ఓం గం గణపతయే నమః మనం దేవుడికి ఎంత సమర్పించామన్నది కాదు, ఎంత భక్తితో ఇచ్చామన్నది ముఖ్యం.
🕉️🔱🚩 ఓం గం గణపతయే నమః🙏
🌹ఈశ్వరానుగ్రహంతో ఐశ్వర్యం పొందిన కుబేరుడికి ఒకసారి తానే ధనవంతుడిననే అహకారం కలిగింది.
🌹అందువల్ల దేవతలందరికి మంచి విందు భోజనం ఏర్పాటు చేసి తన గొప్పతనాన్ని చాటుకోవాలని తలచాడు కుబేరుడు.
🌹దేవతలందరిని ఆహ్వానించి, శివపార్వతులను ఆహ్వానించడానికి కైలాసానికి వెళ్ళాడు.
శివుడు కొండల్లో ఉంటాడు, ఒక ఇల్లు కూడా ఉండదు.
నా ఇంటిని చూసి శివుడు ఆశ్చర్యపోతాడు,
ఎంత బాగుందో అంటూ పొగుడుతాడు,
అప్పుడు దేవతల్లో నా కీర్తి పెరుగుతుందనే ఆలోచనలతో కైలాసం చేరుకున్నాడు.
🌹పరమేశ్వరుడు సర్వాంతర్యామి.
ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏమనుకుంటున్నారో అన్ని తెలుసుకోగలడు.
కుబేరుడి అహాన్ని పసిగట్టాడు.
పార్వతీదేవి కూడా కుబేరుడి పధకాన్ని అర్దం చేసుకుంది.
🌹కుబేరుడు వచ్చి, మహాదేవా మీరు, పార్వతీదేవి కలిసి మా ఇంట్లో నిర్వహించే విందు భోజనానికి తప్పక రావాలి అన్నాడు.
శివుడు తనకు కుదరదన్నాడు, భర్త రాకుండా తాను కూడా రానన్నది పార్వతీ దేవి.
🌹ఇంతలో వినాయకుడు వచ్చాడు.
వస్తూనే "అమ్మా ఆకలేస్తోంది. ఏదైనా ఉంటే పెట్టు" అన్నాడు గణపతి.
🌹పార్వతీదేవి "కుబేరా మా గణపతి మీ ఇంటికి విందుకు వస్తాడు" అనగా, శివుడు "ఔను, గణపతికి విందు భోజనం అంటే మహా ఇష్టం.
మా బదులుగా గణపతిని తీసుకెళ్లు" అన్నాడు పరమశివుడు.
🌹హా ఈ ఏనుగు ముఖమున్న పసిపిల్లవాడా, నా ఇంటికి విందుకొచ్చేది.
ఎంత తింటాడులే అనుకుంటూ గణపతిని తీసుకుని అలకాపురిలో ఉన్న తన భవనంలోనికి తీసుకెళ్ళి, తన భవనంలో ఉన్న సౌకర్యాలను, ఇతర సంపదలను చూపిచసాగాడు.
🌹ఇవన్నీ వ్యర్ధం, త్వరగా ఆహారం పెట్టండి అని గణపతి అనగా, కుబేరుడు భోజనం సిద్ధం చేయవలసిందిగా అక్కడున్న పనివారికి ఆజ్ఞ చేశాడు.
🌹వెంటనే బంగారు కంచం పెట్టి, రకరకాల తీపి పదార్ధాలు, పానీయాలు, కూరలు, పండ్లు గణపతికి వడ్డించారు.
🌹కుబేరుడు చూస్తుండగానే ఒక్కపెట్టున గణపతి కంచంలో ఉన్న ఆహారాన్ని, అక్కడ పాత్రల్లో పెట్టిన ఆహారాన్ని తినేసి,
ఇంకా తీసుకురండి అంటూ ఆజ్ఞ చేశాడు.
🌹సేవకులు వంటశాలలో ఉన్న ఆహారం మొత్తాన్ని తీసుకువచ్చి గణపతికి వడ్డించారు.
అయినా గణపతి ఆకలి ఇసుమంతైనా తగ్గలేదు, కడుపు నిండలేదు.
ఇంకా కావాలి అంటూ గణపతి అడిగాడు.
🌹వంటవారికి ఆహారం వండడం గణపతికి వడ్డించడమే పనైపోయింది.
కాసేపటికి కుబేరుడి వంటశాల మొత్తం ఖాళీ అయిపోయింది.
విషయం కుబేరుని తెలిసింది.
🌹తన సంపద మొత్తం తరిగిపోతోంది కానీ, గణపతి కడుపు నిండడంలేదు.
ఏమి చేయాలో అర్ధంకాలేదు.
ఇంతలో గణపతి ఆగ్రహంతో ఊగిపోతూ కుబేరుని పిలిచి, నీ ఇంటికి విందుకు రమ్మని, నాకు ఆహారం పెట్టకుండా అవమానిస్తున్నావ్ అంటూ పలికాడు.
🌹కుబేరుడికి విషయం అర్ధమైంది.
తనకున్న సంపద ఆ పరమాత్ముడిని ఏ మాత్రం సంతృప్తి పరచలేదని...
అన్ని ఇచ్చిన భగవంతుడి దగ్గరే దర్పాన్ని చూపాలనుకోవడం మూర్ఖత్వమని...
తన అహకారం అణచడానికే దైవం ఈ విధంగా చేశాడని గ్రహించి పరుగుపరుగున కైలాసానికి వెళ్ళాడు.
🌹శివా శంకరా నీవే దిక్కు🙏
ధనానికి నన్ను నీవే అధిపతిని చేశావని మరిచి అహకారంతో ప్రవర్తించాను.
అందుకు ప్రతిగా గణపతి నా సంపద మొత్తాన్నీ ఖాళీ చేసి,
"అన్ని ఇచ్చిన భగవంతుడే, అహంకరించినవారి సర్వసంపదలు తీసివేస్తాడని" నిరూపించాడు.
🌹మీ బిడ్డడైన గణపతి ఆకలి తీర్చలేకపోతున్నాను.
ఏదైనా మార్గం చూపించండి అన్నాడు.
అప్పుడు శివుడు "కుబేరా నీవు ఇంతసేపు అహకారంతో గణపతికి భోజనం పెట్టావు.
అందుకే గణపతి సంతృప్తి చెందలేదు.
గణపతికి కావల్సినది #భక్తి మాత్రమే.
నీకు ఎంత ఉందన్నది అతనికి అనవసరం.
నీవు ఎంత భక్తితో సమర్పించావన్నది మాత్రమే గణపతి చూస్తాడు.
ఇదిగో ఈ గుప్పెడు బియ్యం తీసుకుని, అహకారం విడిచి, చేసిన తప్పు ఒప్పుకుని పరమభక్తితో గణపతికి సమర్పించు" అన్నాడు.
🌹కుబేరుడు ఆ గుప్పెడు బియ్యాన్ని ఉడికించి, గణపతికి భక్తితో సమర్పించాడు.
ఆ గుప్పెడు బియ్యం తినగానే గణపతికి కడుపు నిండి, త్రేనుపులు వచ్చాయి.
గణపతి సంతృప్తి చెందాడు.
🌹మనం దేవుడికి ఎంత సమర్పించామన్నది కాదు, ఎంత భక్తితో ఇచ్చామన్నది ముఖ్యం.
కుబేరుడి అహంకారాన్ని అణిచివేసిన గణపతి, మనలోని అహంకారాన్ని కూడా పటాపంచలు చేయుగాక 🙏
(సేకరణ)
🌺🕉️🔱🕉️🌺🕉️🔱🕉️🌺
Comments
Post a Comment