ఓం నమః శివాయ అర్ధనారీశ్వరము🙏

 🕉️🔱🚩 ఓం నమః శివాయ 🙏


🌹అర్ధనారీశ్వరము


🌹అర్ధ (సగమైన ) నారి (స్త్రీ) , ఈశ్వర (సగమైన పురుషుడు) రూపము (కలిగిఉన్న రూపము). 


🌹తల ఆలోచనకి, పాదము ఆచరణకు సంకేతాలైతే, 

లోకంలో "భార్యా భర్తలు" అన్యోన్యముగా  ఆచరణలోనూ, ఆలోచనలోనూ, కర్మలలోను, కార్యాలలోను, నిర్ణయాలలోనూ, నిర్మాణాలలోనూ ఒకటిగా చెరి సగముగా ఉండాలని హిందూపురాణాలు అర్ధనారీశ్వరాన్ని చూపడం జరిగింది.


🌹పరమేశ్వరుని , అంబికను ఏకభావముతో భక్తితో సేవించాలి.

అప్పుడే అధిక శుభము కలుగుతుంది.

ఇరువురియందును సమాన ప్రీతి ఉండవలెనన్న ... ఆ ఇరువురియందు #మాతా_పితృ భావము ఉండాలి.


🌹‪అర్ధనారీశ్వరుడు‬ లయకారుడు.

శివుడికి అధికారం అధికంగా ఉండాలి.

ఆ అధికారాన్నే... పార్వతి, దుర్గ, శక్తి రూపాలుగా పిలుస్తారని పురాణాలు చెబుతున్నాయి.


🌹అంటే ఆ శక్తిని ఆయన తనలో భాగంగా ధరించాలి.

శివుడు, శక్తి... కలిసి పని చేయడమంటే, స్త్రీపురుషులు సమానమేనని అంతరార్థం.

ఈ సంప్రదాయాన్ని చూపడానికే శివుడు + శక్తి కలిసి అర్ధనారీశ్వరుడిగా దర్శనమిస్తారు. 


🌹శివుడు లేకుండా శక్తి, శక్తి లేకుండా శివుడు ఉండరు.

శక్తితో కలిసిన శివుడిని సంపూర్ణుని (సగుణబ్రహ్మ) గా, శక్తితో లేనప్పుడు అసంపూర్ణుని (నిర్గుణబ్రహ్మ) గా పండితులు చెబుతారు.


🌹‪‎ఆది‬ దంపతులు - #జగత్పితరులు


♦️'జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ'♦️

అని స్తుతిస్తుంటారు.

జగత్తుకంతటికీ తల్లిదండ్రులలాంటి వారు ఆ పార్వతీపరమేశ్వరులు.


🌹నందీశ్వరుడు బ్రహ్మమానస పుత్రుడైన సనత్కుమారుడికి ఈ కథను👇 వివరించాడు.


పూర్వం బ్రహ్మదేవుడు ప్రజలను వృద్ధి చేయటం కోసం తనదైన పద్ధతిలో సృష్టిని చేయసాగాడు.

అలా తానొక్కడే ప్రాణులను రూపొందిస్తూ జీవం పోస్తూ ఎంత కాలంగా తన పనిని తాను చేసుకుపోతున్నా అనుకున్నంత సంఖ్యలో ప్రజావృద్ధి జరగలేదు.

ఇందుకు ఎంతగానో చింతిల్లిన బ్రహ్మదేవుడు పరమేశ్వరుడిని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు.

బ్రహ్మ చేసిన కఠిన తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమయ్యాడు.

సగం పురుషుడు, సగం స్త్రీ రూపం గల దేహంతో ఆ శివ స్వరూపం వెలుగొందసాగింది.

పరమ శక్తితో కూడి ఉన్న ఆ శంకరుడిని చూసి బ్రహ్మదేవుడు సాష్టాంగ ప్రణామం చేసి అనేక విధాల స్తుతించాడు.

అప్పుడు శివుడు బ్రహ్మదేవుడితో బ్రహ్మ సృష్టికి సహకరించటానికే అర్ధనారీశ్వర రూపాన్ని తాను ధరించి వచ్చినట్లు చెప్పాడు.

అలా పలుకుతున్న శివుడి పార్శ్వ భాగం నుంచి ఉమాదేవి బయటకు వచ్చింది.

బ్రహ్మదేవుడు ఆ జగనాత్మను స్తుతించి సృష్టి వృద్ధి చెందటం కోసం సర్వసమర్థమైన ఒక రూపాన్ని ధరించమని, తన కుమారుడైన దక్షుడికి కుమార్తెగా జన్మించమని బ్రహ్మదేవుడు ఉమాదేవిని ప్రార్థించాడు.

ఆమె బ్రహ్మను అనుగ్రహించింది.

ఆ వెంటనే భవానీదేవి కనుబొమల మధ్య నుంచి ఆమెతో సమానమైన కాంతులు గల ఒక దివ్యశక్తి అక్కడ అవతరించింది.

అప్పుడా శక్తిని చూసి పరమేశ్వరుడు బ్రహ్మ తపస్సు చేసి మెప్పించాడు కనుక ఆయన కోర్కెలను నెరవేర్చమని కోరాడు.

పరమేశ్వరుని ఆజ్ఞను ఆమె శిరసావహించింది.

బ్రహ్మదేవుడు కోరినట్లుగానే అనంతరం ఆమె దక్షుడికి కుమార్తెగా జన్మించింది.

ఆనాటి నుంచి ఆ లోకంలో నారీ విభాగం కల్పితమైంది.

                       🔱🌹🔱🌹🔱🌹🔱🌹🔱



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు