🚩 ఓం శ్రీ మాత్రే నమః🙏 🌹 శ్రీ దుర్గా పంచరత్న స్తోత్రం🌹🙏
🕉️🔱🚩 ఓం శ్రీ మాత్రే నమః🙏
🌹విశ్వమంతా వ్యాపించి, నిర్వహించే పరమ చైతన్యం "జగదాంబ"
ఏ "శక్తి" వలన బ్రహ్మాదిపిపీలిక పర్యంతం చేతనమవుతున్నదో ఆ శక్తే "దేవి"
🌹 శ్రీ దుర్గా పంచరత్న స్తోత్రం🌹🙏
తే ధ్యాన యోగానుగతాపస్యన్
త్వామేవ దేవీం స్వగునైర్నిగూడాం
త్వమేవ శక్తిహి పరమేశ్వరస్య
మాం పాహి సర్వేశ్వరీ మోక్షధాత్రి || 1 ||
🌹భావం
నిరంతరము ధ్యాన యోగమునందు మునులు యోగులు మున్నగువారు సత్వరజస్తమో గుణములచే వ్యక్తము కాకుండగా ఉన్న సకల దేవతా స్వరూపిణి అగు నిన్నే చూచుచున్నారు.
ఆ పరమేశ్వరుని యొక్క శక్తివి కూడా నీవే.
ఓ సర్వేశ్వరీ ఓ మోక్షప్రదాత్రీ నన్ను రక్షించు.
దేవాత్మ శక్తీహీ శ్రుతివాక్య గీత
మహర్షిలోకస్య పుర: ప్రసన్న
గుహపరం వ్యోమ సద ప్రతిష్ఠ
మాం పాహి సర్వేశ్వరీ మోక్షధాత్రి || 2 ||
🌹భావం
నీవు దివ్యమగు ఆత్మశక్తిని, వేదవాక్యములచే గానము చేయబడితివి.
మహర్షి లోకమును ముందుగా అనుగ్రహించితివి.
అత్యంత నిగూఢమగు నివాసము నీది.
సత్పదార్థమునకు అధిష్ఠానము నీవు.
ఓ సర్వేశ్వరీ ఓ మోక్షప్రదాత్రీ నన్ను రక్షించు.
పరాస్యశక్తిహీ వివిధైవ శ్రూవ్యసే
శ్వేతాశ్వ వాక్యోదిత దేవీ దుర్గే
స్వాభావికీ జ్ఞాన బలక్రియార్తే
మాం పాహి సర్వేశ్వరీ మోక్షధాత్రి || 3 ||
🌹భావం
శ్వేతాశ్వతరోపనిషద్వాక్యములచే చెప్పబడిన దివ్యరూపిణీ, నీవు పరాశక్తివి.
అయినను అనేకులచే అనేక విధములుగా చెప్పబడగా వివిధ రూపములుగా వినబడుచున్నావు.
నీయొక్క జ్ఞాన, బల సంబంధమగు క్రియారూపములోని శక్తి నీకు స్వాభావికమైనది.
ఓ సర్వేశ్వరీ ఓ మోక్షప్రధాత్రి నన్ను రక్షించు.
దేవాత్మ శబ్దేన శివాత్మ భూత
యత్కూర్మ వాయవ్య వచో వివృత్య
త్వంపాశ విఛ్చేద కరి ప్రసిద్ద్హ
మాం పాహి సర్వేశ్వరీ మోక్షధాత్రి || 4 ||
🌹భావం
దేవాత్మశబ్దముచే చెప్పబడు నీవు, కూర్మ వాయు పురాణముల వాక్య వివరణచే శివాత్మురాలివైతివి.
నీవు ఈ భవపాశములను ఛేదింపగలిగినదానిగా ప్రసిధ్ధురాలవు.
ఓ సర్వేశ్వరీ ఓ మోక్షప్రధాత్రి నన్ను రక్షించు.
త్వం బ్రహ్మ పుచ్చా వివిధా మయూరీ
బ్రహ్మ ప్రతిష్ఠాసి ఉపతిష్ట గీత
జ్ఞాన స్వరుపాత్మదయఖిలానాం
మాం పాహి సర్వేశ్వరీ మోక్షధాత్రి || 5 ||
🌹భావం
అమ్మా, నీవు బ్రహ్మమే పుచ్చముగాగల వివిధ రూపముల ఉండు మయూరివి.
బ్రహ్మమునకు అధిష్టానమైనదానివి.
అనేక గీతలను ఉపదేశించినదానవు.
అందరిలో ఉండు జ్ఞాన స్వరూపము నీవే.
అందరిలోని దయాస్వరూపము నీవే.
ఓ సర్వేశ్వరీ ఓ మోక్షప్రధాత్రి నన్ను రక్షించు.
🌹ఇతి కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్య శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి కృతం "దుర్గా పంచరత్నం" సంపూర్ణం |
🔱🌺🔱🌺🔱🌺🔱🌺🔱
Comments
Post a Comment