ఓం నమో నారాయణాయ శ్రీ విష్ణు షోడశ నామ స్తోత్ర భాష్యం🌹

 🕉️⚜️🚩ఓం నమో నారాయణాయ 🙏


⚜️🚩అన్ని సమస్యల నుండి రక్షించే శ్రీమహావిష్ణువు యొక్క 16 నామాలు.


🌹శ్రీ విష్ణు షోడశ నామ స్తోత్ర భాష్యం🌹🙏


🌹ఔషధే చింతయేద్విష్ణుం:

ఔషధం స్వీకరించే సమయంలో సర్వ వ్యాపకుడైన విష్ణువుగా స్మరించాలి


🌹భోజనే చ జనార్ధనం:

భోజనం చేసే సమయంలో జగద్రక్షకుడైన జనార్ధనుడిగా స్మరించాలి


🌹శయనే పద్మనాభం చ:

నిద్ర పోయే సమయంలో పద్మనాభుడిగా స్మరించాలి


🌹వివాహే చ ప్రజాపతిమ్: 

వివాహ సమయంలో ప్రజాపతిగా స్మరించాలి.


🌹యుద్ధే చక్రధరం దేవం:

యుద్ధంలో సుదర్శన చక్రం ధరించిన చక్రధారిగా స్మరించాలి.


🌹ప్రవాసే చ త్రివిక్రమమ్: 

ప్రయాణ సమయంలో త్రివిక్రముడుగా స్మరించాలి.


🌹నారాయణం తనుత్యాగే:

అంత్య కాలంలో జ్ఞానమనే వాసముగా గల నారాయణుడిగా స్మరించాలి.


🌹శ్రీధరం ప్రియసంగమే:

ఇష్టమైన వారిని కలిసేటప్పుడు లక్ష్మిదేవిని వక్షస్థలం నందు గల శ్రీధరుడిగా స్మరించాలి.


🌹దుస్స్వప్నే స్మర గోవిందం: 

పీడ కలలు వచ్చినప్పుడు గోవర్ధన గిరి ధారి అయిన గోవిందుడుగా స్మరించాలి.


🌹సంకటే మధుసూదనం:

సమస్యలలో ఉన్నప్పుడు రాక్షసులైన మధుసూదనులను వధించిన మధుసూదనడుగా స్మరించాలి.


🌹కాననే నారసింహం చ:

అడవులలో ఉన్నప్పుడు నారసింహుడుగా స్మరించాలి.


🌹పావకే జలశాయినం:

అగ్ని ప్రమాదం ఏర్పడినప్పుడు నీటిపై పవళించే జలశాయిగా స్మరించాలి.


🌹జలమధ్యే వరాహం చ: 

నీటి వల్ల సమస్య ఏర్పడినప్పుడు భూమిని నీటి నుండి రక్షించిన యజ్ఞవరాహమూర్తిగా స్మరించాలి.


🌹పర్వతే రఘునందనం:

కొండలలో, పర్వతాలలో ఉన్నప్పుడు కోదండరాముడిని రఘునందనుడుగా స్మరించాలి.


🌹గమనే వామనం చైవ:

బయటకు వెళ్ళేటప్పుడు రెండు అడుగులతో విశ్వాన్ని కొలిచిన వామనమూర్తిగా స్మరించాలి.


🌹సర్వ కాలేషు మాధవం:

సర్వకాలసర్వావస్థల యందు శ్రీకృష్ణ పరమాత్మను మాధవుడిగా స్మరించాలి.


⚜️🚩ఇవి పరమ పవిత్రమైన శ్రీ మహావిష్ణువు యొక్క 16 నామాలు. 

ఈ విష్ణు షోడశ నామాలను ప్రతీ రోజూ ఉదయం

భక్తి శ్రద్ధలతో ఎవరు పలుకుతారో, వారి సర్వ పాపాలు తొలగి విష్ణులోకం లభిస్తుంది.


                🌹🙏గోవింద గోవింద గోవింద🙏🌹

                           🕉️🌺🕉️🌺🕉️🌺🕉️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు