💥శ్రీ నృసింహ పంచామృత స్తోత్రం (శ్రీరామ కృతం)

 ⚜️🕉️🚩 ఓం శ్రీ లక్ష్మి నృసింహస్వామినే నమః 🌹🙏


💥భగవంతుడు సర్వాంతర్యామి.. జగత్తంతా నిండి, నిబిడీకృతమై ఉన్నాడని చాటి చెప్పడమే "శ్రీ నరసింహావతార" ఉద్దేశం.


తన పుత్రుడి నోట శత్రువు మాట విన్న హిరణ్య కశిపుడికి క్రోధం నిలువెల్లా పాము విషమై కమ్ముకోగా, తన గదను విసురుగా ఎత్తి, స్తంభానికి బలంగా తాటించాడు. 


స్తంభంలో నుంచి ఆవిర్భవించిన శ్రీ నృసింహుడు భీకరంగా హిరణ్య కశిపుని ఒడిసిపట్టి, తన ఒడిలో పెట్టుకొని, వజ్రాల్లాంటి గోళ్లతో చీల్చి చెండాడాడు.


ఆ సమయంలో స్వామి ముఖం పరమ భీకరంగా ఉంది. రక్తాన్ని పులుముకొన్న గోళ్లు సంధ్యాకాలపు ఎర్రదనాన్ని పోలి ఉన్నాయి.


హిరణ్యకశిపుడి కడుపు నుంచి వేరు చేసిన పేగులను కంఠమాలికలుగా వేసుకొన్నాడు.

ఆ ఉగ్రమూర్తి నిట్టూర్పులు పెనుగాలుల్లా వీచాయి. జూలు నుంచి రక్తం ధారలు కడుతోందని పురాణ వచనం.


మహాభాగవతుడైన ప్రహ్లాదుడు ఉగ్రమూర్తిగా దర్శనమిచ్చిన స్వామికి అంజలి ఘటించి సాష్టాంగ ప్రణామం చేశాడు. పలువిధాల స్తుతించాడు.

స్వామి ప్రసన్నుడై శాంతించాడు.


నరసింహుడు ఉగ్రరూపుడైనా భక్తుల మనోభీష్టాలు నెరవేర్చడంలో కరుణా సముద్రుడు.

🏵️🌼🏵️🌼🏵️


త్రేతాయుగమున శ్రీరాముల వారు దండకారణ్యమున సీతాన్వేషణకై వెళ్ళినప్పుడు అహోబిల నరసింహస్వామిని దర్శించి "నృసింహ పంచామృత స్తోత్రం"తో ఆరాధించినట్లు పురాణం చెబుతుంది.


శ్రీరాముడు అహోబిలంలోని నరసింహుని ఆలయాన్ని సందర్శించినప్పుడు ఈ ప్రార్థనను రచించాడు.

ప్రతి చరణం అమృతం లాంటిది కనుక దానిని "#పంచామృతం" అంటారు.


💥శ్రీ నృసింహ పంచామృత స్తోత్రం (శ్రీరామ కృతం)


అహోబిలం నారసింహం గత్వా రామః

ప్రతాపవాన్ |

నమస్కృత్వా శ్రీనృసింహం అస్తాషీత్ కమలాపతిమ్ || 1 ||


గోవింద కేశవ జనార్ధన వాసుదేవ

విశ్వేశ విశ్వ మధుసూదన విశ్వరూప |

శ్రీపద్మనాభ పురుషోత్తమ పుష్కరాక్ష

నారాయణాచ్యుత నృసింహ నమో నమస్తే || 2 ||


దేవాః సమస్తాః ఖలు యోగిముఖ్యాః

గంధర్వ విద్యాధర కిన్నరాశ్చ |

యత్పాదమూలం సతతం నమంతి

తం నారసింహం శరణం గతోస్మి || 3 ||


వేదాన్ సమస్తాన్ ఖలు శాస్త్రగర్భాన్

విద్యాబలే కీర్తిమతీం చ లక్ష్మీమ్ |

యస్య ప్రసాదాత్ సతతం లభంతే

తం నారసింహం శరణం గతోస్మి || 4 ||


బ్రహ్మా శివస్త్వం పురుషోత్తమశ్చ

నారాయణో సౌ మరుతాం పతిశ్చ |

చంద్రార్క వాయ్వగ్ని మరుద్గణాశ్చ

త్వమేవ తం త్వాం సతతం నతోస్మి || 5 ||


స్వప్నే పి నిత్యం జగతాం త్రయాణాం

స్రష్టా చ హంతా విభురప్రమేయః |

త్రాతా త్వమేకస్త్రివిధో విభిన్నః

తం త్వాం నృసింహం సతతం నతోస్మి || 6 ||


ఇతి స్తుత్వా రఘుశ్రేష్ఠః పూజయామాస తం

విభుమ్ |

పుష్పవృష్టిః పపాతాశు తస్య దేవస్య మూర్ధని |

సాధు సాధ్వితి తం ప్రోచుః దేవా ఋషిగణైః సహ || 7 ||


దేవాః ఊచుః |

రాఘవేణ కృతం స్తోత్రం పంచామృతమనుత్తమమ్ |

పఠంతి యే ద్విజవరాస్తేషాం స్వర్గస్తు శాశ్వతః || 8 ||


ఇతి శ్రీరామ కృత శ్రీ నృసింహ పంచామృత స్తోత్రమ్ |

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు