💥విష్ణుసహస్రనామం విశిష్టత ఏమిటి?💥💥


భారతీయ సంస్కృతికి ఇతిహాసాలు రెండు.

వాల్మీకి మహర్షి ప్రణీతమైన రామాయణము.

శ్రీ వేదవ్యాస భగవానుడు అనుగ్రహించిన

శ్రీమహాభారతము.


శ్రీ మహాభారతమునకు రెండింటి వల్లనే గౌరవం

అని పెద్దల యొక్క సూక్తి.

అందులో మొదటిది శ్రీ కృష్ణభగవానుడు అనుగ్రహించిన భగవద్గీత.

రెండవది భీష్మ పితామహుడు లోకానికి ప్రసాదించిన "విష్ణు సహస్రనామ స్తోత్రము"


ఈ రెండింటిలో మొదటి దానిని శ్రీకృష్ణుడు

అర్జునునకు ఉపదేశం చేసి సంజయుని ద్వారా లోకానికి అందించాడు.

రెండవ దానిని భారత సంగ్రామానంతరం అంపశయ్యపై పడియుండిన భీష్మపితామహుని ద్వారా శ్రీకృష్ణపరమాత్మ పాండవులకు ఉపదేశం చేయిస్తూ లోకాన్ని తరింపచేసాడు.


ఈ రెండింటిలో భగవద్గీత కంటే విష్ణు సహస్రనామ స్తోత్రం వల్లనే సులభంగా తరించవచ్చని కృష్ణుని అభిమతం.


ఇందులో 108 శ్లోకాలున్నాయి. 

భారతీయ జ్యోతిషశాస్త్ర ప్రకారం మనకు ఉన్న నక్షత్రాలు 27.

ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి.

అంటే 27 నక్షత్రాలు 4 చే భాగిస్తే వచ్చేది 108.

ఒక్కొక్క నక్షత్రానికి 4 శ్లోకాలు చొప్పున కేటాయిస్తే 108 పాదాలకు 108 శ్లోకాలు అవుతాయి.


సమస్త మానవాళిని ఉద్దరించడానికి పుట్టిందే విష్ణుసహస్రనామం.

దీనిని అందరూ పారాయణం చేయవచ్చు.

విష్ణుసహస్రనామ పారాయణానికి ఎలాంటి నియమాలు లేవు.

విష్ణు సహస్రనామాలు భీష్మపితామహుడు పాండవులకు చేసిన మహోపదేశం.

కురుక్షేత్ర మహాసంగ్రామం ముగిసిన తర్వాత భీష్ముడు అంపశయ్యపై ఉన్నాడు.

సుమారు నెల రోజులు గడిచిపోయిన తర్వాత ఒకనాడు పాండవులతో మాట్లాడుతూ శ్రీకృష్ణుడు హఠాత్తుగా మధ్యలో ఆపేశాడు.


పాండవులు కంగారుపడి ఏమైంది అని శ్రీకృష్ణుడిని అడిగారు.

దీనికి కృష్ణుడు

"మాంధ్యాతి భగవాన్ భీష్మః తపోమే తద్దతం"

కురుక్షేత్రంలో అంపశయ్యపై పవళించి ఉన్న భీష్ముడు

నన్ను స్మరించుకుంటున్నాడు.. అందుకే నామనస్సు అక్కడికి మళ్లింది. పాండవులారా బయలుదేరండి అక్కడకు మనం వెళ్లాం.. భీష్ముడు ఆస్తికాగ్రేసరుడు, ధర్మాలను అవపోశనం పట్టినవాడు అని చెప్పి వారిని వెంటబెట్టుకుని వెళ్లాడు.


ఈ సమయంలోనే భీష్ముడు శ్రీకృష్ణుని స్తుతిస్తూ విష్ణు

సహస్రనామాలను ఉపదేశం చేశాడు.


ఈ స్తోత్ర పారాయణం సకల వాంఛితార్థ ఫలదాయకమని నమ్మకం.

స్తోత్రం ఉత్తర పీఠిక (ఫలశ్రుతి) లో ఈ శ్లోకం

"ధర్మార్థులకు ధర్మం, అర్థార్థులకు అర్థం, కామార్థులకు

కామం, ప్రజార్థులకు ప్రజను ప్రసాదించును" అని పేర్కొన్నారు.


దివ్య కేశవ కీర్తనను వినేవారికి, చదివే వారికి ఏవిధమైన అశుభాలు ఉండవు.

బ్రాహ్మణులకు వేదవిద్య, గోవులు,

క్షత్రియులకు విజయం, వైశ్యులకు ధనం, శూద్రులకు సుఖం లభిస్తుంది.

ధర్మం కోరుకువారికి ధర్మం, ధనం కోరుకున్నవారికి ధనం లభిస్తుంది.

భక్తితో వాసుదేవుని నామాలను కీర్తించేవారికి కీర్తి, శ్రేయస్సు దక్కి వారి రోగాలను హరిస్తుంది.


నామం అందరూ చెప్పవచ్చు.

మంత్రజపం చేసేవారు స్థాణువులాగా ఉండి చేయాలి.

కానీ నామం మాత్రం అటూ ఇటూ తిరుగుతూ, నిలబడి, కూర్చొని, పని చేసుకుంటూ చేయవచ్చు. 


స్వప్న, సుషుప్తులకు అధిదేవత పరమశివుడు.

కాబట్టి రాత్రి నిద్రపోయే ముందు పదకొండుసార్లు శివనామం స్మరించాలి.


జాగృతికి అధిదేవత శ్రీ మహావిష్ణువు.

అందువల్ల ఉదయం లేస్తూనే శ్రీహరీ శ్రీహరీ శ్రీహరీ అంటూ పదకొండుసార్లు స్మరించాలని పండితులు ఉవాచ.


దుఃస్వప్నే స్మర గోవిందం సంకటే మధుసూదనమ్! 

కాననే నారసింహం చ పావకే జల శాయినమ్!! 

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️




Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు