💥ద్వాదశాత్మన్_నమోస్తుతే!!🙏
⚜️🕉️🚩 ఓం శ్రీ సూర్య నారాయణ స్వామినే నమః🌹🙏
నక్షత్ర గ్రహతారాణం అధిపో విశ్వభావనః |
తేజసా మపి తేజస్వీ ద్వాదశాత్మన్ నమోస్తుతే ||
-అంటూ సూర్యుడిని కీర్తిస్తున్నది "ఆదిత్య హృదయం"
💥ద్వాదశాత్మన్_నమోస్తుతే!!🙏
"బృహత్వాత్-బృమ్హణత్వాత్ ఇతి బ్రహ్మ"
అన్నింటి కంటె ఏది ఉత్కృష్టమైనదో అది బృహతి.
బృమ్హణము అంటే వ్యాపకత్వము.
ఏది అన్నిటి కంటె మహోత్కృష్టమైనదో, ఏది అన్నింటి యందు వ్యాపించి యుందో అదియే "బ్రహ్మము"
వేదము ఆదిత్యుని బ్రహ్మముగా కీర్తిస్తుంది.
సర్వజీవుల యందలి ఆత్మయే బ్రహ్మము.
అది జగతఃస్థుషః - తాను కదలకుండ ఉంటూ అన్నింటిని కదిలించే శక్తి గల స్థావర-జంగమాత్మకము.
ప్రత్యక్ష పరంజ్యోతి ఏడాది పొడవునా ఒకటే స్వరూప-స్వభావాలతో వెలుగులు-వేడి వెదజల్లుతుంటే మనము తట్టుకోగలమా? అసలు ఆ ఊహనే అమ్మో?
కొన్ని రోజులు చిగురులు-మరి కొన్ని రోజులు గుబురులు.
కొన్ని రోజులు ఎండలు-మరి కొన్ని రోజులు వానలు.
కొన్ని రోజులు వెన్నెల-మరి కొన్నిరోజులు శిశిరము.
కొన్ని జీవులు పుట్టుట-మరి కొన్ని జీవులు గిట్టుట.
కొంత మందికి బాల్యము-మరి కొంత మందికి భారము.
ఇవన్నీ కలిగించటానికే...
"ఏకం సత్ విప్రా బహుదా వదంతి" అన్నట్లు పన్నెడు రాశులలో పన్నెండు రూప-గుణములతో తన నుండి ప్రకటింపబడిన ఆరు శక్తులతో కలిసి, ఆరగింపులను అందిస్తున్నాడు తన అవ్యాజ కరుణతో...
💥ఈ పన్నెండుగురు ఆదిత్యులు విష్ణువుయొక్క సూర్యరూప విభూతులు.
సూర్యుని వెంబడించేవారిలో ఋషులు వేదత్రయాన్ని చదువుతుంటారు.
గంధర్వులు గానాన్ని చేస్తుంటారు.
అప్సరసలు నాట్యం చేస్తుంటారు.
నాగులు సూర్య రథాన్ని చుట్టుముట్టి ఉంటారు.
యక్షులు రథయోజన చేస్తారు.
రాక్షసులు రథాన్ని వెనుక వైపునుండి తోస్తుంటారు.
వాలఖిల్యులనే పేరుగల బ్రహ్మర్షులు అరువదివేలమంది రథం ముందు నిలచి సూర్య భగవానునికి అభిముఖులై త్రయీమూర్తిని ప్రస్తుతిస్తుంటారు.
జగత్కళ్యాణ జగన్నాథుని సేవాసందర్శనాసక్తుల మనోభీష్టము నెరవేరు గాక.
ధాతా మిత్రః ఆర్యమా శక్రో వరుణ స్త్వంశ ఏవచ
భగో వివస్వాన్ పూషా చ, సవితా దశమస్తథా
ఏకాదశస్తథా త్వష్టా, ద్వాదశో విష్ణురుచ్యతే
జఘన్యజస్తు సర్వేషా మాదిత్యానా గుణాధికః
-నామములతో ప్రకాశించు పరమాత్మ ప్రణతోస్మి!!🙏
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment