💥మహాదేవుడు🔱🌹

 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏


💥మహాదేవుడు🔱🌹


శివనామం గంగానది. విభూతి యమున. రుద్రాక్ష సరస్వతి... త్రివేణిసంగమ తత్వం అని సాక్షాత్‌ బ్రహ్మదేవుడు అన్నారు.


అందుకే శివ అంటే పరమేశ్వరుడు.. శివా అంటే పార్వతి. శివశివా అంటే చాలు జీవితం జీవనం ధన్యమవుతుంది.


"శివను గ్రహేణ జ్ఞాన ప్రాప్తి:" అన్నారు.

శివుని అనుగ్రహం కల్గితే చాలు జ్ఞాన ప్రాప్తి కలుగుతుంది.


మది నిండా ‘మహాదేవ శంభో శంకర’ అని శివ మహాదేవుని నింపుకోవడమే అనిర్వచనీయ ఆనందం.


మహాదేవుని "విభూతి" ధరించని లలాటం.. "ఈశ్వరార్చన" చేయని జన్మం.. శివాలయం లేని ఊరు నింద్యములు, నిష్ప్రయోజనము అని జాబోలినోపనిషత్తు తెలియజేస్తుంది. 


"విభూతి ధారణ" జ్ఞానైశ్వర్యానికి నిదర్శనం.

ఈ దృశ్యమాన జగతిలో ప్రతి వస్తువు ఏనాటికైనా స్మశానంలో బూడిదే అని శివుడు మనకు తెలుపుతున్నాడు.


💥విశ్వమంతా పంచుకుని ఉండే శుద్దచైతన్య పరతత్వమే శివం.

అఖండమైన ఈ పరమ శివతత్వం "పంచభూతాలు"గా విడిపడుతోంది.

పంచభూతాలతో నిర్మాణమైన ప్రకృతిగా భాసిల్లుతోంది. అనేక ప్రాణులుగా బయటకు వ్యక్తమవుతోంది.


అంటే విడిగా చూస్తే అనేకంగా కనబడుతోంది.

వివరంగా చూడగల్గితే అది ఏకాకృతిగా తెలుస్తోంది. అనంత కోటి ప్రాణులను తనలో ఇముడ్చుకోవడానికి వెలిసిన ఈ చైతన్య తేజో స్వరూపాన్ని ఇలా అని ఊహించడానికే ఎవరికి సాధ్యంకాదు.


బ్రహ్మ, విష్ణువులే తుది మొదల్ని తెలుసుకోలేకపోయారే, చివరకు "నమ స్సకల నాధాయ నమోస్తు సకలాత్మనే” అని అగ్ని లింగానికి భక్తితో సాగిలపడ్డారు. 


అపరిమితమైన ఇటువంటి భక్తి విషయాలకే పట్టుబడే అమూర్త భావనాకారమిది. 

వర్ణించడానికి స్తుతించడానికి మాటలు చాలవు.

ఏ భావనా సరిపోదు.


కనుకనే సాక్షాత్తు శివుడే హరి బ్రహ్మాదులకు తన తత్వాన్ని తెలియజెప్పాడు.

ఈ వాక్కులే ఈశ్వ రాగమములై రూపు దిద్దుకున్నాయి. వాటి నుండి వచ్చిన పురాణాలు ఇతిహాసములు శివ మహిమను లీలా వైభవాన్ని విశేషంగా వర్ణించాయి.


సర్వ గ్రహ పీడనలను నిరోధించి శుభాలనిచ్చే పరమ శివుడి స్వరూపం చూసిన వారి జన్మను పావనం చేస్తుంది.


💥పంచాక్షరీ వైభవం: 🔱ఓం నమఃశివాయ🔱 


లౌకిక బంధాల మాయలో చిక్కుకుని విల విల లాడుతున్న మనిషిని ఆ మాయ నుంచి విడిపించే తారక మంత్రం "ఓం నమః శివాయ"

ఆత్మను పరమాత్మ వైపు చేర్చే రాజహంస ఈ మంత్రం. 


"నమఃశివాయ" అంటే శివునకు నమస్కారం అని అర్థం.

శివ అంటే పవిత్రుడు అనే అర్థం.

ఈ అర్థాన్ని ఆధారంగా తీసుకుంటే "నమఃశివాయ" అంటే 'పవిత్రతకు నమస్కారం. లేదా పవిత్రతకు నమస్కరి స్తున్నాను’ అని అర్ధం ఏర్పడుతుంది.


మరొక కోణంలో ఆలోచిస్తే ఏ చైతన్యమైతే విశ్వ వ్యాపితమై ఉంటుందో.. ఏ చైతన్యం సమస్త ప్రపంచా న్ని తనలో లయం చేసుకుంటుందో ఆ చైతన్యం యొక్క పేరు శివ. ఆ రూపం శివ స్వరూపం.


సర్వ జీవాత్మల్లో సకల విశ్వంలో నిండి ఉండే చైతన్య స్వరూపుడైన శివునకు నమస్కారం.. అని పంచాక్షరీ మంత్రానికి అర్థం చెప్పుకోవచ్చు.


💥"పంచాక్షరీ"లో నకారం బ్రహ్మను, మకారం విష్ణువును శికారం రుద్రుడిని వకారం మహేశ్వరుడిని యకారం సదాశివుని సూచిస్తాయి.


ఈవిధంగా చూస్తే పంచాక్షరీ మంత్రం శివ కేశవ అభేదాత్మకమైన అద్వైత భావనకు ప్రతీకగా నిలుస్తుంది.


అనంతమైన విశ్వాన్ని పరమేశ్వరుడు తన ఐదు ముఖాలతో ఏవిధంగా పరిశీలిస్తూ పర్యవేక్షిస్తూ తానై నిండి ఉంటాడో..


ఆ అయిదు ముఖాల సంకేతాక్షరాలతో ఏర్పడిన శివ పంచాక్షరి ఉపాసన చేస్తే అనంతమైన శివతత్వాన్ని ఉపాసన చేసినట్లే అవుతుంది.


"నమఃశివాయ" అనే పంచాక్షరి మంత్రంలో నమ: అనే పదం జీవాత్మని, శివ అనే పదం పరమాత్మను సూచిస్తాయి. అయ అనే పదానికి ఐక్యం చెందడం అనే అర్థం ఉంది.


మదినిండా మహదేవుని స్మరిస్తూ శివానుగ్రహానికి పాత్రులవుదాం.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు