ఓం నమో నారాయణాయ భూలోక వైకుంఠం శ్రీరంగం శ్రీరంగనాథస్వామి🙏
ఓం నమో నారాయణాయ 🙏
🌹భూలోక వైకుంఠం శ్రీరంగం🙏
🌹శ్రీరంగనాథస్వామి🙏
⚜️🚩శ్రీ మహావిష్ణువు శేషతల్ప సాయిగా వుండే మూల విరాట్టుతో రంగానాథావతారంగా శ్రీరంగం లోని శ్రీ రంగనాధ స్వామి దేవాలయంలో పూజలందుకుంటాడు.
🌹స్థల పురాణం🌹🙏
🌹మనువు కుమారుడు అయిన #ఇక్ష్వాకు మహారాజు బ్రహ్మదేవుడు కోసం తపస్సు చేయగా...
బ్రహ్మదేవుడు తన నివాసంలో ఉంచి నిత్యం పూజిస్తున్న శ్రీరంగనాథస్వామి విగ్రహాన్ని ఇక్ష్వాకు మహారాజుకు ఇచ్చాడు.
🌹ఇక్ష్వాకు వంశ రాజులందరూ తరతరాలుగా ఈ స్వామిని పూజిస్తూ ఉండేవారు.
ఆవిధంగానే ఇక్ష్వాకు వంశం వాడైన #శ్రీరామచంద్రుని వరకూ వారి అంతఃపురాలలోనే ఉన్నది.
రావణ సంహారం తర్వాత అయోధ్యలో జరిగిన
శ్రీరామపట్టాభిషేకానికి లంకనుంచి విభీషణుడు వచ్చాడు.
ఆయన లంకకు తిరిగి వెళ్తూ, శ్రీరాముని ఈ విగ్రహం తనకు కావాలని కోరగా,
శ్రీరాముడు ఈ విగ్రహాన్ని విభీషణునికి ఇస్తూ...
దీనిని త్రోవలో ఎక్కడా భూమి మీద ఉంచకూడదని చెప్పాడట.
అలాగే అని విభీషణుడు ఈ విగ్రహాన్ని తన చేతుల లోనే ఉంచుకొని లంకకు బయలుదేరాడు.
సరిగ్గా ఈ శ్రీరంగం దగ్గరకు వచ్చేటప్పటికి, ఈ విగ్రహం విభీషణుడు మొయ్యలేనంతగా బరువు పెరిగిపోయింది.
చేయునది లేక విభీషణుడు విగ్రహాన్ని నేలమీద ఉంచాడు.
అప్పుడు ఆ ప్రాంతాన్ని పాలించే రాజు ధర్మచోళుడు అతనిని ఓదారుస్తాడు.
అతని అనుమతితో ఆ విగ్రహం ఉన్న చోటే ఆలయాన్ని నిర్మిస్తాడు.
విభీషణుడు కోరిక మేరకు స్వామివారు దక్షిణ దిక్కున తిరుగుతాడు.(లంక దక్షిణ దిక్కున కలదు).
ఆవిధంగా ఈ శ్రీరంగనాథుడు ఇక్కడే ప్రతిష్టించబడ్డాడు.
🌹రంగనాథ ఆలయంలో ఒక చిన్న విచిత్రం ఉంది.
ఈ ఆలయ శిఖరం 'ఓం' ఆకారంలో ఉంటుంది.
ఆ విధంగా చూడాలంటే,
గర్భగుడి బయట ఎడమ చేతి ఈ వైపు ఉన్న ఒక వరండాలాంటి మండపంలో ఒక ప్రత్యేకమైన స్థలంలో నిలబడి చూస్తేనే,
ఆలయ శిఖరము 'ఓం'కార రూపములో కనిపిస్తుంది.
🌹#రంగనాథాష్టకం🌹🙏
ఆనందరూపే నిజబోధరూపే
బ్రహ్మస్వరూపే శ్రుతిమూర్తిరూపే |
శశాంకరూపే రమణీయరూపే
శ్రీరంగరూపే రమతాం మనో మే || 1 ||
కావేరితీరే కరుణా విలోలే
మందారమూలే ధృత చారుకేలే |
దైత్యాంతకాలేఖిలలోకలీలే
శ్రీరంగలీలే రమతాం మనో మే || 2 ||
లక్ష్మీనివాసే జగతాం నివాసే
హృత్పద్మవాసే రవిబింబవాసే |
కృపానివాసే గుణవృందవాసే
శ్రీరంగవాసే రమతాం మనో మే || 3 ||
బ్రహ్మాదివంద్యే జగదేకవంద్యే
ముకుందవంద్యే సురనాథవంద్యే |
వ్యాసాదివంద్యే సనకాదివంద్యే
శ్రీరంగవంద్యే రమతాం మనో మే || 4 ||
బ్రహ్మాదిరాజే గరుడాదిరాజే
వైకుంఠరాజే సురరాజరాజే |
త్రైలోక్యరాజేఖిలలోకరాజే
శ్రీరంగరాజే రమతాం మనో మే || 5 ||
అమోఘముద్రే పరిపూర్ణనిద్రే
శ్రీయోగనిద్రే ససముద్రనిద్రే |
శ్రితైకభద్రే జగదేకనిద్రే
శ్రీరంగభద్రే రమతాం మనో మే || 6 ||
సచిత్రశాయీ భుజగేంద్రశాయీ
నందాంగశాయీ కమలాంగశాయీ |
క్షీరాబ్ధిశాయీ వటపత్రశాయీ
శ్రీరంగశాయీ రమతాం మనో మే || 7 ||
ఇదం హి రంగం త్యజతామిహాంగం
పునర్నశాంగం యది శాంగమేతి |
పాణౌ రథాంగం చరణేంబు కాంగం
యానే విహంగం శయనే భుజంగమ్ || 8 ||
రంగనాథాష్టకం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ |
సర్వాన్కామానవాప్నోతి రంగిసాయుజ్యమాప్నుయాత్ |
🌹ఇతి శ్రీ రంగనాథాష్టకం 🙏
🕉️🌺🕉️🌺🕉️🌺🕉️🌺🕉️
Comments
Post a Comment