🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏మహాభారతంలో కృష్ణుడు విదురుడు కధ

 🕉️⚜️🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏


⚜️🚩మనం తినే తిండి, పీల్చే గాలి... జీవించే విధానం మన ఆలోచనలపై ప్రభావం చూపిస్తుంది.

ఇదే విషయాన్నీ శ్రీకృష్ణుడు విదురుడికి తెలిపారు. 


🌹దుర్యోధనుడు ఒకసారి "యాభైఆరు" రకాల వంటలు వండించి శ్రీకృష్ణుని విందు భోజనానికి పిలిచాడు.

కాని కృష్ణుడు దుర్యోధనుని పిలుపును నిరాకరించి విదురుని యింటికి భోజనానికి వెళ్ళాడు.

కృష్ణుని చూడగానే విదురుని భార్య సంతోషంగా ఆహ్వానించి ఉపచారాలు చేసింది.

తినడానికి ఏమిటి పెట్టడం అని యోచించి,

ఆనంద సంభ్రమాలతో తొందరపాటు పడి,

అరటిపండు తొక్కవలిచి, పండు యివ్వడానికి బదులుగా తొక్కని అందించింది.

కృష్ణుడు దానినే తీసుకొని ఆనందంతో భుజించాడు.

ఇది చూసిన విదురుడు భార్యవైపు కోపంగా చూశాడు.

అప్పుడు కృష్ణుడు, “విదురా నేను ఆప్యాయతతో కూడిన ప్రేమకోసమే ఎదురు చూస్తున్నాను.

నిజమైన శ్రద్ధా భక్తులతో యిచ్చినది కాయైనా, పండైనా, ఆకైనా, నీరైనా, ఏది యిచ్చినా సంతోషంగా తీసుకుంటాను" అని అన్నాడు.


🌹మహాభారతంలో ప్రతి పాత్ర, వారు ఎదుర్కొన్న పరిస్థితులు, ఆలోచనా విధానం నేటి మానవుడికి మంచి చెడుల తేడాలను తెలియజేసే మార్గదర్శకాలు.


కృష్ణో రక్షతు నో జగత్‌ త్రయగురుః కృష్ణం నమస్యామ్యహం

కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మైనమః

కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం

కృష్ణే తిష్ఠతి సర్వమేత దఖలం హే కృష్ణ! రక్షస్వమామ్‌🙏

                  ⚜️🌹⚜️🌹⚜️🌹⚜️🌹⚜️


నమామి నారాయణ పాదపంకజం

కరోమి నారాయణ పూజనం సదా

వదామి నారాయణ నామ నిర్మలం

స్మరామి నారాయణ తత్త్వమవ్యయం


🌹శ్రీమన్నారాయణుని పాద పద్మములకు నమస్కరింతును. 

నారాయణుని సదా పూజింతును.

నారాయణుని నిర్మలమగు నామమును కీర్తింతును.

శాశ్వతమగు నారాయణ తత్వమును స్మరింతును.

                                🌺🌼🌺🌼🌺



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు

శ్రీ సూర్యం ప్రణమామ్యహం