నవరాత్రుల్లో ఆఖరి రోజైన ఆశ్వీయుజ శుద్ధ నవమి నాడు నవదుర్గల్లో తొమ్మిదవ, ఆఖరి అవతారం "సిద్ధిధాత్రీ దుర్గా"

 ⚜️🕉️🚩 ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏

🏵️🌼🏵️🌼🏵️


💥అభీష్ట ఫలదాయిని.. సిద్ధిధాత్రి


నవరాత్రుల్లో ఆఖరి రోజైన ఆశ్వీయుజ శుద్ధ నవమి నాడు నవదుర్గల్లో తొమ్మిదవ, ఆఖరి అవతారం "సిద్ధిధాత్రీ దుర్గా" అమ్మవారిని పూజిస్తారు.


💥#ధ్యాన_శ్లోకం:


సిద్ధగంధర్వయక్షాద్యైరసురైరమరైరపి ।

సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ ॥


సిద్ధి అంటే ఒక పని సిద్ధించడం, దాత్రీ అంటే  ఇచ్చేది. భక్తులు కోరుకున్న పనిని తీర్చే అమ్మవారు ఈమె.


ఇహ సుఖాలనే కాక, జ్ఞానాన్నీ, మోక్షాన్నీ కూడా సిద్ధిదాత్రీదేవి ప్రసాదించగలదని భక్తుల నమ్మకం.


అష్టమి నాడు మహాగౌరిగా కనిపించే అమ్మవారు మహర్నవమి రోజు సిద్ధిధాత్రిగా దర్శనమిస్తుంది. 


కమలంపై పద్మాసనంలో కూర్చొని, ఒక చేతిలో కమలం ధరించి కరుణామృత ధారలను కురిపిస్తుంటుంది.


ఈమె వాహనం సింహం. సకల అభీష్టాలనూ నెరవేర్చే దేవత ఈమె.


సాక్షాత్తూ శివుడికే సర్వసిద్ధులను ప్రసాదించిన దేవత సిద్ధిధాత్రి.

ఈ తల్లిని కొలిచిన వారికి అష్టసిద్ధులు కలుగుతాయి. లౌకిక, అలౌకిక సిద్ధులూ సిద్ధిస్తాయి.


ఇహ సుఖాలను ఇస్తూనే జ్ఞానాన్నీ, మోక్షాన్నీ అనుగ్రహిస్తుందీ దేవత.


తామరపువ్వులో కూర్చుని ఉండే సిద్ధిదాత్రీ దుర్గాదేవికి నాలుగు చేతులు ఉంటాయి.

ఒక చేతిలో కమలం, మరో చేతిలో గద, ఇంకో చేతిలో సుదర్శన చక్రం, మరో చేతిలో శంఖం ఉంటాయి.


ఈ అమ్మవారిని ఆరాధించేవారికి బ్రహ్మజ్ఞానం లభిస్తుంది అని పురాణోక్తి. మానవులే కాక సిద్ధులు, గంధర్వులు, యక్షులు, అసురులు, దేవతలు కూడా సిద్ధిదాత్రీ దుర్గాదేవిని పూజిస్తారు.

ఈమెను ఉపాసించేవారి కోరికలన్నీ సిద్ధిస్తాయని పురాణోక్తి.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

ఓం శ్రీ లక్ష్మి నృసింహస్వామినే నమః 🌹🙏

వైశాఖ అమావాస్య శని జయంతి.

💥సింహాచల చందనోత్సవం💥