తొమ్మిదో రోజు: విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు "శ్రీ మహిషాసురమర్ధిని దేవి"గా దర్శనమిస్తారు.
⚜️🕉️🚩 ఓం శ్రీ దుర్గాయై నమః🌹🙏
💥శరన్నవరాత్రి ఉత్సవాలు💥
తొమ్మిదో రోజు: విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు "శ్రీ మహిషాసురమర్ధిని దేవి"గా దర్శనమిస్తారు.
మంత్రం: ఓం శ్రీ మహిషాసురమర్ధిని దేవియే నమ:
నైవేద్యం: చింతపండు పులిహోర, చక్ర పొంగలి ప్రసాదం
చీర: ఎరుపు రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు.
ఈ రూపంలో అమ్మవారు సమస్త జీవరాశుల కష్టాలను తొలగిస్తుందని భక్తులు భావిస్తారు.
అయి జగదంబ మదంబ కదంబవనప్రియవాసిని హాసరతే
శిఖరిశిరోమణి తుంగ హిమాలయశృంగనిజాలయ మధ్యగతే!
మధుమధురే మధుకైతభగంజిని కైతభభంజిని రాసరతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే!!
💥లోక కంటకుడైన మహిషాసురుణ్ని సంహారం చేసిన మహోగ్రరూపం ఇది. సకల దేవీ దేవతల శక్తులన్నీ ఈ తల్లిలో మూర్తీభవించి ఉంటాయి.
దివ్య తేజస్సుతో, అనేక ఆయుధాలు ధరించి, సింహ వాహినియై దర్శనమిస్తుంది.
ఈమె అనుగ్రహం కలిగితే సాధించలేనిది ఏదీ లేదు.
"మహిషాసుర" సంహారం జరిగిన నవమి రోజునే ‘మహర్నవమి’గా జరుపుకోవటం ఆచారంగా వస్తున్నది.
ఈ రోజున చండీదేవిని పూజించిన వారికి శత్రుభయం ఉండదు. అన్నిటా విజయం కలుగుతుంది.
ఈ రోజు అమ్మవారిని యథాశక్తి పూజించి పానకం, వడపప్పు, గారెలు, పులిహోర, పాయసాన్నం నివేదన చేయాలి.
అమ్మవారి స్వరూపంగా సువాసినులకు పూజ చేసి, మంగళద్రవ్యాలు, పసుపు కుంకుమలు, శక్తికొద్దీ నూతన వస్ర్తాలు ఇవ్వాలి.
సింహ వాహనం మీద ఒక చేత త్రిశూలాన్ని ధరించి, మహిషాసురుణ్ణి సంహరిస్తున్న రూపంతో దుర్గమ్మ దర్శనమిస్తుంది.
మహిషాసురుడనే రాక్షసుడను సంహరించిన అమ్మను మహిషాసురమర్ధినీ దేవిగా పూజిస్తే శత్రుభయములు తొలగిపోయి సకల విజయములు కలుగుతాయి.
ఈ అమ్మను పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలితము లభిస్తుంది.
నవరాత్రి దీక్షలో మహర్నవమి మఖ్యమైనది.
సాధకులకు నేడు మంత్రసిద్ధి జరిగే రోజని ఈ రోజుని ‘సిద్దిదా’ అని పిలుస్తారు.
ఈ మహర్నవమి నాడు అమ్మను స్తుతించినవారికి సకల వ్యాధుల బారి నుండి కాపాడి సంపూర్ణ ఆరోగ్యాన్నిస్తుంది, అపమృత్యువును పోగొడుతుంది, పరిపుష్టికరమైన ఆహారాన్నిస్తుంది, ఆధ్యాత్మిక విజ్ఞానాన్నిచ్చి, మనిషిలోని దైవీశక్తిని పెంపొందిస్తుంది.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment