ఆది శంకరుల" మరొక రచన "ప్రాతః స్మరణ స్తోత్రం" 🚩 ఓం నమః శివాయ 🙏

 🕉️🔱🚩 ఓం నమః శివాయ 🙏


🔱🚩 "ఆది శంకరుల" మరొక రచన "ప్రాతః స్మరణ స్తోత్రం" 


🌹ప్రాతఃస్మరణ స్తోత్రం 🌹🙏


ప్రాతః స్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం

సచ్చిత్సుఖం పరమహంస గతిం తురీయమ్ |

యత్ స్వప్న జాగర సుషుప్తిమవైతి నిత్యం

తత్ బ్రహ్మ నిష్కల మహం న చ భూత సఙ్ఘః || 1 ||


🌹తాత్పర్యము:

సచ్చిదానందరూపము, మహాయోగులకు శరణ్యము, మోక్షమును ఇచ్చునదీ  అగు ప్రకాశవంతమైన ఆత్మతత్త్వమును  ప్రాతఃకాలమునందు నామదిలో స్మరించుచున్నాను.

ఏ బ్రహ్మస్వరూపము స్వప్నము , జాగరణ , సుషుప్తి అనువాటిని తెలుసుకొనుచున్నదో, నిత్యమూ, భేదము లేనిదీ అగు ఆ బ్రహ్మ నేనే.

నేను పంచభూతముల సముదాయము కాదు.


ప్రాతర్భజామి మనసాం వచసామగమ్యం

వాచో విభాన్తి నిఖిలా యదనుగ్రహేణ |

యన్నేతి నేతి వచనైర్నిగమా అవోచం

స్తం దేవ దేవ మజమచ్యుతమాహురగ్ర్యమ్ || 2 ||


🌹తాత్పర్యము:

మనస్సు, వాక్కులకు కనిపించుచు, వాటిని ప్రకాశింపచేయుచు, వేదములచే "నేతి" "నేతి" (ఇది కాదు ఇది కాదు) అని వర్ణింపబడుచు,

పర దేవతయై, "అజ" (జన్మము లేని) , "అచ్యుత" (నాశనము లేని), "ఆదిపురుష" (అత్యున్నతమైన) శబ్దములచే వర్ణింపబడు పరబ్రహ్మమును ప్రాతః కాలమున భజించుచున్నాను.


ప్రాతర్నమామి తమసః పరమర్క వర్ణం

పూర్ణం సనాతనవదం పురుషోత్తమాఖ్యమ్ |

యస్మిన్నిదమ్ జగదశేషమశేషమూర్తౌ

రజ్జ్వాం భుజఙ్గమ ఇవ ప్రతిభాసితం వై || 3 ||


🌹తాత్పర్యము:

అజ్ఞానానికి అతీతమైంది, సూర్యుని తేజస్సుకు సమానమైనది, పూర్ణము,

సనాతనమైన పురుషోత్తముడైన పరబ్రహమును ప్రాతః కాలమున నమస్కరించుచున్నాను.

సర్వ మూర్తి స్వరూపుడగు ఈ అశేష మూర్తియందె జగత్తంతయు రజ్జువున (తాడున) సర్పము వలె ప్రకాశించుచున్నది.


ఫలశ్రుతి:


శ్లోకత్రయమిదం పుణ్యం లోకత్రయవిభూషణమ్ |

ప్రాతః కాలే పఠేద్ యస్తు స గచ్ఛేత్ పరమం పదమ్ ||


🌹తాత్పర్యము:

మూడులోకములను అలంకరించునవి, పుణ్యకరములు అగు ఈ శ్లోకములను ఎవరైతే ప్రాతఃకాలము నందు పఠించునో వారు మోక్షమును పొందును.


⚜️🚩॥ ఇతి శ్రీ శంకరాచార్య కృతం "ప్రాతఃస్మరణ స్తోత్రం" సంపూర్ణమ్ ॥

                       ⚜️🌹⚜️🌹⚜️🌹⚜️🌹⚜️


Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు