Posts

Showing posts from February, 2022

మహాశివరాత్రి నాడు "లింగోద్భవ కాలం"లో బ్రహ్మాదులు స్తుతించిన మహాలింగ స్తుతి

Image
 🕉️🔱 🚩 ఓం నమః శివాయ 🙏 ⚜️🚩 మహాశివరాత్రి నాడు "లింగోద్భవ కాలం"లో బ్రహ్మాదులు స్తుతించిన మహాలింగ స్తుతి ఇది. అనాదిమల సంసార రోగ వైద్యాయ శంభవే! నమఃశివాయ శాంతాయ బ్రహ్మణే లింగ మూర్తయే!! ఆదిమధ్యాంత హీనాయ స్వభావానలదీప్తయే! నమఃశివాయ శాంతాయ బ్రహ్మణే లింగ మూర్తయే!! ప్రళయార్ణవ సంస్థాయ ప్రళయోత్పత్తి హేతవే! నమఃశివాయ శాంతాయ బ్రహ్మణే లింగ మూర్తయే!! జ్వాలామాలావృతాంగాయ జ్వలనస్తంభరూపిణే! నమఃశివాయ శాంతాయ బ్రహ్మణే లింగ మూర్తయే!! మహాదేవాయ మహతే జ్యోతిషేనంతతేజసే! నమఃశివాయ శాంతాయ బ్రహ్మణే లింగ మూర్తయే!! ప్రధాన పురుషేశాయ వ్యోమరూపాయ వేధసే! నమఃశివాయ శాంతాయ బ్రహ్మణే లింగ మూర్తయే!! నిర్వికారాయ నిత్యాయ సత్యాయామలతేజసే నమఃశివాయ శాంతాయ బ్రహ్మణే లింగ మూర్తయే!! వేదాంతసార రూపాయ కాలరూపాయ ధీమతే! నమఃశివాయ శాంతాయ బ్రహ్మణే లింగ మూర్తయే!!                        🔱🕉️🔱🕉️🔱🕉️🔱🕉️🔱

ఓం నమః శివాయ 🙏శివరాత్రికి "లింగోద్భవకాలమని" కూడా పేరు.

Image
 🕉️🔱🚩 ఓం నమః శివాయ 🙏 ⚜️🚩 ధ్యానం 🌹🙏 శ్లో|| శాంతం పద్మాసనస్థం శశిధర మకుటం పంచవక్త్రం త్రినేత్రమ్|  శూలం వజ్రం చఖడ్గం పరశుమభ యదంచ దక్షిణాంగే వహంతం|  నాగంపాశం చఘంటాం వరడమరకయుతం చాంబికాంవామభాగే| నానాలం కారయుక్తం స్ఫటిక మణినిభం పార్వతీశం నమామి|| ⚜️🚩శివరాత్రికి "లింగోద్భవకాలమని" కూడా పేరు. ఆ రోజు అర్థరాత్రి జ్యోతిర్మయమైన ఒక మహాలింగంగా శివుడు ఆవిర్భవించాడు. 🌹పరమేశ్వరుడు లోకానికి తన స్వరూప దర్శనం చేయించి జగత్తంతా దేదీప్యమానం చేసిన ఆ సమయంలో మనం నిద్రపోవడంలో అర్థం లేదు. అందుకే శివరాత్రి జాగరణకు అంత ప్రాధాన్యం . 🌹ఆ రోజు అభిషేకాదులతో శివుని పూజించి, ఉపవాసముండి రోజంతా #శివ నామస్మరణంతో గడపడంలోని ఉద్దేశం మన తనువునూ, మనసునూ కూడా శివార్పితం, శివాంకితం చేయడానికే. 🌹శివమంటే జ్ఞానమే.  జన్మ పరంపర శృంఖాలాలను తెంచి నిత్యానంద ప్రదమైన మోక్షాన్ని అందించే శక్తి ఆ జ్ఞానానికే ఉంది. 🌹శివరాత్రి నాడు పధ్నాలుగు లోకాలలోని పుణ్యతీర్థాలు 'బిల్వ' మూలంలో ఉంటాయనీ, శివరాత్రి నాడు ఉపవసించి ఒక్క బిల్వమైన శివార్పణ చేసి తరించమని శాస్త్రం చెబుతోంది. 🌹కనీసం జన్మకొక్క శివరాత్రి అయినా చేయమని పెద్దలు చె...

ఓం సాయి రామ్

Image
 ఓం సాయి రామ్

ఓం నమో వేంకటేశాయ పాదపూజ 🌹🙏

Image
 🕉️⚜️ 👏 ఓం నమో వేంకటేశాయ 🙏 శ్రీమన్‌ కృపాజలనిధే కృతసర్వలోక సర్వజ్ఞ శక్త నతవత్సల సర్వశేషిన్‌ స్వామిన్‌ సుశీల సులభాశ్రిత పారిజాత శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే ॥ 🌹భావము: శ్రీమంతుడవగు వేంకటేశ్వరా నీవు దయా సముద్రుడవు. సమస్త లోకములకు సృష్టికర్తవు. సర్వజ్ఞుడవు. సర్వశక్తుడవు. సేవించు వారి యెడల వాత్సల్యము కలవాడవు. సర్వ స్వతంత్రుడవు. ప్రభువైనవాడవు. సుగుణములు కలవాడవు. ఆశ్రితులకు సులభముగా లభించు కల్పవృక్షం నీవు. నీ పాదములనే శరణు జొచ్చెదను. ⚜️🚩పాదపూజ 🌹🙏 🌹భగవానుడి అవతారమూర్తుల చరణాల పైన నిలిచే దృష్టి ఆ రూప వైభవాన్ని, తత్వాన్ని గ్రహించగలుగుతుంది. 🌹భగవానుడికి సమర్పించే అధాంగపూజలో ప్రథమంగా "పాదౌ పూజయామి" అంటారు. 🌹ఆ పాదాలకు - మనసుకు బంధం ఏర్పడాలి. ఆ బంధం మానవుణ్ని మాధవత్వం వైపు నడుపుతుంది. 🌹హిరణ్యకశిపుణ్ని తన నరసింహాకృతితో వధించిన తరువాత, ఉగ్రరూపంలో సింహాసనాన్ని అధిష్ఠించిన శ్రీహరిని ప్రహ్లాదుడు నీ పాదాశ్రయుడిగా చేయమంటూ ప్రార్థిస్తాడు. అంతకన్నా సామ్రాజ్య వైభవాలు వద్దంటాడు. 🌹శ్రీరామచంద్రుడి పాదుకలను తలపై ధరిస్తాడు భరతుడు. తల ఉన్నతమైన స్థానం. అది బ్రహ్మరంధ్రం ఉండే చోటు. సహస్రారకమలం ...

ఓం శ్రీ సాయి రామ్

Image
                              ఓం శ్రీ సాయి రామ్

ఓం శ్రీ మాత్రే నమః 🙏 అమ్మవారి.. ఆదిశంకరుల అద్భుత లీల 🙏🌹ఈ కథ విన్నా, వినిపించినా కోటిజన్మల పుణ్యఫలం.

Image
 🕉️🔱🚩 ఓం శ్రీ మాత్రే నమః 🙏 శ్రీవిద్యాం శివవామభాగనిలయాం హ్రీకారమన్త్రోజ్జ్వలాం శ్రీచక్రాఙ్కిత బిన్దుమధ్యవసతిం శ్రీమత్సభానాయకీమ్| శ్రీమత్షణ్ముఖవిష్ణురాజజననీం శ్రీమజ్జగన్మోహినీం మీనాక్షీం ప్రణతోఽస్మి సంతతమహం కారుణ్యవారాన్నిధిమ్|| 🌹ఈ కథ విన్నా, వినిపించినా కోటిజన్మల పుణ్యఫలం. ⚜️🚩 అమ్మవారి.. ఆదిశంకరుల అద్భుత లీల 🙏 🌹మధుర  మీనాక్షి అమ్మవారి ఆలయంలో అమ్మవారితోనే పాచికలాడి శ్రీచక్రంలో అమ్మవారిని కూర్చోబెట్టిన ఘనుడు... "శ్రీ ఆదిశంకరులు" శ్రీచక్రం ప్రతిష్ఠించిన ఉదంతం. 🌹మధురను పాలించే పాండ్య రాజులంతా మీనాక్షి తల్లిని ఆడపడుచుగా, కులదేవతగా, జగజ్జననిగా ఆరాధిస్తారు. "దేవీ భాగవతపురాణము" లో మణిద్వీపవర్ణనలా ఆ ఆలయాన్ని పాండ్యరాజులు రూపొందించారు. అంతటి సౌందర్యరాశి, చతుష్షష్టి కళానిలయమైన "మీనాక్షి" గూడా రాత్రివేళ తామస శక్తిస్వరూపిణిగా మారి ప్రాణిహింసకు పాల్పడుతుంది. ఆమెను శాంతింపచేయడానికి యావద్భారతంలోని మూలమూలలనుండి వేదపండితులను, ఋత్విక్కులను పిలిపించి యజ్ఞాలు, యాగాలు, క్రతువులు పూజలు, జపహోమాలు అన్నీ చేయించారు. వారు పూజలు చేస్తుండగా వారినీ కబళించేసింది మీనాక్షి. 🌹పాండ్...

ఓం నమః శివాయ 🙏 🌹యమకృత శివకేశవ స్తుతి🌹🙏

Image
 🕉️🔱🚩 ఓం నమః శివాయ 🙏 ⚜️🚩"కాశీ ఖండము" లోని "యముని"చే (యమ కృతం)   చెప్పబడిన "శివుడు -- విష్ణువు" ఇద్దరితో కూడిన నామాలు. ఒక్కసారి చదివిన అనేక జన్మల పాపాలు పోతాయి. 🌹యముడు స్వయంగా తన యమభటులకు ఈ శివకేశవ నామాలు ఎవ్వరూ భక్తితో రోజు చదువుతూ వుంటారో వారి జోలికి మీరు పోవద్దు అని చెప్పాడు. ⚜️🚩🌹 యమకృత శివకేశవ స్తుతి🌹🙏 గోవింద మాధవ ముకుంద హరే మురారే శంభో శివేశ శశిశేఖర శూలపాణే | దామోదరాఽచ్యుత జనార్దన వాసుదేవ త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి || 1 || గంగాధరాంధకరిపో హర నీలకంఠ వైకుంఠకైటభరిపో కమఠాబ్జపాణే | భూతేశ ఖండపరశో మృడ చండికేశ త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి || 2 || విష్ణో నృసింహ మధుసూదన చక్రపాణే గౌరీపతే గిరిశ శంకర చంద్రచూడ | నారాయణాఽసురనిబర్హణ శార్ఙ్గపాణే త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి || 3 || మృత్యుంజయోగ్ర విషమేక్షణ కామశత్రో శ్రీకంఠ పీతవసనాంబుదనీలశౌరే | ఈశాన కృత్తివసన త్రిదశైకనాథ త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి || 4 || లక్ష్మీపతే మధురిపో పురుషోత్తమాద్య శ్రీకంఠ దిగ్వసన శాంత పినాకపాణే | ఆనందకంద ధరణీధర పద్మనాభ త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి || 5 || సర్వేశ్వర త్రిపురసూదన దేవదేవ...

ఓం సాయి రామ్

Image
                                ఓం సాయి రామ్

🌹గురు అష్టకం స్తోత్రం🌹🙏

Image
 🕉️⚜️🚩 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 🌹ఆదిశంకరాచార్య విరచిత "గురు అష్టకమ్" గురువు ప్రాముఖ్యతని చెబుతూ గురువు పాదపద్మములకు ప్రణమిల్లడం ఎంత ముఖ్యమో ఇది వివరిస్తుంది. 🌹ఎంత సంపద, జ్ఞానం, కీర్తి లేదా యోగ సిద్ధులను గడించినా సరే, గురువు అనుగ్రహం లేకపోతే ఇవి ఉన్నా ఉపయోగం లేదు అన్న విషయాన్ని ఈ స్తోత్రం మనకు చెబుతోంది.               🌹 గురు అష్టకం స్తోత్రం🌹🙏 శరీరం సురూపం తథా వా కళత్రం యశఃశ్చారు చిత్రం ధనం మేరుతుల్యం గురోరంఘ్రి పద్మే మనస్చేన లగ్నం తత: కిమ్ తత: కిమ్, తత: కిమ్ తత: కిమ్ ||1|| 🌹భావము: చక్కని రూపం గల అందమైన భార్య ఉన్నప్పటికి, గొప్ప కీర్తి, మేరు పర్వతమంత డబ్బు ఉన్నప్పటికీ గురువు పాదాల వద్ద నిలపలేని మనస్సు ఉండి ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? కళత్రం ధనం పుత్ర పౌత్రాధి సర్వం గృహం బాంధవా సర్వ మేతాధి జాతం, గురోరంఘ్రి పద్మే మనస్చేన లగ్నం తత: కిమ్ తత: కిమ్, తత: కిమ్ తత: కిమ్ ||2|| 🌹భావము:  భార్య, సంపద, పుత్రులు, మనుమలు, మంచి ఇల్లు, బంధువులు ఉండి గొప్ప కుటుంబములో పుట్టినప్పటికీ, గురువు పాదాల వద్ద నిలపలేని మనస్సు ఉండి ఏమి లాభం? ఏమి లాభం...

శ్రీ మహాగణేశ పంచరత్న స్తోత్రం - భావ సహితం🌹🙏

Image
 🕉️🔱🚩 ఓం శ్రీ మహా గణాధిపతయే నమః 🙏 🌹శ్రీ "ఆదిశంకరుల" విరచిత శ్రీ మహాగణేశ పంచరత్న స్తోత్రం - భావ సహితం ముదా కరాత్త మోదకం సదా విముక్తి సాధకమ్ | కళాధరావతంసకం విలాసిలోక రక్షకమ్ | అనాయకైక నాయకం వినాశితేభ దైత్యకమ్ | నతాశుభాశు నాశకం నమామి తం వినాయకమ్ ॥ 1 ॥ 🌹భావము: మోదకములు చేతిలో ఆనందంగా ఉంచుకుని, ఎల్లప్పుడూ మోక్షాన్ని ప్రసాదించే, శిరస్సున చంద్రుని ధరించిన, లోకాన్ని కాపాడే, నాయకులకే నాయకుడైన, అసురులను, అన్ని ఆశుభాలను నశింపజేసే ఆ విఘ్నేశునికి నా నమస్కారములు.  నతేతరాతి భీకరం నవోదితార్క భాస్వరమ్ | నమత్సురారి నిర్జరం నతాధికాపదుద్ఢరమ్ | సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరమ్ | మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరమ్ ॥ 2 ॥ 🌹భావము: భక్తుల శత్రువులకు భయం కలిగించే వానికి, అప్పుడే ఉదయిస్తున్న సూర్యుని వలె ప్రకాశిస్తున్న వానికి, దేవతలు, అసురులచే నుతింపబడేవాడికి , భక్తుల విఘ్నాలను తొలగించే వానికి, దేవతలకే దేవునికి, సర్వ సంపదలకు అధిపతి అయిన వానికి, గజరాజుకు, దేవతల గణాలకు అధిపతి అయిన వానికి ఎల్లప్పుడూ నా నమస్కారములు. సమస్త లోక శంకరం నిరస్త దైత్య కుంజరమ్ | దరేతరోదరం వరం వరేభ వక్త్రమక్షరమ్ | కృపా...

నిరాడంబరత - సాయి సందేశం

Image
  🕉️⚜️🚩ఓo సాయి శ్రీసాయి జయ జయ సాయి నిరాడంబరత - సాయి సందేశం 🌹సాయి ఎల్లప్పుడూ నిరాడంబరంగా ఉండమని చెప్పారు. ఒక్కోసారి మనం దైవసేవలో కూడా ఆడంబరాలకు పోయి నిజమైన ప్రేమకు భక్తికి దూరం అవుతాము. 🌹సాయి సమర్ధుని కృపతో దాసగణు మహారాజ్ సత్పురుషుల కథలను రచించి, ఏ కానుకలు తీసుకోకుండా కీర్తనలు చేసి ప్రసిద్ధి చెందారు. 🌹ఒక సారి దాసగణు మహారాజ్ షిర్డీ గ్రామంలో హరికథా కీర్తన కోసమని శరీరంపై కోటు, కండువా, తలకు పాగా కట్టి బయలుదేరారు. 🌹బాబా ఆశీర్వాదం కోసమని వస్తే బాబా ఇలా అంటారు... "వాహ్వా పెళ్ళికొడుకు లాగా అలంకరించుకుని, ఎక్కడకు వెళ్తున్నావు? అని అడుగుతారు. కీర్తన చెప్పడానికి ఇవన్నీ అవసరమా! వీనిని నా ఎదుట తీసివేయి అని చెప్తారు. 🌹అప్పటినుంచి దాసగణు మహారాజ్ ఒక్క పంచ కట్టుకొని చొక్కా లేకుండా, చేతిలో చిడతలు మరియు మేడలో మాల వేసుకొని హరికథ చెప్పేవారు. బాబా ఈ నిరాడంబరతనే కోరుకునే వారు. 🌹మన ధ్యేయం అంతరంగ పరిశుద్ధత. 🌹 సేకరణ 🌹శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై🌹

ఓం సాయి రామ్

Image
                        🚩  ఓం సాయి రామ్🙏

సుదంతుడు చేసిన "హనుమంతుని స్తోత్రం" శ్రీ ఆంజనేయం 🙏

Image
 🕉️⚜️🚩 శ్రీ ఆంజనేయం 🙏 ⚜️🚩 సుదంతుడు చేసిన "హనుమంతుని స్తోత్రం" నమో నమస్తే దేవేశ - సృష్టిస్థిత్యంత హేతవే | అక్షరాయ వరేణ్యాయ వరదాయ మహాత్మనే |1| 🌹ఓ దేవనాయకా నీకు నమస్కారము. సృష్టి స్థితి లయలకు కారకుడవైనట్టి వానికి, నాశరహితునకు, శ్రేష్ఠునకు, మహాత్ముడగు వరప్రదాతకు నీకు నమస్కారము. యోగిహృత్సద్మ సంస్థాయ భవరోగౌషధాయ చ | భక్తాపరాధసహినే భావపుత్త్రాయ తే నమః |2| 🌹యోగుల హృదయ పద్మమున ఉండు వానికి, జననమరణముల రోగమునకు ఔషధము వంటి వానికి, భక్తుల అపరాధములు సహించువానికి, ఈశ్వరసుతుడవైన నీకు నమస్కారము. రామోపకారశీలాయ లక్ష్మణప్రాణదాయినే | సప్తకోటి మహామంత్ర స్వరూపాయ నమో నమః |3| 🌹శ్రీరామునకు ఉపకరించుటయే స్వభావంగా కలవానికి, లక్ష్మణుని ప్రాణదాతకు, సప్తకోటి మహామంత్ర స్వరూపునకు నీకు నమస్కారము. గౌరీగర్భ మహాశుక్తిం రాత్నాయామిత ఘాతవే | వేదవేద్యాయ యజ్ఞాయ యజ్ఞోభోక్త్రే నమోనమః |4| 🌹పార్వతీ గర్భమనే గొప్ప ముత్యపుచిప్ప యందు ఉద్భవించిన రత్నమునకు, అమితముగ దుష్టులను చంపువానికి, వేదవేద్యునకు, యజ్ఞ స్వరూపునకు, యజ్ఞో భోక్తకు నీకు నమస్కారము. బ్రహ్మవిష్ణు మహేశాది సర్వదేవ స్వరూపిణే | శతానన పధార్థాయ నక్షత్రే శ్రవణే శు...

ఆది శంకరుల" మరొక రచన "ప్రాతః స్మరణ స్తోత్రం" 🚩 ఓం నమః శివాయ 🙏

Image
 🕉️🔱🚩 ఓం నమః శివాయ 🙏 🔱🚩 "ఆది శంకరుల" మరొక రచన "ప్రాతః స్మరణ స్తోత్రం"  🌹 ప్రాతఃస్మరణ స్తోత్రం 🌹🙏 ప్రాతః స్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సచ్చిత్సుఖం పరమహంస గతిం తురీయమ్ | యత్ స్వప్న జాగర సుషుప్తిమవైతి నిత్యం తత్ బ్రహ్మ నిష్కల మహం న చ భూత సఙ్ఘః || 1 || 🌹తాత్పర్యము: సచ్చిదానందరూపము, మహాయోగులకు శరణ్యము, మోక్షమును ఇచ్చునదీ  అగు ప్రకాశవంతమైన ఆత్మతత్త్వమును  ప్రాతఃకాలమునందు నామదిలో స్మరించుచున్నాను. ఏ బ్రహ్మస్వరూపము స్వప్నము , జాగరణ , సుషుప్తి అనువాటిని తెలుసుకొనుచున్నదో, నిత్యమూ, భేదము లేనిదీ అగు ఆ బ్రహ్మ నేనే. నేను పంచభూతముల సముదాయము కాదు. ప్రాతర్భజామి మనసాం వచసామగమ్యం వాచో విభాన్తి నిఖిలా యదనుగ్రహేణ | యన్నేతి నేతి వచనైర్నిగమా అవోచం స్తం దేవ దేవ మజమచ్యుతమాహురగ్ర్యమ్ || 2 || 🌹తాత్పర్యము: మనస్సు, వాక్కులకు కనిపించుచు, వాటిని ప్రకాశింపచేయుచు, వేదములచే "నేతి" "నేతి" (ఇది కాదు ఇది కాదు) అని వర్ణింపబడుచు, పర దేవతయై, "అజ" (జన్మము లేని) , "అచ్యుత" (నాశనము లేని), "ఆదిపురుష" (అత్యున్నతమైన) శబ్దములచే వర్ణింపబడు పరబ్రహ్మము...

ఓం శ్రీ సాయి రామ్ ఓం శ్రీ సాయి రామ్

Image
 ఓం శ్రీ సాయి రామ్

ఓం సాయి రామ్

Image
 ఓం సాయి రామ్

🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏మహాభారతంలో కృష్ణుడు విదురుడు కధ

Image
 🕉️⚜️🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏 ⚜️🚩మనం తినే తిండి, పీల్చే గాలి... జీవించే విధానం మన ఆలోచనలపై ప్రభావం చూపిస్తుంది. ఇదే విషయాన్నీ శ్రీకృష్ణుడు విదురుడికి తెలిపారు.  🌹దుర్యోధనుడు ఒకసారి "యాభైఆరు" రకాల వంటలు వండించి శ్రీకృష్ణుని విందు భోజనానికి పిలిచాడు. కాని కృష్ణుడు దుర్యోధనుని పిలుపును నిరాకరించి విదురుని యింటికి భోజనానికి వెళ్ళాడు. కృష్ణుని చూడగానే విదురుని భార్య సంతోషంగా ఆహ్వానించి ఉపచారాలు చేసింది. తినడానికి ఏమిటి పెట్టడం అని యోచించి, ఆనంద సంభ్రమాలతో తొందరపాటు పడి, అరటిపండు తొక్కవలిచి, పండు యివ్వడానికి బదులుగా తొక్కని అందించింది. కృష్ణుడు దానినే తీసుకొని ఆనందంతో భుజించాడు. ఇది చూసిన విదురుడు భార్యవైపు కోపంగా చూశాడు. అప్పుడు కృష్ణుడు, “విదురా నేను ఆప్యాయతతో కూడిన ప్రేమకోసమే ఎదురు చూస్తున్నాను. నిజమైన శ్రద్ధా భక్తులతో యిచ్చినది కాయైనా, పండైనా, ఆకైనా, నీరైనా, ఏది యిచ్చినా సంతోషంగా తీసుకుంటాను" అని అన్నాడు. 🌹మహాభారతంలో ప్రతి పాత్ర, వారు ఎదుర్కొన్న పరిస్థితులు, ఆలోచనా విధానం నేటి మానవుడికి మంచి చెడుల తేడాలను తెలియజేసే మార్గదర్శకాలు. కృష్ణో రక్షతు నో జగత్‌ త్రయగురుః కృష...

ఓం నమో నారాయణాయ శ్రీ విష్ణు షోడశ నామ స్తోత్ర భాష్యం🌹

Image
 🕉️⚜️🚩ఓం నమో నారాయణాయ 🙏 ⚜️🚩అన్ని సమస్యల నుండి రక్షించే శ్రీమహావిష్ణువు యొక్క 16 నామాలు. 🌹 శ్రీ విష్ణు షోడశ నామ స్తోత్ర భాష్యం🌹🙏 🌹ఔషధే చింతయేద్విష్ణుం: ఔషధం స్వీకరించే సమయంలో సర్వ వ్యాపకుడైన విష్ణువుగా స్మరించాలి 🌹భోజనే చ జనార్ధనం: భోజనం చేసే సమయంలో జగద్రక్షకుడైన జనార్ధనుడిగా స్మరించాలి 🌹శయనే పద్మనాభం చ: నిద్ర పోయే సమయంలో పద్మనాభుడిగా స్మరించాలి 🌹వివాహే చ ప్రజాపతిమ్:  వివాహ సమయంలో ప్రజాపతిగా స్మరించాలి. 🌹యుద్ధే చక్రధరం దేవం: యుద్ధంలో సుదర్శన చక్రం ధరించిన చక్రధారిగా స్మరించాలి. 🌹ప్రవాసే చ త్రివిక్రమమ్:  ప్రయాణ సమయంలో త్రివిక్రముడుగా స్మరించాలి. 🌹నారాయణం తనుత్యాగే: అంత్య కాలంలో జ్ఞానమనే వాసముగా గల నారాయణుడిగా స్మరించాలి. 🌹శ్రీధరం ప్రియసంగమే: ఇష్టమైన వారిని కలిసేటప్పుడు లక్ష్మిదేవిని వక్షస్థలం నందు గల శ్రీధరుడిగా స్మరించాలి. 🌹దుస్స్వప్నే స్మర గోవిందం:  పీడ కలలు వచ్చినప్పుడు గోవర్ధన గిరి ధారి అయిన గోవిందుడుగా స్మరించాలి. 🌹సంకటే మధుసూదనం: సమస్యలలో ఉన్నప్పుడు రాక్షసులైన మధుసూదనులను వధించిన మధుసూదనడుగా స్మరించాలి. 🌹కాననే నారసింహం చ: అడవులలో ఉన్నప్పుడు నారస...

ఓం శ్రీ సాయి రామ్

Image
 ఓం శ్రీ సాయి రామ్

ఓం శ్రీ మాత్రే నమః శ్రీ దేవీ నవరత్నమాలికా స్తోత్రం🙏

Image
 🕉️🔱🚩 ఓం శ్రీ మాత్రే నమః 🙏 🌹శ్రీ శంకరాచార్య విరచిత   శ్రీ దేవీ నవరత్నమాలికా స్తోత్రం🙏 హారానూపుర కిరీట కుండల విభూషితా వయవ శోభినీం కారణేశ వరమౌళికోటి పరికల్ప్య మాన పాదపీఠికాం కాలకాల ఫణీ పాశబాణ ధనురంకుశామరుణమేఖలాం ఫాలభూ త్రిలోక లోచనాం మనసి భావయామి పరదేవతామ్  గంధసార ఘనసార చారు నవ నాగవల్లి రసవాసినీం సంధ్యరాగం మధురాధరా భరణ సుందరానన శుచిస్మితాం మంథరా యతలోచనా మమలబాల చంద్రకృత శేఖరీమ్ ఇందిరా రమణ సోదరీం మనసి భావయామి పరదేవతామ్  స్మేర చారుముఖ మండలాం విమల గండ్లంబి మణి కుండలాం హారదామ పరిశోభమాన కుచభార భీరుతనుమధ్యమాం వీర గర్వహర నూపురాం వివిధ కారణేశ వరపీఠీకాం మార వైరి సహచారిణీం మనసి భావయామి పరదేవతామ్  భూరిభార ధరకుండలీంద్రమణిబధ భూవలయ పీఠికాం వారి రాశి మణిమేఖలావలయ వహ్ని మండల శరీరిణీం వారి సారవహ కుండలాం గగన శేఖరీం చ పరమాత్మికాం చారు చంద్ర రవిలోచానాం మనసి భావయామి పరదేవతామ్  కుండల త్రివిధకోణ మండల విహార షడ్దళ సముల్లసత్ పుండరీక ముఖభేదినీం తరుణ చండభాను తటిదుజ్జ్వలాం మండలేందు పరివాహితా మృత తరంగిణీ మరుణ రూపిణీం మండలాంత మణిదీపికాం మనసి భావయామి పరదేవతామ్  వారణానన మయూరవాహనముఖ ద...

ఓం నమః శివాయ అర్ధనారీశ్వరము🙏

Image
 🕉️🔱🚩 ఓం నమః శివాయ 🙏 🌹అర్ధనారీశ్వరము 🌹అర్ధ (సగమైన ) నారి (స్త్రీ) , ఈశ్వర (సగమైన పురుషుడు) రూపము (కలిగిఉన్న రూపము).  🌹తల ఆలోచనకి, పాదము ఆచరణకు సంకేతాలైతే,  లోకంలో "భార్యా భర్తలు" అన్యోన్యముగా  ఆచరణలోనూ, ఆలోచనలోనూ, కర్మలలోను, కార్యాలలోను, నిర్ణయాలలోనూ, నిర్మాణాలలోనూ ఒకటిగా చెరి సగముగా ఉండాలని హిందూపురాణాలు అర్ధనారీశ్వరాన్ని చూపడం జరిగింది. 🌹పరమేశ్వరుని , అంబికను ఏకభావముతో భక్తితో సేవించాలి. అప్పుడే అధిక శుభము కలుగుతుంది. ఇరువురియందును సమాన ప్రీతి ఉండవలెనన్న ... ఆ ఇరువురియందు #మాతా_పితృ భావము ఉండాలి. 🌹‪అర్ధనారీశ్వరుడు‬ లయకారుడు. శివుడికి అధికారం అధికంగా ఉండాలి. ఆ అధికారాన్నే... పార్వతి, దుర్గ, శక్తి రూపాలుగా పిలుస్తారని పురాణాలు చెబుతున్నాయి. 🌹అంటే ఆ శక్తిని ఆయన తనలో భాగంగా ధరించాలి. శివుడు, శక్తి... కలిసి పని చేయడమంటే, స్త్రీపురుషులు సమానమేనని అంతరార్థం. ఈ సంప్రదాయాన్ని చూపడానికే శివుడు + శక్తి కలిసి అర్ధనారీశ్వరుడిగా దర్శనమిస్తారు.  🌹శివుడు లేకుండా శక్తి, శక్తి లేకుండా శివుడు ఉండరు. శక్తితో కలిసిన శివుడిని సంపూర్ణుని (సగుణబ్రహ్మ) గా, శక్తితో లేనప్పు...

🚩ఓం శ్రీ గురుభ్యోనమః గురుగీత" శ్లోకాలు, తాత్పర్యము.

Image
 🕉️🔱🚩ఓం శ్రీ గురుభ్యోనమః🙏 🌹 ఓం శ్రీ దత్తాయ నమః 🌹🙏 🌹"గురుగీత" స్కాందపురాణంలో, "బ్రహ్మ సంహిత"లో  శివపార్వతుల సంవాదములో  చెప్పబడింది. "వ్యాస భగవానులు" గురువు యొక్క విశిష్టతను చాలా గొప్పగా, సరళమైన సంస్కృతంలో చెప్పారు. ఇందులో ఇరవై ఏడు శ్లోకాలు ఉన్నాయి. ⚜️🚩" గురుగీత " శ్లోకాలు, తాత్పర్యము. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః | గురుస్సాక్షాత్ పరం బ్రహ్మా తస్మై శ్రీ గురవే  నమః ||1|| 🌹తాత్పర్యము:  గురువు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. ఆయనే ఆ పరబ్రహ్మము. ఆయనకు నా నమస్కారములు.  అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా | చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే  నమః ||2|| 🌹తాత్పర్యము:  అజ్ఞానమనే అంధకారాన్ని జ్ఞానమనే అంజనముతో తొలగించిన (కంటిలో ఉన్న నలుసును తొలగించినట్లు) ఆ గురువునకు నా నమస్కారములు.  అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం | తత్పదం దర్శితేన తస్మై శ్రీ గురవే  నమః ||3|| 🌹తాత్పర్యము: అనంతమైన, అఖండమైన, సృష్టిలోని కదిలే కదలని ప్రతి ప్రాణి/వస్తువు లో ఉండే బ్రహ్మ యొక్క నిజాన్ని తెలిపే ఆ గురువుకు నా నమస్కారములు.  స్థావరం జంగమం వ్యా...

ఓం సాయి రామ్ 🌹🙏

Image
                           ఓం సాయి రామ్

శ్రీ సాయి బాబా ‬అష్టకం🌹🙏

Image
  శ్రీ సాయి బాబా ‬అష్టకం🌹🙏 పత్రిగ్రామ సమద్భూతం ద్వారకామాయి వాసినం భక్తాభీష్టప్రదం దేవం సాయినాథం నమామ్యహం ||1|| మహోన్నత కులేజాతం క్షీరాంబుధి సమే శుభే ద్విజరాజం తమోఘ్నంతం సాయినాథం నమామ్యహం ||2|| జగదుద్ధారణార్ధం యో నరరూపధరో విభుః యోగినంచ మహాత్మానాం సాయినాథం నమామితం ||3|| సాక్షాత్‌ కారం జయోలాభే స్వాత్మారామో గురోర్‌ ముఖాత్‌ నిర్మలం మమతాఘ్నంతం సాయినాథం నమామ్యహం ||4|| యస్య తర్శన మాత్రేణ పశ్యంతి వ్యాధికోటయః సర్వేపాపాః ప్రాణశ్యంతి సాయినాథం నమామితం ||5|| నరసింహాది శిష్యాణాం దదౌయోనుగ్రహం గురుః భవబంధాన హర్తారం సాయినాధం నమామితాం ||6|| ధనహీన చ దారిద్రాన్య, సమదృష్టైవ పశ్యతి కరుణసాగరం దేవం సాయినాథం నమామితం ||7|| సమాధిసాపి యో భక్తా సమతీష్టార్థ దానతః అచింతం మహిమానంతం సాయినాథం నమామ్యహం ||8|| 🌹శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై🌹

గణనాయకాష్టకం ఓం గం గణపతయే నమః🙏

Image
 🕉️🔱 🚩 ఓం గం గణపతయే నమః🙏 🌹ఏదైనా కార్యాన్ని ప్రారంభించే ముందు భగవన్నామ స్మరణ మనకు విజయాలను సంప్రాప్తింపజేసేలా చేస్తుంది. అందునా విఘ్ననాయకుడైన వినాయకుడి "శ్రీగణనాయకాష్టకం" అన్ని విజయాలకు దగ్గరయ్యేలా చేస్తుంది. అందుకే ఏదైనా కార్యం తలపెట్టేటపుడు "శ్రీగణనాయక అష్టకాన్ని" పఠించడం మంచిది. 🌹 గణనాయకాష్టకం 🌹🙏 ఏకదంతం మహాకాయం తప్తకాంచనసన్నిభమ్ | లంబోదరం విశాలాక్షం వందేఽహం గణనాయకమ్ || 1 || మౌంజీ కృష్ణాజినధరం నాగయజ్ఞోపవీతినమ్ | బాలేందుశకలం మౌళిం వందేఽహం గణనాయకమ్ || 2 || చిత్రరత్నవిచిత్రాంగచిత్రమాలావిభూషితమ్ | కామరూపధరం దేవం వందేఽహం గణనాయకమ్ || 3 || గజవక్త్రం సురశ్రేష్ఠం కర్ణచామరభూషితమ్ | పాశాంకుశధరం దేవం వందేఽహం గణనాయకమ్ || 4 || మూషకోత్తమమారుహ్య దేవాసురమహాహవే | యోద్ధుకామం మహావీర్యం వందేఽహం గణనాయకమ్ || 5 || యక్షకిన్నరగంధర్వసిద్ధవిద్యాధరైస్సదా | స్తూయమానం మహాబాహుం వందేఽహం గణనాయకమ్ ||6|| అంబికాహృదయానందం మాతృభిఃపరివేష్టితమ్ | భక్తప్రియం మదోన్మత్తం వందేఽహం గణనాయకమ్ || 7 || సర్వవిఘ్నహరం దేవం సర్వవిఘ్నవివర్జితమ్ | సర్వసిద్ధిప్రదాతారం వందేఽహం గణనాయకమ్ || 8 || గణాష్టకమిదం పుణ్యం యః...

ఓం సాయి రామ్

Image
 

ఓం సాయి రామ్

Image
🌹ఓo సాయి శ్రీసాయి జయ జయ సాయి🌹 జీవులను‬ సృష్టించే తండ్రే సాయి ఈ దేహమిచ్చి పోషించే తల్లే సాయి మహనీయుడై వెలసిన సద్గురువే సాయి వేదశాస్త్రాలలో మంచిని చెప్పే మన మిత్రుడు సాయి తన భక్తుల క్షేమానికి దత్తుడు సాయి ఈ సృష్టిని పరిపాలించే శివుడే సాయి భవసంద్రము దాటించే విభుడే సాయి కలియుగాన వెలసిన భగవంతుడు సాయి || జీవులను|| మోడులను చిగురించే జీవం సాయి అంధులకు వెలుగిచ్చే దైవం సాయి మూఢులతో వేదం పలికించెను సాయి మృతులను బ్రతికించే మృతసంజీవని సాయి ||జీవులను|| తన సంపదను భక్తులకు పంచెను సాయి వారి ప్రేమతో జీవించే భిక్షువు సాయి ఇహలోకపు కోర్కెలను తీర్చును సాయి తన భక్తులను ముక్తివైపు నడిపించును సాయి ||జీవులను|| సేకరణ 🌹🙏 🌹శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై🌹

ఓం సాయి రామ్

Image
                    ఓం సాయి రామ్

⚜️🚩 శ్రీ ఆంజనేయం విభీషణ కృత ఆపదుద్ధారక శ్రీహనుమత్ స్తోత్రం

Image
 🕉️ ⚜️🚩 శ్రీ ఆంజనేయం 🙏 ⚜️🚩"విభీషణుడు" చేసిన "శ్రీ హనుమాన్ స్తోత్రం" ఇది. దీన్ని పఠిస్తే ఆపదలు తొలగి పోతాయి. శత్రువులను జయించగలుగుతారు.  🌹 విభీషణ కృత ఆపదుద్ధారక శ్రీహనుమత్ స్తోత్రం ఓం అస్య శ్రీ ఆపదుద్ధారక హనుమత్ స్తోత్ర మహామంత్ర కవచస్య, విభీషణ ఋషిః, హనుమాన్ దేవతా, సర్వాపదుద్ధారక శ్రీహనుమత్ప్రసాదేన మమ సర్వాపన్నివృత్త్యర్థే, సర్వకార్యానుకూల్య సిద్ధ్యర్థే జపే వినియోగః || ధ్యానం || వామే కరే వైరిభీతం వహన్తం శైలం పరే శృంఖలహారిటంకం | దధానమచ్ఛచ్ఛవియజ్ఞసూత్రం భజే జ్వలత్కుండలమాంజనేయమ్ || 1 || సంవీతకౌపీన ముదంచితాంగుళిం సముజ్జ్వలన్మౌంజిమథోపవీతినం సకుండలం లంబిశిఖాసమావృతం తమాంజనేయం శరణం ప్రపద్యే || 2 || ఆపన్నాఖిల లోకార్తిహారిణే శ్రీహనూమతే అకస్మాదాగతోత్పాత నాశనాయ నమో నమః || 3 || సీతావియుక్తశ్రీరామశోకదుఃఖభయాపహ తాపత్రితయసంహారిన్ ఆంజనేయ నమోఽస్తుతే || 4 || ఆధివ్యాధి మహామారి గ్రహపీడాపహారిణే ప్రాణాపహర్త్రేదైత్యానాం రామప్రాణాత్మనే నమః || 5 || సంసారసాగరావర్త కర్తవ్యభ్రాన్తచేతసామ్ శరణాగతమర్త్యానాం శరణ్యాయ నమోఽస్తుతే || 6 || వజ్రదేహాయ కాలాగ్నిరుద్రాయామితతేజసే బ్రహ్మాస్త్రస్తంభనాయాస్మై న...