ఓం నమో నారాయణాయ అష్టాక్షరీ మహామంత్ర స్తుతి🌹

ఓం నమో నారాయణాయ🙏


ఆలోక్య సర్వ శాస్త్రాణీ విచార్యచ పునః పునః

ఇదామేకం సునిప్పన్నం ధ్యేయో నారాయణ సదా


🌹సమస్తములైన శాస్త్రాలను క్షుణ్ణంగా పరిశీలించి చూడగా, నిరంతర "నారాయణ" ధ్యానమొక్కటే, సర్వదా, ధ్యేయంగా కనబడుతోంది అని భావం.


“న” కార పదోచ్చారణ మాత్రేనైవ నాకాధిప భోగం లభతే

“ర” కార పదోచ్ఛారణేవ రామరాజ్య భోగం లభతే

“య” కార పదోచ్ఛారణేవ కుబేరవత్ ప్రకాశతే

“ణ” కార పదోచ్చారణేవ వైరాగ్యం లభతే


🌹“న” అను అక్షరాన్ని ఉచ్చరించటం చేత ఇంద్ర భోగాలు లభిస్తాయి. 


🌹“ర” అనే అక్షరాన్ని ఉచ్చరించటం చేత రామరాజ్యంలో ఉన్న భోగాలు లభిస్తాయి. 


🌹“య” అను అక్షరాన్ని ఉచ్చరించటం చేత కుబేరునివలె సర్వసంపదలతో ప్రకాశిస్తారు. 


🌹“ణ” అను అక్షరాన్ని ఉచ్చరించటం చేత ఐహిక సుఖాల పట్ల విముఖత కలిగి, దైవచింతన పట్ల ఆసక్తి కలిగి, మోక్షాన్ని పొందేందుకై మార్గం లభిస్తుంది. 


🌹స్వామి... స్థితి కారకుడై అష్ట ఐశ్వర్యములను ప్రసాదించునప్పుడు లక్ష్మీనారాయణునిగా, 


🌹విద్యా జ్ఞానము ప్రసాదించునపుడు లక్ష్మీహయగ్రీవునిగా 


🌹ఆరోగ్య ప్రధాతగా నిలిచిన సమయాన ధన్వంతరిగా, 


🌹సంకల్ప దీక్ష నొసగు లక్ష్మీనారసింహునిగా, 


🌹సమస్త మానసిక రుగ్మతలు తొలగించు లక్ష్మీసుదర్శనునిగా, 


🌹భక్తి జ్ఞాన వైరాగ్యములు ప్రసాదించు అనఘదత్తాత్రేయునిగా, 


🌹సర్వ మంగళకరుడగు శ్రీ వేంకటనాయకుడైన వేంకటేశ్వరునిగా  భక్తులకు సుఖశాంతులను ప్రసాదిస్తాడు.


⚜️🚩అష్టాక్షరీ మహామంత్రం🙏


🌹"ఓం నమో నారాయణాయ"

మంత్రాలన్నింటిలోకి ఎంతో ఉత్తమమైంది ఈ మంత్రం. 

నిత్యం దీన్ని జపిస్తే శక్తి, ముక్తి లభిస్తుంది. 

సకల పాపరాశిని ధ్వసం చేయగల శక్తి ఈ మంత్రానికి ఉంది.

ఈ అష్టాక్షరిని జపించేటప్పుడు శ్రీమహావిష్ణువును మనసులో ధ్యానిస్తుండాలి.

                    🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️


🌹అష్టాక్షరీ మహామంత్ర స్తుతి🌹🙏


ఓం ఓం నమః ప్రణవార్థార్థ స్థూలసూక్ష్మ క్షరాక్షర

వ్యక్తావ్యక్త కళాతీత ఓంకారాయ నమో నమః|| (1)


న నమో దేవాదిదేవాయ దేహసంచారహేతవే

దైత్యసంఘవినాశాయ నకారాయ నమో నమః|| (2)


మో మోహనం విశ్వరూపం చ శిష్టాచారసుపోషితమ్

మోహవిధ్వంసకం వందే మోకారాయ నమో నమః|| (3)


నా నారాయణాయ నవ్యాయ నరసింహాయ నామినే

నాదాయ నాదినే తుభ్యం నాకారాయ నమో నమః|| (4)


రా రామచంద్రం రఘుపతిం పిత్రాజాపరిపాలకమ్

కౌసల్యాతనయం వందే రాకారాయ నమో నమః|| (5)

 

య యజ్ఞాయ యజ్ఞగమ్యాయ యజ్ఞరక్షాకరాయ చ

యజ్ఞాంగరూపిణే తుభ్యం యకారాయ నమో నమః|| (6)


ణా ణాకారం లోకవిఖ్యాతం నానాజన్మఫలప్రదమ్

నానాభీష్టప్రదం వందే ణాకారాయ నమో నమః|| (7)


య యజ్ఞకర్రే యజ్ఞభళే యజ్ఞరూపాయ తే నమః

సుజ్ఞానగోచరాయాస్తు యకారాయ నమో నమః|| (8)

                             🌺🌼🌺🌼🌺🌼🌺



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు