ఓం నమః శివాయ 🙏శివరాత్రికి "లింగోద్భవకాలమని" కూడా పేరు.
🕉️🔱🚩 ఓం నమః శివాయ 🙏
⚜️🚩ధ్యానం🌹🙏
శ్లో||
శాంతం పద్మాసనస్థం శశిధర మకుటం పంచవక్త్రం త్రినేత్రమ్|
శూలం వజ్రం చఖడ్గం పరశుమభ యదంచ దక్షిణాంగే వహంతం|
నాగంపాశం చఘంటాం వరడమరకయుతం చాంబికాంవామభాగే|
నానాలం కారయుక్తం స్ఫటిక మణినిభం పార్వతీశం నమామి||
⚜️🚩శివరాత్రికి "లింగోద్భవకాలమని" కూడా పేరు.
ఆ రోజు అర్థరాత్రి జ్యోతిర్మయమైన ఒక మహాలింగంగా శివుడు ఆవిర్భవించాడు.
🌹పరమేశ్వరుడు లోకానికి తన స్వరూప దర్శనం చేయించి జగత్తంతా దేదీప్యమానం చేసిన ఆ సమయంలో మనం నిద్రపోవడంలో అర్థం లేదు.
అందుకే శివరాత్రి జాగరణకు అంత ప్రాధాన్యం .
🌹ఆ రోజు అభిషేకాదులతో శివుని పూజించి, ఉపవాసముండి రోజంతా #శివ నామస్మరణంతో గడపడంలోని ఉద్దేశం
మన తనువునూ, మనసునూ కూడా శివార్పితం, శివాంకితం చేయడానికే.
🌹శివమంటే జ్ఞానమే.
జన్మ పరంపర శృంఖాలాలను తెంచి నిత్యానంద ప్రదమైన మోక్షాన్ని అందించే శక్తి ఆ జ్ఞానానికే ఉంది.
🌹శివరాత్రి నాడు పధ్నాలుగు లోకాలలోని పుణ్యతీర్థాలు 'బిల్వ' మూలంలో ఉంటాయనీ,
శివరాత్రి నాడు ఉపవసించి ఒక్క బిల్వమైన శివార్పణ చేసి తరించమని శాస్త్రం చెబుతోంది.
🌹కనీసం జన్మకొక్క శివరాత్రి అయినా చేయమని పెద్దలు చెబుతుంటారు.
సమస్త ప్రాణికోటిలో సూక్ష్మజ్యోతి రూపంలో ఉండే శివుడు భూమిపై పార్థివలింగంగా ఆర్చింపబడుతుంటాడు.
🌹శివరాత్రినాడు ఫలం, ఒక తోటకూర కట్ట అయినాసరే #శివార్పణం అని దానం చేయడం ముక్తిదాయకం.
కలిగినవారు వారి వారి శక్తి అనుసారం బంగారం, వెండి కుందులలో ఆవునేతి దీపం వెలిగించి ఓ పండితునికి సమర్పిస్తే అజ్ఞానంధకారం నశిస్తుందని పెద్దలవాక్కు.
🌹శివరాత్రినాడు ఉపవసించి త్రికరణ శుద్ధిగా శివుని ఆరాధిస్తే,
ఒక సంవత్సర కాలం నిత్యం శివార్చన చేసిన ఫలం కలుగుతుందని సాక్షాత్తు శంకరుడు బ్రహ్మదేవునికి చెప్పినట్లు పెద్దలవాక్కు.
🌹సేకరణ
ఓం నమః శివాయ....!!
హర హర మహాదేవ శంభో శంకర....!!
ఓం నమః శివాయ శివాయ నమః ఓం
ఓం నమః శివాయ శివాయ నమః ఓం
🔱🌺🔱🌺🔱🌺🔱🌺🔱
Comments
Post a Comment