ఓం సాయి రామ్
ఓం సాయి రామ్
గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురువే నమః🙏
శ్లో" ప్రత్యక్షే గురవ: స్తుత్యా: పరోక్షే మిత్ర బాంధవా:!
కర్మాంతే దాస బృత్యాశ్చ న కదాచన పుత్రకా: !!
🌹భా:- "గురువులను వారి సమక్షములో ప్రస్తుతించాలి.
మిత్రులనూ, బంధువులనూ వారి పరోక్షంలో ప్రశంసించాలి.
అప్పగించిన కార్యములను పూర్తి చేసిన తరువాతనే దాసులనూ భృత్యులనూ మెచ్చుకోవాలి.
సంతానాన్ని మాతరం ఎన్నడూ పొగడకూడదు."
అని మన సనాతన ధరం హితవు పలుకుతొంది.
అలా అని పిల్లల ప్రతిభను పట్టించుకోవద్దని కాదు;
అది ప్రోత్సాహపూర్వకమైన ఆశీర్వాదంగా ఉండాలే కానీ అహంకారాన్ని పెంచే పొగడ్తలా ఉండకూడదు.
🌹జీవితాన్ని స్వర్గమయం చేసుకోవటం మన చేతుల్లోనే ఉంది.
ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా, వాళ్లకు చెడు చేయకుండా, బాబా సూక్తులు పాటిస్తూ జీవితం గడిపితే స్వర్గం ఎక్కడో కాదు, భూమి మీదనే వుంటుంది.
🌹శ్రీ సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై🌹
Comments
Post a Comment