శ్రీ సత్యనారాయణాష్టకం💥🙏
⚜️🕉️🚩 ఓం శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి నమో నమః🌹🙏
💥🌷💥🌷💥🌷💥🌷
మేరువు కుమారులైన భద్రుడు, రత్నాకరుడు మహావిష్ణువు అనుగ్రహంతో భద్రగిరి, రత్నగిరిగా మారినట్లు పురాణ కథనం.
శ్రీమన్నారాయణుడు భద్రగిరిపై శ్రీరామచంద్రుడిగా, రత్నగిరిపై సత్యనారాయణ స్వామిగా అవతరించినట్లు చెబుతారు.
సత్యదేవుని కొలువు సర్వదేవతా నిలయం.
శ్రీ సత్యనారాయణ స్వామి వారిని
"మూలతో బ్రహ్మరూపాయ
మధ్యతశ్చ మహేశ్వరం
అధతో విష్ణురూపాయ
త్ర్త్యెక్య రూపాయతేనమః"అని స్తుతిస్తారు.
అన్నవరం వీర వెంకట సత్యనారాయణస్వామి త్రిమూర్తి రూపం.
భక్త సులభుడిగా, కోర్కెలు నెరవేర్చే సత్యదేవుడిగా ఆయనపై అందరికీ అచంచల విశ్వాసం.
ఏదైనా పని తలపెట్టినప్పుడు సత్యనారాయణ వ్రతం ఆచరిస్తే అనితర సాధ్యమైన మనోబలం సొంతమవుతుందని చెబుతారు.
కార్తికమాసంలో త్రిమూర్తుల అభేదానుభవాన్నిచ్చే మీసాలరాయుని దర్శనం చాలా మంచిదని నమ్మకం.
🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔸
💥💥 శ్రీ సత్యనారాయణాష్టకమ్ 💥💥
ఆదిదేవం జగత్కారణం శ్రీధరం లోకనాథం విభుం వ్యాపకం శఙ్కరమ్ ।
సర్వభక్తేష్టదం ముక్తిదం మాధవం సత్యనారాయణం విష్ణుమీశం భజే || 1 ||
సర్వదా లోక-కల్యాణ-పారాయణం దేవ-గో-విప్ర-రక్షార్థ-సద్విగ్రహమ్ ।
దీన-హీనాత్మ-భక్తాశ్రయం సున్దరం సత్యనారాయణం విష్ణుమీశం భజే || 2 ||
దక్షిణే యస్య గఙ్గా శుభా శోభతే రాజతే సా రమా యస్య వామే సదా ।
యః ప్రసన్నాననో భాతి భవ్యశ్చ తం సత్యనారాయణం విష్ణుమీశం భజే || 3 ||
సఙ్కటే సఙ్గరే యం జనః సర్వదా స్వాత్మభీనాశనాయ స్మరేత్ పీడితః ।
పూర్ణకృత్యో భవేద్ యత్ప్రసాదాచ్చ తం సత్యనారాయణం విష్ణుమీశం భజే || 4 ||
వాఞ్ఛితం దుర్లభం యో దదాతి ప్రభుః సాధవే స్వాత్మభక్తాయ భక్తిప్రియః ।
సర్వభూతాశ్రయం తం హి విశ్వమ్భరం సత్యనారాయణం విష్ణుమీశం భజే || 5 ||
బ్రాహ్మణః సాధు-వైశ్యశ్చ తుఙ్గధ్వజో యేఽభవన్ విశ్రుతా యస్య భక్త్యాఽమరా ।
లీలయా యస్య విశ్వం తతం తం విభుం సత్యనారాయణం విష్ణుమీశం భజే || 6 ||
యేన చాబ్రహ్మబాలతృణం ధార్యతే సృజ్యతే పాల్యతే సర్వమేతజ్జగత్ ।
భక్తభావప్రియం శ్రీదయాసాగరం సత్యనారాయణం విష్ణుమీశం భజే || 7 ||
సర్వకామప్రదం సర్వదా సత్ప్రియం వన్దితం దేవవృన్దైర్మునీన్ద్రార్చితమ్ ।
పుత్ర-పౌత్రాది-సర్వేష్టదం శాశ్వతం సత్యనారాయణం విష్ణుమీశం భజే || 8 ||
అష్టకం సత్యదేవస్య భక్త్యా నరః భావయుక్తో ముదా యస్త్రిసన్ధ్యం పఠేత్ ।
తస్య నశ్యన్తి పాపాని తేనాఽగ్నినా ఇన్ధనానీవ శుష్కాణి సర్వాణి వై || 9 ||
ఇతి శ్రీ సత్యనారాయణాష్టకం సంపూర్ణమ్ ।
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment