ఏడవ రోజు: విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు "శ్రీ సరస్వతీ దేవి"గా దర్శనమిస్తారు.
⚜️🕉️🚩 ఓం దుర్గాయై నమః 🌹🙏
💥శరన్నవరాత్రి ఉత్సవాలు💥
ఏడవ రోజు: విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు "శ్రీ సరస్వతీ దేవి"గా దర్శనమిస్తారు.
మంత్రం: ఓం శ్రీ సరస్వతీ దేవ్యై నమ:
నైవేద్యం: దద్దోజనం, పరమాన్నం, చక్ర పొంగలి ప్రసాదం.
చీర: వైట్ రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు.
అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం రోజున వాగ్దేవతామూర్తి అయిన సరస్వతి దేవి అవతారంలో అలంకరిస్తారు. సరస్వతిదేవిని సేవించడం వల్ల విద్యార్థులు అన్ని విద్యల్లో విజయం పొందుతారని భక్తులు విశ్వసిస్తారు.
సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి
విద్యారంభం కరిష్యామి సిద్ధిద్బవతుమే సదా!
పద్మపత్ర విశాలాక్షీ పద్మ కేసరవర్ణినీ
నిత్యం పద్మాలయా దేవీ సా మాం పాతు సరస్వతీ!!
💥బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతీ దేవిని పురాణాలు వర్ణించాయి.
ఆమె సంగీత, సాహిత్యాలకు అధిష్ఠాన దేవత. మానవులందరికీ సకల విద్యలను ప్రసాదించి వారిలో జ్ఞానదీపాన్ని వెలిగించే విద్యాశక్తి.
ఈ తల్లిని ఆరాధించడం వల్ల బుద్ధి వికాసం, విద్యాలాభం కలుగుతాయి.
మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా త్రిశక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవి తన అంశలోని నిజ స్వరూపాన్ని సాక్షాత్కరింప చేయడమే మూలా నక్షత్రం రోజున చేసే అలంకార ప్రత్యేకత.
శ్వేతపద్మాన్ని అధిష్ఠించి, వీణ, దండ, కమండలాలు, అక్షమాల ధరించి, అభయ ముద్రతో భక్తుల అజ్ఞాన తిమిరాలను ఆమె దూరం చేస్తారని విశ్వాసం.
చింతామణి సరస్వతి, జ్ఞానసరస్వతి, నీల సరస్వతి, ఘట సరస్వతి, కిణి సరస్వతి, అంతరిక్ష సరస్వతి, మహా సరస్వతి అనేవి సరస్వతీ దేవి ఏడు రూపాలు.
ఆమెను కొలిస్తే విద్యార్ధులకు మంచి చదువును ప్రసాదిస్తుందనీ, వాక్సుద్ధి, మంచి బుద్ధీ ఇస్తుందనీ నమ్మిక.
నవరాత్రుల్లో మూలా నక్షత్రం నుంచి విజయదశమి వరకు విశేష పుణ్యదినాలుగా అమ్మవారిని భక్తులు ఆరాధిస్తారు.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment