ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః నవ నారసింహ క్షేత్రం అహోబిలం🙏

 ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః🙏


🌹నవ నారసింహ క్షేత్రం అహోబిలం🙏


ఇందు గలఁ డందు లేడని

సందేహము వలదు చక్రి సర్వోపగతుం

డెం దెందు వెదకి చూచిన

నందందే కలఁడు దానవాగ్రణి! వింటే...


🌹అని పలికిన ప్రహ్లాదుని విశ్వాసాన్ని నిజం చేసి, ఆస్తికత్వాన్ని సజీవంగా ఉంచడానికి, స్తంభం నుండి ఆవిర్భవించి హిరణ్యకశిపుని మట్టుపెట్టిన ఉగ్ర నరసింహుడు కొలువు దీరిన ప్రదేశమిది.


🌹హిరణ్యకశిపుని గోళ్లతో చీల్చి సంహరించిన సమయంలో స్వామిని దర్శించిన ఇంద్రాది దేవతలు 


  "అహోవీర్య అహోశౌర్య అహోబహుపరాక్రమః !

  నారసింహ పరః దైవం ఆహోబిలః ఆహోబిలః !!"


అని పొగిడారట.

అందుకే ఈ క్షేత్రానికి "అహోబిల నరసింహస్వామి" దేవాలయం గా పేరు వచ్చింది అని చెబుతారు.


🌹ఎగువ అహోబిలం లోని గుహలో స్వయంభువు గా వెలసిన ఉగ్ర నరసింహుని ఆరాధించి సాక్షాత్కరింప చేసుకొని దివ్యానుభూతికి లోనైన గరుడుడు స్వామి కొలువు తీరిన గుహను చూసి అహో బిలం అన్నాడట. 

ఆనాటినుండి ఈ పుణ్యక్షేత్రాన్ని అహోబిలమని పిలుస్తున్నారని కూడా అంటారు.


🌹హిరణ్యకశిపుడిని సంహరించి వికటాట్టహాసాలు చేస్తూ అహోబిలం కొండల్లో తిరుగుతూ స్వామి తొమ్మిది ప్రదేశాల్లో వివిధ రూపాల్లో వెలశారని ప్రతీతి.

అవి...


జ్వాలాహోబిల మాలోల క్రోడ గరంజ్ భార్గవ

యోగానంద చత్రవట పావన నవమూర్తయః !! 


జ్వాలా నరసింహస్వామి

అహోబిల నరసింహస్వామి, 

మాలోల నరసింహస్వామి, 

క్రోడ (వరాహ) నరసింహస్వామి, 

కరంజ నరసింహస్వామి,

భార్గవ నరసింహస్వామి,

యోగానంద నరసింహస్వామి, 

ఛత్ర వట నరసింహస్వామి, 

పావన నరసింహస్వామిగా... నవ నరసింహుడిగా ఈ క్షేత్రంలో స్వామి వెలిశారు. 


🌹ఉగ్ర స్థంభం

దీనినుండే నృసింహ ఆవిర్భావం జరిగి హిరణ్యకశిపుని సంహరించాడని చెపుతారు. 

దీని దర్శనం, స్పర్శనం సర్వ పాప హరం.


"ఉగ్ర వీరః మహావిష్ణు జ్వాలంతం సర్వతోముఖః 

నృసింహః భీషణఃభద్రంమృత్యుమృత్యః నమామ్యహః" 


🌹తిరుమల శ్రీ శ్రీనివాసుడు పద్మావతీ దేవి తో తన కళ్యాణానికి ముందు లక్ష్మీనరసింహుని ఆశీస్సుల కోసం అహోబిలం వచ్చి...  

ఎగువ అహోబిలంలో స్వామి ఉగ్రరూపుడై ఉండటంతో దిగువ అహోబిలంలో ప్రహ్లాద వరదుడైన లక్ష్మీనరసింహుని శాంతమూర్తిగా ఆయనే ప్రతిష్టించినట్లు చెపుతారు. 

దీనికి సాక్ష్యంగా ప్రధాన ఆలయానికి దక్షిణంగా శ్రీ వేంకటేశ్వరాలయం మనకు దర్శనమిస్తుంది.


🌹దిగువ అహోబిలంలో ప్రహ్లాదవరదుడైన లక్ష్మీనరసింహుడు శాంతరూపుడై, భక్తులను రక్షిస్తున్నాడు.

                 

ఉగ్రవీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖమ్‌ |

నృసింహం భీషణం భద్రం మృత్యోర్‌ మృత్యుం నమామ్యహం||


అనే మంత్రాన్ని పఠించిన "మృత్యువు" సైతం ఆమడ దూరంలో నిలిచిపోతుందని నమ్మకం.

                              🌺⚜️🌺⚜️🌺



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు

శ్రీ సూర్యం ప్రణమామ్యహం