శరన్నవరాత్రుల్లో 6వ రోజు.. ఆశ్వీయుజ శుద్ధ షష్ఠి నాడు.. అమ్మవారు "కాత్యాయిని దుర్గా"

 ⚜️🕉️🚩 ఓం శ్రీమాత్రే నమః 🌹🙏


💥కరుణధార.. కాత్యాయని


శరన్నవరాత్రుల్లో 6వ రోజు.. ఆశ్వీయుజ శుద్ధ షష్ఠి నాడు.. అమ్మవారు "కాత్యాయిని దుర్గా" రూపంలో అనుగ్రహిస్తారు.


💥ధ్యాన శ్లోకం:


చంద్రహాసోజ్వలకరా శార్దూలవరవాహనా!

కాత్యాయినీ శుభం దద్యాదేవి దానవఘాతినీ!!


చతుర్భుజాలతో, వరద, అభయ హస్తాలతో, ఖడ్గం, పద్మం ధరించి సింహ వాహనాన్ని అధిరోహించి దర్శనమిస్తుంది.


బంగారు వర్ణంలో మెరిసిపోతూ దివ్యతేజస్సుతో అలరారుతుంది.


ఈమె కాత్యాయన మహర్షి ఇంట పుత్రికగా అవతరించినది. అందువలన ఈమె "కాత్యాయని" అని ప్రసిద్ధికెక్కెను.


ఈమె ఆశ్వయుజ శుక్లసప్తమి, అష్టమి, నవమి తిథులయందు కాత్యాయన మహర్షి పూజలందుకొని విజయదశమినాడు మహిషాసురుని వధించెను.


కాత్యాయని అంటే తేజ స్వరూపిణి, మహాతేజో పుంజం అని అర్థాలు. తేజస్సు అంటే జ్ఞానం.


కాత్యాయని మన బుద్ధిని ప్రేరేపిస్తుంది. భక్తులను భవజలధి, చింతా జలధి, సంసార జలధి అనే భవ సాగరాల నుంచి ఉద్ధరింపజేస్తుంది.

ధర్మార్థ కామ మోక్షాలకు అధికారిణి ఈమె.


"పార్వతీదేవే కాత్యాయని" అని అమరకోశం చెబుతున్నది.

శాక్తేయంలో కాత్యాయనీ దేవిని దుర్గ, భద్రకాళి, చండికల అవతారంగా పరిగణిస్తారు.


మహిషాసుర సంహారంలో కాత్యాయని సింహ వాహనం అధిష్ఠించి దుర్గాదేవికి సాయం చేసిందని స్కాంద పురాణం చెబుతున్నది.


యోగశాస్త్రం ప్రకారం కాత్యాయనిని ఆజ్ఞా చక్రానికి అధిష్ఠాన దేవతగా చెబుతారు.


ఆజ్ఞా చక్రాన్ని జాగృతపరచి సాధకుడికి ఏకాగ్రతను ప్రసాదిస్తుంది అమ్మ.


ఆ మూలపుటమ్మను ధ్యానిస్తే అన్నీ శుభాలే కలుగుతాయి. విద్యార్థులు ఆ తల్లిని ఆరాధించడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి.

కన్యలు కాత్యాయనీ దేవిని కొలిస్తే శీఘ్రంగా వివాహం అవుతుంది.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

వైశాఖ అమావాస్య శని జయంతి.

ఓం శ్రీ లక్ష్మి నృసింహస్వామినే నమః 🌹🙏

🌺🏵️🌼పూలపండుగ.. బతుకమ్మ🌹🙏