💥లలితా సహస్రనామములు.. (26, 27, 28, 29, 30) సంక్షిప్త వివరణ

 ⚜️🕉️🚩 ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏


💥లలితా సహస్రనామములు.. (26, 27, 28, 29, 30) సంక్షిప్త వివరణ.


చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృతా |

గేయచక్ర రథారూఢ మంత్రిణీ పరిసేవితా || 26 ||


💥చక్రరాజము అను పేరుగల రథములో అధిష్ఠించిన సమస్తమైన ఆయుధములచే అలంకరింపబడింది.


గేయచక్రము అని పేరుగల రథమును అధిష్ఠించిన మంత్రిణిచే అన్ని వైపుల నుండి సేవింపబడునది.


కిరిచక్ర రథారూఢ దండనాథా పురస్కృతా |

జ్వాలామాలిని కాక్షిప్త వహ్నిప్రాకార మధ్యగా || 27 ||


💥కిరిచక్రము అను పేరుగల రథమును ఎక్కిన దండము చేతియందు ఎల్లప్పుడూ వుండు దేవి ముందు ఉండి సేవింపబడునది.


జ్వాలా మాలిని అను పేరు గల నిత్యదేవత చేత వెదజల్లబడి నిర్మింపబడిన అగ్నిప్రాకారము యొక్క మధ్యనున్నది.


భండసైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షితా |

నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకా || 28 ||


💥భండాసురుణ్ణి, అతని సైన్యాన్ని సంహరించడానికి సంసిద్ధురాలైన తన శక్తి సైన్యాల విక్రమాన్ని చూచి ఆనందించింది.


నిత్యాదేవతల యొక్క పరులను ఆక్రమించుకోగల శక్తి, సామర్థ్య, ఉత్సాహాలను చూసి సంతోషించింది.


భండపుత్ర వధోద్యుక్త బాలావిక్రమ నందితా |

మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషితా || 29 ||


💥భండాసురుని పుత్రులను సంహరించుటకు సంసిద్ధురాలైన బాలాదేవి యొక్క విక్రమమునకు సంతసించునది.


మంత్రిణీ దేవి చేత చేయబడిన విషంగ వధను విని సంతసించింది.


విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్యనందితా |

కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరా || 30 ||


💥విశుక్రుని ప్రాణాలను హరించిన వారాహీదేవి యొక్క పరాక్రమానికి సంతోషించింది.


కామేశ్వరుని యొక్క ముఖమును చూచినంత మాత్రమున కల్పించబడిన గణపతిని గలది.

సేకరణ... 💐🙏

⚜️🌺⚜️🌺⚜️🌺⚜️🌺⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు

శ్రీ సూర్యం ప్రణమామ్యహం