🌹శ్రీ నరసింహ మహా మృత్యుంజయ మంత్రం:🌹

 ⚜️🕉️🚩 ఓం శ్రీ లక్ష్మి నృసింహస్వామినే నమః🌹🙏


🌹శ్రీ నరసింహ మహా మృత్యుంజయ మంత్రం:🌹


ఉగ్రం వీరం మహావిష్ణుం

జ్వలంతం సర్వతోముఖం

నృసింహం భీషణం భద్రం

మృత్యుమృత్యుం నమామ్యహం


ఈ మంత్రాన్ని నిత్యం 108 సార్లు జపించినట్టయితే అనారోగ్య బాధలూ, అపమృత్యు దోషాలు తొలగి, దీర్ఘాయుష్షు లభిస్తుందనీ శాస్త్రవచనం.


పెద్దలే కాదు, పిల్లల చేత కూడాఈ మంత్రాన్ని వల్లె వేయిస్తే... అనవసరమైన భయాలు దూరమై, స్థిరమైన బుద్ధి, ఆయురారోగ్యాలూ కలుగుతాయి. 


స్వామి నామ మంత్రాన్ని ఒకసారి పరిశీలిస్తే తన భక్తులకు అభయమిచ్చే అంతరార్ధం అందులో నిబిడీకృతమై వున్నట్లు తెలుస్తుంది.


🌹ఉగ్రం:

నృశింహుడు ఉగ్రమూర్తి.

నరసింహుని హుంకారాన్ని విన్నంత మాత్రంలోనే అంతర్గత, బహిర్గత శత్రునాశనం జరుగుతుంది.


🌹వీరం:

సకల కార్యకారణాలకు మూలంగా వున్న శక్తినే వీరం అంటారు. నరసింహుడు వీరమూర్తి. కనుక సకల కార్యకారణ స్వరూపుడు ఆయనే.


🌹మహావిష్ణుం:

అన్ని లోకాల్లో అంతటా వుండే నరసింహ తత్వానికి ఈ నామం ప్రతీక. సకల జీవరాశులన్నిటిలోనూ తానే వ్యక్తంగానూ, అవ్యక్తంగానూ పరమాత్మ భాసిస్తాడు. 


🌹జ్వలంతం:

సకల లోకాల్లో, సర్వాత్మల్లో తన తేజస్సును ప్రకాశింపజేయడం ద్వారా వాటి ప్రకాశానికి కారణమైన తత్త్వమే జ్వలంత శబ్దానికి అర్థం.


🌹సర్వతోముఖం:

ఇంద్రియ సహాయం లేకుండా సకల విశ్వాన్ని చూడగల పరమాత్మ తత్త్వమే సర్వతోముఖత్వం.


🌹నృసింహం:

సకల జీవుల్లో సింహం చాలా శ్రేష్ఠమైనది. అందుకనే పరమాత్మ లోకాలను ఉద్ధరించడానికి శ్రేష్టమైన సింహాకృతి ప్రధానంగా నరసింహుడుగా ఆవిర్భవించాడు. 


🌹భీషణం:

నరసింహుని శాసనశక్తి ప్రతీక భీషణత్వం.

అత్యంత భయంకరమైన రూపం ఇది.


🌹భద్రం:

భయాన్ని కలిగించే భీషణుడైన పరమాత్మే ఆ భయాన్ని పోగొట్టి అభయాన్ని కూడా ఇస్తాడు. ఇదే భద్రత్వం. 


🌹మృత్యుమృత్యుం:

స్మరణ మాత్రం చేత అప మృత్యువును దూరం చేసేవాడు. మృత్యువుకే మృత్యువైన వాడు నరసింహుడు మాత్రమే.

మృత్యువును కలిగించేదీ, మృత్యువును తొలగించేది కూడా ఆ స్వామి అనుగ్రహమే.


నరమూర్తి కాదు, హరిమూర్తి కాదు.

కేవలం హరిమాయా రచితమైన నరసింహావతార ఆవిర్భావం.

శత్రువుకు ఎంత భీకరమో భక్తునికి అంత ప్రసన్న రూపం.

సకల అపమృత్యు బాధలు తొలగించే రక్షాకవచం.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు