🚩ఓం శ్రీ గురుభ్యోనమః గురుగీత" శ్లోకాలు, తాత్పర్యము.
🕉️🔱🚩ఓం శ్రీ గురుభ్యోనమః🙏
🌹ఓం శ్రీ దత్తాయ నమః🌹🙏
🌹"గురుగీత" స్కాందపురాణంలో, "బ్రహ్మ సంహిత"లో శివపార్వతుల సంవాదములో చెప్పబడింది.
"వ్యాస భగవానులు" గురువు యొక్క విశిష్టతను చాలా గొప్పగా, సరళమైన సంస్కృతంలో చెప్పారు.
ఇందులో ఇరవై ఏడు శ్లోకాలు ఉన్నాయి.
⚜️🚩"గురుగీత" శ్లోకాలు, తాత్పర్యము.
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |
గురుస్సాక్షాత్ పరం బ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః ||1||
🌹తాత్పర్యము:
గురువు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు.
ఆయనే ఆ పరబ్రహ్మము.
ఆయనకు నా నమస్కారములు.
అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా |
చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః ||2||
🌹తాత్పర్యము:
అజ్ఞానమనే అంధకారాన్ని జ్ఞానమనే అంజనముతో తొలగించిన (కంటిలో ఉన్న నలుసును తొలగించినట్లు) ఆ గురువునకు నా నమస్కారములు.
అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం |
తత్పదం దర్శితేన తస్మై శ్రీ గురవే నమః ||3||
🌹తాత్పర్యము:
అనంతమైన, అఖండమైన, సృష్టిలోని కదిలే కదలని ప్రతి ప్రాణి/వస్తువు లో ఉండే బ్రహ్మ యొక్క నిజాన్ని తెలిపే ఆ గురువుకు నా నమస్కారములు.
స్థావరం జంగమం వ్యాప్తం యత్కించిత్సచరాచరం|
త్వం పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః ||4||
🌹తాత్పర్యము:
సృష్టిలో, కదిలే కదలని ప్రతి వస్తువులో ఉండే జీవాత్మ నిజాన్ని తెలిపే ఆ గురువుకు నా నమస్కారములు.
చిన్మయం వ్యాపితం సర్వం త్రైలోక్యం సచరాచరం |
అసిత్వం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః ||5||
🌹తాత్పర్యము:
చరాచరాలతో కూడిన మూడులోకాలను వ్యాపించి ఉన్న శుద్ధ చైతన్య స్వరూపమైన బ్రహ్మ గురించి తెలిపే అసి శబ్దాన్ని వివరించే గురువుకు నా నమస్కారములు.
నిమిషార్ధార్ధపాదాద్వా యద్వాక్యాద్వై విలోక్యతే |
స్వాత్మానం స్థిరమాధత్తే తస్మై శ్రీ గురవే నమః ||6||
🌹తాత్పర్యము:
ఆత్మజ్ఞానమనేది ఎవరి ద్వారా అయితే ఒకనిమిషములోని అత్యంత అల్పమైన భాగము లో కలుగుతుందో ఆ గురువునకు నా నమస్కారములు.
యస్య దేవే పరాభక్తిర్యథా దేవే తథా గురౌ |
తస్యైతే కథితాహ్యర్థా ప్రకాశంతే మహాత్మనః ||7||
🌹తాత్పర్యము:
దైవము, గురువు పట్ల అత్యంత ఉన్నతమైన భక్తి కలిగిన వానికే శాస్త్రాలు తమ నిగూఢ అర్థాన్ని పూర్తిగా తెలుపుతాయి.
త్వం పితా త్వం చ మే మాతా త్వం బంధుస్త్వం చ దేవతా |
సంసారభీతిభంగాయ తస్మై శ్రీ గురవే నమః ||8||
🌹తాత్పర్యము:
నీవే నా తండ్రివి, తల్లివి, హితుడవు, దేవుడవు. సంసార భయాన్ని పోగొట్టే గురువైన నీకు నా నమస్కారములు.
గుకారశ్చంధకారస్తు రుకారస్తన్నిరోధకృత్ |
అంధకారవినాశిత్వాద్గురురిత్యభిదీయతే ||9||
🌹తాత్పర్యము:
గు అనే అక్షరము అంధకారాన్ని, రు అనే అక్షరము తొలగించడానికి ప్రతీక.
అందుకనే గురు అనే పదము అంధకారాన్ని తొలగించేదిగా పిలవబడింది.
కర్మణా మనసా వాచా సర్వదారాధయేత్గురుం |
దీర్ఘ దండం నమస్కృత్య నిర్లజ్జో గురుసన్నిధౌ ||10||
🌹తాత్పర్యము:
కర్మలు, మనసు, వాక్కు - మూడింటి ద్వారా గురువును ఆరాధించాలి.
గురువుకు పూర్తి సాష్టాంగ నమస్కారము చేయుటకు వెనుకాడ కూడదు.
సాష్టాంగ ప్రణిపాతేన తతో నిత్యం గురుం భజేత్ |
భజనాత్స్థైర్యమాప్నేతి స్వస్వరూపమయోభవేత్ ||11||
🌹తాత్పర్యము:
గురువుకు ప్రతి నిత్యం సాష్టాంగ నమస్కారము చేసి పూజించవలెను.
అలా చేయటం వలన స్థైర్యము, ఆత్మ జ్ఞానము (తాను ఎవరు అని తెలిపేది) కలుగుతాయి.
దోర్భ్యాం పద్భ్యాం చ జానుభ్యామురసా శిరసా దృశా |
మనసా ఉచసా చేతి ప్రణామోష్టాంగ ఉచ్యతే ||12||
🌹తాత్పర్యము: సాష్టాంగము లో ఉన్న ఎనిమిది అంగాలు - చేతులు, కాళ్లు, మోకాళ్ళు, వక్షస్థలము, తల, కళ్ళు, మనసు, వాక్కు.
యత్సత్వేన జగత్సత్యం యత్ ప్రకాశేన భాతి యత్ |
యదానందేన నందంతి తస్మై శ్రీ గురవే నమః ||13||
🌹తాత్పర్యము:
ఎవరి వలన ప్రపంచము సత్యముగా, ప్రకాశముగా, ఆనందముగా కనిపించి, తెలుస్తుందో ఆ గురువునకు నా నమస్కారములు.
యేన చేతయతా హీదం చిత్తం చేతయతే నరః |
జాగ్రత్స్వప్నసుషుప్త్యాది తస్మై శ్రీ గురవే నమః ||14||
🌹తాత్పర్యము:
మూడు అవస్థలు (జాగృతము, స్వప్నము, సుషుప్త) - వీటి యందు చేతనను, చైతన్యమును కలిగినే ఆ గురువునకు నా నమస్కారములు.
జ్ఞానశక్తిసమారూఢ తత్వమాలావిభూషిణే |
భుక్తిముక్తి ప్రదాత్రేచ తస్మై శ్రీ గురవే నమః ||15||
🌹తాత్పర్యము:
జ్ఞానమనే శక్తిని అధిరోహించి, తత్వము (నిజము) అనే మాలతో అలంకరించబడి, నాకు భుక్తిని, ముక్తిని ప్రసాదించే ఆ గురువునకు నా నమస్కారములు.
అనేకజన్మ సంప్రాప్త కర్మబంధవిదాహినే |
జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవే నమః ||16||
🌹తాత్పర్యము:
జ్ఞానమనే అగ్ని ద్వారా అనేక జన్మల నుంచి సంప్రాప్తించిన కర్మ అనే బంధములను దహించే ఆ గురువునకు నా నమస్కారములు.
శోషనం భవసింధోశ్చ దీపనం క్షరసంపదాం |
గురోః పాదోదకం యస్య తస్మై శ్రీ గురవే నమః ||17||
🌹తాత్పర్యము:
ఎవరి పాదములు కడిగిన నీరు ఈ సంసారమనే సాగరాన్ని దాటించి, అసత్యాన్ని నాశనం చేస్తుందో ఆ గురువునకు నా నమస్కారములు.
న గురోరధికం తత్వం న గురోరధికం తపః |
న గురోరధికం జ్ఞానం తస్మై శ్రీ గురవే నమః ||18||
🌹తాత్పర్యము:
గురువును మించిన తత్వము (నిజము), తపస్సు, జ్ఞానము లేదు.
ఆ గురువునకు నా నమస్కారములు.
మన్నాథః శ్రీజగన్నాథః మద్గురుః శ్రీజగద్గురుః |
మమాత్మా సర్వ భూతాత్మా తస్మై శ్రీ గురవే నమః ||19||
🌹తాత్పర్యము:
నా నాథుడు ఈ జగత్తుకే నాథుడు, నా గురువు ఈ జగత్తుకే గురువు.
నాలో ఉన్న ఆత్మ అన్నిట ఉంది.
నా గురువులకు నమస్కారములు.
గురురాదిరనాదిశ్చ గురుః పరమదైవతం |
గురమంత్రసమోనాస్తి తస్మై శ్రీ గురవే నమః ||20||
🌹తాత్పర్యము:
గురువే కారణము, ఆది (మొదలు). కానీ ఆయనకు అవి లేవు.
గురువు ఉత్తమమైన దైవము.
గురు మంత్రాన్ని మించిన మంత్రము లేదు.
ఆ గురువునకు నా నమస్కారములు.
ఏక ఏవ పరో బంధుః వివేకే సముపస్థితే |
గురుః సకలధర్మాత్మా తస్మై శ్రీ గురవే నమః ||21||
🌹తాత్పర్యము:
నిజమైన వివేకము జాగృతమైనప్పుడు గురువే అత్యంత హితుడని తెలుస్తుంది. అన్ని ధర్మములకు మూలము గురువే. ఆ గురువునకు నా నమస్కారములు.
గురుమధ్యే స్థితం విశ్వం విశ్వ మధ్యే స్థితో గురుః |
గురుర్విశ్వం నమస్తేస్తు తస్మై శ్రీ గురవే నమః ||22||
🌹తాత్పర్యము:
విశ్వము గురువు యందు స్థితమైయున్నది.
గురువు విశ్వవ్యాప్తమై యున్నాడు.
ఆ గురువునకు నా నమస్కారములు.
భవార్ణ్య ప్రవిష్టస్య దిజ్ఞ్మోహ భ్రాంతి చేతసః |
యేన సందర్శితః పంథాః తస్మై శ్రీ గురవే నమః ||23||
🌹తాత్పర్యము:
సంసారమనే అడవిలో చిక్కుకున్న వారికి, భ్రాంతిలో జీవించే వారికి ముక్తిని కలిగినే ఆ గురువునకు నా నమస్కారములు.
తాపత్రయాగ్నితప్తానం అశాంతప్రాణినాం ఉమే |
గురురేవ పరా గంగా తస్మై శ్రీ గురవే నమః ||24||
🌹తాత్పర్యము:
మూడు రకాల తాపముల(శరీరము, ప్రాణులు,దైవికము) అగ్ని నుంచి ఉపశమనము కలిగించే గంగానది వంటి ఆ గురువునకు నా నమస్కారములు.
అజ్ఞానేనాహినాగ్రస్తాః ప్రాణినస్తాన్ చికిత్సకః |
విద్యాస్వరూపో భగవాన్ తస్మై శ్రీ గురవే నమః ||25||
🌹తాత్పర్యము:
అజ్ఞానమనే సర్పముచే కాటు వేయబడిన మనకు జ్ఞానమనే వైద్యము చేసి ఉద్ధరించే ఆ గురువునకు నా నమస్కారములు.
హేతవే జగతామేవం సంసారార్ణవసేతవే |
ప్రభవే సర్వ విద్యానం శంభవే గురవే నమః ||26||
🌹తాత్పర్యము:
సాక్షాత్తు శివుడే అయిన గురువు ఈ జగత్తులో మనకు ఏకైక హితుడు.
సర్వ విద్యలకు ప్రభువు ఆయన.
సంసారమనే సాగరాన్ని దాటించే ఆ గురువులకు నా నమస్కారములు.
ధ్యానమూలం గురోర్మూర్తిః పూజా మూలం గురోః పదం |
మంత్రమూలం గురోర్వాక్యం ముక్తిమూలం గురోః కృపాః||27||
🌹తాత్పర్యము:
ధ్యానానికి మూలము గురువు యొక్క రూపము, పూజకు మూలము గురువు యొక్క పాదములు, గురువు యొక్క పలుకులు మంత్రానికి మూలము. గురువు యొక్క కృప ముక్తికి మూలము.
🌹తస్మై శ్రీ గురవే నమః🙏
Comments
Post a Comment