శరన్నవరాత్రులలో 7వ రోజు - ఆశ్వయుజ సప్తమి నాడు అమ్మవారు... "కాళరాత్రి దుర్గా"
⚜️🕉️🚩 ఓం శ్రీమాత్రే నమః 🌹🙏
💥"కాళరాత్రి దేవీ" నమోస్తుతే!
శరన్నవరాత్రులలో 7వ రోజు - ఆశ్వయుజ సప్తమి నాడు అమ్మవారు... "కాళరాత్రి దుర్గా" అవతారంలో దర్శనమిస్తారు.
💥#ధ్యాన_శ్లోకం
ఏకవేణీ జపాకర్ణపూరా నగ్నా ఖరాస్థితా
లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్త శరీరిణీ!
వామపాదోల్ల సల్లోహలతా కంటక భూషణా
వర్ధనమూర్ధజా కృష్ణా కాళరాత్రి ర్భయంకరీ!!
గాఢాంధకారంతో సమానంగా ప్రకాశించే నల్లని దేహం, విరబోసుకున్న ఒత్తయిన నల్లని జుత్తు, ప్రకాశవంతమైన మూడు కన్నులు, విద్యుత్కాంతితో సమానంగా ప్రకాశించే కంఠహారంతో కాళరాత్రి అమ్మవారు దర్శనమిస్తుంది.
ఉచ్ఛాస నిశ్వాసల కారణంగా అమ్మ ముక్కుపుటాల నుంచి అగ్నిజ్వాలలు రేగుతుంటాయి.
కాళరాత్రి చతుర్భుజాలతో దర్శనమిస్తుంది.
పై ఎడమ చేతిలో వడి తిరిగిన ఖడ్గాన్ని, కింది ఎడమ చేతిలో కంటకాల వంటి కత్తులతో కూడిన మరొక ఆయుధాన్ని ధరించి శత్రు భయంకరిగా నిలిచిన అమ్మవారు..
తన కుడి చేతులతో అభయ, వరద ముద్రలను ప్రదర్శిస్తూ భక్తుల పాలిట కల్పవృక్షంగా సాక్షాత్కరిస్తుంది.
గార్దభ వాహనంపై కుడికాలును ముడుచుకొని, ఎడమకాలును జారవిడిచి భక్తులపై అనురాగంతో నిండిన చూపులను ప్రసరింపజేస్తూ ఉంటుంది కాళరాత్రి.
కరాళ వదనాం గౌరీం ముక్తకేశీ చతుర్భుజామ్
కాళరాత్రిం కరాళికాం దివ్యాం విద్యుత్ మాలావిభూషితామ్॥
సంస్కృతంలో ‘ళ’ అనే అక్షరం లేనందున ఆమెను కాలరాత్రిగా పిలుస్తారు. రాత్రి కాలానికి అధికారిణిగా నిలిచిన అమ్మవారు కాలరాత్రి.
దశమహా విద్యల్లో ‘ధూమ్ర’.. నవదుర్గల్లోని ‘కాళరాత్రి’ ఒకరేనని సాధకులు నమ్ముతారు.
కాళరాత్రి ఆరాధనలో వామాచార ప్రాధాన్యం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.
ప్రపంచానికి వాటిల్లిన ఉపద్రవం నుంచి మానవాళిని ఉద్ధరించడానికి అవతరించిన దేవిగా కాళరాత్రిని భావిస్తారు.
కాళరాత్రిని సహస్రార చక్రాన్ని పాలించే దేవతగా, మోక్ష ప్రదాయనిగా పేర్కొంటారు.
అరిభయంకరి అయిన కాళరాత్రి భక్తులకు శుభంకరి.
నలుపురంగులో శోభిల్లే ఈ కాళరాత్రి అవతారాన్ని ఆరాధిస్తే చెడు తొలిగి సకల శుభాలూ వర్షిస్తాయి.
ధర్మ పరిరక్షణ కోసం భయంకర రూపంలో దుష్టశిక్షణ చేస్తుంది.
గ్రహచారంలో శని బాగాలేని వారు, గాలి సోకినవారు, మానసిక వ్యాధిగ్రస్థులు కాళరాత్రి అమ్మవారిని ఆరాధిస్తే తక్షణ ఫలితం కనిపిస్తుంది.
భూతప్రేత పిశాచాలు అమ్మవారి పేరు వింటే చాలు పారిపోతాయని పురాణాలు చెప్తున్నాయి.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment