ఓం సాయి రామ్

🌹ఓo సాయి శ్రీసాయి జయ జయ సాయి🌹

జీవులను‬ సృష్టించే తండ్రే సాయి
ఈ దేహమిచ్చి పోషించే తల్లే సాయి
మహనీయుడై వెలసిన సద్గురువే సాయి
వేదశాస్త్రాలలో మంచిని చెప్పే మన మిత్రుడు సాయి

తన భక్తుల క్షేమానికి దత్తుడు సాయి
ఈ సృష్టిని పరిపాలించే శివుడే సాయి
భవసంద్రము దాటించే విభుడే సాయి
కలియుగాన వెలసిన భగవంతుడు సాయి ||
జీవులను||

మోడులను చిగురించే జీవం సాయి
అంధులకు వెలుగిచ్చే దైవం సాయి
మూఢులతో వేదం పలికించెను సాయి
మృతులను బ్రతికించే మృతసంజీవని సాయి ||జీవులను||

తన సంపదను భక్తులకు పంచెను సాయి
వారి ప్రేమతో జీవించే భిక్షువు సాయి
ఇహలోకపు కోర్కెలను తీర్చును సాయి
తన భక్తులను ముక్తివైపు నడిపించును సాయి ||జీవులను||
సేకరణ 🌹🙏

🌹శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై🌹



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు