శ్రీ మహాగణేశ పంచరత్న స్తోత్రం - భావ సహితం🌹🙏
🕉️🔱🚩 ఓం శ్రీ మహా గణాధిపతయే నమః 🙏
🌹శ్రీ "ఆదిశంకరుల" విరచిత
శ్రీ మహాగణేశ పంచరత్న స్తోత్రం - భావ సహితం
ముదా కరాత్త మోదకం సదా విముక్తి సాధకమ్ |
కళాధరావతంసకం విలాసిలోక రక్షకమ్ |
అనాయకైక నాయకం వినాశితేభ దైత్యకమ్ |
నతాశుభాశు నాశకం నమామి తం వినాయకమ్ ॥ 1 ॥
🌹భావము:
మోదకములు చేతిలో ఆనందంగా ఉంచుకుని, ఎల్లప్పుడూ మోక్షాన్ని ప్రసాదించే,
శిరస్సున చంద్రుని ధరించిన, లోకాన్ని కాపాడే,
నాయకులకే నాయకుడైన,
అసురులను, అన్ని ఆశుభాలను నశింపజేసే ఆ విఘ్నేశునికి నా నమస్కారములు.
నతేతరాతి భీకరం నవోదితార్క భాస్వరమ్ |
నమత్సురారి నిర్జరం నతాధికాపదుద్ఢరమ్ |
సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరమ్ |
మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరమ్ ॥ 2 ॥
🌹భావము:
భక్తుల శత్రువులకు భయం కలిగించే వానికి,
అప్పుడే ఉదయిస్తున్న సూర్యుని వలె ప్రకాశిస్తున్న వానికి,
దేవతలు, అసురులచే నుతింపబడేవాడికి ,
భక్తుల విఘ్నాలను తొలగించే వానికి,
దేవతలకే దేవునికి, సర్వ సంపదలకు అధిపతి అయిన వానికి, గజరాజుకు,
దేవతల గణాలకు అధిపతి అయిన వానికి ఎల్లప్పుడూ నా నమస్కారములు.
సమస్త లోక శంకరం నిరస్త దైత్య కుంజరమ్ |
దరేతరోదరం వరం వరేభ వక్త్రమక్షరమ్ |
కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరమ్ |
మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరమ్ ॥ 3 ॥
🌹భావము:
సమస్త లోకాలకు శుభం కలిగించే వానికి,
లోకాన్ని గజాసురుని బారినుండి కాపాడిన వానికి,
పెద్ద ఉదరముతో, గజముఖముతో జనులను ఆశీర్వదించే వానికి,
కరుణను కురిపించే వానికి, తప్పులను క్షమించి,
శుభము, యశస్సు కలిగించే వానికి,
తనకు నమస్కరించే వానికి సర్వ శుభాలు కలుగ జేసే విఘ్నరాజునికి నా నమస్కారములు.
అకించనార్తి మార్జనం చిరంతనోక్తి భాజనమ్ |
పురారి పూర్వ నందనం సురారి గర్వ చర్వణమ్ |
ప్రపంచ నాశ భీషణం ధనంజయాది భూషణమ్ |
కపోల దానవారణం భజే పురాణ వారణమ్ ॥ 4 ॥
🌹భావము:
కోరికలను తీర్చి, బాధలను నశింపజేసే వానికి,
అనాదిగా పూజింపబడిన వానికి,
ప్రళయ కారకుడైన శివుని పెద్ద కుమారునికి,
అసురుల గర్వాన్ని అణచే వానికి,
ప్రళయ కాలంలో భీషణంగా ఉండేవానికి,
సర్పము ఆభరణంగా ఉన్నవానికి,
మదగజము వలె ఉత్సాహముగా ఉన్నవానికి,
పురాతనమైన వానికి నా భజనలు.
నితాంత కాంతి దంత కాంతి మంత కాంతి కాత్మజమ్ |
అచింత్య రూపమంత హీన మంతరాయ కృంతనమ్ |
హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినామ్ |
తమేకదంతమేవ తం విచింతయామి సంతతమ్ ॥ 5 ॥
🌹భావము:
ఎంతో శోభతో ఉన్న దంతము కలవానికి (ఏకదంతునికి),
మృత్యుంజయ కారకుడైన శివుని కుమారునికి,
వర్ణనకు, ఊహకు అందని ఆకారము కలవానికి,
అంతము లేని వానికి,
విఘ్నాలు, ఆపదలు తొలగించే వానికి,
వసంత రుతువులాగా యోగుల మనస్సులో నిలిచే వానికి ఎల్లప్పుడూ నా స్మరణ.
మహాగణేశ పంచరత్నమాదరేణ యోஉన్వహమ్ |
ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరన్ గణేశ్వరమ్ |
అరోగతామదోషతాం సుసాహితీం సుపుత్రతామ్ |
సమాహితాయు రష్టభూతి మభ్యుపైతి సోஉచిరాత్ ॥
🌹భావము:
"మహాగణేశ పంచరత్నము" అను ఈ స్తోత్రమును ప్రతి దినము ప్రాతః కాలమున శ్రీ వినాయకుని మనస్సు యందు ధ్యానించుచు ఎవరెవరు పఠిస్తారో,
అట్టి వారికి వెంటనే ఆరోగ్యము, దోషము లేని జీవనమును,
మంచి విద్యను, జ్ఞానమును, చక్కని సంతానము కలవారై,
దీర్ఘాయుష్కులై అష్టైశ్వర్యములను అనుభవించి మంగళములను పొందెదరు.
⚜️🌹⚜️🌹⚜️🌹⚜️🌹⚜️
🌹శ్రీ విఘ్న రాజం భజే🌹
Comments
Post a Comment