💥అపరాజితా దేవి

 ⚜️🕉️🚩 ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏


💥అపరాజితా దేవి


"దుర్గాదేవి" అనేక అంశలలో "అపరాజితా దేవి" అవతారం ఒకటి. అపరాజిత అంటే ఎవరిచేతా ఓడింపబడనిది అని అర్థం.


దుర్మార్గులను శిక్షించి ధర్మ మార్గంలో నడిచేవారిని అమ్మ

ఎల్లప్పుడూ కాపాడుతుంది. భూమండలం పై అధర్మం ప్రజ్వరిల్లినపుడు దేవతలందరి సహకారంతో దుర్గా దేవి అంశతో అపరాజితా దేవి ఉద్భవించింది.


ఆమె అష్టదళ పద్మం పై అధిష్టించి మహా శివుని ఆజ్ఞ తో జయాన్ని కూర్చే ఎనిమిది శక్తి రూపాలను ఆదేశిస్తుంది.

వారు ఆమ్మను కొలిచిన వారికి సర్వదా విజయం కలిగేలా పరిస్థితులను శాసిస్తారు.


కొన్ని రూపాలలో అపరాజితా దేవి సింహ వాహనం పై అనేక బాహువులతో ఆయుధాలను ధరించి ఉంటుంది. 


దేవీ పురాణంలోనూ చండీ సప్త శతి లోనూ అమ్మవారి గురించిన వర్ణనలు ఉంటాయి.


అమ్మవారు శక్తి కేంద్రకమైన శమీ వృక్షం (జమ్మిచెట్టు) పైన నివశిస్తుందని శాస్త్రోక్తం.

అందుకే విజయ దశమి రోజున అమ్మ వారు నివసించే శమీ వృక్షానికి పూజలు చేస్తారు.


💥#శమీ_పూజ


"విజయదశమి" రోజున అపరాజితాదేవిని "శమీవృక్షం" వద్ద పూజించే సంప్రదాయం ఉంది.

శమీ వృక్షం (జమ్మి చెట్టు)లో అపరాజితా దేవి కొలువై ఉంటుందని విశ్వాసం.


దేవ దానవులు క్షీరసాగర మథనం చేసినప్పుడు ఉద్భవించిన పవిత్రమైన దేవతా వృక్షాల్లో జమ్మి చెట్టు ఒకటి..

అందుకే యాగాల కోసం నిప్పు రాజెయ్యడానికి జమ్మి చెట్టు కలపనే వినియోగించేవారు.


రావణ సంహారానికి ముందు శ్రీరాముడు శమీ వృక్షానికీ, అపరాజితా దేవికీ పూజలు ఆచరించాడని పురాణాలు పేర్కొంటున్నాయి.


పాండవులు అజ్ఞాతవాసం మొదలుపెట్టడానికి ముందు తమ ఆయుధాలను శమీ వృక్షం మీద దాచారనీ, అజ్ఞాతవాసం ముగిసిన తరువాత వాటిని తిరిగి తీసుకున్నారనీ మహాభారతంలోని విరాటపర్వంలో కథ ఉంది.


💥విజయదశమి రోజున...


శమీ శమయతే పాపం శమీ శత్రువినాశిని

అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని...


అనే శ్లోకం పఠించి, జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే... అపరాజితాదేవి కటాక్షంతో శత్రు భయం తొలగి విజయం చేకూరుతుందనీ, దోషాలు తొలగిపోయి సకల కార్యసిద్ధి కలుగుతుందనీ పెద్దలు చెబుతారు.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

ఓం శ్రీ లక్ష్మి నృసింహస్వామినే నమః 🌹🙏

వైశాఖ అమావాస్య శని జయంతి.

💥సింహాచల చందనోత్సవం💥