మార్గశిర శుక్ల షష్ఠి.. సుబ్రహ్మణ్య_షష్టి, సుబ్బారాయ షష్ఠి, స్కందషష్ఠి.
⚜️🕉️🚩ఓం శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యస్వామినే నమః🌹🙏 💥మార్గశిర శుక్ల షష్ఠి.. సుబ్రహ్మణ్య_షష్టి, సుబ్బారాయ షష్ఠి, స్కందషష్ఠి. కొలిచిన వారికి కొంగు బంగారమై, అభీష్టములు నెరవేర్చి, ఆయన పాదములను పట్టుకున్న వారికి ధర్మార్ధకామములతో పాటు మోక్షమును కూడా ఇవ్వగలిగిన వాడు, అవ్యాజకరుణామూర్తి, ఎప్పుడూ చిద్విలాసముతో చిరునవ్వులొలికిస్తూ ఉండే తండ్రి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. శివశక్తుల అనురాగమునకు ఫలము, జ్ఞాన పండిత అని కీర్తించబడ్డ వాడు, గజముఖానుజుడు, దేవసేనాపతి, వల్లీనాయకుడు శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. లోక సంరక్షణార్ధం తారకాసురున్ని వధించేందుకై దేవతల కోరిక మేరకు లోకనాయకుడు పరమశివుడు అంశతో "మార్గశిర శుద్దషష్టి" నాడు జన్మించారు సుబ్రహ్మణ్య స్వామి. 💥పూర్వము "తారకాసురుడు" అనే రాక్షసుడు శివుని మెప్పుకై తీవ్రముగా తపస్సు చేసి తపోఫలముగా.. బ్రహ్మగారిచే ఒక వరం పొందాడు. అది ఏమిటంటే, పరమశివుని వీర్యమునకు జన్మించిన వాడి చేతిలోనే తారకాసురుడు సంహరింపబడతాడు. శివుడు అంటే కామమును గెలిచిన వాడు, ఆయన ఎప్పుడు తనలో తానే రమిస్తూ ఆత్మస్థితిలో ఉంటాడు కదా, ఆయనకి పుత్రుడు ఎలా కలుగుతాడులే అను...