Posts

Showing posts from October, 2024

⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 హరిః ఓం నమస్తే అస్తు భగవన్విశ్వేశ్వరాయ మహాదేవాయ త్య్రంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః "న కార్తీక నమో మాసః న దేవం కేశవాత్పరం! నచవేద సమం శాస్త్రం న తీర్థం గంగాయాస్థమమ్” -- అని స్కంద పురాణంలో పేర్కొనబడింది. అంటే “కార్తీకమాసానికి సమానమైన మాసము లేదు. శ్రీమహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు. వేదముతో సమానమైన శాస్త్రము లేదు గంగతో సమానమైన తీర్థము లేదు.” అని అర్ధం. కార్తీకమాస మహత్యం గురించి పూర్వం నైమిశారణ్య ఆశ్రమములో శౌనకాది మహామునులు అందరికీ సూతమహాముని ఎన్నో విష్ణు భక్తుల చరిత్రలు, విష్ణు మహిమలను వినిపించే సమయంలో, "ఓ సూతముని శ్రేష్ఠా! కలియుగంలో ప్రజలు సంసార సాగరమునుండి తరింపలేక, అరిషడ్వర్గాలకు దాసులై, సుఖంగా మోక్షమార్గం తెలియక ఎన్నో ఈతిబాధలు అనుభవిస్తున్న ఈ మానవులకు ధర్మాలన్నింటిలో ఉత్తమ ధర్మమేది? దేవతలు అందరిలోనూ ముక్తి నొసంగు ఉత్తమ దైవమెవరు? మానవునికి ఆవరించియున్న ఈ అజ్ఞానాన్ని రూపుమాపి పుణ్యఫలం యిచ్చే కార్యమేది? ప్రతిక్షణం మృత్యువు వల్ల వెంబడించబడే ఈ మానవులకు మోక్షము కలిగిం...

⚜️🕉️🚩 శ్రీ రామ జయ రామ జయజయ రామ 🌹🙏

Image
 ⚜️🕉️🚩 శ్రీ రామ జయ రామ జయజయ రామ 🌹🙏 శ్రీరఘురామ చారు తులసీదళదామ, శమక్షమాది శృం గార గుణాభిరామ, త్రిజగన్నుత శౌర్య రమా లలామ దు ర్వార కబంధ రాక్షస విరామ, జగజ్జన కల్మషార్ణవో త్తారకరామ భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ! 🌹భావం: ఇక్ష్వాకువంశం సంపదలకు నెలవు. ఆ వంశంలో రఘుమహారాజు గొప్పవాడు. అటువంటి వంశ పరంపరలో పుట్టినవాడు. అందమైన తులసీదళాలతో తయారైన మాలికను ధరించినవాడు. శాంతి, ఓర్పు అనే మంచి లక్షణాలతో ప్రకాశించేవాడు. ముల్లోకాలలోనూ పొగడ్తలు అందుకున్నవాడు. పరాక్రమం అనే సంపదను ఆభరణంగా కలిగినవాడు. ఎవ్వరికీ ఎదుర్కోవడం సాధ్యం కాని కబంధుడనే రాక్షసుని వధించినవాడు. ప్రపంచంలోని మానవులను పాపాలు అనే సముద్రం నుంచి దాటించగల ‘రామా’ అనే పేరు గలవాడు. దయకు సముద్రం వంటివాడు. భద్రాచలం అనే కొండ పైభాగంలో నివాసం ఉన్నవాడు. దశరథ మహారాజుకు ముద్దుల కుమారుడు. ఆయనే శ్రీరాముడు.

⚜️🕉️🚩 ఓం శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః 🌹🙏

🌹🌹శ్రీ పాండురంగాష్టకం🌹🌹

Image
 🕉️⚜️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥భజే పాండురంగమ్... 🌹🌹శ్రీ పాండురంగాష్టకం🌹🌹 మహాయోగపీఠే తటే భీమరథ్యా వరం పుండరీకాయ దాతుం మునీంద్రైః | సమాగత్య తిష్ఠంతమానందకందం పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్ || 1 || తటిద్వాససం నీలమేఘావభాసం రమామందిరం సుందరం చిత్ప్రకాశమ్ | వరం త్విష్టకాయాం సమన్యస్తపాదం పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్ || 2 || ప్రమాణం భవాబ్ధేరిదం మామకానాం నితంబః కరాభ్యాం ధృతో యేన తస్మాత్ | విధాతుర్వసత్యై ధృతో నాభికోశః పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్ || 3 || స్ఫురత్కౌస్తుభాలంకృతం కంఠదేశే శ్రియా జుష్టకేయూరకం శ్రీనివాసమ్ | శివం శాంతమీడ్యం వరం లోకపాలం పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్ || 4 || శరచ్చంద్రబింబాననం చారుహాసం లసత్కుండలాక్రాంతగండస్థలాంతమ్ | జపారాగబింబాధరం కంజనేత్రం పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్ || 5 || కిరీటోజ్జ్వలత్సర్వదిక్ప్రాంతభాగం సురైరర్చితం దివ్యరత్నైరనర్ఘైః | త్రిభంగాకృతిం బర్హమాల్యావతంసం పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్ || 6 || విభుం వేణునాదం చరంతం దురంతం స్వయం లీలయా గోపవేషం దధానమ్ | గవాం బృందకానందదం చారుహాసం పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్ || 7 || అజం రుక్మిణీప్రాణసంజీవనం తం పరం ధామ కైవల్యమేక...

💥శ్రీ వేంకటేశ్వర పంచక స్తోత్రమ్💥

Image
 ⚜️🕉️🚩 ఓం నమో వేంకటేశాయ🌹🙏 💥శ్రీ వేంకటేశ్వర పంచక స్తోత్రమ్💥 శ్రీధరాధినాయకం శ్రితాపవర్గదాయకం శ్రీగిరీశమిత్రమంబుజేక్షణం విచక్షణమ్ | శ్రీనివాసమాదిదేవమక్షరం పరాత్పరం నాగరాద్గిరీశ్వరం నమామి వేంకటేశ్వరమ్ || 1 || ఉపేంద్రమిందుశేఖరారవిందజామరేంద్రబ్బ- -న్దారకాదిసేవ్యమానపాదపంకజద్వయమ్ | చంద్రసూర్యలోచనం మహేంద్రనీలసన్నిభమ్ నాగరాద్గిరీశ్వరం నమామి వేంకటేశ్వరమ్ || 2|| నందగోపనందనం సనందనాదివందితం కుందకుట్మలాగ్రదంతమిందిరామనోహరమ్ | నందకారవిందశంఖచక్రశార్ణ సాధనం  నాగరాద్గిరీశ్వరం నమామి వేంకటేశ్వరమ్ || 3 || నాగరాజపాలనం భోగినాథశాయినం నాగవైరిగామినం నగారిశత్రుసూదనమ్ | నాగభూషణార్చితం సుదర్శనాద్యుదాయుధం నాగరాద్గిరీశ్వరం నమామి వేంకటేశ్వరమ్ || 4 || తారహీరశారదాభ్రతారకేశకీర్తి సం- -విహారహారమాదిమధ్యాంతశూన్యమవ్యయమ్ | తారకాసురాటవీకుఠారమద్వితీయకం నాగరాద్గిరీశ్వరం నమామి వేంకటేశ్వరమ్ || 5 || ఇతి శ్రీ వేంకటేశ్వర పంచక స్తోత్రమ్| ⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

⚜️🕉️🚩 ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏 లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవత్‌ బ్రహ్మంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం రెండు చేతులలో మాలలను ధరించి, అభయ వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, గజరాజు సేవిస్తుండగా శ్రీమహాలక్ష్మి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు.  మహాలక్ష్మీ సర్వమంగళకారిణి, ఐశ్వర్య ప్రదాయిని. అష్టలక్ష్ముల సమష్టి రూపమే మహాలక్ష్మీ దేవి. మహా విష్ణువునకు సృష్ట్యాది నుండి లక్ష్మీదేవి తోడుగానే ఉందని, లక్ష్మీ నారాయణులు వేరు వేరు కాదని చెప్పబడింది. సృష్ట్యాదిలో దేవి సృష్టిని పాలించడానికి విష్ణువుకు తోడుగా ఉండమని లక్ష్మీ దేవిని ప్రసాదించిందని దేవీభాగవతంలో ఉంది. భృగు మహర్షి భార్య ఖ్యాతి. ఆమె పుత్రికా సంతానానికై తపస్సు చేస్తే ఆదిపరాశక్తి అంశతో ఆమె భార్గవిగా జన్మించింది. లక్ష్మీదేవి.. స్వారోచిష మన్వంతరంలో- అగ్నినుంచి ఔత్తమ మన్వంతరంలో స్వచ్ఛమైన గాలి నుంచి, తామస మన్వంతరంలో భూమి నుంచి, రైవత మన్వంతరంలో – బిల్వం నుంచి, చాక్షుష మన్వంతరంలో- సహస్ర దళ పద్మం నుంచి, వైవస్వ...

⚜️🕉️🚩 ఓం శ్రీ గురు దక్షిణామూర్తయే నమః 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ గురు దక్షిణామూర్తయే నమః 🌹

💥శ్రి దత్త స్తవం💥

Image
 ⚜️🕉️🚩ఓం శ్రీదత్తాయ నమః🌹🙏 💥శ్రి దత్త స్తవం💥 దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలమ్ । ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామి సనోవతు ॥ 1 ॥ భావము: భక్తుల యందు పుత్రప్రేమను కలిగి అపార ప్రేమతో వరములు ఇచ్చి, పరబ్రహ్మ స్వరూపం అయి, తలచిన వెంటనే ప్రత్యక్షమయ్యే శ్రీ దత్తాత్రేయ స్వామి నన్ను రక్షించు. దీనబంధుం కృపాసింధుం సర్వకారణకారణమ్ । సర్వరక్షాకరం వందే స్మర్తృగామి సనోవతు ॥ 2 ॥ భావం:  దీనుల, ఆర్తుల యందు బంధువు, కరుణా సముద్రుడు అందరినీ రక్షించే దయ తత్వం కలిగి, తలచిన వెంటనే ప్రత్యక్షమయ్యే శ్రీ దత్తాత్రేయ స్వామి నన్ను రక్షించు. శరణాగతదీనార్త పరిత్రాణపరాయణమ్ । నారాయణం విభుం వందే స్మర్తృగామి సనోవతు ॥ 3 ॥ భావం:  శరణాగతి చెందిన దీనులకు కల్పవృక్షం, సర్వ వ్యాప్తుడు అయిన నారాయణుడు, ఆప్త పరాధీనుడు అయి  తలచిన వెంటనే   ప్రత్యక్షమయ్యే శ్రీ దత్తాత్రేయస్వామి నన్ను రక్షించు. సర్వానర్థహరం దేవం సర్వమంగళ మంగళమ్ । సర్వక్లేశహరం వందే స్మర్తృగామి సనోవతు ॥ 4 ॥ భావం:  అన్ని జ్ఞాన సంబంధ అనర్దాలు  తొలగించి, శుభములు ప్రసాదించి కష్టాలు తొలగించి ఐహిక కోసం ఉపాసన చేసినా పారమార్ధిక ఫలం ప్రస...

⚜️🕉️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏 శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్‌ సర్వ విఘ్నోపశాంతయే॥ సకల విఘ్నాలను తొలగించే విఘ్నాధిపతి ఆయనే కాబట్టి, ఏ పని ప్రారంభించినా ముందుగా గణపతిని తలుచుకుంటారు. ప్రకృతి స్వరూపమైన పరమశివుడికి, సృష్టి చైతన్యానికి మూలమైన అమ్మవారికి తనయుడైన వినాయకుడు, ప్రకృతి పురుషుల అభేదరూపానికి సంకేతం. అందుకే కంఠం నుంచి పాదాల వరకు జగం, కంఠం నుంచి శీర్షం వరకు గజం ఉంటాయి. గజం శివ స్వరూపమైతే, జగం మాతృస్వరూపం. అమ్మ ఇచ్చిన రూపాన్ని, అయ్య కూర్చిన శిరోభాగాన్నీ కలిపిన గజ స్వరూపంగా గణపతిని పూజించుకుంటాం. గణేశ అంటే సకలదేవతా గణాలకు అధిపతి అని అర్థం. మన శరీరంలో ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు, నాలుగు అంతఃకరణలు ఉంటాయి. ఈ పద్నాలుగింటిని చతుర్దశ మహాశక్తులు అంటారు. వీటన్నిటికీ మూల ప్రేరకుడు శ్రీగణేశుడు. సిద్ధిని, బుద్ధిని కలిగించి, విఘ్నాలు వైదొలిగేలా చేయడం, మంగళప్రదంగా జయం కలిగించడం కూడా వినాయకుడి చలువే. గణపతి ఆనందస్వరూపుడు. స్వామి ఆరాధనకు పరమావధి ఆనందమే. ఆయన విద్య, ఐశ్వర్య , జ్ఞాన ప్రదాత. ‘కలౌచండీ వినాయకః’ అన్నారు పెద్దలు! కలికాలంలో శీఘ్రంగా రక్షించే దేవతల...

💥సుబ్రహ్మణ్య తత్వం💥

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః 🌹🙏 స్తోత్రం: గాంగేయం వహ్నిగర్భం శరవణ జనితం జ్ఞానశక్తిం కుమారం బ్రహ్మణ్యం స్కందదేవం గుహమమలగుణం రుద్రతేజం స్వరూపం సేనాన్యాం తారకఘ్నం గురుమచల మతిం కార్తికేయం షడస్యం సుబ్రహ్మణ్యం మాయూరధ్వజరధ సహితం దేవదేవం నమామి 💥సుబ్రహ్మణ్య తత్వం💥 అవిద్య మరియు జ్ఞానము, దేవతలు మరియు అసురుల మధ్య జరిగే నిరంతర యుద్ధము, వాటి పరిణామమైన దైవిక శక్తుల విజయం - ఇదే సుబ్రహ్మణ్యుని లీలల సారము. స్కందుని జననం గురించి శ్రీమద్రామాయణం లో వాల్మీకి మహర్షి వివరంగా చెప్పారు. శివుని తేజస్సు (వీర్య రూపంలో) ఆయన ఆజ్ఞా చక్రమునుండి పెల్లుబుకి స్కందుని రూపము పొందినదట. అందుకనే స్కందుడు జ్ఞాన జ్యోతిగా ప్రతీక. శరవణమను సరస్సులో రెల్లు గడ్డి పెరిగే చోటనున్న ఆరు కమలముల నుండి పార్వతీ దేవి ఈ స్కందుని తీసుకున్నదట. సర్వోన్నత ఆధ్యాత్మిక అనుభూతి (అపరోక్షానుభూతి) అనేది యోగములో షడ్చక్రముల భేదన ద్వారా కలుగుతుంది. ఈ ఆరు చక్రముల భేదన ద్వారా జీవ శక్తి సహస్రార చక్రమున పూర్ణ యొక స్థితిని అనుభూతి పొందుతుంది. దీనికి సంకేతమైన ఆరు కమలముల నుండి ఆవిర్భవించిన స్కందుడు సర్వోన్నత జ్ఞానమునకు,...

💥శ్రీ ప్రసన్నాంజనేయ స్తోత్ర పంచరత్నాని💥

Image
 ⚜️🕉️🚩శ్రీ ఆంజనేయం 🌹🙏 💥శ్రీ ప్రసన్నాంజనేయ స్తోత్ర పంచరత్నాని💥 [దీనిని నిత్యము పఠించిన హనుమంతుని ప్రసన్నుని చేసికొన గలము] శ్రీ సీతారామ పాదాంబుజ మధులహరీ పానమత్త ద్విరేఫః విజ్ఞా తాగాధ సేవా విది సలిలనిధి స్ఫార గంభీర భావః దుర్వారోద్య ద్దృషీక ప్రణవ తురగ సంశిక్ష ణాత్యంత దక్షః స్వార్థత్యా గైకధీరః సమది మమ మమ భవ త్వాంజనేయః ప్రసన్నః|| శ్రుత్వా రామాభిదానం పులకిత సుతను ర్యో విధత్తే జదత్వం రామా ఖ్యోచ్చారణా ద్యో నయన జలభరా రుధ్ధ కంఠో విభాతి రామం హిత్వా న కించి న్నివసతి హృదయే యస్యభక్తి ప్రపూర్ణే భూయ శ్శ్రేయః ప్రదాతా స హి మమ భవతదంజనేయః ప్రసన్నః || అంభోదే ర్లంఘనే నాసురపతి నగరే భూమి జాన్వేషణేన లంకాయాం చారణేన ప్రతిభట బలవ ద్దైత్య విద్రావణేన సంజీవిన్యాః ప్రదానాత్ స్మృతిరహీత రఘు భ్రాతు రుజ్జీవనేన ప్రఖ్యా తాతి ప్రభావ స్స హి మమ భవతా దాంజనేయః ప్రసన్నః || పౌరందర్యం శివత్వం జలరుహభవతా భూతయ స్సిద్దయోష్ట శ్రీమ ద్రామాంఘ్రి పంకేరుహగత రజసో యస్యనాంశేన తుల్యాః దాస్యం యస్యై త్వదూష్యం ప్రమద మతితరాం దాస్యతి ప్రాభవాద ప్యానం దామంద కంద స్స హి మమ భవతా దాంజనేయః ప్రసన్నః || త్యాగీ యేగీ విరాగీ పర హితకర ణానుక్ష ణానందభోగీ త...

💥ఆది శంకరులు నుతించిన కాశీవిశ్వనాథుని అష్టకం..

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 💥ఆది శంకరులు నుతించిన కాశీవిశ్వనాథుని అష్టకం.. గంగా తరంగ రమణీయ జటా కలాపం గౌరీ నిరంతర విభూషిత వామ భాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణశీ పురపతిం భజ విశ్వనాథమ్ ॥ 1 ॥ తాత్పర్యం: గంగా నదీ అలలను తన జటాఝూటంలో అందంగా కలిగిన, తన ఎడమ వైపు పార్వతీ దేవి ఎల్లప్పుడూ శోభించే, శ్రీహరికి ప్రియుడైన, మన్మథుని గర్వము అణచిన, వారణాసి పురంలో వెలసిన ఆ విశ్వనాథుని భజన చేద్దాము. వాచామగోచరమనేక గుణ స్వరూపం వాగీశ విష్ణు సుర సేవిత పాద పద్మం వామేణ విగ్రహ వరేన కలత్రవంతం వారాణశీ పురపతిం భజ విశ్వనాథమ్ ॥ 2 ॥ తాత్పర్యం: పదములకు, వర్ణనకు అందని అనేక గుణాలు కలిగిన స్వరూపంతో ఉన్న, బ్రహ్మ విష్ణు మరియు ఇతర దేవతలచే సేవించబడిన పాదములు కలిగిన, తన ఎడమ వైపు శుభములు కలిగించే పార్వతిని కలిగి ఉన్న, వారణాసి పురంలో వెలసిన ఆ విశ్వనాథుని భజన చేద్దాము. భూతాదిపం భుజగ భూషణ భూషితాంగం వ్యాఘ్రాంజినాం బరధరం, జటిలం, త్రినేత్రం పాశాంకుశాభయ వరప్రద శూలపాణిం వారాణశీ పురపతిం భజ విశ్వనాథమ్ ॥ 3 ॥ తాత్పర్యం: సమస్త భూతములకు అధిపతియైన, సర్పములను ఆభరణంగా కలిగిన, పులిచర్మం వస్త్రంగా ధరించిన, జడలు కట్టిన కేశములు కలిగిన, పాశము ...

💥ద్వాదశార్యా స్తుతి💥

Image
 ⚜️🕉️🚩ఓం సూర్యాయ నమః🌹🙏 "ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్" అని శాస్త్రవచనం. వేదంలో సౌర, అరుణ మంత్రాలు శక్తివంతమైన ప్రభావం కలిగినవి. వాటిలోని భావాలను, శబ్దశక్తులను మిళితం చేసిన దివ్యస్తోత్రమిది. శ్రీకృష్ణుని పుత్రుడైన సాంబుడు ఒకసారి మహా వ్యాధిగ్రస్తుడై, కృష్ణోపదేశంతో సూర్యోపాసన దీక్షను వహించాడు. సముద్ర తీరంలో దీక్షాబద్ధుడైన సాంబునకు ఆకాశమార్గం నుండి ఒక దివ్యపత్రం ఎగిరివచ్చి చేరింది. ఆ పత్రంలోనివి ఈ శ్లోకాలు. వీటిని నియమంగా రోజూ పారాయణ చేస్తే సంపూర్ణారోగ్యం చేకూరుతుంది. వ్యాధులన్నిటినీ నివారింపజేసే ఈ స్తోత్రంలో వైదికమంత్ర స్ఫురణ నిబద్ధమై ఉంది. సాక్షాత్తు భాస్కర భగవానుడు అనుగ్రహించిన అక్షరౌషధమిది. 💥ద్వాదశార్యా స్తుతి💥 ఉద్యన్నద్య వివస్వా- నారోహన్నుత్తరాం దివం దేవః! హృద్రోగం మమ సూర్యో హరిమాణం చాశు నాశయేదఖిలమ్!! (1)  నిమిషార్ధేనైకేన ద్వేచ శతే ద్వే సహస్రే ద్వే!  క్రమమాణ యోజనానాం నమోస్తుతే నళిననాథాయ!! (2) కర్మజ్ఞానఖదశకం మనశ్చ జీవ ఇతి విశ్వసర్గాయ ద్వాదశథా యో విచరతి స ద్వాదశమూర్తి రస్తు మోదాయ!! (3)  త్వం హి యజూ ఋక్సామ త్వమాగమస్త్వం వషట్కారః! త్వం విశ్వం త్వం హంస - స్త్వం భానో! పరమ...

💥వేంకటేశ్వరుని సందేశము..

Image
 ⚜️🕉️🚩 ఓం నమో వేంకటేశాయ🌹🙏 💥వేంకటేశ్వరుని సందేశము.. దివ్యమంగళకరం శ్రీవేంకటేశ్వరుని రూపం - ఆత్మజ్ఞాన ప్రబోధకరం. ఆత్మజ్ఞాన చిహ్నాలతో అలరారే  వేంకటేశ్వరుని తేజోమూర్తి కడు రమ్యం. హస్తముల ద్వారా ఇస్తున్న సందేశం :- 'సంసార సాగర సముత్తరణైక సేతో' అన్నట్లుగా - కుడి హస్తముతో తన పాదములను చూపుతూ, వీటిని శరణువేడితే చాలు, మీ సంసార సాగరాన్ని మోకాళ్ళ లోతు మాత్రమే చేసి సులభముగా దాటిస్తాననే అభయ హస్త సందేశం ఇస్తుండగా, ఎడమచేతితో నాభి క్రింద స్థానం చూపిస్తూ, ప్రాణవాయువును నాభి క్రింద నుండి ఊర్ధ్వముఖంగా తీసుకుపోయి సహస్రారంలో ఉన్న పరబ్రహ్మ యందు లయం చెయ్యమన్న సందేశముంది. కుడి హస్తంతో, నా పాదాలను శరణువేడితే ఎడమ చేతితో నిను నా అక్కున చేర్చుకుంటానన్న సూచన ఉందని కూడా కొందరు పెద్దల విశ్లేషణ. శంఖు నామ చక్రములు ద్వారా ఇస్తున్న సందేశం :- #శంఖం ద్వారా ఉద్భవించునది శబ్దం. శంఖారావం ద్వారా జనించే ధ్వనిలో రజో తమో గుణములను హరింపజేసి సత్వగుణమును పెంచే శక్తి ఉండడమే కాక, విశ్వచైతన్యమును ఎరుకలోనికి తెస్తుంది. కుడి ప్రక్కగల #నామము ను సూర్యనాడిగా, ఎడమ ప్రక్కగల నామమును చంద్రనాడిగా, మధ్యనగల నామమును బ్రహ్మనాడిగా చెప్తుం...

💥అష్టలక్ష్మీ స్వరూపాలు..

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏 💥అష్టలక్ష్మీ స్వరూపాలు.. భక్తాభీష్ట ప్రదాయిని, ధర్మసంవర్ధిని అయిన జగన్మాత శ్రీమహాలక్ష్మి అష్టలక్ష్మీ రూపాల్లో ఈ జగత్తుని పరిపాలిస్తోంది. విష్ణుమూర్తి ధరించిన మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరుశురామ, రామ, కృష్ణ, బుద్ధ, కల్క్యావతారాలు ఏ రకంగా జగత్కల్యాణానికి ఉద్దేశింపబడ్డాయో, అలాగే విష్ణువు పత్నియైన లక్ష్మీదేవి అవతారాలు కూడా జగత్కల్యాణ కారకాలే. ధర్మ సంరక్షణ, సమాజ సంక్షేమం కోసం దుష్టశిక్షణ చేసి శిష్టరక్షణ చేశాడు నారాయణుడు. సమాజం వ్యక్తుల సమూహం కాబట్టి ఆయా వ్యక్తుల సంరక్షణకోసం, అభివృద్ధి కోసం, ఉన్నతి కోసం లక్ష్మీదేవి అష్టలక్ష్మీ రూపధారణ చేసింది. ఒక మాతృమూర్తి తన కన్న బిడ్డలని సరైనమార్గంలో పెంచటం కోసం రోజూ ఎన్నో రకాల అవతారాలను ఎత్తుతుంది. వాత్సల్యపూరితంగా అనునయిస్తునే తప్పు చేస్తే దండిస్తుంది. మనకి విద్యాబుద్ధులు నేర్పిన ప్రథమగురువు అయిన ఆ తల్లే అవసరమైప్పుడు ధైర్యాన్ని నూరిపోసి వీరత్వాన్ని వృద్ధి చేస్తుంది. ముఖ్యంగా ధర్మచింతన, యుక్తాయుక్త విచక్షణా జ్ఞానం, కరుణ, జాలి, వివేకం ఇవన్నీ ఆ అమ్మ పెట్టిన భిక్షలే. ఒక సాధారణ మాతృమూర్తే తన పిల్లల కోస...

💥 సత్యావతారం దత్తాత్రేయ అవతారం..

Image
 ⚜️🕉️🚩ఓం శ్రీదత్తాయ నమః🌹🙏 💥 సత్యావతారం దత్తాత్రేయ అవతారం.. భిన్నత్వంలోని ఏకత్వ దర్శనం ప్రసాదించడానికే జ్ఞాన స్వరూపమైన దత్తావతారం ఉద్భవించింది. మూడు గుణాలు వీరివే. త్రిగుణాత్మకుడు, త్రిగుణాతీతుడుగా, గురుదేవదత్తగా ఆ పరబ్రహ్మ అవతరించారు. మహా పతివ్రతైన అనసూయదేవిని పరీక్షించే నిమిత్తం త్రిమూర్తులు యతీశ్వరుల రూపంలో వచ్చి, నగ్నంగా భిక్ష వడ్డించమని అడగడం, ఆమె వారిని పసిపిల్లలుగా మార్చడం, త్రిమాతలు రావడం, త్రిమూర్తులను త్రిమాతలకు అనసూయదేవి అప్పగించడం, త్రిమాతలు, త్రిమూర్తులు సంతోషంగా అత్రి, అనసూయలకు వరం ఇవ్వడం వల్ల దత్తాత్రేయుల జననం జరిగిందని కధనం. దత్తావతారం దశావతారాలకంటే ఎంతో పురాతనమైనది. అన్ని అవతారాలు తమకు నిర్ధేశించిన కార్యము పూర్తి చేసుకొని ఈ లోకమునుండి నిష్క్రమించాయి. దత్త అవతారం మాత్రం నిత్య సత్యావతారంగా విరాజిల్లుతూనే ఉంది. ఇది శిష్టరక్షణకు, దుష్టశిక్షణకు కొరకే గాక, ప్రజలకు జ్ఞానప్రభోధం చేసి, వారిని సన్మార్గంలో చేయడానికి వచ్చిన విలక్షణ అవతారం. ఏ అవతార మూర్తికీ లేని "గురుదేవ" అన్న విశేషణం దత్తాత్రేయుల వారికి మాత్రమే ఉంది. అసలు గురుశబ్దం పుట్టింది వీరి నుండే. అందరికంటే జ్ఞ...

🌹శ్రీ నరసింహ మహా మృత్యుంజయ మంత్రం:🌹

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ లక్ష్మి నృసింహస్వామినే నమః🌹🙏 🌹శ్రీ నరసింహ మహా మృత్యుంజయ మంత్రం:🌹 ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం ఈ మంత్రాన్ని నిత్యం 108 సార్లు జపించినట్టయితే అనారోగ్య బాధలూ, అపమృత్యు దోషాలు తొలగి, దీర్ఘాయుష్షు లభిస్తుందనీ శాస్త్రవచనం. పెద్దలే కాదు, పిల్లల చేత కూడాఈ మంత్రాన్ని వల్లె వేయిస్తే... అనవసరమైన భయాలు దూరమై, స్థిరమైన బుద్ధి, ఆయురారోగ్యాలూ కలుగుతాయి.  స్వామి నామ మంత్రాన్ని ఒకసారి పరిశీలిస్తే తన భక్తులకు అభయమిచ్చే అంతరార్ధం అందులో నిబిడీకృతమై వున్నట్లు తెలుస్తుంది. 🌹ఉగ్రం: నృశింహుడు ఉగ్రమూర్తి. నరసింహుని హుంకారాన్ని విన్నంత మాత్రంలోనే అంతర్గత, బహిర్గత శత్రునాశనం జరుగుతుంది. 🌹వీరం: సకల కార్యకారణాలకు మూలంగా వున్న శక్తినే వీరం అంటారు. నరసింహుడు వీరమూర్తి. కనుక సకల కార్యకారణ స్వరూపుడు ఆయనే. 🌹మహావిష్ణుం: అన్ని లోకాల్లో అంతటా వుండే నరసింహ తత్వానికి ఈ నామం ప్రతీక. సకల జీవరాశులన్నిటిలోనూ తానే వ్యక్తంగానూ, అవ్యక్తంగానూ పరమాత్మ భాసిస్తాడు.  🌹జ్వలంతం: సకల లోకాల్లో, సర్వాత్మల్లో తన తేజస్సును ప్రకాశింపజేయడం ద్వారా వాటి...

⚜️🕉️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏 విద్యకు, విజ్ఞానానికి, బ్రహ్మతత్వ వివేచనానికి ప్రతీకగా విఘ్నేశ్వరుడు విచిత్రమైన మూషికవాహనాన్ని అధిరోహిస్తాడు. వింతైన మోదకాన్ని నైవేద్యంగా స్వీకరిస్తాడు. ఇంతకూ మూషికానికి, మోదకానికి గల ఆధ్యాత్మిక వైశిష్ట్యం ఏమిటి? 💥ఆదిపూజితుడిగా మోక్షదాయకమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించే లంబోదరుడు మూషికాన్ని తన వాహనంగా ఎంచుకున్నాడు. ఇందులో ఆధ్యాత్మిక గూఢార్థముంది.  వెలుగంటే భయపడే ఈ అల్పజీవి నేలలో చీకటి బొరియలు చేసుకొని నివసిస్తుంది. చీకటిలో అత్యంత వేగంగా పరుగెట్టే ఎలుక ఇంద్రియ లౌల్యానికి నిదర్శనం.  ఆవిధంగా అజ్ఞానానికి, భయానికి, కామక్రోధాలకు ప్రతీక అయిన ఎలుకపై సర్వవిద్యాసమన్వితుడైన విఘ్నేశుడు కూర్చోవడం ద్వారా మానవులు అజ్ఞాన నివృత్తిని సాధించే మార్గాన్ని ఉపదేశిస్తాడు. అంతరంగపు వెలుగును ఇచ్చే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందడం, ఇంద్రియాలను నిగ్రహించడం, ధర్మాచరణతో నిర్భయులవడం వంటి లక్షణాలను సాధించడం ద్వారా మానవులు ముక్తిధామాన్ని చేరగలరని ఉపదేశించే దివ్యమూర్తి విఘ్నేశ్వరుడు. 💥మోదకం – అంతరార్థం గణపతికి మోదకం అత్యంత ప్రియమైన తినుబండారం. అచ్చ తెనుగులో ఉండ్రాళ్ళుగా పిలువబ...

💥॥ శ్రీసుబ్రహ్మణ్య షోడశనామ స్తోత్రం ॥💥

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః 🌹🙏 💥॥ శ్రీసుబ్రహ్మణ్య షోడశనామ స్తోత్రం ॥💥 అస్య శ్రీ సుబ్రహ్మణ్య షోడశనామస్తోత్ర మహామంత్రస్య అగస్త్యో భగవానృషిః అనుష్టుప్ఛందః సుబ్రహ్మణ్యో దేవతా మమేష్ట సిద్ధ్యర్థే జపే వినియోగః । ధ్యానం । షడ్వక్త్రం శిఖివాహనం త్రినయనం చిత్రాంబరాలంకృతం శక్తిం వజ్రమసిం త్రిశూలమభయం ఖేటం ధనుశ్చక్రకమ్ । పాశం కుక్కుటమంకుశం చ వరదం హస్తైర్దధానం సదా ధ్యాయేదీప్సితసిద్ధిదం శివసుతం స్కందం సురారాధితమ్ ॥ ప్రథమో జ్ఞానశక్త్యాత్మా ద్వితీయః స్కంద ఏవ చ । అగ్నిగర్భస్తృతీయస్తు బాహులేయశ్చతుర్థకః ॥ ౧ ॥ గాంగేయః పంచమః ప్రోక్తః షష్ఠః శరవణోద్భవః । సప్తమః కార్తికేయశ్చ కుమారశ్చాష్టమస్తథా ॥ ౨ ॥ నవమః షణ్ముఖః ప్రోక్తో దశమస్తారకాంతకః । ఏకాదశశ్చ సేనానీః గుహో ద్వాదశ ఏవ చ ॥ ౩ ॥ త్రయోదశో బ్రహ్మచారీ శివతేజశ్చతుర్దశః । క్రౌంచదారీ పంచదశః షోడశః శిఖివాహనః ॥ ౪ ॥ షోడశైతాని నామాని యః పఠేద్భక్తిసంయుతః । బృహస్పతిసమో వాచి బ్రహ్మతేజోయుతో భవేత్ । యద్యత్ప్రార్థయే మర్త్యస్తత్సర్వం లభతే ధ్రువమ్ ॥ ౫ ॥ ఇతి శ్రీ సుబ్రహ్మణ్య షోడశనామ స్తోత్రమ్ । సేకరణ... 💐🙏 ⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

💥హనుమదుపాసన సర్వ సంపత్కరం..

Image
 ⚜️🕉️🚩 శ్రీ ఆంజనేయం 🌹🙏 💥హనుమదుపాసన సర్వ సంపత్కరం.. బ్రహ్మచర్య పాలన, శత్రు నిగ్రహం, కామ విజయం, కార్య సిద్ధి తదితర విషయాల దృష్ట్యా హనుమంతుడు ప్రసిద్ధి. దాస్య భక్తికి చక్కని నిదర్శనంగా నిలిచిన హనుమంతుడ్ని అంజనీ పుత్రుడు, పవనసుతుడు, రుద్రావతార మూర్తి, కేసరీ నందనుడు, సాధు శిరోమణి, కపి శిరోమణి, భక్త శిరోమణి, పాప నాశకరుడు తదితర పేర్లతో మనం స్మరిస్తాం. రుద్రావతారుడు కావడం చేత శంకర నందనుడయ్యాడు. కేసరికి ఔరస పుత్రుడు కావడం వల్ల కేసరి నందనుడయ్యాడు. హనుమంతునికి పవన సుత, అంజనీపుత్రుడు అనే పేర్లు రావడానికి ఓ పురాణ గాథ ప్రచారంలో ఉంది. పుంజిక స్థల అనే అప్సరస శాపగ్రస్తురాలై కామ రూపం గల దివ్యాతి దివ్యమైన వస్త్రాలను ధరించి సంచరిస్తుందట. ఆమెను వీక్షించిన వాయుదేవుడు ఆమె వైపు పురోగమించాడు. ఈ హఠత్పరిణామానికి విస్తుపోయిన పుంజికస్థల పతివ్రత అయిన తనను స్పృశించిన వారెవరని గద్ధించిందట. అంతట వాయుదేవుడు దేవీ.. అలాంటిదేమీ లేదు. అనంత కోటి బ్రహ్మాండ నాయకుడు, అనాధ నాధుడు, కరుణామయుడైన భగవానుడు భూ భార హరణార్ధం మానవ రూపాన అవతరించనున్నాడు. ఆ పరమాత్ముని సేవ కోసం నీ పుత్రునిగా మారుతి పుట్టి విఖ్యాతుడవుతాడని చెప్పాడట...

🌼॥ ఉమమహేశ్వరాష్టకం (సంఘిల కృతం) ॥🌼

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌼🙏 🔱 హర హర మహాదేవ శంభో శంకర 🔱 🌼॥ ఉమమహేశ్వరాష్టకం (సంఘిల కృతం) ॥🌼 పితామహశిరచ్ఛేదప్రవీణకరపల్లవ | నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వర || 1 || నిశుంభశుంభప్రముఖదైత్యశిక్షణదక్షిణే | నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వరి || 2 || శైలరాజస్యజామాతశ్శశిరేఖావతంసక | నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వర || 3 || శైలరాజాత్మజే మాతశ్శాతకుంభనిభప్రభే | నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వరి || 4 || భూతనాథ పురారాతే భుజంగామృతభూషణ | నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వర || 5 || పాదప్రణతభక్తానాం పారిజాతగుణాధికే | నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వరి || 6 || హాలాస్యేశ దయామూర్తే హాలాహలలసద్గళ | నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వర || 7 || నితంబిని మహేశస్య కదంబవననాయికే | నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వరి || 8 || ఇతి శ్రీహాలాస్యమాహాత్మ్యే సంఘిలకృతం ఉమామహేశ్వరాష్టకమ్ | 🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼

⚜️🕉️🚩 ఓం సూర్యాయ నమః 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం సూర్యాయ నమః 🌹🙏

💥అపరాజితా దేవి

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏 💥అపరాజితా దేవి "దుర్గాదేవి" అనేక అంశలలో "అపరాజితా దేవి" అవతారం ఒకటి. అపరాజిత అంటే ఎవరిచేతా ఓడింపబడనిది అని అర్థం. దుర్మార్గులను శిక్షించి ధర్మ మార్గంలో నడిచేవారిని అమ్మ ఎల్లప్పుడూ కాపాడుతుంది. భూమండలం పై అధర్మం ప్రజ్వరిల్లినపుడు దేవతలందరి సహకారంతో దుర్గా దేవి అంశతో అపరాజితా దేవి ఉద్భవించింది. ఆమె అష్టదళ పద్మం పై అధిష్టించి మహా శివుని ఆజ్ఞ తో జయాన్ని కూర్చే ఎనిమిది శక్తి రూపాలను ఆదేశిస్తుంది. వారు ఆమ్మను కొలిచిన వారికి సర్వదా విజయం కలిగేలా పరిస్థితులను శాసిస్తారు. కొన్ని రూపాలలో అపరాజితా దేవి సింహ వాహనం పై అనేక బాహువులతో ఆయుధాలను ధరించి ఉంటుంది.  దేవీ పురాణంలోనూ చండీ సప్త శతి లోనూ అమ్మవారి గురించిన వర్ణనలు ఉంటాయి. అమ్మవారు శక్తి కేంద్రకమైన శమీ వృక్షం (జమ్మిచెట్టు) పైన నివశిస్తుందని శాస్త్రోక్తం. అందుకే విజయ దశమి రోజున అమ్మ వారు నివసించే శమీ వృక్షానికి పూజలు చేస్తారు. 💥#శమీ_పూజ "విజయదశమి" రోజున అపరాజితాదేవిని "శమీవృక్షం" వద్ద పూజించే సంప్రదాయం ఉంది. శమీ వృక్షం (జమ్మి చెట్టు)లో అపరాజితా దేవి కొలువై ఉంటుందని విశ్వాస...

💥శ్రీరాజరాజేశ్వరీ అష్టకం💥

Image
 ⚜️🕉️💥 ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవ్యై నమః 🌹🙏 💥శ్రీరాజరాజేశ్వరీ అష్టకం💥 అంబా శాంభవి చంద్రమౌళీ రబలా వర్ణా ఉమా పార్వతీ కాళీ హైమవతీ శివా త్రిణయనీ కాత్యాయనీభైరవీ సావిత్రీ నవయౌవనా శుభకరీ సామ్రాజ్య లక్ష్మి ప్రదా చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి  అంబా మోహిని దేవతా త్రిభువనీ ఆనంద సందాయనీ వాణీ వల్లవపాణీ వేణు మురళీగాన ప్రియాలోలినీ కళ్యాణీ ఉడు రాజబింబ వదనా ధూమ్రాక్ష సంహారిణి చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి అంబానూపుర రత్నకంకణధరీ కేయూర హేరావళి జాతీ చంపక వైజయంతి లహరీ గ్రైవేయ విరాజితా వీణా వేణు వినోద మండితకరా వీరాసనే సంస్థితా చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి అంబా రౌద్రాణి భద్రకాళి భగళా జ్వాలాముఖీ వైష్ణవీ బ్రహ్మణీ త్రిపురాంతకీ సురనుతా దేదీప్యమానోజ్వలా చాముండాశ్రిత రక్షపోష జననీ దాక్షాయణి వల్లవీ చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి అంబా శూలధను: కుశాంకుశధరీ అర్ధేందుబింబాధరీ వారాహీ మధుకైటభ ప్రశమనీ వాణీ రామాసేవితా మల్లాద్యాసుర మూకదైత్యదమనీ మాహేశ్వరీ అంబికా చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి అంబా సృష్టి వినాశ పాలనకరీ ఆర్యా విసంశోభీతా గాయత్రీ ప్రణవాక్ష రామృతసరః ప...

పదవ రోజు: విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు "శ్రీ రాజరాజేశ్వరి దేవి"గా దర్శనమిస్తారు.

Image
 ⚜️🕉️🚩 ఓం దుర్గాయై నమః🌹🙏 💥శరన్నవరాత్రి_ఉత్సవాలు💥 పదవ రోజు: విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు "శ్రీ రాజరాజేశ్వరి దేవి"గా దర్శనమిస్తారు. మంత్రం: ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవ్యై నమ: నైవేద్యం: పులిహోర, గారెలు ప్రసాదం చీర: పచ్చ రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు. దసరా ఉత్సవాల చివరి రోజు అందరికీ అనందింప చేసే అపరాజితాదేవిగా, చల్లని తల్లిగా దుర్గమ్మ రాజరాజేశ్వరిదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తుంది. అమ్మను ఈ అలంకారంలో సేవించడం వల్ల సకల శుభాలు, విజయాలు లభిస్తాయని భక్తుల భావిస్తారు. 💥#రాజరాజేశ్వరీదేవి రాజరాజేశ్వరీదేవి భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత. మహాత్రిపుర సుందరిగా పూజలు అందుకుంటుంది. "అపరాజితాదేవి"గా భక్తులు ఆరాధిస్తారు. పరమేశ్వరుడి అంకం ఆసనంగా.. ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులను భక్తులకు అనుగ్రహిస్తుందీ తల్లి.  యోగమూర్తిగా.. మాయామోహిత మానవ చైతన్యాన్ని ఉద్దీపనం చేస్తుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీ చక్రానికి ఈ తల్లి అధిష్టాన దేవత. ఈ అవతారంలో అమ్మ ఒక చేతిలో చెరకుగడ, ఇంకో చేతిలో అభయముద్రతో భక్తులను అనుగ్రహిస్తూ దర్శనం ఇస్తుంది. చెరకు రసం అత్మజ్ఞానాన్ని సూచిస్తుంది. దుష్టుల...

నవరాత్రుల్లో ఆఖరి రోజైన ఆశ్వీయుజ శుద్ధ నవమి నాడు నవదుర్గల్లో తొమ్మిదవ, ఆఖరి అవతారం "సిద్ధిధాత్రీ దుర్గా"

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ 💥అభీష్ట ఫలదాయిని.. సిద్ధిధాత్రి నవరాత్రుల్లో ఆఖరి రోజైన ఆశ్వీయుజ శుద్ధ నవమి నాడు నవదుర్గల్లో తొమ్మిదవ, ఆఖరి అవతారం "సిద్ధిధాత్రీ దుర్గా" అమ్మవారిని పూజిస్తారు. 💥#ధ్యాన_శ్లోకం: సిద్ధగంధర్వయక్షాద్యైరసురైరమరైరపి । సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ ॥ సిద్ధి అంటే ఒక పని సిద్ధించడం, దాత్రీ అంటే  ఇచ్చేది. భక్తులు కోరుకున్న పనిని తీర్చే అమ్మవారు ఈమె. ఇహ సుఖాలనే కాక, జ్ఞానాన్నీ, మోక్షాన్నీ కూడా సిద్ధిదాత్రీదేవి ప్రసాదించగలదని భక్తుల నమ్మకం. అష్టమి నాడు మహాగౌరిగా కనిపించే అమ్మవారు మహర్నవమి రోజు సిద్ధిధాత్రిగా దర్శనమిస్తుంది.  కమలంపై పద్మాసనంలో కూర్చొని, ఒక చేతిలో కమలం ధరించి కరుణామృత ధారలను కురిపిస్తుంటుంది. ఈమె వాహనం సింహం. సకల అభీష్టాలనూ నెరవేర్చే దేవత ఈమె. సాక్షాత్తూ శివుడికే సర్వసిద్ధులను ప్రసాదించిన దేవత సిద్ధిధాత్రి. ఈ తల్లిని కొలిచిన వారికి అష్టసిద్ధులు కలుగుతాయి. లౌకిక, అలౌకిక సిద్ధులూ సిద్ధిస్తాయి. ఇహ సుఖాలను ఇస్తూనే జ్ఞానాన్నీ, మోక్షాన్నీ అనుగ్రహిస్తుందీ దేవత. తామరపువ్వులో కూర్చుని ఉండే సిద్ధిదాత్రీ దుర్గాదేవికి నా...

💥శ్రీ మహిషాసుర మర్దినీ స్తోత్రం💥

Image
 ⚜️🕉️🚩ఓం శ్రీ మహిషాసురమర్దిని దేవ్యై నమః 🌹🙏 💥శ్రీ మహిషాసుర మర్దినీ స్తోత్రం💥 అయి గిరినందిని నందితమేదిని విశ్వవినోదిని నందినుతే గిరివరవింధ్యశిరోధినివాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే । భగవతి హే శితికంఠకుటుంబిని భూరికుటుంబిని భూరికృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 1 ॥ సురవరవర్షిణి దుర్ధరధర్షిణి దుర్ముఖమర్షిణి హర్షరతే త్రిభువనపోషిణి శంకరతోషిణి కల్మషమోషిణి ఘోరరతే । [కిల్బిష-, ఘోష-] దనుజనిరోషిణి దితిసుతరోషిణి దుర్మదశోషిణి సింధుసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 2 ॥ అయి జగదంబ మదంబ కదంబవనప్రియవాసిని హాసరతే శిఖరి శిరోమణి తుంగహిమాలయ శృంగనిజాలయ మధ్యగతే । మధుమధురే మధుకైటభగంజిని కైటభభంజిని రాసరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 3 ॥ అయి శతఖండ విఖండితరుండ వితుండితశుండ గజాధిపతే రిపుగజగండ విదారణచండ పరాక్రమశుండ మృగాధిపతే । నిజభుజదండ నిపాతితఖండ విపాతితముండ భటాధిపతే [-చండ] జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 4 ॥ అయి రణదుర్మద శత్రువధోదిత దుర్ధరనిర్జర శక్తిభృతే చతురవిచారధురీణ మహాశివ దూతకృత ప్రమథాధిపతే । దురితదురీహ దురాశయ దుర్మతి దానవదూ...

తొమ్మిదో రోజు: విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు "శ్రీ మహిషాసురమర్ధిని దేవి"గా దర్శనమిస్తారు.

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ దుర్గాయై నమః🌹🙏 💥శరన్నవరాత్రి ఉత్సవాలు💥 తొమ్మిదో రోజు: విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు "శ్రీ మహిషాసురమర్ధిని దేవి"గా దర్శనమిస్తారు. మంత్రం: ఓం శ్రీ మహిషాసురమర్ధిని దేవియే నమ: నైవేద్యం: చింతపండు పులిహోర, చక్ర పొంగలి ప్రసాదం చీర: ఎరుపు రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు. ఈ రూపంలో అమ్మవారు సమస్త జీవరాశుల కష్టాలను తొలగిస్తుందని భక్తులు భావిస్తారు. అయి జగదంబ మదంబ కదంబవనప్రియవాసిని హాసరతే శిఖరిశిరోమణి తుంగ హిమాలయశృంగనిజాలయ మధ్యగతే! మధుమధురే మధుకైతభగంజిని కైతభభంజిని రాసరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే!! 💥లోక కంటకుడైన మహిషాసురుణ్ని సంహారం చేసిన మహోగ్రరూపం ఇది. సకల దేవీ దేవతల శక్తులన్నీ ఈ తల్లిలో మూర్తీభవించి ఉంటాయి. దివ్య తేజస్సుతో, అనేక ఆయుధాలు ధరించి, సింహ వాహినియై దర్శనమిస్తుంది. ఈమె అనుగ్రహం కలిగితే సాధించలేనిది ఏదీ లేదు.  "మహిషాసుర" సంహారం జరిగిన నవమి రోజునే ‘మహర్నవమి’గా జరుపుకోవటం ఆచారంగా వస్తున్నది.  ఈ రోజున చండీదేవిని పూజించిన వారికి శత్రుభయం ఉండదు. అన్నిటా విజయం కలుగుతుంది. ఈ రోజు అమ్మవారిని యథాశక్తి పూజించి పానకం, వడపప్పు, గ...

నవరాత్రులలో ఎనిమిదవ రోజైన ఆశ్వీయుజ శుద్ధ అష్టమి నాడు అమ్మ అనుగ్రహించే రూపం "మహాగౌరీ దుర్గా"

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీమాత్రే నమః 🌹🙏 💥ఓం దేవీ మహాగౌర్యై నమః💥 నవరాత్రులలో ఎనిమిదవ రోజైన ఆశ్వీయుజ శుద్ధ అష్టమి నాడు అమ్మ అనుగ్రహించే రూపం "మహాగౌరీ దుర్గా" 💥ధ్యాన శ్లోకం: శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా శుచిః! మహాగౌరీ శుభం దద్యాత్‌, మహాదేవ ప్రమోదదా!! "మహాగౌరీదేవి" నాలుగు చేతులుతో.. కుడిచేయి అభయ ముద్రలో ఉండగా, కింది కుడి చేతిలో త్రిశూలం ఉంటుంది. కింది ఎడమ చేతిలో ఢమరుకం ఉండగా, పై ఎడమ చేయి దీవిస్తున్నట్టుగా ఉంటుంది. మహాగౌరి అనే పేరుకు గొప్ప తెలుపు అని అర్ధం. 💥పార్వతీదేవి తన భర్తగా శివుడిని పొందడంకోసం నారదుడు ఇచ్చిన సలహాతో తపస్సు చేయటానికి పూనుకుంది. కాబట్టి, ఆమె రాజ భవనాన్ని, అన్ని సౌకర్యాలను విడిచి, అడవికి వెళ్ళి తపస్సు చేయడం ప్రారంభించింది. ఆమె ఎండ, చలి, వర్షం, కరువు, భయంకరమైన తుఫానులను కూడా లెక్కచేకుండా చాలా సంవత్సరాలు కఠిన తపస్సు కొనసాగింది. దాంతో పార్వతి శరీరం దుమ్ము, ధూళి, నేల, చెట్ల ఆకులతో నిండిపోయింది. చివరికి, శివుడు ఆమెముందు ప్రత్యక్షమై, ఆమెను వివాహం చేసుకుంటానని మాట ఇచ్చాడు. అతను తన ముడి వేసిన జుట్టు నుండి వెలువడే గంగా నది పవిత్ర జలాల ద్వారా ఆమెను తడిపాడు. గంగ ...

⚜️🕉️🚩 ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏

💥శ్రీదుర్గాదేవీ సప్తశ్లోకి స్తోత్రం💥

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ మాత్రే నమః🌹🙏 "దుర్గాష్టమి" రోజు "దుర్గ సప్తశ్లోకి" పారాయణం చేయడం అందరికీ శ్రేయోదాయకం. ఎంతో శుభాన్ని కలిగిస్తుంది. శ్రీ దుర్గాదేవి ఆశిస్సులు మీతో ఎప్పటికీ ఉండాలంటే "శ్రీ దుర్గా సప్తశ్లోకి" శ్లోకాన్ని ప్రతీ రోజూ జపించండి. ఈ సప్తశతి శ్లోకాన్ని జపించడం ద్వారా మీ అన్ని కష్టాలు దూరమవుతాయి, సంపద సిధ్దిస్తుంది. ఈ శ్లోకాన్ని శ్రద్ధగా జపిస్తే అమ్మవారి ఆశిస్సులు మీకు ఎల్లపుడూ ఉంటాయి. ప్రతీ రోజు ఉదయం స్నానం చేయగానే ఈ సప్తశ్లోకి శ్లోకాన్ని పఠించండి. 💥 శ్రీదుర్గాదేవీ సప్తశ్లోకి స్తోత్రం💥 శివ ఉవాచ దేవీ త్వం భక్తసులభే సర్వకార్యవిధాయిని | కలౌ హి కార్యసిద్ధ్యర్థముపాయం బ్రూహి యత్నతః || దేవ్యువాచ శృణు దేవ ప్రవక్ష్యామి కలౌ సర్వేష్టసాధనమ్ | మయా తవైవ స్నేహేనాప్యంబాస్తుతిః ప్రకాశ్యతే || ఓం అస్య శ్రీ దుర్గా సప్తశ్లోకీ స్తోత్రమంత్రస్య నారాయణ ఋషిః, అనుష్టుప్ ఛందః, శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వత్యో దేవతాః, శ్రీ దుర్గా ప్రీత్యర్థం సప్తశ్లోకీ దుర్గాపాఠే వినియోగః | ఓం జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీ హి సా | బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్ఛతి || 1 || దుర్గే స్మృతా ...

ఎనిమిదో రోజు: విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు "శ్రీదుర్గా దేవి"గా దర్శనమిస్తారు.

Image
 ⚜️🕉️🚩 ఓం దుర్గాయై నమః 🌹🙏 💥శరన్నవరాత్రి ఉత్సవాలు💥 ఎనిమిదో రోజు: విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు "శ్రీదుర్గా దేవి"గా దర్శనమిస్తారు. మంత్రం: ఓం శ్రీ దుర్గాదేవ్యై నమ: నైవేద్యం: అల్లం గారెలు, నిమ్మకాయ ప్రసాదం చీర: ఎరుపు రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు. ఈ అలంకారంలోని అమ్మవారిని శక్తి స్వరూపిణిగా భక్తులు కొలుస్తారు. కుంకుమార్చనలతో భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. 💥శక్తి స్వరూపిణి #దుర్గాదేవి.. పవిత్రమైన ‘శరత్‌ రుతువు’లో ప్రారంభమయ్యే నవరాత్రులు శక్తి స్వరూపమైన దుర్గాదేవి ఉపాసనకు గొప్పదని భావిస్తారు. ఎనిమిదో రోజు అమ్మవారిని "మహాదుర్గ"గా అలంకరించి అర్చిస్తారు. దుర్గముడు అనే రాక్షసుడిని సంహారం చేసిన శక్తి స్వరూపం దుర్గాదేవి. అమ్మవారు మహాప్రకృతి స్వరూపిణి. ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తుల సమష్టి ఆరాధనే దుర్గాదేవి ఉపాసన. సమస్త దేవీదేవతా శక్తులు, తేజస్సులు మూర్తీభవించిన తేజోరూపం ఈ తల్లి స్వరూపం. ఇది సర్వ శత్రు సంహారక రూపం. దుర్గతులను నివారించే పరాశక్తి దుర్గాదేవి. కోటి సూర్యప్రభలతో వెలుగొందే అమ్మను పూజించడం వల్ల శత్రుపీడ తొలగిపోతుంది. విజయం కలుగుతుంది.  సకల గ్రహబాధలూ ఆ తల...

శరన్నవరాత్రులలో 7వ రోజు - ఆశ్వయుజ సప్తమి నాడు అమ్మవారు... "కాళరాత్రి దుర్గా"

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీమాత్రే నమః 🌹🙏 💥"కాళరాత్రి దేవీ" నమోస్తుతే! శరన్నవరాత్రులలో 7వ రోజు - ఆశ్వయుజ సప్తమి నాడు అమ్మవారు... "కాళరాత్రి దుర్గా" అవతారంలో దర్శనమిస్తారు. 💥#ధ్యాన_శ్లోకం  ఏకవేణీ జపాకర్ణపూరా నగ్నా ఖరాస్థితా లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్త శరీరిణీ! వామపాదోల్ల సల్లోహలతా కంటక భూషణా వర్ధనమూర్ధజా కృష్ణా కాళరాత్రి ర్భయంకరీ!! గాఢాంధకారంతో సమానంగా ప్రకాశించే నల్లని దేహం, విరబోసుకున్న ఒత్తయిన నల్లని జుత్తు, ప్రకాశవంతమైన మూడు కన్నులు, విద్యుత్కాంతితో సమానంగా ప్రకాశించే కంఠహారంతో కాళరాత్రి అమ్మవారు దర్శనమిస్తుంది.  ఉచ్ఛాస నిశ్వాసల కారణంగా అమ్మ ముక్కుపుటాల నుంచి అగ్నిజ్వాలలు రేగుతుంటాయి. కాళరాత్రి చతుర్భుజాలతో దర్శనమిస్తుంది. పై ఎడమ చేతిలో వడి తిరిగిన ఖడ్గాన్ని, కింది ఎడమ చేతిలో కంటకాల వంటి కత్తులతో కూడిన మరొక ఆయుధాన్ని ధరించి శత్రు భయంకరిగా నిలిచిన అమ్మవారు.. తన కుడి చేతులతో అభయ, వరద ముద్రలను ప్రదర్శిస్తూ భక్తుల పాలిట కల్పవృక్షంగా సాక్షాత్కరిస్తుంది. గార్దభ వాహనంపై కుడికాలును ముడుచుకొని, ఎడమకాలును జారవిడిచి భక్తులపై అనురాగంతో నిండిన చూపులను ప్రసరింపజేస్తూ ఉంటుంది కాళర...

⚜️🕉️🚩 ఓం శ్రీమాత్రే నమః 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీమాత్రే నమః 🌹🙏

⚜️🕉️🚩 ఓం శ్రీ సరస్వతి దేవ్యై నమః 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ సరస్వతి దేవ్యై నమః 🌹🙏

ఏడవ రోజు: విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు "శ్రీ సరస్వతీ దేవి"గా దర్శనమిస్తారు.

Image
 ⚜️🕉️🚩 ఓం దుర్గాయై నమః 🌹🙏 💥శరన్నవరాత్రి ఉత్సవాలు💥 ఏడవ రోజు: విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు "శ్రీ సరస్వతీ దేవి"గా దర్శనమిస్తారు. మంత్రం: ఓం శ్రీ సరస్వతీ దేవ్యై నమ: నైవేద్యం: దద్దోజనం, పరమాన్నం, చక్ర పొంగలి ప్రసాదం. చీర: వైట్ రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు. అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం రోజున వాగ్దేవతామూర్తి అయిన సరస్వతి దేవి అవతారంలో అలంకరిస్తారు. సరస్వతిదేవిని సేవించడం వల్ల విద్యార్థులు అన్ని విద్యల్లో విజయం పొందుతారని భక్తులు విశ్వసిస్తారు. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిద్బవతుమే సదా! పద్మపత్ర విశాలాక్షీ పద్మ కేసరవర్ణినీ నిత్యం పద్మాలయా దేవీ సా మాం పాతు సరస్వతీ!! 💥బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతీ దేవిని పురాణాలు వర్ణించాయి. ఆమె సంగీత, సాహిత్యాలకు అధిష్ఠాన దేవత. మానవులందరికీ సకల విద్యలను ప్రసాదించి వారిలో జ్ఞానదీపాన్ని వెలిగించే విద్యాశక్తి. ఈ తల్లిని ఆరాధించడం వల్ల బుద్ధి వికాసం, విద్యాలాభం కలుగుతాయి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా త్రిశక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవి తన అంశలోని నిజ స్వరూపాన్ని సాక్షాత్కరింప చేయడమే మూలా న...

శరన్నవరాత్రుల్లో 6వ రోజు.. ఆశ్వీయుజ శుద్ధ షష్ఠి నాడు.. అమ్మవారు "కాత్యాయిని దుర్గా"

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీమాత్రే నమః 🌹🙏 💥కరుణధార.. కాత్యాయని శరన్నవరాత్రుల్లో 6వ రోజు.. ఆశ్వీయుజ శుద్ధ షష్ఠి నాడు.. అమ్మవారు "కాత్యాయిని దుర్గా" రూపంలో అనుగ్రహిస్తారు. 💥ధ్యాన శ్లోకం: చంద్రహాసోజ్వలకరా శార్దూలవరవాహనా! కాత్యాయినీ శుభం దద్యాదేవి దానవఘాతినీ!! చతుర్భుజాలతో, వరద, అభయ హస్తాలతో, ఖడ్గం, పద్మం ధరించి సింహ వాహనాన్ని అధిరోహించి దర్శనమిస్తుంది. బంగారు వర్ణంలో మెరిసిపోతూ దివ్యతేజస్సుతో అలరారుతుంది. ఈమె కాత్యాయన మహర్షి ఇంట పుత్రికగా అవతరించినది. అందువలన ఈమె "కాత్యాయని" అని ప్రసిద్ధికెక్కెను. ఈమె ఆశ్వయుజ శుక్లసప్తమి, అష్టమి, నవమి తిథులయందు కాత్యాయన మహర్షి పూజలందుకొని విజయదశమినాడు మహిషాసురుని వధించెను. కాత్యాయని అంటే తేజ స్వరూపిణి, మహాతేజో పుంజం అని అర్థాలు. తేజస్సు అంటే జ్ఞానం. కాత్యాయని మన బుద్ధిని ప్రేరేపిస్తుంది. భక్తులను భవజలధి, చింతా జలధి, సంసార జలధి అనే భవ సాగరాల నుంచి ఉద్ధరింపజేస్తుంది. ధర్మార్థ కామ మోక్షాలకు అధికారిణి ఈమె. "పార్వతీదేవే కాత్యాయని" అని అమరకోశం చెబుతున్నది. శాక్తేయంలో కాత్యాయనీ దేవిని దుర్గ, భద్రకాళి, చండికల అవతారంగా పరిగణిస్తారు. మహిషాసుర ...