ఓం నమః శివాయ లింగాష్టకం యొక్క గొప్పతనం🙏
ఓం నమః శివాయ 🙏
🔱🚩లింగాష్టకం యొక్క గొప్పతనం🙏
🌹బ్రహ్మ మురారి సురార్చిత లింగం
బ్రహ్మ, విష్ణు, దేవతల చేత పూజింపబడ్డ శివలింగం.
🌹నిర్మల భాషిత శోభిత లింగం
నిర్మలమైన మాటల చేత అలంకరింపబడ్డ శివలింగం.
🌹జన్మజ దుఃఖ వినాశక లింగం
జన్మ వల్ల పుట్టిన బాధలను నాశనం చేసే శివలింగం.
🌹తత్ ప్రణమామి సదా శివ లింగం
నీకు ఇవే నా నమస్కారాలు, ఓ సదా శివలింగమా🙏
🌹దేవముని ప్రవరార్చిత లింగం
దేవమునులు, మహా ఋషులు పూజించే శివలింగం.
🌹కామదహన కరుణాకర లింగం
మన్మధుడిని దహనం చేసిన, అపారమైన కరుణను చూపే చేతులు గల శివలింగం.
🌹రావణ దర్ప వినాశక లింగం
రావణుడి గర్వాన్ని నాశనం చేసినట్టి శివలింగం.
🌹తత్ ప్రణమామి సద శివ లింగం
నీకు ఇవే నా నమస్కారాలు, ఓ సదా శివలింగమా🙏
🌹సర్వ సుగంధ సులేపిత లింగం
అన్ని మంచి గంధాలు, చక్కగా పూసిన శివలింగం.
🌹బుద్ధి వివర్ధన కారణ లింగం
మనుషుల బుద్ధి వికాసానికి కారణమైన శివలింగం .
🌹సిద్ధ సురాసుర వందిత లింగం
సిద్ధులు, దేవతలు, రాక్షసుల చేత కీర్తింపబడ్డ శివలింగం.
🌹తత్ ప్రణమామి సదా శివ లింగం
నీకు ఇవే నా నమస్కారాలు, ఓ సదా శివలింగమా🙏
🌹కనక మహామణి భూషిత లింగం
బంగారు, మహా మణుల చేత అలంకరింపబడ్డ శివలింగం.
🌹ఫణిపతి వేష్టిత శోభిత లింగం
నాగరాజు నివాసం చేత అలంకరింపబడ్డ శివలింగం.
🌹దక్ష సుయజ్ఞ వినాశక లింగం
దక్షుడు చేసిన యజ్ఞాన్ని నాశనం చేసిన శివలింగం.
🌹తత్ ప్రణమామి సదా శివ లింగం
నీకు ఇవే నా నమస్కారాలు, ఓ సదా శివలింగమా🙏
🌹కుంకుమ చందన లేపిత లింగం
కుంకుమ, గంధము పూయబడ్డ శివలింగం.
🌹పంకజహార సుశోభిత లింగం
కలువల దండ చేత చక్కగా అలంకరింపబడ్డ శివలింగం.
🌹సంచిత పాప వినాశక లింగం
సంక్రమించిన పాపాలను నాశనం చేసే శివలింగం.
🌹తత్ ప్రణమామి సదా శివ లింగం
నీకు ఇవే నా నమస్కారాలు, ఓ సదా శివలింగమా🙏
🌹దేవగణార్చిత సేవిత లింగం
దేవ గణాల చేత పూజింప బడ్డ, సేవించ బడ్డ శివలింగం.
🌹భావైర్ భక్తి భిరేవచ లింగం
చక్కటి భావంతో కూడిన భక్తి చేత పూజింప బడ్డ శివలింగం.
🌹దినకర కోటి ప్రభాకర లింగం
కోటి సూర్యుల కాంతితో వెలిగే మరో సూర్య బింబం లాంటి శివలింగం.
🌹తత్ ప్రణమామి సదా శివ లింగం
నీకు ఇవే నా నమస్కారాలు, ఓ సదా శివలింగమా🙏
🌹అష్ట దళోపరి వేష్టిత లింగం
ఎనిమిది రకాల ఆకుల మీద నివాసముండే శివలింగం.
🌹సర్వ సముద్భవ కారణ లింగం
అన్నీ సమానంగా జన్మించడానికి కారణమైన శివలింగం
🌹అష్ట దరిద్ర వినాశక లింగం
ఎనిమిది రకాల దరిద్రాలను (అష్ట దరిద్రాలు) నాశనం చేసే శివలింగం.
🌹తత్ ప్రణమామి సదా శివ లింగం
నీకు ఇవే నా నమస్కారాలు, ఓ సదా శివలింగమా🙏
🌹సురగురు సురవర పూజిత లింగం
దేవ గురువు (బృహస్పతి), దేవతల చేత పూజింప బడ్డ శివలింగం.
🌹సురవన పుష్ప సదార్చిత లింగం
దేవతల తోటల్లో పూచే పువ్వులు (పారిజాతాలు) చేత ఎప్పుడూ పూజింప బడే శివలింగం
🌹పరమపదం పరమాత్మక లింగం
ఓ శివ లింగమా, నీ సన్నిధి ఏ ఒక స్వర్గము.
🌹తత్ ప్రణమామి సదా శివ లింగం
నీకు ఇవే నా నమస్కారాలు, ఓ సదా శివలింగమా🙏
🔱🚩లింగాష్టక మిదం పుణ్యం యఃపఠేత్ శివ సన్నిధౌ
ఎప్పుడైతే శివుడి సన్నిధిలో చదవబడుతుందో వారికి చాలా పుణ్యం వస్తుంది.
🌹శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే
శివలోకం లభిస్తుంది, శివుడిలో ఐక్యమవడానికి మార్గం దొరుకుతుంది.
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️
🔱🚩లింగాష్టక స్తోత్రాన్ని తరుచుగా చదవడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.
మరియు చెడు అలవాట్ల నుండి క్రమంగా దూరం అవుతారు.
లింగాష్టక స్తోత్రాన్ని గొప్ప భక్తితో పఠించడం వలన శివలోకాన్ని చేరుతారని పెద్దల నమ్మకం.
🌼🔱🌺🔱🌺🔱🌼
Comments
Post a Comment