ఓం నమో నారాయణాయ 🙏 🌹శ్రీ దశావతార స్తుతి🌹
ఓం నమో నారాయణాయ 🙏
యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత
అభ్యుత్థాన మధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్
పరిత్రాణాయ సాధూనామ్ వినాశాయ చ దుష్కృతామ్
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే
🌹అర్జునా... ధర్మమునకు హాని కలిగినప్పుడును,
అధర్మము పెచ్చుపెరిగి పోవుచున్నప్పుడును (జన్మ కర్మ రహితుడనైనప్పటికిని) నన్ను నేను సృజించు కొందును.
సత్పురుషులను పరి రక్షించుటకును, దుష్టులను రూపు మాపుటకును, ధర్మమును సుస్థిర మొనర్చుటకును నేను ప్రతి యుగమునందును అవతరించుచుందును.
🌹త్రిమూర్తులలో విష్ణువు లోకపాలకుడు.
సాధుపరిరక్షణ కొరకు, దుష్టశిక్షణ కొరకు ఆయన ఎన్నో అవతారాలలో యుగయుగాన అవతరిస్తాడు.
అలాంటి అవతారాలలో 21 ముఖ్య అవతారాలను ఏకవింశతి అవతారములు అంటారు.
🌹కానీ వాటిలో అతిముఖ్యమైన 10 అవతారాలను దశావతారాలు అంటారు.
🌹శ్రీ దశావతార స్తుతి🌹🙏
వేదోధారవిచారమతే సోమకదానవసంహరణ
మీనాకారశరీర నమో భక్తంతే పరిపాలయమాం.
నామస్మరణా ధన్యోపాయం న హిపశ్యామో భవతరణే
రామ హరే కృష్ణ హరే తవ నామ పదామి సదా నృహరే (1)
మంథాచలధారణ హేతో దేవాసుర పరిపాల విభో
కూర్మాకార శరీరా నమో భక్తం తే పరిపాలయమాం.
నామస్మరణా ధన్యోపాయం న హి పశ్యామో భవతరణే
రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే (2)
భూచోరక హర పుణ్యమతే క్రీడోధ్ధఋతభూ
క్రోడాకార శరీర నమో భక్తం తే పరిపాలయమాం
నామస్మరణా ధన్యోపాయం న హి పశ్యామే భవతరణే
రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే (3)
హిరణ్యకశిపుచ్చేదన హేతో ప్రహ్లాదా భయధారణ హేతో
నరసింహా చ్యుత రూపా నమో భక్తంతే పరిపాలయమాం
నామస్మరణా ధన్యోపాయం న హి పశ్యామో భవతరణే
రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే (4)
భవబంధనహర వితతమతే పాదోదకవిమతాఘతతే
వటు వటు వేషమనోఙ్ఞ నమో భక్తం తే పరిపాలయమాం.
నామస్మరణా ధన్యోపాయం న హి పశ్యామో భవతరణే
రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే (5)
క్షితిపతివంశక్షయకరమూర్తే క్షితిపతి కర్తాహర మూర్తే
భూగుకులరామ పరేవ నమో భక్తం తే పరిపాలయమాం
నామస్మరణా ధన్యోపాయం న హి పశ్యామో భవతరణే
రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే (6)
సీతా వల్లభ దాశరథే దశరథనందన లోక గురో
రావణమర్ధన రామనమో భక్తంతే పరిపాలయమాం
నామస్మరణా ధన్యోపాయం న హి పశ్యామో భవతరణే
రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే (7)
కృష్ణానంత కృపాజలథే కంసారే కమలేశ హరే
కాళియమర్థన లోక గురో భక్తం తే పరిపాలయమాం
నామస్మరణా ధన్యోపాయం న హి పశ్యామో భవతరణే
రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే (8)
దానవసతి మానాపహార త్రిపుర విజయమర్థన రూప
బుద్థఙ్ఞాయ చ బౌధ్ధనమో భక్తంతే పరిపాలయమాం
నామస్మరణా ధన్యోపాయం న హి పశ్యామో భవతరణే
రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే (9)
శిష్టాజనావన దుష్ట హర ఖగతురగోత్తమవాహన తే
కల్కి రూపపరిపాల నమో భక్తం తే పరిపాలయమాం
నామస్మరణా ధన్యోపాయం న హి పశ్యామో భవతరణే
రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే (10)
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️
Comments
Post a Comment