⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏

 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏


హరిః ఓం నమస్తే అస్తు భగవన్విశ్వేశ్వరాయ మహాదేవాయ త్య్రంబకాయ

త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ

మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః


"న కార్తీక నమో మాసః

న దేవం కేశవాత్పరం!

నచవేద సమం శాస్త్రం

న తీర్థం గంగాయాస్థమమ్”


-- అని స్కంద పురాణంలో పేర్కొనబడింది.

అంటే “కార్తీకమాసానికి సమానమైన మాసము లేదు. శ్రీమహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు. వేదముతో సమానమైన శాస్త్రము లేదు గంగతో సమానమైన తీర్థము లేదు.” అని అర్ధం.


కార్తీకమాస మహత్యం గురించి పూర్వం నైమిశారణ్య ఆశ్రమములో శౌనకాది మహామునులు అందరికీ సూతమహాముని ఎన్నో విష్ణు భక్తుల చరిత్రలు, విష్ణు మహిమలను వినిపించే సమయంలో,


"ఓ సూతముని శ్రేష్ఠా! కలియుగంలో ప్రజలు సంసార సాగరమునుండి తరింపలేక, అరిషడ్వర్గాలకు దాసులై, సుఖంగా మోక్షమార్గం తెలియక ఎన్నో ఈతిబాధలు అనుభవిస్తున్న ఈ మానవులకు ధర్మాలన్నింటిలో ఉత్తమ ధర్మమేది? దేవతలు అందరిలోనూ ముక్తి నొసంగు ఉత్తమ దైవమెవరు? మానవునికి ఆవరించియున్న ఈ అజ్ఞానాన్ని రూపుమాపి పుణ్యఫలం యిచ్చే కార్యమేది? ప్రతిక్షణం మృత్యువు వల్ల వెంబడించబడే ఈ మానవులకు మోక్షము కలిగించు చక్కని ఉపాయము చెప్ప''మని కోరారు.


ఆ ప్రశ్నలను విన్న సూతముని, "ఓ ముని పుంగవులారా! క్షణికమైన సుఖభోగాల కోసం పరితపించుతూ, మందబుద్ధులు అవుతున్న మానవులకు "కార్తీకమాస వ్రతము’’ హరిహరాదులకు అత్యంత ప్రీతికరమైంది. దీనిని ఆచరించటం వల్ల సకల పాపాలు హరింపబడి మరు జన్మలేక పరంధామము పొందగలరు. 


పుణ్యాత్ములకు మాత్రమే ఈ కార్తీకమాస వ్రతమాచరించాలని కోరికను కలుగచేస్తాడు ఆ పరమాత్మ! దుష్టులకు, దుర్మార్గులకు వారి కర్మలు పరిపక్వమయ్యేవరకు ఏవగింపు కలిగిస్తాడు.


ఈ మాసంలో వచ్చే సోమవారాలు చవితి, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి, అత్యంత పుణ్యప్రదమైనవి. నెల అంతా సాధ్యపడని భక్తులు కనీసం ఆయా రోజులలో పవిత్రపుణ్య నదీ స్నానం ఆచరించి, ఉపవాస దీక్షలు చేస్తూ మహాన్యాస పూర్వక మహా రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చనలు, లక్ష కుంకుమార్చనలు, లలిత, విష్ణు సహస్రనామ పారాయణాలు, ప్రతి నిత్యం ఉభయ సంధ్యలలో దీపారాధన చేసేవారికి విశేష పుణ్య ఫలం లభిస్తుంది. ఈ కార్తీకమాసం ముప్పై రోజులు ఆచరించిన వారికి అనంతకోటి పుణ్యఫలం లభిస్తుందని చెప్పబడింది.


కార్తీకమాస విశేషాలను కొనియాడి చెప్పడానికి సహస్ర ముఖాలు కలిగిన ఆదిశేషుడు, చతుర్ముఖుడైన బ్రహ్మకే సాధ్యం కాదని చెప్పగా, ఇక మానవ మాత్రులమైన మనమెంత?'' అని సూతమహాముని చెప్పారు.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

వైశాఖ అమావాస్య శని జయంతి.

ఓం శ్రీ లక్ష్మి నృసింహస్వామినే నమః 🌹🙏

🌺🏵️🌼పూలపండుగ.. బతుకమ్మ🌹🙏