💥సౌర పురాణంలో "మనుమహారాజు" కృత "సూర్య స్తుతి"

 ⚜️🕉️🚩 ఓం శ్రీ సూర్య నారాయణ స్వామినే నమః 🌹🙏


💥సౌర పురాణంలో "మనుమహారాజు" కృత "సూర్య స్తుతి" ఇది.


నమో నమో వరేణ్యాయ వరదాయాంశుమాలినే |

జ్యోతిర్మయ నమస్తుభ్యం అనంతా యాజితాయతే || 1 ||


త్రిలోకచక్షుషె తుభ్యం త్రిగుణా యామృతాయా చ |

నమో ధర్మాయ హంసాయ జగజ్జననహేతవే || 2 ||


నరనారీ శరీరాయ నమో మీడుష్టమాయ తే |

ప్రజ్ఞానా యాఖిలేశాయ సప్తాశ్వాయ త్రిమూర్తయే || ౩ ||


నమో వ్యాహృతిరూపాయ త్రిలక్షాయశుగామినే |

హర్యశ్వాయ నమస్తుభ్యం నమో హరితబాహవే || 4 ||


ఏకలక్షవిలక్షాయ బహులక్షాయ దండినే |

ఏక సంస్థ ద్విసంస్థాయ బహు సంస్థాయ తే నమః || 5 ||


శక్తి త్రయాయ శుక్లాయ రవయే పరమేష్టినే |

త్వం శివ స్త్వం హరి ర్దేవ త్వం బ్రహ్మ త్వం దివస్పతి : || 6 ||


త్వాం మృతే పరమాత్మానం న తత్పశ్యామి దైవతం ||


ఇతి శ్రీ సౌరపురాణే మనుకృత సూర్యస్తోత్రం సంపూర్ణం.


💥#భావం:


అసంఖ్యాక కిరణములతో సంశోభితమయ్యే ఓ అంశుమాలిన్! వరములు ప్రదానం చేయటంలో నువ్వే సర్వసమర్థునివి.

హే జ్యోతిస్వరూపా! నీ స్వరూపం అంతములేనిది.

నీ నామములు అనంతములు.


త్రిలోక చక్షువు నీవే! త్రిగుణాత్మకమైన నీ రూపము, అమృతమయము. జగత్సృష్టికర్తవు నీవే! ధర్మస్వరూపా! హంస అని కూడా పిలువబడే నీవు, సప్తాశ్వయుతమైన రథముపై త్రిలోకాలలోనూ సంచరిస్తూ ఉంటావు!


ఓ జ్ఞానభాండారమా! అఖిలేశునిగానూ, శివ స్వరూపునిగానూ, సతత గతిశీలునిగానూ, వినతులందుకునే భగవన్! ఏకలక్ష, విలక్ష, బహులక్ష, ఏకసంస్థ, ద్విసంస్థ, బహుసంస్థాది నామాలన్నీ నీ పర్యాయ పదాలే!


పరమేష్టి సంజ్ఞతో సుశోభితుడవైన హే భగవన్! నీలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల మూడు శక్తులూ నెలకొని వున్నాయి.


ఓంకార, వషట్కార, స్వాహా, స్వధా స్వరూపమైన నీవే పరమాత్మవు.

సదా నిన్నే నేను శరణు వేడుతాను.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

ఓం శ్రీ లక్ష్మి నృసింహస్వామినే నమః 🌹🙏

వైశాఖ అమావాస్య శని జయంతి.

💥సింహాచల చందనోత్సవం💥