నమశ్శివాయ.. సాంబాయ.. శాంతాయ.. పరమాత్మనే.

 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏


నమశ్శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే..

య ఇదం కీర్తయేన్నిత్యం శివసాయుజ్యమాప్నుయాత్


సాంబా... అని పిలిస్తే చాలు శివుడు వెంటనే కరిగిపోతాడు.

అమ్మతో ఉన్నవాడు అనగానే పరమేశ్వరుని దయ వేరు.


మహాభారతంలో ఉపమన్యు మహర్షి శ్రీకృష్ణ పరమాత్మకి శివదీక్ష ఇస్తూ...


నమశ్శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే..

య ఇదం కీర్తయేన్నిత్యం శివసాయుజ్యమాప్నుయాత్


-అనే మంత్రాన్ని ఉపదేశించారు.

ఇది శివపురాణంలో కూడా వస్తుంది.

ఇది చాలా గొప్ప మంత్రం.


నమశ్శివాయ.. సాంబాయ.. శాంతాయ.. పరమాత్మనే.

నాలుగు నామాలలో అత్యద్భుతమైన శక్తి ఉంది.


1) నమశ్శివాయ:


(శివాయనమః) మహాపంచాక్షరీ మంత్రం.

పంచాక్షరీ మంత్ర మహిమను శాస్త్రాలు పలు విధాలుగా వర్ణించాయి.

అ, ఉ, మ, బిందు, నాద అనే పంచ అవయువాలతో కూడిన ఓంకారం సూక్ష్మప్రణవం..

న, మ, శి, వా, య అనే ఐదు అక్షరాల శివమంత్రం స్ధూలప్రణవం.

పంచాక్షరీని పఠిస్తే పరమేశ్వర అనుగ్రహం సిద్ధం.


2) సాంబాయ:


అమ్మతో ఉన్నవాడు.. ఇలా పిలిస్తే చాలు శివుడు వెంటనే కరిగిపోతాడు. అమ్మతో ఉన్నవాడు అనగానే పరమేశ్వరుని దయ వేరు. అమ్మ అయ్యలతో కలిపి భావిస్తే కావలసినవి అన్ని సమృద్ధిగా పొందవచ్చును.


3) శాంతాయ:


ఆయనని తలంచుకొంటే వచ్చేది శాంతం.

జీవితానికి కావలసింది కూడా శాంతమే.

"ప్రపంచోప శమం శాంతం అద్వైతం మన్యంతే” అని ఉపనిషత్తు చెప్పింది.

అలజడులు అన్నీ అణగిన తరువాత వచ్చే శాంతం అది.


4) పరమాత్మనే_నమః:


చిట్ట చివరికి పొందవలసినది పరమాత్మ తత్త్వమే. అన్నిటిని కలిపి నాలుగు నామాలతో పొదిగిన మంత్రరాజం ఈ శ్లోకం.


ఈ శ్లోకాన్ని అర్థానుసంధానంగా మననం చేసినవారు శివసాయుజ్యాన్ని పొందుతారు అని ఉపమన్యు మహర్షే స్వయంగా చెప్పారు.

సేకరణ... 💐🙏



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు