నిరాడంబరత - సాయి సందేశం

 

🕉️⚜️🚩ఓo సాయి శ్రీసాయి జయ జయ సాయి

నిరాడంబరత - సాయి సందేశం

🌹సాయి ఎల్లప్పుడూ నిరాడంబరంగా ఉండమని చెప్పారు.
ఒక్కోసారి మనం దైవసేవలో కూడా ఆడంబరాలకు పోయి నిజమైన ప్రేమకు భక్తికి దూరం అవుతాము.

🌹సాయి సమర్ధుని కృపతో దాసగణు మహారాజ్ సత్పురుషుల కథలను రచించి, ఏ కానుకలు తీసుకోకుండా కీర్తనలు చేసి ప్రసిద్ధి చెందారు.

🌹ఒక సారి దాసగణు మహారాజ్ షిర్డీ గ్రామంలో హరికథా కీర్తన కోసమని శరీరంపై కోటు, కండువా, తలకు పాగా కట్టి బయలుదేరారు.

🌹బాబా ఆశీర్వాదం కోసమని వస్తే బాబా ఇలా అంటారు...
"వాహ్వా పెళ్ళికొడుకు లాగా అలంకరించుకుని, ఎక్కడకు వెళ్తున్నావు? అని అడుగుతారు.
కీర్తన చెప్పడానికి ఇవన్నీ అవసరమా!
వీనిని నా ఎదుట తీసివేయి అని చెప్తారు.

🌹అప్పటినుంచి దాసగణు మహారాజ్ ఒక్క పంచ కట్టుకొని చొక్కా లేకుండా, చేతిలో చిడతలు మరియు మేడలో మాల వేసుకొని హరికథ చెప్పేవారు.
బాబా ఈ నిరాడంబరతనే కోరుకునే వారు.

🌹మన ధ్యేయం అంతరంగ పరిశుద్ధత.
🌹 సేకరణ

🌹శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై🌹



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు