శ్రీ గాంగేయం వహ్నిగర్భం శరవణ జనితం జ్ఞానశక్తిం కుమారం బ్రహ్మణ్యం స్కందదేవం గుహమమల గుణం రుద్ర తేజస్వరూపం

 🕉️⚜️🚩 ఓం శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః 🌹🙏

🌷💥🌷💥🌷💥🌷💥🌷💥


💢ధ్యాన శ్లోకము💢


శ్రీ గాంగేయం వహ్నిగర్భం శరవణ జనితం జ్ఞానశక్తిం కుమారం 

బ్రహ్మణ్యం స్కందదేవం గుహమమల గుణం రుద్ర తేజస్వరూపం

సేనాన్యం తారకఘ్నం గురుమచలమతిం కార్తికేయం షడాన్యం

సుబ్రహ్మణ్యం మయూరధ్వజ రథ సహితం దేవదేవం నమామి


🍁గంగాదేవి  శివుని శక్తిని కొంత సేపు మోసి, శక్తిని భరించలేక రెల్లు గడ్డిలోకి త్రోయటంవలన గాంగేయుడు అని,

అగ్ని శివుని శక్తిని తన వద్ద ఉంచుకొని గంగలో విడుచుట వలన అగ్నిగర్భుడని,

జ్ఞాన శక్తి పరబ్రహ్మమని, గుహుడని,

అమలమైన గుణము కలవాడని,

రుద్రుని తేజస్స్వరూపమని, దేవతల సేనాపతియని,

తారకాసురుని చంపిన వాడని,

జ్ఞానానికి నిధియై గురు స్వరూపమని,

అచలమైన బుద్ధి కలవాడని,

రెల్లు గడ్డి నందు పుట్టినందు వలన శరవణభవుడని,

ఆరుముఖములు ఉండుట వలన షడాననుడు అని,

నెమలిని అధిరోహించినందు వలన మయూర ధ్వజుడని, రథముని అధిరోహించిన వాడు అని ఈ ధ్యాన శ్లోకము ద్వారా ప్రార్ధించబడినాడు.

🔹🔸🔹🔸🔹🔸🔹🔸🔹


కుమార, కార్తికేయ, సుబ్రహ్మణ్య, షణ్ముఖ మొదలైన నామములతో పిలవబడే స్కందుడు పరమశివుని రెండవ పుత్రుడు.

కోడి పుంజు (కుక్కుటం) ఇతని ధ్వజము.

నెమలి ఇతని వాహనము.

ఈయన శక్తులు (పత్నులు) వల్లి మరియు దేవసేన. 

ఇతని ఆయుధము శూలము.


తను తపస్సు చేయుచుండగా భంగము చేయ వచ్చిన మన్మథుని శివుడు తన మూడో నేత్రముతో దగ్ధము చేస్తాడు.

ఆ అగ్నిని అగ్నిదేవుడు, వాయుదేవుడు ఆకాశ మార్గమున గంగానదిలో పడవేస్తారు.

దాని తేజోశక్తిని భరించలేక గంగాదేవి దానిని ఒడ్డున ఉన్న రెల్లుగడ్డిలోకి నెడుతుంది.

ఆ విధముగా పంచ భూతముల శక్తితో శివుని దివ్య తేజము ఏకమై ఆరు ముఖములు గల స్కందునిగా జన్మిస్తాడు.


స్కందుని జననం గురించి శ్రీమద్రామాయణంలో వాల్మీకి మహర్షి వివరంగా చెప్పారు.


జ్ఞాన రూపమైన శివుని మూడో నేత్రమునుండి జన్మించిన వాడు కాబట్టి కార్తికేయుడు జ్ఞానావతారునిగా పేరు పొందాడు.


శరవణమను సరస్సులో రెల్లు గడ్డి పెరిగే చోటనున్న ఆరు కమలముల నుండి పార్వతీ దేవి ఈ స్కందుని తీసుకున్నదట.

సర్వోన్నత ఆధ్యాత్మిక అనుభూతి  అనేది

యోగములో షడ్చక్రముల భేదన ద్వారా  కలుగుతుంది.

ఈ ఆరు చక్రముల భేదన ద్వారా జీవ శక్తి సహస్రార చక్రమున పూర్ణ స్థితిని అనుభూతి పొందుతుంది.

దీనికి సంకేతమైన ఆరు కమలములనుండి ఆవిర్భవించిన స్కందుడు సర్వోన్నత జ్ఞానమునకు, బుద్ధికి ప్రతీకగా నిలిచాడు.

అందుకనే స్కందుడు అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించే (ఈ ప్రపంచములో అజ్ఞాన రూపమైన అసురులను సంహరించే దైవిక శక్తి) పరిపూర్ణ జ్ఞాన స్వరూపముగా కొలవబడుతున్నాడు.


అవిద్య మరియు జ్ఞానము, దేవతలు మరియు అసురుల మధ్య జరిగే నిరంతర యుద్ధము, వాటి పరిణామమైన దైవిక శక్తుల విజయం - ఇదే సుబ్రహ్మణ్యుని లీలల సారము.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

ఓం శ్రీ లక్ష్మి నృసింహస్వామినే నమః 🌹🙏

వైశాఖ అమావాస్య శని జయంతి.

💥సింహాచల చందనోత్సవం💥