Posts

Showing posts from January, 2022

ఓం సాయి రామ్

Image
 ఓం సాయి రామ్ గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్‌ పరబ్రహ్మ తస్మైశ్రీ గురువే నమః🙏 శ్లో" ప్రత్యక్షే గురవ: స్తుత్యా: పరోక్షే మిత్ర బాంధవా:!       కర్మాంతే దాస బృత్యాశ్చ న కదాచన పుత్రకా: !! 🌹భా:- "గురువులను వారి సమక్షములో ప్రస్తుతించాలి. మిత్రులనూ, బంధువులనూ వారి పరోక్షంలో ప్రశంసించాలి. అప్పగించిన కార్యములను పూర్తి చేసిన తరువాతనే దాసులనూ భృత్యులనూ మెచ్చుకోవాలి.  సంతానాన్ని మాతరం ఎన్నడూ పొగడకూడదు." అని మన సనాతన ధరం హితవు పలుకుతొంది.  అలా అని పిల్లల ప్రతిభను పట్టించుకోవద్దని కాదు;  అది ప్రోత్సాహపూర్వకమైన ఆశీర్వాదంగా ఉండాలే కానీ అహంకారాన్ని పెంచే పొగడ్తలా ఉండకూడదు. 🌹జీవితాన్ని స్వర్గమయం చేసుకోవటం మన చేతుల్లోనే ఉంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా, వాళ్లకు చెడు చేయకుండా, బాబా సూక్తులు పాటిస్తూ జీవితం గడిపితే స్వర్గం ఎక్కడో కాదు, భూమి మీదనే వుంటుంది.        🌹శ్రీ సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై🌹

ఓం సాయి రామ్

Image
                                 ఓం సాయి రామ్

🚩 ఓం నమో వేంకటేశాయ 🙏శ్రీవేంకటేశ్వర ద్వాదశ నామ స్తోత్రం

Image
 🕉️ ⚜️🚩 ఓం నమో వేంకటేశాయ 🙏 🌹అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు " శ్రీవేంకటేశ్వర స్వామి" 🌹బ్రహ్మ అంతటి వాడు ఎంతో కాలం తపస్సు చేసి సంపాదించిన మహా మంత్రం " శ్రీవేంకటేశ " మహామంత్రం .  🌹భక్త శిరోమణి "అన్నమయ్య" నిత్యం శ్రీ వేంకటేశ నామాన్ని కీర్తన చేసి ముక్తిని పొందాడు.  🌹అటువంటిది 12 నామాలు గల ఈ శ్రీ వేంకటేశ్వర ద్వాదశ నామ స్తోత్రమును త్రిసంధ్యాం (మూడు సంధ్యా కాలాలలో) పఠించే వారికి అన్ని పాపాలు తొలగి విష్ణు సాయుజ్యం లభిస్తుంది. 🌹 శ్రీవేంకటేశ్వర ద్వాదశ నామ స్తోత్రం🌹 అస్య శ్రీ వేంకటేశ ద్వాదశ నామ స్తోత్ర మహామంత్రస్య బ్రహ్మా ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీ వేంకటేశ్వరో దేవతా ఇష్టార్థే వినియోగః | నారాయణో జగన్నాథో వారిజాసనవందితః | స్వామిపుష్కరిణీవాసీ శంఖచక్రగదాధరః || 1 || పీతాంబరధరో దేవో గరుడాసనశోభితః | కందర్పకోటిలావణ్యః కమలాయతలోచనః || 2 || ఇందిరాపతిగోవిందః చంద్రసూర్యప్రభాకరః | విశ్వాత్మా విశ్వలోకేశో జయ శ్రీవేంకటేశ్వరః || 3 || ఏతద్ద్వాదశనామాని త్రిసంధ్యం యః పఠేన్నరః | దారిద్ర్యదుఃఖనిర్ముక్తో ధనధాన్యసమృద్ధిమాన్ || 4 || జనవశ్యం రాజవశ్యం సర్వకామార్థసిద్ధిదమ్ | దివ్యతేజః సమాప...

🚩 ఓం శ్రీ మాత్రే నమః🙏 🌹 శ్రీ దుర్గా పంచరత్న స్తోత్రం🌹🙏

Image
 🕉️🔱🚩 ఓం శ్రీ మాత్రే నమః🙏 🌹విశ్వమంతా వ్యాపించి, నిర్వహించే పరమ చైతన్యం "జగదాంబ" ఏ "శక్తి" వలన బ్రహ్మాదిపిపీలిక పర్యంతం చేతనమవుతున్నదో ఆ శక్తే "దేవి" 🌹 శ్రీ దుర్గా పంచరత్న స్తోత్రం🌹🙏 తే ధ్యాన యోగానుగతాపస్యన్ త్వామేవ దేవీం స్వగునైర్నిగూడాం త్వమేవ శక్తిహి పరమేశ్వరస్య మాం పాహి సర్వేశ్వరీ మోక్షధాత్రి || 1 || 🌹భావం నిరంతరము ధ్యాన యోగమునందు మునులు యోగులు మున్నగువారు సత్వరజస్తమో గుణములచే వ్యక్తము కాకుండగా ఉన్న సకల దేవతా స్వరూపిణి అగు నిన్నే చూచుచున్నారు.  ఆ పరమేశ్వరుని యొక్క శక్తివి కూడా నీవే.  ఓ సర్వేశ్వరీ ఓ మోక్షప్రదాత్రీ నన్ను రక్షించు. దేవాత్మ శక్తీహీ శ్రుతివాక్య గీత మహర్షిలోకస్య పుర: ప్రసన్న గుహపరం వ్యోమ సద ప్రతిష్ఠ మాం పాహి సర్వేశ్వరీ మోక్షధాత్రి || 2 || 🌹భావం నీవు దివ్యమగు ఆత్మశక్తిని, వేదవాక్యములచే గానము చేయబడితివి.  మహర్షి లోకమును ముందుగా అనుగ్రహించితివి. అత్యంత నిగూఢమగు నివాసము నీది. సత్పదార్థమునకు అధిష్ఠానము నీవు.  ఓ సర్వేశ్వరీ ఓ మోక్షప్రదాత్రీ నన్ను రక్షించు. పరాస్యశక్తిహీ వివిధైవ శ్రూవ్యసే శ్వేతాశ్వ వాక్యోదిత దేవీ దుర్గే స్వాభావికీ జ్ఞాన బలక...

ఓం సాయి రామ్

Image
                   ఓం సాయి రామ్

ఓం సాయి రామ్ శ్రీ సాయి బాబా ప్రార్థనాష్టకం🙏

Image
ఓం సాయి రామ్ 🙏 శ్రీ సాయి బాబా ప్రార్థనాష్టకం🙏 శాంతచిత్తా మహాప్రజ్ఞా సాయినాథా దయాధనా దయాసింధో సత్యస్వరూపా మాయాతమవినాశనా (1) జాత గోతాతీతా సిద్ధా అచింత్యా కరుణాలయా పాహిమాం పాహిమాం నాథా శిరిడీ గ్రామనివాసియా (2) శ్రీ జ్ఞానార్క జ్ఞానదాత్యా సర్వమంగళకారకా భక్త చిత్త మరాళా హే శరణాగత రక్షక (3) సృష్టికర్తా విరించీ తూ పాతాతూ ఇందిరాపతి జగత్రయాలయానేతా రుద్రతో తూచ నిశ్చితీ (4) తుజవీణే రతాకోఠె ఠావనాయా మహీవరీ సర్వజ్ఞాతూ సాయినాథా సర్వాంచ్యా హృదయాంతరీ (5) క్షమా సర్వపరాథాంచీ కరానీ హేచీమాగణే అభక్తి సంశయాచ్యాత్యాలాటా శీఘ్రనివారణే  (6) తూధేను వత్సమీతాన్హే తూ ఇందుచంద్రకాంత మీ స్వర్నదీరూప త్వత్పాదా ఆదరేదాసహా నమీ (7) ఠేవ ఆతా శిరీమాజ్యా కృపేచాకర పంజర శోకచింతా నివారా గణూహా తవకింకరః (8)        🌹జయ జయ సాయి సద్గురు పరమాత్మ సాయి🌹

ఓం సాయి రామ్

Image
 ఓం సాయి రామ్

ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🙏 శ్రీమహాలక్ష్మీ స్తోత్రం🌹🙏

Image
 🕉️🔱🚩 ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🙏 🌹 శ్రీమహాలక్ష్మీ స్తోత్రం🌹🙏 జయ పద్మ విశాలాక్షి జయత్వం శ్రీపతిప్రియే | జయ మాత ర్మహలక్ష్మి సంసారార్ణవ తారిణీ || మహాలక్ష్మీ నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వరీ | హరిప్రియే నమస్తుభ్యం దయానిధే || పద్మాలయే నమస్తుభ్యం నమస్తుభ్యం చ సర్వదే | సర్వభూత హితార్థాయ వసువృష్టిం సదాకురు || జగన్నాత ర్నమస్తుభ్యం నమస్తుభ్యం దయానిధే | దయావతి నమస్తుభ్యం విశ్వేశ్వరి నమోస్తుతే || నమః క్షీరార్ణవసుతే నమ స్తైలోక్యధారిణీ | వసువృష్టే నమస్తుభ్యం రక్ష మాం శరణాగతమ్ || రక్ష త్వం దేవదేవేశి దేవదేవస్య వల్లభే | దరిద్రం త్రామిహం లక్ష్మీ కృపాం కురు మయోపరి || సమస్త్రైలోక్య జననీ నమ స్తుభ్యం జగద్దితే | అర్తిహంత్రి నమ స్తుభ్యం సమృద్దిం కురు మే సదా || అబ్జవాసే నమ స్తుభ్యం చపలాయై నమో నమః | చంచలాయై నమ స్తుభ్యం లలితాయై నమో నమః || నమః ప్రద్యుమ్న జననీ మాతస్తుభ్యం నమో నమః | పరిపాలయ మాం మాతః మాం తుభ్యం శరణాగతమ్ || శరణ్యే త్వాం ప్రసన్నో స్మి కమలే కమలాలయే | త్రాహి త్రాహి మహాలక్ష్మి పరిత్రాణ పరాయణే || పాండిత్యం శోభతే నైవ నశోభంతి గుణా కరే | శీలత్వం నైవ శోభతే మహాలక్ష్మీ త్వయా వినా || తావ ద్విరాజ...

🌹శ్రీ సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై🌹

Image
 🕉️⚜️🚩 ఓం శ్రీ గురుభ్యోనమః🙏 🌹కృతయుగమున తపము, త్రేతాయుగమున జ్ఞానము, ద్వాపర యుగమున యజ్ఞము, కలియుగమున ‪నామము ల‬ వలన భగవదనుగ్రహం పొందవచ్చును అని తెలుపబడి ఉన్నది.  🌹కలియుగంలో అత్యంత ప్రభావము కలిగినది, సులభమైనది ‪భగవన్నామస్మరణ‬.  దైవం నామాన్ని పదే పదే ఉచ్చరించడమే  నామజపం. 🌹చిత్తశుద్ధికి నామజపము కంటే సులభమైన సాధనము లేదు. ‪ భక్తి‬, శ్రద్ధ, అణకువ, ప్రేమ, ఓర్పు, విశ్వాసం (నమ్మకం)లతో జపిస్తే సర్వదా భగవంతుని రక్ష ఉంటుంది.        🌹శ్రీ సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై🌹

ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః🙏🌹శ్రీ రాఘవేంద్ర సుప్రభాత స్తోత్రమ్🌹🙏

Image
 🕉️⚜️🚩ఓం శ్రీ గురుభ్యోనమః🙏 🌹ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః🙏 🌹శ్రీ రాఘవేంద్ర సుప్రభాత స్తోత్రమ్🌹🙏 శ్రీమతే రాఘవేంద్రాయ - సర్వాభీష్ట ప్రదాయినే  మంత్రాలయ నివాసాయ - గురురాజాయ మంగళమ్. సీతాపతే! విధ కరార్చిత! కూర్మరాజ భండారతో నృహరి తీర్ధ మునీంద్ర లబ్ద ! ఆనంద తీర్ధ మునివంశ్యయతీంద్ర పూజ్య ! శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్. శ్రీరామదుత! హనుమాన్! యదునాధదూత! శ్రీ భీమసేన వరరౌప్య పురావ తార! శ్రీవ్యాసహృత్ప్రియత మామిత శుద్ద బుద్దే! శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్. బ్రహ్మాజ్ఞ యాదితికులే బహుదోష పూర్ణే! జాతోపి భక్తి భరితో భువనం సమస్తం! యోపీపవో దివిషదాం వర! శంకుకర్ణ! శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్. దైత్యేశ్వరం హరి విరోధి హిరణ్యకంతం ! యోనీనయో హరి పదం పితరం స్వభక్త్యా! ప్రహ్లాద! మృత్యుహరి సంభవ కారణాత్మన్ ! శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్. సోమాన్వయోద్భవ! సమస్త సురాజమౌళే! భూభార సంహరణతో షిత కృష్ణ మూర్తే ! బాహ్లీ కరాజ బహురాజ సుధర్మ ధామన్ ! శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్. శ్రీకృష్ణ దేవనృపతి స్సకలం స్వరాజ్యం ! యస్మిన్ స్వమప్యమల మార్పయ దాత్మ భక్త్యా ! శ్రీవ్యాసరాజ! విదుషాం వర! దివ్య మూర్తే ! శ్రీ మూ...

🚩 జై శ్రీ రామ్ శ్రీరామరక్షా స్తోత్రం🙏

Image
 🕉️⚜️🚩 జై శ్రీ రామ్ 🙏 🌹శ్రీరాముని నుతిస్తూ బుధ కౌశిక ముని ఈ "రామ రక్షా స్తోత్రాన్ని" రచించారు.  ఇది ఎంతో ఫలదాయకమైనది, మహిమాన్వితమైనది. జన్మ సాఫల్య మంత్రం ఇది. 🕉️🌹 శ్రీరామరక్షా స్తోత్రం🌹 🙏 అస్య శ్రీరామరక్షాస్తోత్రమంత్రస్య బుధకౌశిక ఋషిః శ్రీసీతారామచంద్రో దేవతా అనుష్టుప్ ఛందః  సీతా శక్తిః శ్రీమద్ హనుమాన కీలకమ్ శ్రీరామచంద్రప్రీత్యర్థే రామరక్షాస్తోత్రజపే వినియోగః || ధ్యానమ్ ధ్యాయేదాజానుబాహుం ధృతశరధనుషం బద్ధపద్మాసనస్థం పీతం వాసో వసానం నవకమలదళస్పర్ధినేత్రం ప్రసన్నమ్ | వామాంకారూఢసీతాముఖకమలమిలల్లోచనం నీరదాభం నానాలంకారదీప్తం దధతమురుజటామండలం రామచంద్రమ్ || స్తోత్రం చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరమ్ | ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనమ్ || 1|| ధ్యాత్వా నీలోత్పలశ్యామం రామం రాజీవలోచనమ్ | జానకీలక్ష్మణోపేతం జటామకుటమండితమ్ || 2 || సాసితూణధనుర్బాణపాణిం నక్తంచరాంతకమ్ | స్వలీలయా జగత్రాతుం ఆవిర్భూతం అజం విభుమ్ || 3 || రామరక్షాం పఠేత్ప్రాజ్ఞః పాపఘ్నీం సర్వకామదామ్ | శిరో మే రాఘవః పాతు ఫాలం దశరథాత్మజః || 4 || కౌసల్యేయో దృశౌ పాతు విశ్వామిత్రప్రియః శ్రుతీ | ఘ్రాణం పాతు మఖత్రాతా ముఖం సౌమిత్రి...

ఓం సాయి రామ్

Image
  ఓం సాయి రామ్

ఓం సాయి రామ్ శ్రీ సాయి శివ స్తోత్రం🙏

Image
 ఓం సాయి రామ్ 🙏 శ్రీ సాయి శివ స్తోత్రం🙏 ఓం నమశ్శివాయః సాయి ఓం నమశ్శివాయః సదాశివం భజామ్యహం సకల లోక నాయకం సుజన చిత్త ప్రేరకం మనోభిలాష పూరకం సురేశ్వరం గణేశ్వరం సనాతనాత్మ మానుషం నమామి తం మహేశ్వరం స్మరామి సాయి శంకరం ఓం నమశ్శివాయః సాయి ఓం నమశ్శివాయః (1) నమః పురారి సంతతం భయాక్రాంత నాశకం సుధైర్య వీర్య దాయకం ప్రచండ తాండవ ప్రియం త్రినేత్ర ధారి శంకరం త్రిశూల పాణి సుందరం నమామి తం మహేశ్వరం స్మరామి సాయి శంకరం ఓం నమశ్శివాయః సాయి ఓం నమశ్శివాయః (2) జటాధరం కృపాకరం సదా ఉమా సేవితం విభూతి వేష భూషితం శశాంక కాంతి మండనం చంద్రశేఖరం శివం నిరంతరం తమాశ్రయే నమామి తం మహేశ్వరం స్మరామి సాయి శంకరం ఓం నమశ్శివాయః సాయి ఓం నమశ్శివాయః (3) నిర్గుణం నిరంతరం నిత్య సత్య మానసం స్థిరాసనే సుఖాన్వితం సాధు సంరక్షకం యతీశ్వరం మునీశ్వరం యజామ్యహం అహర్నిశం నమామి తం మహేశ్వరం స్మరామి సాయి శంకరం ఓం నమశ్శివాయః సాయి ఓం నమశ్శివాయః (4) రత్నాకర వంశితం భారద్వాజ గోత్రజం సర్వ ధర్మ పోషకం సర్వ శక్తి రూపిణాం సత్య సాయీశ్వరం మనసా స్మరామ్యహం నమామి తం మహేశ్వరం స్మరామి సాయి శంకరం ఓం నమశ్శివాయః సాయి ఓం నమశ్శివాయః (5)  ...

ఓం గం గణపతయే నమః మనం దేవుడికి ఎంత సమర్పించామన్నది కాదు, ఎంత భక్తితో ఇచ్చామన్నది ముఖ్యం.

Image
 🕉️🔱🚩 ఓం గం గణపతయే నమః 🙏 🌹ఈశ్వరానుగ్రహంతో ఐశ్వర్యం పొందిన కుబేరుడికి ఒకసారి తానే ధనవంతుడిననే అహకారం కలిగింది.  🌹అందువల్ల దేవతలందరికి మంచి విందు భోజనం ఏర్పాటు చేసి తన గొప్పతనాన్ని చాటుకోవాలని తలచాడు కుబేరుడు.  🌹దేవతలందరిని ఆహ్వానించి, శివపార్వతులను ఆహ్వానించడానికి కైలాసానికి వెళ్ళాడు.  శివుడు కొండల్లో ఉంటాడు, ఒక ఇల్లు కూడా ఉండదు.  నా ఇంటిని చూసి శివుడు ఆశ్చర్యపోతాడు, ఎంత బాగుందో అంటూ పొగుడుతాడు, అప్పుడు దేవతల్లో నా కీర్తి పెరుగుతుందనే ఆలోచనలతో కైలాసం చేరుకున్నాడు. 🌹పరమేశ్వరుడు సర్వాంతర్యామి. ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏమనుకుంటున్నారో అన్ని తెలుసుకోగలడు.  కుబేరుడి అహాన్ని పసిగట్టాడు.  పార్వతీదేవి కూడా కుబేరుడి పధకాన్ని అర్దం చేసుకుంది.  🌹కుబేరుడు వచ్చి, మహాదేవా మీరు, పార్వతీదేవి కలిసి మా ఇంట్లో నిర్వహించే విందు భోజనానికి తప్పక రావాలి అన్నాడు.  శివుడు తనకు కుదరదన్నాడు, భర్త రాకుండా తాను కూడా రానన్నది పార్వతీ దేవి.  🌹ఇంతలో వినాయకుడు వచ్చాడు.  వస్తూనే "అమ్మా ఆకలేస్తోంది. ఏదైనా ఉంటే పెట్టు" అన్నాడు గణపతి.  🌹పార్వతీదేవి "కుబేరా...

ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః శ్రీ సుబ్రహ్మణ్య పంచ రత్నం

Image
 🕉️🔱🚩 ఓం శ్రీ సుబ్రహ్మణ్యస్వామినే నమః 🙏 🌹శ్రీ సుబ్రహ్మణ్య పంచరత్నం🌹🙏 షడాననం చందనలేపితాంగం  మహోరసం దివ్యమయూరవాహనమ్ | రుద్రస్యసూనుం సురలోకనాథం  బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే (1) జాజ్వల్యమానం సురవృందవంద్యం  కుమార ధారాతట మందిరస్థమ్ | కందర్పరూపం కమనీయగాత్రం  బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే (2) ద్విషడ్భుజం ద్వాదశదివ్యనేత్రం  త్రయీతనుం శూలమసీ దధానమ్ | శేషావతారం కమనీయరూపం  బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే (3) సురారిఘోరాహవశోభమానం  సురోత్తమం శక్తిధరం కుమారమ్ | సుధార శక్త్యాయుధ శోభిహస్తం  బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే (4) ఇష్టార్థసిద్ధిప్రదమీశపుత్రం  ఇష్టాన్నదం భూసురకామధేనుమ్ | గంగోద్భవం సర్వజనానుకూలం  బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే (5) యః శ్లోకపంచమిదం పఠతీహ భక్త్యా బ్రహ్మణ్యదేవ వినివేశిత మానసః సన్ | ప్రాప్నోతి భోగమఖిలం భువి యద్యదిష్టమ్ అంతే స గచ్ఛతి ముదా గుహసామ్యమేవ || 🌹ఇతి శ్రీ సుబ్రహ్మణ్య పంచ రత్నమ్|                         🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺

ఓం శ్రీ సాయి రామ్🙏

Image
                           ఓం సాయి రామ్🙏

ఓం సాయి రామ్ సాయి భక్తి విలాస మంజరి

Image
 🌹 సాయి భక్తి విలాస మంజరి🌹🙏 🌹రచన శ్రీ పండిత నేమాని రామజోగి సన్యాసిరావు గారు🙏 ప్రవిమలాత్ముల మానసాబ్జము వాసమై యలరారు నిన్ సవినయమ్ముగ నేఁ దలంతును సాధుబృంద సుసేవితా! శ్రవణపేయము నీ కథాసుధ సారసద్గుణ భూష! నీ స్తవ మొనర్తు సమర్థ సద్గురు  సాయినాథ మహాప్రభూ (1) సాయి సద్గురు! సాయి సద్గురు! సాయి సద్గురు! సాయి! నాన్ గేయమంజరి మంజులమ్ముగ కీర్తనమ్మొనరించుచో శ్రేయమాదృతి కూర్చుచుందువు శిష్ట కోటికి నిత్యమున్ సాయమౌచు సమర్థ సద్గురు సాయినాథ మహాప్రభూ! (2) స్మరణ మాదృతి భవ్య నామ ప్రశస్త తత్త్వ విశిష్టతల్ నిరతమున్ బొనరింప చిత్తము నిర్మలత్వము నొందుచున్ దురితముల్ తొలగున్ భవార్తియు దూరమౌ నని చేయుదున్ స్మరణమేను సమర్థ సద్గురు  సాయినాథ మహాప్రభూ!  (3) పాదసేవ నొనర్చు భాగ్యమె భాగ్యమెల్లర కబ్బునే? ఆదిదేవు కృపావిశేష మహాఫలంబుగ కాక, నీ పాదసేవనచే భయమ్ములు వాయు, చేకురు మోక్షమున్ సాదరాన సమర్థ సద్గురు  సాయినాథ మహాప్రభూ! (4) ధ్యాన ముఖ్య సమర్చనా నియమాళితో షిరిడీశ్వరా! మానసాబ్జము సాదరాన సమర్పిత మ్మొనరింపగా దీనులయ్యును వేగ గాంతురు దివ్యతేజము సత్కృపన్ జ్ఞానసిద్ధి సమర్థ సద్గురు  సాయినాథ మహాప్రభూ!(5) పా...

శ్రీ ఆంజనేయం 🌹శ్రీ హనుమద్భుజంగ ప్రయాత స్తోత్రం

Image
 🕉️🔱 🚩 శ్రీ ఆంజనేయం 🙏 🌹శ్రీ హనుమద్భుజంగ ప్రయాత స్తోత్రం🌹🙏 ప్రసన్నాంగరాగం ప్రభాకాంచనాంగం జహద్భీతిశౌర్యం తుషారాద్రిధైర్యం తృణీభూతహేతిం రణోద్యద్విభూతిం భజే వాయుపుత్రం పవిత్రాక్తమిత్రం |1| భజే పామరం భావనీ నిత్యవాసం భజే బాలభాను ప్రభాచారుభాసం భజే చంద్రికా కుందమందారహాసం భజే సంతతం రామ భూపలహాసమ్ |2| భజే లక్ష్మణ ప్రాణ రక్షాతి దక్షం భజే తోషితానేక గౌర్వాణ పక్షం భజే ఘోర సంగ్రామసీమా హతాక్షం భజే రామనామాతి సంప్రాప్తరక్షమ్ |3| కృతాభీలనాదం క్షితిక్షిప్రవాదం ఘనక్రాంత భృంగం కటిస్థోరంగం వియద్వ్యాప్తకేశం భుజాశ్లేషితాశమ్ జయశ్రీ సమేతం భజే రామదూతమ్ |4| చలద్వాలఘాతం భ్రమచ్ఛక్రవాలం కఠోరాట్టహాసం ప్రభిన్నాబ్జజాండం మహాసింహనాధాద్విశీర్ణత్రిలోకం భజేదాంజనేయం ప్రభుం వజ్రకాయమ్ |5| రణేభీషణే భీషణే మేఘనాధే సనాదే సరోషే సమారోపితే మిత్రముఖ్యే ఖగానాం ఘనానాం సురాణాంచమార్గే నటంతం వహంతం హనూమంతమీడే |6| ఘనద్రత్నజంభారి దంభోళిధారం ఘనద్యంతనిర్ధూత కాలోగ్రదంతం పదాఘాత భీతాబ్ధభూతాధివాసం రణోక్షోణిదక్షం భజే పింగళాక్షమ్ |7| మహాగ్రాహపీడాం మహోత్ఫాతపీడాం మహారోగపీడాం మహతీవ్రపీడాం హరత్యాస్తుతే పాదపద్మానురక్తో నమస్తే కపిశ్రేష్ట రామప్రియ...

ఓం సాయి రామ్

Image
 ఓం సాయి రామ్

ఓం నమః శివాయ శ్రీ మృత్యుంజయ అక్షరమాలికా స్తోత్రమ్🌹🙏

Image
 🕉️🔱 🚩 ఓం నమః శివాయ 🙏 🌹 పాహి మృత్యుంజయ 🌹🙏 🕉️ శ్రీ మృత్యుంజయ అక్షరమాలికా స్తోత్రమ్🌹 శంభో మహాదేవ శంభో మహాదేవ       శంభో మహాదేవ గంగాధర | మృత్యుంజయ పాహి మృత్యుంజయ పాహి   మృత్యుంజయ పాహి మృత్యుంజయ || అద్రీశ జాధీశ విద్రావితాఘోఘ భద్రాకృతే పాహి మృత్యుంజయ | ఆకాశకేశామరాధీశ వంద్య త్రిలోకేశ్వర పాహి మృత్యుంజయ | ఇందూపలేందుప్రభోత్ఫుల్ల కుందార విందాకృతే పాహి మృత్యుంజయ | ఈక్షాహతానంగ దాక్షాయణీనాథ మోక్షాకృతే పాహి మృత్యుంజయ | ఉద్దేశసంచార యక్షేశసన్మిత్ర దక్షార్చిత పాహి మృత్యుంజయ | ఊహాపథాతీతమాహాత్మ్య సంయుక్త మోహాంతకా పాహి మృత్యుంజయ | బుద్ధిప్రదాశేషబుద్ధిపతారజ్ఞ సిద్దేశ్వర పాహి మృత్యుంజయ | ఋపర్వతోత్తుంగ శృంగాగ్రసంగాంగ హేతో సదా పాహి మృత్యుంజయ | లుప్తాత్మభక్తాఘసంఘాతి సంఘాతకారి ప్రహన్ పాహి మృత్యుంజయ | లూతీకృతానేకపారాది కృత్యంతనీయాధునాపాహి మృత్యుంజయ | ఏకాదశాకార రాకేందుసంకాశ శోకాంతక పాహి మృత్యుంజయ | ఐశ్వర్యధామార్క వైశ్వానరాభాస విశ్వాధిక పాహి మృత్యుంజయ | ఓషధ్యధీశాంశుభూషాధి పాపౌఘ మోక్షప్రద పాహి మృత్యుంజయ | ఔద్ధత్యహీన ప్రబుద్ధప్రభావ ప్రబుద్దాఖిల పాహి మృత్యుంజయ | అంబాసమాశ్లిష్ట ల...

ఓం నమః శివాయ లింగాష్టకం యొక్క గొప్పతనం🙏

Image
  ఓం నమః శివాయ 🙏 🔱🚩 లింగాష్టకం యొక్క గొప్పతనం 🙏 🌹బ్రహ్మ మురారి సురార్చిత లింగం బ్రహ్మ, విష్ణు, దేవతల చేత పూజింపబడ్డ శివలింగం. 🌹నిర్మల భాషిత శోభిత లింగం నిర్మలమైన మాటల చేత అలంకరింపబడ్డ శివలింగం. 🌹జన్మజ దుఃఖ వినాశక లింగం జన్మ వల్ల పుట్టిన బాధలను నాశనం చేసే శివలింగం. 🌹తత్ ప్రణమామి సదా శివ లింగం నీకు ఇవే నా నమస్కారాలు, ఓ సదా శివలింగమా🙏 🌹దేవముని ప్రవరార్చిత లింగం దేవమునులు, మహా ఋషులు పూజించే శివలింగం. 🌹కామదహన కరుణాకర లింగం మన్మధుడిని దహనం చేసిన, అపారమైన కరుణను చూపే చేతులు గల శివలింగం. 🌹రావణ దర్ప వినాశక లింగం రావణుడి గర్వాన్ని నాశనం చేసినట్టి శివలింగం. 🌹తత్ ప్రణమామి సద శివ లింగం నీకు ఇవే నా నమస్కారాలు, ఓ సదా శివలింగమా🙏  🌹సర్వ సుగంధ సులేపిత లింగం అన్ని మంచి గంధాలు, చక్కగా పూసిన శివలింగం. 🌹బుద్ధి వివర్ధన కారణ లింగం మనుషుల బుద్ధి వికాసానికి కారణమైన శివలింగం . 🌹సిద్ధ సురాసుర వందిత లింగం సిద్ధులు, దేవతలు, రాక్షసుల చేత కీర్తింపబడ్డ శివలింగం. 🌹తత్ ప్రణమామి సదా శివ లింగం నీకు ఇవే నా నమస్కారాలు, ఓ సదా శివలింగమా🙏 🌹కనక మహామణి భూషిత లింగం బంగారు, మహా మణుల చేత అలంకరింపబడ్డ శి...

ఓం నమః శివాయ గత జన్మల పుణ్య ఫలం (కథ)

Image
 ఓం నమః శివాయ 🙏    🌹 గత జన్మల పుణ్య ఫలం🌹 🌹పూర్వం ఒక ఊరిలో ఒక పేద కుటుంబం ఉండేది. వాళ్ళలో ఇంటి పెద్ద రోజు శివ పూజ చేస్తూ తనకి ఉన్నంతలో "నైవేద్యం" నివేదన చేసి తనపని తాను చేసుకునేవాడు.  అలా ఎన్నాళ్ళ నుండో పూజలు చేస్తూ తన బాధని శివయ్యకి వెళ్ళబోసుకుంటూ ఉండేవాడు. 🌹ఒకరోజు పార్వతీదేవి శివుడితో "స్వామి అతడు అనేక సంవత్సరాలుగా నిత్యం పూజలు చేస్తూనే ఉన్నాడు.  కరుణించి ఏదైనా వరం ఇవ్వవచ్చు కదా" అంటే శివుడు చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు.  🌹పార్వతికి కోపం వచ్చింది.  ఏమిటి స్వామి ఆ నవ్వు ఇప్పుడు మీరు ఆ భక్తుడిని కరుణించి పేదరికం మాపి ధనవంతుడిని చేయకపోతే ఊరుకొను అంది.  🌹శివుడు మళ్ళి నవ్వి దేవి నీకోరిక కాదనలేను కాని జరగబోయే విపరీతాలు నీవు ఎరుగవు. ఎవరి కర్మఫలం వారు అనుభవించాలి.  అనుభవిస్తే కాని కర్మ పరిపక్వం చెందదు అన్నాడు. 🌹అయినా వినలేదు. పట్టుబట్టింది.  శివుడు ఇక కాదనలేక దేవి నీకోరిక ప్రకారం అతడిని ధనవంతుడిని చేస్తాను. చేసే ముందు అసలు ఏమి జరుగుతుందో నువ్వే చూడు అని అక్కడ మాయమయ్యాడు శివుడు. 🌹ఒక సాధువు వేషంలో ఆ పేదవాడి ముందు ప్రత్యక్షమై "నిన్ను నేన...

ఓం నమో నారాయణాయ 🙏 🌹శ్రీ దశావతార స్తుతి🌹

Image
  ఓం నమో నారాయణాయ 🙏 యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థాన మధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్ పరిత్రాణాయ సాధూనామ్ వినాశాయ చ దుష్కృతామ్ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే 🌹అర్జునా... ధర్మమునకు హాని కలిగినప్పుడును, అధర్మము పెచ్చుపెరిగి పోవుచున్నప్పుడును (జన్మ కర్మ రహితుడనైనప్పటికిని) నన్ను నేను సృజించు కొందును.  సత్పురుషులను పరి రక్షించుటకును, దుష్టులను రూపు మాపుటకును, ధర్మమును సుస్థిర మొనర్చుటకును నేను ప్రతి యుగమునందును అవతరించుచుందును. 🌹త్రిమూర్తులలో విష్ణువు లోకపాలకుడు. సాధుపరిరక్షణ కొరకు, దుష్టశిక్షణ కొరకు ఆయన ఎన్నో అవతారాలలో యుగయుగాన అవతరిస్తాడు. అలాంటి అవతారాలలో 21 ముఖ్య అవతారాలను ఏకవింశతి అవతారములు అంటారు.  🌹కానీ వాటిలో అతిముఖ్యమైన 10 అవతారాలను దశావతారాలు అంటారు.         🌹 శ్రీ దశావతార స్తుతి 🌹🙏 వేదోధారవిచారమతే  సోమకదానవసంహరణ మీనాకారశరీర నమో భక్తంతే పరిపాలయమాం. నామస్మరణా ధన్యోపాయం న హిపశ్యామో భవతరణే రామ హరే  కృష్ణ హరే తవ నామ పదామి సదా నృహరే (1) మంథాచలధారణ హేతో దేవాసుర పరిపాల విభో కూర్మాకార శరీరా నమో భక్తం తే పరిపాలయమాం. నామ...

ఓం సాయి రామ్

Image
 ఓం సాయి రామ్

ఓం నమో నారాయణాయ భూలోక వైకుంఠం శ్రీరంగం శ్రీరంగనాథస్వామి🙏

Image
 ఓం నమో నారాయణాయ 🙏 🌹 భూలోక వైకుంఠం శ్రీరంగం🙏 🌹 శ్రీరంగనాథస్వామి 🙏 ⚜️🚩శ్రీ మహావిష్ణువు శేషతల్ప సాయిగా వుండే మూల విరాట్టుతో రంగానాథావతారంగా శ్రీరంగం లోని శ్రీ రంగనాధ స్వామి దేవాలయంలో పూజలందుకుంటాడు. 🌹 స్థల పురాణం 🌹🙏 🌹మనువు కుమారుడు అయిన #ఇక్ష్వాకు మహారాజు బ్రహ్మదేవుడు కోసం తపస్సు చేయగా... బ్రహ్మదేవుడు తన నివాసంలో ఉంచి నిత్యం పూజిస్తున్న శ్రీరంగనాథస్వామి విగ్రహాన్ని ఇక్ష్వాకు మహారాజుకు ఇచ్చాడు. 🌹ఇక్ష్వాకు వంశ రాజులందరూ తరతరాలుగా ఈ స్వామిని పూజిస్తూ ఉండేవారు.  ఆవిధంగానే ఇక్ష్వాకు వంశం వాడైన #శ్రీరామచంద్రుని వరకూ వారి అంతఃపురాలలోనే ఉన్నది.  రావణ సంహారం తర్వాత అయోధ్యలో జరిగిన శ్రీరామపట్టాభిషేకానికి లంకనుంచి విభీషణుడు వచ్చాడు.  ఆయన లంకకు తిరిగి వెళ్తూ, శ్రీరాముని ఈ విగ్రహం తనకు కావాలని కోరగా, శ్రీరాముడు ఈ విగ్రహాన్ని విభీషణునికి ఇస్తూ... దీనిని త్రోవలో ఎక్కడా భూమి మీద ఉంచకూడదని చెప్పాడట.  అలాగే అని విభీషణుడు ఈ విగ్రహాన్ని తన చేతుల లోనే ఉంచుకొని లంకకు బయలుదేరాడు.  సరిగ్గా ఈ శ్రీరంగం దగ్గరకు వచ్చేటప్పటికి, ఈ విగ్రహం విభీషణుడు మొయ్యలేనంతగా బరువు పెరిగిపోయి...

ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః 🙏 ఐశ్వర్యాభివృద్ధికి శ్రీమహాలక్ష్మి అష్టకం🙏

Image
 ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః 🙏 🌹దేవేంద్రుడు ఒకసారి లక్ష్మీదేవి తో "తల్లీ నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండుట న్యాయమా  నీ బిడ్డలు నీ కరుణ పొందే మార్గం లేదా" అని అడుగుతాడు. 🌹అప్పుడు ఆ తల్లి "లక్ష్మీదేవి" తనను త్రికరణశుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి అభీష్టాలకు అనుగుణంగా... మహర్షులకు మోక్ష లక్ష్మి రూపంగా... విజయాన్ని కోరే బిడ్డలకు విజయలక్ష్మిగా... విద్యార్థులు నన్ను భక్తి తో ఆరాధిస్తే విద్యాలక్ష్మిగా... ఐశ్వర్యాన్ని కోరి నన్ను కొలిచేవారికి ధనలక్ష్మిగా... వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మిగా... ప్రసన్నురాలనవుతానని దేవేంద్రునికి సమాధానం ఇస్తుంది. 🌹ఆ తల్లిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో పూజిస్తారో వారికి ఆ తల్లి ప్రసన్నురాలై వారి కోర్కెలు నెరవేర్చుతుంది. 🌹గురుభక్తితో దేవతలను, పితృదేవతలను పూజించేవారు...  సత్యం పలికే వారు... దాన ధర్మాలు చేసేవారు... భార్యను గౌరవించేవారు... బ్రాహ్మణుల పట్ల భక్తి చూపేవారు... పగటిపూట నిద్రపోని వారు...  వృద్ధులను దయతో చూసేవారు... పేదవారి పట్ల కరుణ గలవారు... పారిశుద్ధ్యాన్ని పాటించేవారు... అతిథులకు పెట్టిన తర్వాతే భోజనం చేసేవారు...

ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః నవ నారసింహ క్షేత్రం అహోబిలం🙏

Image
 ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః🙏 🌹నవ నారసింహ క్షేత్రం అహోబిలం 🙏 ఇందు గలఁ డందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుం డెం దెందు వెదకి చూచిన నందందే కలఁడు దానవాగ్రణి! వింటే... 🌹అని పలికిన ప్రహ్లాదుని విశ్వాసాన్ని నిజం చేసి, ఆస్తికత్వాన్ని సజీవంగా ఉంచడానికి, స్తంభం నుండి ఆవిర్భవించి హిరణ్యకశిపుని మట్టుపెట్టిన ఉగ్ర నరసింహుడు కొలువు దీరిన ప్రదేశమిది. 🌹హిరణ్యకశిపుని గోళ్లతో చీల్చి సంహరించిన సమయంలో స్వామిని దర్శించిన ఇంద్రాది దేవతలు    " అహోవీర్య అహోశౌర్య అహోబహుపరాక్రమః !   నారసింహ పరః దైవం ఆహోబిలః ఆహోబిలః !!" అని పొగిడారట. అందుకే ఈ క్షేత్రానికి "అహోబిల నరసింహస్వామి" దేవాలయం గా పేరు వచ్చింది అని చెబుతారు. 🌹ఎగువ అహోబిలం లోని గుహలో స్వయంభువు గా వెలసిన ఉగ్ర నరసింహుని ఆరాధించి సాక్షాత్కరింప చేసుకొని దివ్యానుభూతికి లోనైన గరుడుడు స్వామి కొలువు తీరిన గుహను చూసి అహో బిలం అన్నాడట.  ఆనాటినుండి ఈ పుణ్యక్షేత్రాన్ని అహోబిలమని పిలుస్తున్నారని కూడా అంటారు. 🌹హిరణ్యకశిపుడిని సంహరించి వికటాట్టహాసాలు చేస్తూ అహోబిలం కొండల్లో తిరుగుతూ స్వామి తొమ్మిది ప్రదేశాల్లో వివిధ రూపాల్లో వెలశ...

హరిఓం, జై గురుదత్త 🌹శ్రీ దత్త స్తవం🌹🙏

Image
  హరిఓం, జై గురుదత్త 🙏 జగదంకురకందాయ సచ్చిదానందమూర్తయే । దత్తాత్రేయాయ యోగీంద్రచంద్రాయ పరమాత్మనే || 🌹జగత్తు అనే మొక్కకు దుంప వంటి వాడు, సచ్చిదానంద మూర్తి, యోగీంద్రచంద్రుడు, పరమాత్మ అయిన దత్తాత్రేయునికి నమస్కారము🙏 🌹 శ్రీ దత్త స్తవం 🌹🙏 దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం | ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామి సనోవతు || 1 || దీనబంధుం కృపాసింధుం సర్వకారణకారణం | సర్వరక్షాకరం వందే స్మర్తృగామి సనోవతు || 2 || శరణాగతదీనార్త పరిత్రాణపరాయణం | నారాయణం విభుం వందే స్మర్తృగామి సనోవతు || 3 || సర్వానర్థహరం దేవం సర్వమంగళ మంగళం | సర్వక్లేశహరం వందే స్మర్తృగామి సనోవతు || 4 || బ్రహ్మణ్యం ధర్మతత్త్వజ్ఞం భక్తకీర్తివివర్ధనం | భక్తాఽభీష్టప్రదం వందే స్మర్తృగామి సనోవతు || 5 || శోషణం పాపపంకస్య దీపనం జ్ఞానతేజసః | తాపప్రశమనం వందే స్మర్తృగామి సనోవతు || 6 || సర్వరోగప్రశమనం సర్వపీడానివారణం | విపదుద్ధరణం వందే స్మర్తృగామి సనోవతు || 7 || జన్మసంసారబంధఘ్నం స్వరూపానందదాయకం | నిశ్శ్రేయసపదం వందే స్మర్తృగామి సనోవతు || 8 || జయ లాభ యశః కామ దాతుర్దత్తస్య యః స్తవం | భోగమోక్షప్రదస్యేమం ప్రపఠేత్ సుకృతీ భవేత్ || 9 || ఇతి శ్రీ దత...

ఓం నమో నారాయణాయ అష్టాక్షరీ మహామంత్ర స్తుతి🌹

Image
ఓం నమో నారాయణాయ 🙏 ఆలోక్య సర్వ శాస్త్రాణీ విచార్యచ పునః పునః ఇదామేకం సునిప్పన్నం ధ్యేయో నారాయణ సదా 🌹సమస్తములైన శాస్త్రాలను క్షుణ్ణంగా పరిశీలించి చూడగా, నిరంతర "నారాయణ" ధ్యానమొక్కటే, సర్వదా, ధ్యేయంగా కనబడుతోంది అని భావం. “న” కార పదోచ్చారణ మాత్రేనైవ నాకాధిప భోగం లభతే “ర” కార పదోచ్ఛారణేవ రామరాజ్య భోగం లభతే “య” కార పదోచ్ఛారణేవ కుబేరవత్ ప్రకాశతే “ణ” కార పదోచ్చారణేవ వైరాగ్యం లభతే 🌹“న” అను అక్షరాన్ని ఉచ్చరించటం చేత ఇంద్ర భోగాలు లభిస్తాయి.  🌹“ర” అనే అక్షరాన్ని ఉచ్చరించటం చేత రామరాజ్యంలో ఉన్న భోగాలు లభిస్తాయి.  🌹“య” అను అక్షరాన్ని ఉచ్చరించటం చేత కుబేరునివలె సర్వసంపదలతో ప్రకాశిస్తారు.  🌹“ణ” అను అక్షరాన్ని ఉచ్చరించటం చేత ఐహిక సుఖాల పట్ల విముఖత కలిగి, దైవచింతన పట్ల ఆసక్తి కలిగి, మోక్షాన్ని పొందేందుకై మార్గం లభిస్తుంది.  🌹స్వామి... స్థితి కారకుడై అష్ట ఐశ్వర్యములను ప్రసాదించునప్పుడు లక్ష్మీనారాయణునిగా,  🌹విద్యా జ్ఞానము ప్రసాదించునపుడు లక్ష్మీహయగ్రీవునిగా  🌹ఆరోగ్య ప్రధాతగా నిలిచిన సమయాన ధన్వంతరిగా,  🌹సంకల్ప దీక్ష నొసగు లక్ష్మీనారసింహునిగా,  🌹సమస్త మానస...

ఓం గం గణపతయే నమః 🙏 శ్రీ సిద్ధివినాయక స్తోత్రం

Image
  ఓం గం గణపతయే నమః 🙏    🌹 శ్రీ సిద్ధివినాయక స్తోత్రం🌹🙏 విఘ్నేశ విఘ్నచయఖండననామధేయ శ్రీశంకరాత్మజ సురాధిపవంద్యపాద | దుర్గామహావ్రతఫలాఖిలమంగలాత్మన్ విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ (1) సత్పద్మరాగమణివర్ణశరీరకాంతిః శ్రీసిద్ధిబుద్ధిపరిచర్చితకుంకుమశ్రీః | దక్షస్తనే వలయితాతిమనోజ్ఞశుండో విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ (2) పాశాంకుశాబ్జపరశూంశ్చ దధచ్చతుర్భి- -ర్దోర్భిశ్చ శోణకుసుమస్త్రగుమాంగజాతః | సిందూరశోభితలలాటవిధుప్రకాశో విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ (3) కార్యేషు విఘ్నచయభీతవిరంచిముఖ్యైః సంపూజితః సురవరైరపి మోదకాద్యైః | సర్వేషు చ ప్రథమమేవ సురేషు పూజ్యో విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ (4) శీఘ్రాంచనస్ఖలనతుంగరవోర్ధ్వకంఠ స్థూలేందురుద్రగణహాసితదేవసంఘః | శూర్పశ్రుతిశ్చ పృథువర్తులతుంగతుందో విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ (5) యజ్ఞోపవీతపదలంభితనాగరాజో మాసాదిపుణ్యదదృశీకృతఋక్షరాజః | భక్తాభయప్రద దయాలయ విఘ్నరాజ విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ (6) సద్రత్నసారతతిరాజితసత్కిరీటః కౌసుంభచారువసనద్వయ ఊర్జితశ్రీః | సర్వత్ర మంగలకరస్మరణప్రతాపో విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ (7) దేవాంతకాద్యసురభీతస...

ఓం సాయి రామ్

Image
               ఓం సాయి రామ్

ఓం సాయి రామ్ సాయి బాబా దినచర్య

Image
 ఓం సాయి రామ్🙏 సాయి బాబా దినచర్య సాయిబాబా ‪సాధు‬ జీవితం ఎంతో పరిశుద్ధమైనది. అందులోని పవిత్రతే ఎందరో భక్తులను ఎక్కడెక్కడి నుంచో షిరిడీకి లాక్కొచ్చేది. బాబా దినచర్యను గమనించినవారికి ఆయన జీవితం ఎంత ‪‎పవిత్రమైనదో‬ తేలికగా అర్థమవుతుంది. బాబా తెల్లవారు జామునే నిద్రలేచేవారు. ‪ ధుని‬ దగ్గర స్తంభానికి ఆనుకుని కొంతసేపు నిశ్చలంగా ధ్యాన నిమగ్నులయ్యేవారు. తర్వాత అక్కడే నిల్చుని విచిత్రమైన భంగిమలను ప్రదర్శించేవారు. నెమ్మదిగా '‪యాదేహక్‬' (దైవాన్ని ఎప్పుడూ స్మరించాలి) వంటీ అరబ్బీ పదాలు పలికేవారు. ఆ సమయంలో తమ వద్దకు ఎవరినీ రానిచ్చేవారు కారు. ఆ లోగా‪ ‎మాధవ్‬ ఫస్లే అనే సేవకుడు మసీదును చక్కగా ఊడ్చి, బకెట్లతో నీటిని సిద్ధం చేసేవాడు.  సాయి ఆ నీటిని నోట్లోకి తీసుకుని పుక్కిలించి, ముఖం, కాళ్లు చేతుల్ని ఎంతో నాజుకుగా కడుక్కునేవారు. తర్వాత కొంతసేపు కన్నులు అరమోడ్చి మౌనంగా కూర్చునేవారు. మధ్యలో ధునిలోని కట్టెల్ని సవరిస్తూ, ‪భక్తులతో‬ ఆ ముందటి రాత్రి తామెక్కడికి వెళ్లిందీ, ఎవరినెలా కాపాడిందీ, మరణించిన వారి ఆత్మలను పైలోకాలకు తానెలా తీసుకెళ్లిందీ వివరించేవారు. ఆ సమయంలోనే వేర్వేరు భక్తులకు క...