🌹గురు అష్టకం స్తోత్రం🌹🙏

 🕉️⚜️🚩 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏

🌹ఆదిశంకరాచార్య విరచిత "గురు అష్టకమ్" గురువు ప్రాముఖ్యతని చెబుతూ గురువు పాదపద్మములకు ప్రణమిల్లడం ఎంత ముఖ్యమో ఇది వివరిస్తుంది.


🌹ఎంత సంపద, జ్ఞానం, కీర్తి లేదా యోగ సిద్ధులను గడించినా సరే, గురువు అనుగ్రహం లేకపోతే ఇవి ఉన్నా ఉపయోగం లేదు అన్న విషయాన్ని ఈ స్తోత్రం మనకు చెబుతోంది. 


             🌹గురు అష్టకం స్తోత్రం🌹🙏


శరీరం సురూపం తథా వా కళత్రం

యశఃశ్చారు చిత్రం ధనం మేరుతుల్యం

గురోరంఘ్రి పద్మే మనస్చేన లగ్నం

తత: కిమ్ తత: కిమ్, తత: కిమ్ తత: కిమ్ ||1||


🌹భావము:

చక్కని రూపం గల అందమైన భార్య ఉన్నప్పటికి,

గొప్ప కీర్తి, మేరు పర్వతమంత డబ్బు ఉన్నప్పటికీ

గురువు పాదాల వద్ద నిలపలేని మనస్సు ఉండి

ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?


కళత్రం ధనం పుత్ర పౌత్రాధి సర్వం

గృహం బాంధవా సర్వ మేతాధి జాతం,

గురోరంఘ్రి పద్మే మనస్చేన లగ్నం

తత: కిమ్ తత: కిమ్, తత: కిమ్ తత: కిమ్ ||2||


🌹భావము: 

భార్య, సంపద, పుత్రులు, మనుమలు, మంచి ఇల్లు, బంధువులు ఉండి

గొప్ప కుటుంబములో పుట్టినప్పటికీ,

గురువు పాదాల వద్ద నిలపలేని మనస్సు ఉండి

ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?


షడంగాది వేదో ముఖే శాస్త్ర విద్య

కవిత్వాది గద్యం, సుపదయం కరోతి

గురోరంఘ్రి పద్మే మనస్చేన లగ్నం

తత: కిమ్ తత: కిమ్, తత: కిమ్ తత: కిమ్ ||3||

 

🌹భావము: 

నీవు ఆరు అంగములలోను, నాలుగు వేదములలోను, పారంగతుడవైనా కాని,

గద్య, పద్య రచనలో ప్రజ్ఞావంతుడైన గాని,

గురువు పాదాల వద్ద నిలపలేని మనస్సు ఉండి

ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?


విదేశేషు మాన్యః, స్వదేశేషు ధన్యః

సదాచార వృత్తేషు మత్తో న చాన్యః

గురోరంఘ్రి పద్మే మనస్చేన లగ్నం

తత: కిమ్ తత: కిమ్, తత: కిమ్ తత: కిమ్ ||4||

 

🌹భావము: 

నిన్ను విదేశములో గొప్పగా, స్వదేశములో ధనవంతునిగా, సదాచార వృత్తి గలిగి జీవించువాడవని పొగడబడినా,

గురువు పాదాల వద్ద నిలపలేని మనస్సు ఉండి

ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?


క్షమా మండలే భూప భూపాల వృందై

సదా సేవితం యస్య పాదారవిందం

గురోరంఘ్రి పద్మే మనస్చేన లగ్నం

తత: కిమ్ తత: కిమ్, తత: కిమ్ తత: కిమ్ ||5||

 

🌹భావము: 

నీవు ఒక దేశానికి రాజువైనా, ఎందరో రాజులు, రారాజులు నీ పాదాలు సేవించినను,

గురువు పాదాల వద్ద నిలపలేని మనస్సు ఉండి

ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?


యశో మే గతమ్ దీక్షు దాన ప్రతాప

జగద్వస్తు సర్వమ్ కరే యః ప్రసాదత్

గురోరంఘ్రి పద్మే మనస్చేన లగ్నం

తత: కిమ్ తత: కిమ్, తత: కిమ్ తత: కిమ్ ||6||

 

🌹భావము: 

దానగుణం వలన నీ కీర్తి అన్ని దిశల వ్యాపించినా,

ప్రపంచం మొత్తం నీ పక్షాన ఉన్నప్పటికీ,

గురువు పాదాల వద్ద నిలపలేని మనస్సు ఉండి

ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?


న భోగే, న యోగే, న వా వాజి రాజౌ

న కాంతా ముఖే నైవ విత్తేషు చిత్తమ్

గురోరంఘ్రి పద్మే మనస్చేన లగ్నం

తత: కిమ్ తత: కిమ్, తత: కిమ్ తత: కిమ్ ||7||

 

🌹భావము: 

భోగము, యోగము, అగ్నిహోమము, స్త్రీ సుఖము, ధనము నందు నీవు శ్రద్ధ చూపనప్పటికీ,

గురువు పాదాల వద్ద నిలపలేని మనస్సు ఉండి

ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?


అరణ్యే న వాసస్య గేహే న కార్యే

న దేహే మనో వర్తతే మే త్వనర్ఘ్యె

గురోరంఘ్రి పద్మే మనస్చేన లగ్నం

తత: కిమ్ తత: కిమ్, తత: కిమ్ తత: కిమ్ ||8||

 

🌹భావము: 

అడవిలో, ఇంటిలో ఉండాలని కోర్కెలేని వారైనా,

ఏదైనా సాధించాలని గాని, తన వంటి మీద శ్రద్ధగాని లేని వారైన గాని,

గురువు పాదాల వద్ద నిలపలేని మనస్సు ఉండి

ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?


🌹ఫలశ్రుతి:


గురోరష్టకం యః పఠేత్పుణ్యదేహీ

యతిర్భూపతిర్బ్రహ్మచారీ చ గేహీ

లభేత్ వాంఛితార్థ పదం బ్రహ్మసంజ్ఞం

గురోరుక్తవాక్యే మనో యస్య లగ్నం ॥


🌹భావము: 

ఎవరైతే ఈ గురు అష్టకాన్ని చదువుతారో, నేర్చుకుంటారో, మననం చేస్తారో,

గురువు చెప్పిన విషయాలను నిత్యం స్మరిస్తూ గురు పాదపద్మములపై మనస్సు లగ్నం చేస్తారో,

అటువంటివారు యోగి అయినా, సన్యాసి అయినా, రాజు అయినా, బ్రహ్మచారి అయినా, గృహస్తు అయినా అతనికి శాశ్వత పరతత్వమగు పరబ్రహ్మం సిద్ధిస్తుంది.



                         ⚜️🌺⚜️🌺⚜️🌺⚜️🌺⚜️

Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు