సుదంతుడు చేసిన "హనుమంతుని స్తోత్రం" శ్రీ ఆంజనేయం 🙏

 🕉️⚜️🚩 శ్రీ ఆంజనేయం 🙏


⚜️🚩సుదంతుడు చేసిన "హనుమంతుని స్తోత్రం"


నమో నమస్తే దేవేశ - సృష్టిస్థిత్యంత హేతవే |

అక్షరాయ వరేణ్యాయ వరదాయ మహాత్మనే |1|


🌹ఓ దేవనాయకా నీకు నమస్కారము.

సృష్టి స్థితి లయలకు కారకుడవైనట్టి వానికి, నాశరహితునకు, శ్రేష్ఠునకు, మహాత్ముడగు వరప్రదాతకు నీకు నమస్కారము.


యోగిహృత్సద్మ సంస్థాయ భవరోగౌషధాయ చ |

భక్తాపరాధసహినే భావపుత్త్రాయ తే నమః |2|


🌹యోగుల హృదయ పద్మమున ఉండు వానికి,

జననమరణముల రోగమునకు ఔషధము వంటి వానికి,

భక్తుల అపరాధములు సహించువానికి,

ఈశ్వరసుతుడవైన నీకు నమస్కారము.


రామోపకారశీలాయ లక్ష్మణప్రాణదాయినే |

సప్తకోటి మహామంత్ర స్వరూపాయ నమో నమః |3|


🌹శ్రీరామునకు ఉపకరించుటయే స్వభావంగా కలవానికి,

లక్ష్మణుని ప్రాణదాతకు,

సప్తకోటి మహామంత్ర స్వరూపునకు నీకు నమస్కారము.


గౌరీగర్భ మహాశుక్తిం రాత్నాయామిత ఘాతవే |

వేదవేద్యాయ యజ్ఞాయ యజ్ఞోభోక్త్రే నమోనమః |4|


🌹పార్వతీ గర్భమనే గొప్ప ముత్యపుచిప్ప యందు ఉద్భవించిన రత్నమునకు,

అమితముగ దుష్టులను చంపువానికి, వేదవేద్యునకు,

యజ్ఞ స్వరూపునకు, యజ్ఞో భోక్తకు నీకు నమస్కారము.


బ్రహ్మవిష్ణు మహేశాది సర్వదేవ స్వరూపిణే |

శతానన పధార్థాయ నక్షత్రే శ్రవణే శుభే |5|


🌹బ్రహ్మ, విష్ణు, మహేశ్వరాది సమస్త దేవతల స్వరూపమయినవానికి,

శతకంఠ రావణుని వధించుటకై శుభప్రదమగు శ్రవణా నక్షత్రమున.


అవతీర్ణః పంచవక్త్రః తస్మై హనుమతే నమః |

నమ స్తుభ్యం కృపాపార! క్షమస్వ మమ దుర్ణయం |6|


🌹అవతరించిన పంచముఖాంజనేయునకు నమస్కారము.

ఓ దయాపూర్ణుడా నా అవినయమును క్షమింపుము.


మ మాపరాథ సంజ్ఞానే శక్తి ర్నాస్తి కపీశ్వరః |

అట స్సహనమే వైషాం యుక్తం భవతి ప్రాణద |7|


🌹నా అపరాధములను నీవు కూడ లెక్కింపజాలవు. అందువలన వాటినన్నిటిని సహింప నీవే తగియున్నావు.


పుచ్చాగ్ని లంకాపుర దాహకాయ

సురాంత కాక్షాసుర మర్ధనాయ |

నమో స్తు భీభత్సవినిర్మితే ష్వ

వ్యత్యర్థ భీభత్సరసోత్సవాయ |8|


🌹తోక నిప్పుతో లంకానగరాన్ని దగ్ధం చేసినట్టి,

దేవతలనే బాధించు అక్షరాక్షసుని వధించినట్టి,

వారధి నిర్మించు బీభత్స కార్యంలో బీభత్స రసోత్సవముననున్న నీకు నమస్కారము.


జనన మరణ వర్ణితం, శాంతరూప విగ్రహమ్ |

ప్రమథగణ సుసేవితం, పాపసంఘ నాశకమ్ |9|


🌹జనన మరణములు లేనట్టియు,

శాంత స్వరూపము కలిగినట్టియు,

వానర సమూహంచే సేవింపబడునట్టి,

పాపములను పటాపంచలు చేయగలిగినట్టి,


కూర్మవృష్ఠధారణం, పార్థ కేతు చారిణమ్ |

వాలఖిల్య సంస్తుతం, వాయుసూను మాశ్రయే |10|


🌹తాబేలు వెన్ను అధిరోహించినవానిని,

అర్జునుని రథపు టెక్కెమున సంచరించువానిని,

వాలాఖిల్యాది మునులచే స్తుతింపబడినవానిని,

వాయు కుమారుడయిన హనుమంతుని ఆశ్రయించుచున్నాను.


ఇంద్రవ్యాకరణాధిగ త్యవసరే యస్య స్వతో విహ్వాలో

దృష్టో రూప మహఃపతి శ్చరమ పూర్వాద్రిస్థి తాంఘ్రిద్వయః |

ప్రాదా దాత్మసుతాం సురూపగుణశ్రీ లానర్ఘరత్న శ్రియామ్

యస్మై నామ సువర్చలాం హనుమతే తస్మై నాహం కుర్మహే |11|


🌹ఇంద్ర వ్యాకరణమును నేర్చుకొనవలసి వచ్చినప్పుడు బ్రహ్మచారియగుటచే స్వయంగా అనర్హుడై కలత చెందిన వానరవీరుని,

పూర్వ పశ్చిమాద్రుల పాదములు ఉంచి యున్న హనుమంతుని రూపము చూసి సూర్యుడు...

రూపగణ శీలములందు సాటిలేనటువంటి తన కుమార్తెయైన సువర్చలాదేవిని యిచ్చి వివాహంచేశాడు.

అట్టి అంజనేయునకు నమస్కరించుచున్నాను.


🌹హనుమ నామస్మరణం … సర్వపాప నివారణం🌹🙏

                       ⚜️🌺⚜️🌺⚜️🌺⚜️🌺⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు