ఓం నమో వేంకటేశాయ పాదపూజ 🌹🙏

 🕉️⚜️👏 ఓం నమో వేంకటేశాయ 🙏


శ్రీమన్‌ కృపాజలనిధే కృతసర్వలోక

సర్వజ్ఞ శక్త నతవత్సల సర్వశేషిన్‌

స్వామిన్‌ సుశీల సులభాశ్రిత పారిజాత

శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే ॥


🌹భావము:

శ్రీమంతుడవగు వేంకటేశ్వరా నీవు దయా సముద్రుడవు.

సమస్త లోకములకు సృష్టికర్తవు.

సర్వజ్ఞుడవు. సర్వశక్తుడవు.

సేవించు వారి యెడల వాత్సల్యము కలవాడవు.

సర్వ స్వతంత్రుడవు. ప్రభువైనవాడవు.

సుగుణములు కలవాడవు.

ఆశ్రితులకు సులభముగా లభించు కల్పవృక్షం నీవు.

నీ పాదములనే శరణు జొచ్చెదను.


⚜️🚩పాదపూజ 🌹🙏


🌹భగవానుడి అవతారమూర్తుల చరణాల పైన నిలిచే దృష్టి ఆ రూప వైభవాన్ని, తత్వాన్ని గ్రహించగలుగుతుంది.


🌹భగవానుడికి సమర్పించే అధాంగపూజలో ప్రథమంగా "పాదౌ పూజయామి" అంటారు.


🌹ఆ పాదాలకు - మనసుకు బంధం ఏర్పడాలి.

ఆ బంధం మానవుణ్ని మాధవత్వం వైపు నడుపుతుంది.


🌹హిరణ్యకశిపుణ్ని తన నరసింహాకృతితో వధించిన తరువాత,

ఉగ్రరూపంలో సింహాసనాన్ని అధిష్ఠించిన శ్రీహరిని ప్రహ్లాదుడు నీ పాదాశ్రయుడిగా చేయమంటూ ప్రార్థిస్తాడు.

అంతకన్నా సామ్రాజ్య వైభవాలు వద్దంటాడు.


🌹శ్రీరామచంద్రుడి పాదుకలను తలపై ధరిస్తాడు భరతుడు.

తల ఉన్నతమైన స్థానం.

అది బ్రహ్మరంధ్రం ఉండే చోటు.

సహస్రారకమలం నెలవై ఉండే చోటు.

శ్రీరామచంద్రుడి పాదుకలను సింహాసనంపై ఉంచి శ్రీరామచంద్రుడి పేరిట రాజ్యపాలన చేస్తాడు. 


🌹ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు కాళియుడి పడగలపై నాట్యం చేస్తాడు.

ఆయన పాదముద్రలే నాగజాతికి

అలంకారాలయ్యాయి.


🌹శ్రీకృష్ణుడి అవతార వైభవానికి తన్మయుడైన విధాత "స్వామీ ఆ బ్రహ్మపథం ఎందుకు, నీతో కలిసి ఆడిపాడే గోపబాలుర పాద రేణువు నా తలపై ధరించినా నాకది చాలు"నంటాడు.


🌹మధురా నగరంలో సుదాముణ్ని అనుగ్రహించి వరం కోరుకొమ్మని అంటాడు శ్రీకృష్ణుడు.

నీ పాద కమల సేవ నీ పాదార్చకుల తోడి స్నేహం అనుగ్రహించమని అడుగుతాడు సుదాముడు.


🌹ఆదిశంకరుల అద్భుత రచనల్లో దేవీదేవతల పాదాల వైభవాన్ని వర్ణించారు.


🌹సర్వ భయాలను పోగొట్టి సుఖాలనిచ్చే సదాశివుడి పాదపద్మాలను ఆశ్రయించాలని శివానందలహరిలో ప్రబోధిస్తారు.

అరిషడ్వర్గాలను తొలగించి ముక్తిపథాన్ని చూపేది ఒక్క గురుపాదాలేనని, తన గురుపాదుకాస్తోత్రం ద్వారా తెలియజేశారు.


🌹వివాహ వేడుకలో వరపూజ ముఖ్యమైన ఘట్టం. కన్యాదాత వరుణ్ని లక్ష్మీనారాయణ స్వరూపుడిగా భావించి, సుగంధ పూజాద్రవ్యాలతో కూడిన జలంతో పాదప్రక్షాళన చేస్తారు.


🌹అలాగే తల్లిదండ్రులను దైవస్వరూపులుగా భావించి, పాదపూజ జరుపుతుంది సంతానం.

పాద ప్రక్షాళన చేసిన జలాన్ని తమ శిరస్సులపై చిలకరించుకొని ధన్యత చెందినట్లుగా భావిస్తారు.


🌹వినమ్రతకు, మనసులో మెదిలే భక్తి భావనకు నిదర్శనాలు ఇవన్నీ.

ఆధ్యాత్మిక సాధనా జగత్తులో #పాదసేవ గొప్ప సంస్కారవంతమైనది. 

🌹సేకరణ 


వినా వేంకటేశం న నాథో న నాథః

సదా వేంకటేశం స్మరామి స్మరామి !

హరే వేంకటేశ ప్రసీద ప్రసీద

ప్రియం వేంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ !!

                        ⚜️🌺⚜️🌺⚜️🌺⚜️🌺⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు