💥💥 శ్రీ భల్లలేశ్వర గణపతి 💥💥

 ⚜️🕉️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏

🏵️🌼🏵️🌼🏵️🌼🏵️🌼🏵️


💥💥 శ్రీ భల్లలేశ్వర గణపతి 💥💥


   "వేదో సంతువైభవో గజముఖో భాక్తాభిమానియో 


         భల్లలేరశ్య సుభక్త పాల నారద"


- అని భక్తులచే పిలువబడుతూ, బాల భక్తుడిని అనుగ్రహించేందుకు స్వయంభూగా వెలసిన శ్రీ భల్లలేశ్వర గణపతి.


సాధారణంగా ఏ కోవెల స్థల పురాణం విన్నా భగవంతుడు మహానుభావులనో , ఇతర దేవీదేవతలనో అనుగ్రహించేందుకు అవతరించడం వింటూ వుంటాము.

కాని "శ్రీ భల్లలేశ్వర గణపతి"  చిన్న బాల భక్తుని కొరకై

స్వయంభుగా అవతరించాడు.


🍁స్థల పురాణం🍁


గణేశ పురాణం ప్రకారం కృతయుగంలో (మహారాష్ట్రలోని రాయఘఢ్ జిల్లాలో, సుధగఢ్ తాలుకాలో వున్న పాలీ గ్రామం)

ఈ పాలీ గ్రామం సింధు ప్రాంతానికి చెందినదిగా వుండేది.

ఈ గ్రామంలో కల్వాణుడు అనే వైశ్యుడు వుండేవాడు.

అతను ఇందుమతి అనే కన్యను వివాహం చేసుకొని పూర్ణ చంద్రునివంటి పుత్రుని పొందాడు.

ఆ పుత్రునకు "భల్లాలుడు" అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు.

ఆ బాలుడు అందరు పిల్లల వలె ఆటపాటలతో సమయము వెచ్చించక తన వద్దనున్న బొమ్మలను ఎదురుగా నున్న రాళ్లను పెట్టి వాటిని దేవతా మూర్తులుగా భావించి భక్తి  పారవశ్యంతో పూజ చేసుకొనేవాడు.

భల్లాలుని చూచి అతని తోటి బాలురు కుడా అతని వలెనే రాళ్లనే దేవతా మూర్తులుగా భావించి పూజలు చేసుకొనే వారు.


అదే విధముగా ఓ రోజు పిల్లలందరూ వూరి బయట అడవిలోకి వెళ్లి అక్కడ వారికి కనిపించిన ఓ రాయిని వినాయకునిగా భావించి కొందరు పూజాది కార్యక్రమాలు నిర్వహించగా...

మరి కొందరు ఆ రాయి పైన వెదుళ్ళు కట్టెలతో పందిరి నిర్మించి, మరికొందరు నాట్యగానములతో గణేశునకు వినోదము కలిగించుటకు ప్రయత్నిచగా

మరికొందరు గణేశుని కధలు గానం చెయ్యసాగారు. 


భక్తి పారవశ్యంలో మునిగి వున్న పిల్లలకు ఆకలి దప్పులు, రాత్రి పగలు తెలియ రాలేదు.

రోజులు గడచినను పిల్లలు ఇళ్ళకు చేరక పోయేసరికి వారి వారి తల్లితండ్రులు ఇది భల్లాలుని వల్లనే జరిగినదని భావించి కల్వాణుని యింటికి వెళ్లి భల్లాలుని వల్లనే తమ పిల్లలు తమ మాట వినుట లేదని ఆరోపించి పిల్లలను వెదుకుటకు వెళ్తారు. 


ఊరిబయట అడవిలో తమ పిల్లలను వున్నట్లు గుర్తించి ఇళ్ళకు తీసుకొని వెళ్తారు.

ఊరి వారి మాటల ప్రభావానికి లోనైన కల్వాణుడు ఇంటికి మరలి రమ్మని భల్లాలుని కోరగా గణేశుని  ధ్యానంలో మునిగి వున్న అతను వినిపించుకోడు. 


కల్వాణుడు క్రోధించి అతనిని రక్తము వచ్చునట్లు కొట్టి తాళ్ళతో చెట్టునకు కట్టి "నీ దేవుడే నిన్ను కట్లు విప్పి రక్షించునని" పలికి ఊరిలోకి వెళ్ళిపోతాడు.

సరియైన ఆహారము లేక నెత్తురు కారుతున్న దెబ్బలవలన భల్లాలుడు స్పృహ కోల్పోతాడు.


కొంత సమయానంతరము తెలివి వచ్చిన భల్లాలుడు తనకు సపర్యలు చేయుచున్నది స్వయంగా గణేశుడేనని తెలుసుకొని మిక్కిలి ఆనందము పొంది భగవంతునకు సష్ఠాంగ నమస్కారములు చేసి అనేక స్తోత్రములు చదివి తన్ను కాపాడి రక్షించినట్లుగానే కలియుగానంతరము వరకు భక్తులను బ్రోవమని కోరెను.

సంతోషించిన గణేశుడు అక్కడే స్వయంభూగా అవతరించి ఆ బాలభాక్తుని పేరుమీదనే శ్రీ భల్లలేశ్వరునిగా పూజలందుకుంటున్నాడు.


ఎడమ వైపుకి తిరిగిన తొండంతో తూర్పు ముఖంగా కూర్చోని ఉండి..

రెండు కళ్ల స్థానాలలో రెండు వజ్రాలు పొదగబడి,

రిద్ధి  సిద్ధి లచే చామర సేవలందుకుంటున్న  వినాయకుడు దర్శనమిస్తాడు.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️




Comments

Popular posts from this blog

ఓం శ్రీ లక్ష్మి నృసింహస్వామినే నమః 🌹🙏

వైశాఖ అమావాస్య శని జయంతి.

💥సింహాచల చందనోత్సవం💥