💥గోవింద నామ మహిమ..

 ⚜️🕉️🚩 ఓం నమో వేంకటేశాయ 🌹🙏


శరణాగతవత్సల గోవిందా కరుణాసాగర గోవిందా!

గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా!!


💥గోవింద నామ మహిమ..


'గోవింద’ అనే మూడక్షరాల నామం శ్రీమన్నారాయణుని అనుగ్రహాన్ని సులభంగా, నిశ్చయంగా సిద్ధింపజేసే ఒక మహామంత్రం.


అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆపద్బాంధవుడు, ఆశ్రిత రక్షకుడైన శ్రీహరికి వేలనామాలు ఉన్నాయి. 


‘నారాయణ’ వంటి అద్భుత నామాలు ఎన్ని ఉన్నా, శరణు కోరేవారికి కొండంత అండగా, భక్తులను ఆపదల నుంచి సులభంగా గట్టెక్కించే సరళతరమైన విష్ణునామం ‘గోవింద’ మాత్రమే.


💥మూడక్షరాల గోవిందనామం చేతనే ఏకంగా మోక్షాన్ని పొందిన '#క్షత్రబంధువు’ అనే  ఆయన కథ ఆసక్తికరం.


సూర్యవంశంలో పుట్టిన రాజకుమారుడే ‘క్షత్రబంధువు’గా ప్రసిద్ధి పొందాడు.


ఇతడు బాల్యం నుంచే హింసా ప్రవృత్తిని కలిగి మూగజీవాలను, చిన్నపిల్లలను చంపేవాడు.

దీంతో ఇతణ్ణి మహారాజు ‘రాజ్య బహిష్కారం’ చేసి సైనికుల ద్వారా అరణ్యానికి పంపాడు.

అక్కడకూడా ‘క్షత్రబంధువు’ మహర్షులను హింసిస్తూ, జంతువులను వధిస్తూ ఆఖరికి నరమాంసాన్నీ తినేవాడు.


ఒకనాడు ఒక మునీశ్వరుడు ఓ సరస్సులోకి దప్పికతో దిగబోయి కాలు జారి నీటిలో పడ్డాడు.

క్షత్రబంధువు దూరం నుంచే దీన్ని గమనించి వెంటనే ఆ సరస్సులోకి దూకి మునిని ఒడ్డుకు చేర్చాడు.

స్పృహలోకి వచ్చేందుకు తగిన ఉపచారాలన్నీ చేశాడు. 


ఆ మునీశ్వరుడు యోగశక్తితో ‘క్షత్రబంధువు’ జన్మ వృత్తాంతం, జీవనశైలి, స్వభావాలను తెలుసుకొని, తన ప్రాణాలను కాపాడినందుకు ప్రత్యుపకారం చేయాలనుకున్నాడు.


మూడక్షరాల ‘గోవింద నామాన్ని పలుకమని’ ప్రబోధించాడు.

తనకు అంత సమయం, ఆసక్తి లేవన్నాడు క్షత్రబంధువు. 


‘నాయనా! నువు కేవలం తుమ్మినపుడో, దగ్గినప్పుడో ఈ గోవింద నామాన్ని పలికినా.. చాలు’ అన్నాడు.


అంతేనా, అనుకొని, చివరికి రోజంతా అదే ధ్యాసతో, నిరంతర గోవింద నామస్మరణలో మునిగిపోయి, భగవదనుగ్రహాన్నే పొంది తరించాడు.


💥తిరుమల కొండపై, దేవాలయాల్లో, గృహాలలో జరిపే అర్చనలలో, భజనలలో భక్తిశ్రద్ధలతో భక్తులు ఉచ్చరించే ‘గోవింద’ నామం పట్ల మనందరం కూడా ప్రీతిని ఏర్పరచుకుందాం.


గృహాలలోనూ చక్కగా ‘గోవింద’నామం పలికే విషయంలో ఎటువంటి సందేహాలకు, అపోహలకు లోనుకావద్దు. 


అత్యంత భక్తి ప్రపత్తులతో ‘గోవింద’నామాన్ని నిరంతరం, మనసా వాచా కర్మణా స్మరిద్దాం.

భక్త సులభుడైన పరమాత్ముని అనుగ్రహాన్ని పొందుదాం.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

ఓం శ్రీ లక్ష్మి నృసింహస్వామినే నమః 🌹🙏

వైశాఖ అమావాస్య శని జయంతి.

💥సింహాచల చందనోత్సవం💥