💥శ్రీ కాలభైరవ అష్టమి.. (కాలాష్టమి):
⚜️🕉️🚩ఓం కాలభైరవాయ నమః🌹🙏
💥శ్రీ కాలభైరవ అష్టమి.. (కాలాష్టమి):
కార్తీక మాసంలో కృష్ణ పక్షం 'అష్టమి' తిథి అనగా.. పూర్ణిమ తరువాత వచ్చే ఎనిమిదవ రోజు కాల భైరవుడిని పూజించడానికి ఉత్తమమైన రోజు అని నమ్ముతారు.
పరమేశ్వరుని పరిపూర్ణ అవతారమే "#కాలభైరవుడు"
బ్రహ్మ విష్ణువులను ఆవహించిన అజ్ఞానాన్ని తొలగించడానికి రుద్రుడి భృకుటిలోంచి పుట్టిన మహాశక్తిమంతుడు దుష్టశిక్షకుడిగా, గ్రహపీడల్ని తొలగించే దేవుడిగా పూజలు అందుకుంటున్నాడు.
కాశీ విశ్వనాథస్వామి కొలువై యున్న వారణాసికి కాలభైరవుడే క్షేత్ర పాలకుడు.
భైరవ: పూర్ణ రూపోహ శంకరస్య పరాత్మన:
మూఢాస్తంవైనజానంతి మోహతాశ్శివమాయయా
-అని పేర్కొనబడింది.
దేవరాజ-సేవ్యమాన-పావనాంఘ్రి-పంకజం
వ్యాళయజ్ఞ-సూత్రమిందు-శేఖరం కృపాకరమ్ ।
నారదాది-యోగిబృంద-వందితం దిగంబరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥
💥కాలాష్టమి పూజా విధానం:
ఈ రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి.
ఆ తర్వాత భైరవ దేవుడిని పూజించండి.
కాలాష్టమి రోజున, భైరవ దేవ్‌తో పాటు, నల్ల కుక్కను పూజించే ఆచారం కూడా చెప్పబడింది.
పూజానంతరం కాలభైరవుని కథ వినడం వల్ల కూడా మేలు జరుగుతుంది.
ఈ రోజున, కాల భైరవ మంత్రం "ఓం కాలభైరవాయ నమః" జపించడం ఫలవంతంగా పరిగణించబడుతుంది.
ఈ రోజు పేదలకు అన్నదానం, వస్త్రదానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. అంతే కాకుండా కాలాష్టమి రోజున గుడికి వెళ్లి కాలభైరవుని ముందు నూనె దీపం వెలిగించాలి.
💥కాల-భైరవుడు శివుని స్వరూపం, కాబట్టి ఈ రోజున ఎవరు కాలభైరవుడిని నిజమైన భక్తితో పూజిస్తారో, శివుడు అతనికి ఆనందం , శ్రేయస్సును ప్రసాదిస్తాడని చెబుతారు.
భైరవుడిని పూజిస్తే గ్రహ దోషాలూ, అపమృత్యు గండాలూ తొలగిపోతాయనీ ఆయురారో గ్యాలు సిద్ధిస్తాయనీ మంత్ర శాస్త్రం చెబుతోంది.
అసితాంగ భైరవుడూ, రురు భైరవుడూ, చండ భైరవుడూ, క్రోధ భైరవు డూ, ఉన్మత్త భైరవుడూ, కపాల భైరవుడూ, భీషణ భైరవుడూ, సంహార భైరవుడూ... ఇలా ఎన్నో రూపాల్ని ధరించిన కాలభైరవుడుని ఒక్కో రూపాన్ని ఉపాసిస్తే, మనలోని ఒక్కో దుర్గుణం తొలగిపోతుందని సాధకుల విశ్వాసం.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment