Posts

Showing posts from May, 2023

వైశాఖ శుద్ధ చతుర్దశి "నృసింహ జయంతి"

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నృసింహ దేవాయ🌹🙏 💥వైశాఖ శుద్ధ చతుర్దశి "నృసింహ జయంతి " “వైశాఖశుక్లపక్షేతు చరుర్దశ్యాం సమాచరేత్, మజ్జన్మసంభవం పుణ్యం వ్రతం పాపప్రణాశనమ్” - అని నరసింహుడు ప్రహ్లాదునితో పేర్కొన్నట్లుగా నృసింహ పురాణములో ఉంది. 🍁🍁🍁🍁🍁 💥 శ్రీ నృసింహ స్తంభావిర్భావ స్తోత్రం సహస్రభాస్కరస్ఫురత్ప్రభాక్షదుర్నిరీక్షణం ప్రభగ్నకౄరకృద్ధిరణ్యకశ్యపోరురస్థలమ్ | అజస్తృజాండకర్పరప్రభగ్నరౌద్రగర్జనం ఉదగ్రనిగ్రహాగ్రహోగ్రవిగ్రహాకృతిం భజే || 1 || స్వయంభుశంభుజంభజిత్ప్రముఖ్యదివ్యసంభ్రమం ద్విజృంభమధ్యదుత్కటోగ్రదైత్యకుంభకుంభినిన్ | అనర్గళాట్టహాసనిస్పృహాష్టదిగ్గజార్భటిన్ యుగాంతిమాంతమత్కృతాంతధిక్కృతాంతకం భజే || 2 || జగజ్వలద్దహద్గ్రసత్ప్రహస్ఫురన్ముఖార్భటిం మహద్భయద్భవద్దహగ్రసల్లసత్కృతాకృతిమ్ | హిరణ్యకశ్యపోసహస్రసంహరత్సమర్థకృ- -న్ముహుర్ముహుర్ముహుర్గళధ్వనన్నృసింహ రక్ష మామ్ || 3 || దరిద్రదేవి దుష్టి దృష్టి దుఃఖ దుర్భరం హరం నవగ్రహోగ్రవక్రదోషణాదివ్యాధి నిగ్రహమ్ | పరౌషధాదిమన్త్రయన్త్రతన్త్రకృత్రిమంహనం అకాలమృత్యుమృత్యుమృత్యుముగ్రమూర్తిణం భజే || 4 || జయత్వవక్రవిక్రమక్రమక్రమక్రియాహరం స్ఫురత్సహస్రవిస్ఫులింగభాస్కరప్రభా...

💥వైశాఖ శుక్ల చతుర్దశి "నరసింహ జయంతి"

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ లక్ష్మి నృసింహ స్వామినే నమః 🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ 💥 వైశాఖ శుక్ల చతుర్దశి "నరసింహ జయంతి" ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖమ్‌ నృసింహం భీషణం భద్రం మృత్యోర్‌ మృత్యుం నమామ్యహం !! వైశాఖ శుక్ల చతుర్దశి నాడు శ్రీ హరి నరకేసరిగా అవతరించారు. పరమపావనమైన ఈ తిథిని "నరసింహ జయంతి"గా చేసుకోవడం సంప్రదాయం. భాగవతం ఏడో స్కందంలో భక్తుడి మాటకు కట్టుబడి శ్రీ మహావిష్ణువు నరసింహుడిగా ఆవిర్భవించిన ఘట్టం అద్భుతం. 🍁🍁🍁🍁🍁 🌹భగవత్‌ తత్తాన్ని సంపూర్ణంగా తెలుసుకున్న వాడు ప్రహ్లాదుడు. తాను నమ్మిన దైవం సృష్టిలో అణువణువునా ఉన్నాడని త్రికరణ శుద్ధిగా నమ్మిన వాడు కూడా!  అందుకే, తండ్రి ‘ఏడిరా నీ శ్రీహరి. ఈ స్తంభంలో చూపగలవా?’ అని గద్దించి ప్రశ్నించినప్పుడు.. తొట్రుపాటుకు గురి కాకుండా, ‘సందేహమే లేద’న్నాడు. గదా ఘాతంతో స్తంభాన్ని కూల్చాడు హిరణ్యకశిపుడు. భీకర రూపంతో నరసింహస్వామి అవతరించాడు. స్తంభోద్భవుడైన ఆ నరసింహుడు అంత ఆవేశంలోనూ బ్రహ్మదేవుడు ఇచ్చిన వరాలను నిష్ఫలం చేయలేదు. ఆయనిచ్చిన వరాల్లో లేని రూపాన్ని పొందాడు. తన తెలివితేటలతో మృత్యువును జయించాలని తలచిన రాక్షసుడి ఎదుట మృత్యువై నిలి...

💥గం గణపతే నమో నమ - ముత్తయ్య భాగవతార్ కృతి

Image
 ⚜️🕉️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ 💥గం గణపతే నమో నమ - ముత్తయ్య భాగవతార్ కృతి గం గణపతే నమో నమ! శంకరి తనయా నమో నమో! అంకుశధర! మంగళకర! పంకజ చరణా! వారణ! పంకజాసనాది వందిత! భక్తార్తి హరణ!ముదిత! కుంకుమాప! గుణ నిధే! హరికేశ కుమార! మందార! 🌹భావం: సమస్త విఘ్నములను అణచే శక్తిని కలిగిన బీజాక్షరం గం. ఆ "గం" బీజాక్షరముగా కలిగిన పార్వతీదేవి తనయుడైన గణపతికి వందనములు. అంకుశము ఆయుధముగా ధరించి, కమలముల వంటి చరణములు కలిగి, సమస్త శుభములు కలిగించే గజముఖునికి వందనములు. బ్రహ్మాది దేవతలచే పూజించబడే, భక్తుల ఆర్తిని హరించి ఆనందాన్ని కలిగించే, కుంకుమ చేత పూజించబడిన, సుగుణములకు నిధియైన, శివుని కుమారుడు, భక్తుల పాలిట కల్పవృక్షమైన గణపతికి వందనములు. 🍁🍁🍁🍁🍁 ఏదైనా కార్యాన్ని ప్రారంభించేముందు... భగవన్నామ స్మరణ మనకు విజయాలను సంప్రాప్తింపజేసేలా చేస్తుంది.... అందునా విఘ్ననాయకుడైన వినాయకుడి... "శ్రీ గణనాయకాష్టకం" అన్ని విజయాలకు దగ్గరయ్యేలా చేస్తుంది.. అందుకే ఏదైనా కార్యం తలపెట్టేటపుడు శ్రీ గణనాయక అష్టకాన్ని పఠించడం మంచిది.... 💥గణనాయకాష్టకం... ఏకదంతం మహాకాయం తప్తకాంచనసన్నిభమ్ | లంబోదరం విశాలా...

💥శ్రీ స్కంద స్తోత్రమ్: (మహాభారతం)

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః 🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ 💥శ్రీ స్కంద స్తోత్రమ్: (మహాభారతం) మార్కండేయ ఉవాచ | ఆగ్నేయశ్చైవ స్కందశ్చ దీప్తకీర్తిరనామయః | మయూరకేతుర్ధర్మాత్మా భూతేశో మహిషార్దనః || 1 || కామజిత్కామదః కాంతః సత్యవాగ్భువనేశ్వరః | శిశుః శీఘ్రః శుచిశ్చండో దీప్తవర్ణః శుభాననః || 2 || అమోఘస్త్వనఘో రౌద్రః ప్రియశ్చంద్రాననస్తథా | దీప్తశక్తిః ప్రశాంతాత్మా భద్రకృత్కూటమోహనః || ౩ || షష్ఠీప్రియశ్చ ధర్మాత్మా పవిత్రో మాతృవత్సలః | కన్యాభర్తా విభక్తశ్చ స్వాహేయో రేవతీసుతః || 4 || ప్రభుర్నేతా విశాఖశ్చ నైగమేయః సుదుశ్చరః | సువ్రతో లలితశ్చైవ బాలక్రీడనకప్రియః || 5 || ఖచారీ బ్రహ్మచారీ చ శూరః శరవణోద్భవః | విశ్వామిత్రప్రియశ్చైవ దేవసేనాప్రియస్తథా | వాసుదేవప్రియశ్చైవ ప్రియః ప్రియకృదేవ తు || 6 || నామాన్యేతాని దివ్యాని కార్తికేయస్య యః పఠేత్ | స్వర్గం కీర్తిం ధనం చైవ స లభేన్నాత్ర సంశయః || 7 || స్తోష్యామి దేవైరృషిభిశ్చ జుష్టం శక్త్యా గుహం నామభిరప్రమేయమ్ | షడాననం శక్తిధరం సువీరం నిబోధ చైతాని కురుప్రవీర || 8 || బ్రహ్మణ్యో వై బ్రహ్మజో బ్రహ్మవిచ్చ బ్రహ్మేశయో బ్రహ్మవతాం వరిష్ఠః | బ్రహ్...

💥మనలోని అనంత చైతన్యమే శ్రీ ఆంజనేయం

Image
 ⚜️🕉️🚩 శ్రీ ఆంజనేయం 🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ అతులిత బలధామం స్వర్ణశైలభ దేహం దనుజవనక్రుశానుం ఙ్ఞానినాం అగ్రగణ్యం | సకలగుణ నిధానం వానరాణాం అధీశం రఘుపతిప్రియభక్తం వాతజాతం నమామి || 🌹భావము:- ఎవరికీ సమానము కాని శక్తిని సొంతం చేసుకొని, బంగారు వర్ణము కలిగిన కొండంత శరీరం, భూత ప్రేత పిశాచాలకు ఆవేశంతో ఉన్న అగ్నిపర్వతంలా కనబడి, ఙ్ఞానులలో అగ్రగణ్యుడు, అన్ని మంచి లక్షణాలు కలిగి ఉండి, వానర మూకకు అధిపతి అయి శ్రీ రామచంద్రమూర్తికి నమ్మిన బంటు అయిన వాయుపుత్రుడైన హనుమంతునికి నమస్కారాలు. 🍁🍁🍁🍁🍁 💥మనలోని అనంత చైతన్యమే శ్రీ ఆంజనేయం. రామాయణంలో వానర జంట అయిన కేసరి, అంజన పుత్రుడిగా దర్శనమిచ్చే హనుమంతుడు నిజానికి ప్రతివ్యక్తిలో నిద్రాణమైన ఆధ్యాత్మిక శక్తికి ప్రతీక.  శివపార్వతుల శృంగార క్రీడలో ఉత్తేజితమైన అద్భుత శక్తి, వాయు సంగృహీతమై అంజని గర్భం ద్వారా ఆంజనేయుడి రూపంలో అవతరించింది. శివాంశ అయిన హనుమంతుడు బ్రహ్మ వల్ల వరాలు పొందడం, విష్ణువును సేవించడం వల్ల త్రిమూర్తిత్వ భావనకు ప్రతీకగా కనిపిస్తాడు. బుద్ధిని ప్రచోదన చేయగలిగిన చైతన్యానికి అధిదేవత అయిన సూర్యభగవానుడి దగ్గర సకల విద్యలూ అభ్యసించాడు. 💥#తాత్వికంగా...

💥శివాలయంలో పరమేశ్వరుని దర్శనం..

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 🔱 హర హర మహాదేవ శంభో శంకర 🔱 🏵️🌼🏵️🌼🏵️ నమః పార్వతి పతయే హర హర హర హర శంభో మహాదేవ హర హర మహాదేవ హర హర హర హర మహాదేవ శివ శివ శివ శివ సదాశివ మహాదేవ సదాశివ సదాశివ మహాదేవ || 💥 శివాలయంలో పరమేశ్వరుని దర్శనం.. శివాలయంలో పరమేశ్వరుని దర్శిస్తే ముక్కోటి దేవుళ్ళని దర్శించినట్టే. సాధారణ దేవాలయాల్లో మనం దర్శనం చేసుకునే విధానం, శివాలయంలో విధానం వేరు వేరుగా ఉంటుంది. అందుకే, శివాలయం దర్శిస్తే అందరు దేవుళ్ళని దర్శించినట్టే అని చెప్పబడింది. శివాలయంలో ఉండే శివలింగానికి మొత్తం 5 ముఖాలు ఉంటాయి. అందులో నాలుగు ముఖాలు నాలుగు దిక్కులను చూస్తుంటే, ఐదవ ముఖం ఊర్ధ్వముఖమై (పైకి/ఆకాశంవైపు చూస్తూ) ఉంటుంది. 5 ముఖాల్ని 5 పేర్లు నిర్ధేశించబడ్డాయి. అందుకే శివాలయంలో ఏ దిక్కున కూర్చుని అయినా పూజ చేయవచ్చు అంటారు. శివాగమనంలో చెప్పినట్లుగా మనం తప్పకుండా శివాలయంలో ఏ దిక్కువైపు వెళితే ఆ శివలింగం పేరుని స్మరించాలి. ముఖాలు మనకు 5 ఫలితాలని కలుగజేస్తాయి. ఆ 5 ముఖాలలో నుండే సృష్టి, స్థితి, లయ, తిరోదానము, అనుగ్రహము యివ్వబడతాయి. 🍁🍁🍁🍁🍁 🌹శివాలయాలు అన్నింటిలో అత్యంత మహిమ కలిగినది. కోరిన కోర్కెలు వెంటన...

🌹॥ శ్రీ పరమేశ్వర స్తుతిః (వసిష్ఠ కృతమ్) ॥🌹

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹 🔱 హర హర మహాదేవ శంభో శంకర 🔱 🏵️🌼🏵️🌼🏵️ 🌹 ॥ శ్రీ పరమేశ్వర స్తుతిః (వసిష్ఠ కృతమ్) ॥🌹 లింగమూర్తిం శివం స్తుత్వా గాయత్ర్యా యోగమాప్తవాన్ | నిర్వాణం పరమం బ్రహ్మ వసిష్ఠోన్యశ్చ శంకరాత్ || ౧ || నమః కనకలింగాయ వేదలింగాయ వై నమః | నమః పరమలింగాయ వ్యోమలింగాయ వై నమః || ౨ || నమస్సహస్రలింగాయ వహ్నిలింగాయ వై నమః | నమః పురాణలింగాయ శ్రుతిలింగాయ వై నమః || ౩ || నమః పాతాళలింగాయ బ్రహ్మలింగాయ వై నమః | నమో రహస్యలింగాయ సప్తద్వీపోర్ధ్వలింగినే || ౪ || నమస్సర్వాత్మలింగాయ సర్వలోకాంగలింగినే | నమస్త్వవ్యక్తలింగాయ బుద్ధిలింగాయ వై నమః || ౫ || నమోహంకారలింగాయ భూతలింగాయ వై నమః | నమ ఇంద్రియలింగాయ నమస్తన్మాత్రలింగినే || ౬ || నమః పురుషలింగాయ భావలింగాయ వై నమః | నమోరజోఽర్ధలింగాయ సత్త్వలింగాయ వై నమః || ౭ || నమస్తే భవలింగాయ నమస్త్రైగుణ్యలింగినే | నమో నాగతలింగాయ తేజోలింగాయ వై నమః || ౮ || నమో వాయూర్ధ్వలింగాయ శ్రుతిలింగాయ వై నమః | నమస్తే ధర్మలింగాయ సామలింగాయ వై నమః || ౯ || నమో యజ్ఞాంగలింగాయ యజ్ఞలింగాయ వై నమః | నమస్తే తత్త్వలింగాయ దేవానుగతలింగినే || ౧౦ || దిశ నః పరమం యోగమపత్యం మత్సమం తథా | బ్రహ్మ చైవా...

💥సకల గుణాభిరామా శ్రీరామా !

Image
 ⚜️🕉️🚩 శ్రీ రామ జయ రామ జయజయ రామ 🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ శ్రీరఘురామ చారు తులసీదళదామ, శమక్షమాది శృం గార గుణాభిరామ, త్రిజగన్నుత శౌర్య రమా లలామ దు ర్వార కబంధ రాక్షస విరామ, జగజ్జన కల్మషార్ణవో త్తారకరామ భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ! 🌹భావం: ఇక్ష్వాకువంశం సంపదలకు నెలవు. ఆ వంశంలో రఘుమహారాజు గొప్పవాడు. అటువంటి వంశ పరంపరలో పుట్టినవాడు. అందమైన తులసీదళాలతో తయారైన మాలికను ధరించినవాడు. శాంతి, ఓర్పు అనే మంచి లక్షణాలతో ప్రకాశించేవాడు. ముల్లోకాలలోనూ పొగడ్తలు అందుకున్నవాడు. పరాక్రమం అనే సంపదను ఆభరణంగా కలిగినవాడు. ఎవ్వరికీ ఎదుర్కోవడం సాధ్యం కాని కబంధుడనే రాక్షసుని వధించినవాడు. ప్రపంచంలోని మానవులను పాపాలు అనే సముద్రం నుంచి దాటించగల ‘రామా’ అనే పేరు గలవాడు. దయకు సముద్రం వంటివాడు. భద్రాచలం అనే కొండ పైభాగంలో నివాసం ఉన్నవాడు. దశరథ మహారాజుకు ముద్దుల కుమారుడు. ఆయనే శ్రీరాముడు. 🍁🍁🍁🍁🍁 💥సకల గుణాభిరామా శ్రీరామా ! "శ్రీరామచంద్రుడు" - పేరు వినగానే కన్నుల ఎదుట ఒక దివ్యమైన స్వరూపం సాక్షాత్కరిస్తుంది. ఆ రూపం సకల కల్యాణ గుణాలతో అలరారుతూ మనస్సులకు ఆనందాన్ని నింపుతూ మైమరపిస్తుంది. అదే శ్రీరామచంద్రునిలోని గొప్ప...

💥అయమేవ అయమేవ ఆదిపురుషో... (అన్నమాచార్య సంకీర్తన)

Image
 ⚜️🕉️🚩 ఓం నమో వేంకటేశాయ 🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ 💥అయమేవ అయమేవ ఆదిపురుషో... (అన్నమాచార్య సంకీర్తన) అయమేవ అయమేవ ఆదిపురుషో జయకరం తమహం శరణం భజామి అయమేవ ఖలుపురా అవనీధరస్తుసో- ప్యయమేవ వటదళాగ్రాధీశయన: అయమేవ దశవిధైరవతార రూపశ్చ నయమార్గ భువిరక్షణం కరోతి అయమేవ సతతం శ్రియహ్పతి ర్దేవేషు అయమేవ దుష్టదైత్యాంత కస్తు అయమేవ సకల భూతాంతరేష్వాక్రమ్య ప్రియభక్తపోషణం ప్రీత్యాదనోతి అయమేవ శ్రీవేంకటాద్రౌ విరాజితే అయమేవ వరదోప్యాచకానాం అయమేవ వేదవేదాంతైశ్చ సూచితో అయమేవ వైకుంఠాధీశ్వరస్తు 🍁🍁🍁🍁🍁 🌹#భావం: ఈతడే ఆదిపురుషుడు (సృష్టికి పూర్వం ఉన్నవాడు), సకల జయములు, శుభములు కలిగించు ఈతనిని నేను రక్షణ కోసం సేవించుచున్నాను. ఈతడే కదా పూర్వము భూమిని ధరించినవాడు,  పెద్దదైన మర్రి ఆకు మీద శయనించిన వాడు అతడు కూడా ఈతడే. (ఈ భూమి/సృష్టి మొత్తం నాశనం అయినప్పుడు, మహా విష్ణువు మరల సృష్టి చేయడానికి ముందు ఒక చిన్న బాలుడు రూపంలో మర్రి ఆకును పడవ గా చేసుకుని దానిపై పవళించినాడుట. (అన్నమయ్య రాసిన సంకీర్తన "తెప్పగా మర్రాకు మీద తేలాడువాడు" చదివితే మరింత అర్ధం అవుతుంది).  ఈతడే  పది రకాల అవతార రూపుడు మరియు న్యాయ మార్గము నందు...

గంగమ్మ తల్లి పన్నెండేండ్లకోసారి జరుపుకొనే పెద్ద పండుగ.. పుష్కరాలు!

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ గంగా దేవ్యై నమః 🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ 💥భారతీయత ఓ ముక్కాలిపీట అయితే... గీత.. గాయత్రి.. గంగ.. ఆ పీటకు మూడు కాళ్లని చెబుతారు. గంగమ్మ తల్లి పన్నెండేండ్లకోసారి జరుపుకొనే పెద్ద పండుగ.. పుష్కరాలు! బృహస్పతి మేషరాశిలో ప్రవేశించినప్పుడు గంగా పుష్కరం మొదలవుతుంది. బృహస్పతి పన్నెండో రాశి అయిన మీనంలో ప్రవేశించినప్పుడు గంగా పుష్కరం పూర్తి అవుతుంది. (ఏప్రిల్‌ 22న ఆరంభమైన గంగా పుష్కరాలు మే 3 న ముగుస్తాయి) తవజల మమలం యేననిపీతమ్‌ పరమపదం ఖలుతేన గృహీతమ్‌ మాతర్గంగే త్వయియో భక్తః కిల తం ద్రష్టుం న యమః శక్తః 🌹"తల్లీ! నీ నీళ్లు గుక్కెడు తాగినా చాలు. పరమ పదాన్ని చేరుకోవచ్చు. యమరాజు అంతటివాడైనా నీ భక్తులవైపు కన్నెత్తి చూడలేడు" అంటుంది భారతీయత. 🍁🍁🍁🍁 💥గంగమ్మా.. అంటూ నోరారా పిలుస్తారు తెలుగువారు. ఏ పెద్దమ్మనో పలకరించినట్టు, ఏ ముత్తయిదువనో ఇంటికి ఆహ్వానించినట్టు. మన గడ్డ మీద ప్రవహించకపోవచ్చు, కానీ మన గుండెల్లో మాత్రం గంగ పారుతూనే ఉంటుంది.  గోదావరి, తుంగభద్ర, కృష్ణ.. ప్రవాహాల్లోనే గంగా తరంగాలను ఊహించుకుంటాం. పెద్దలను ‘గంగా భాగీరథీ సమానులు’గా గౌరవించుకుంటాం. "గంగేచ యమునేచైవ గోదావరీ స...

💥నారదుడికి ముగురమ్మల మంత్రం... ఓం శ్రీ సతియే నమః

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ 💥నారదుడికి ముగురమ్మల మంత్రం... ఓం శ్రీ సతియే నమః ఒకసారి పాలసముద్రం శేషపాన్పుపై శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై ఉండగా, పార్వతీదేవి, సరస్వతీదేవి, లక్ష్మీదేవిని చూడటానికి వైకుంఠానికి వచ్చారు.  అల్లంత దూరాన వారిని చూసిన లక్ష్మీదేవి, భర్త అనుమతితో ఆయన పాదాలను వొత్తడం ఆపి, శేషపానుపు దిగి వారిద్దరినీ సాదరంగా ఆహ్వానించింది. ముగ్గురు సమీపంలోని ఓ ఉద్యానవనానికి వెళ్లి, ఓ చంద్రకాంత శిల మీద ఆసీనులై ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకోసాగారు. వారలా మాట్లాడుకుంటుండగా, దూరంగా నారదుడు వస్తుండటం కనిపించింది. నారదుడు కూడా వీరిని చూశాడు. ఇంకేం.. కలహభోజనుడు తనకు కావలసినంత కాలక్షేపం దొరికిందనుకున్నాడు. త్రిమూర్తుల భార్యలంతా ఒకేచోట కూర్చుని ఏదో విషయాన్ని గురించి మాట్లాడుకుంటున్నారు. కనుక ఏదో ఒక చిక్కు ప్రశ్న వేసి.. వారి మధ్య కలహాన్ని రేపి, తన నామానికి సార్థకతను చేకూర్చుకోవాలనుకున్నాడు. అదేవిధంగా జగన్మాతలు కూడా నారదుడిని చూసి "ఈ కలహ భోజనుడు ఊరకనే రాడు. ఇతనికి తగిన బుద్ధి చెప్పాలి'' అని నిర్ణయించుకుని బ్రహ్మ మానసపుత్రుడిని సగౌరవంగా ఆహ్వానించారు. ఈ సం...

💥హరిహర సుతనే ధర్మశాస్త్ర అయ్యప్ప...

Image
 ⚜️🕉️🚩ఓం హరి హర సుతనే... శరణమయ్యప్ప 🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ 💥హరిహర సుతనే ధర్మశాస్త్ర అయ్యప్ప... వర్ణనాతీతమైన దివ్యమైన ఙ్ఞానమంగళ విగ్రహం. హరిహరాత్మకమైన ఏక చైతన్యం, తత్వమసి, అహం బ్రహ్మాస్మి మొదలైన మహా వాక్యాల ద్వారా ప్రతిపాదింపబడుతున్న అద్వైత తత్వానికి సాకారం. ధ్యానిస్తే చాలు సమస్త తత్వసారమూ సాక్షాత్కారమవుతుంది. 🍁🍁🍁🍁🍁 💥#హరిహరాత్మకం: నారాయణుడు, శివుడు వేరు తత్వతః ఒక్కరే అని వేద, పురాణాలు సుస్పష్టంగా వక్కాణిస్తున్నాయి.  యోహం సత్వం జగచ్చేదం స దేవాసురమానుషం అవిద్యా మోహితాత్మానః పురుషా భిన్నదర్శినః 🌹"శంకరా, నేను దేవాసుర మనుషాది సహితమైన ఈ జగత్తు నీ స్వరూపమే. అవిద్యామోహితులు భిన్నభిన్నంగా భావిస్తారు" అని విష్ణుపురాణంలో విష్ణువచనం. అహం త్వం సర్వగోదేవ త్వమేవాహం జనార్దన ఆవయోరంతరం నాస్తి శబ్దై రర్ధై ర్జగత్త్రైయే 🌹"నేను సర్వగతుడవైన నీవే. నీవే నేను. శబ్దాలచే గాని, అర్ధాలచే గాని మన ఉభయులకు భేదం లేదు" అని హరివంశంలో శంకరుడు విష్ణువుతో అన్నమాటలు. ఈ అభేద ప్రతిపత్తి అయ్యప్ప రూపంలో రూఢి అవుతోంది. హరి, మోహిని రూపం ధరించగా, హరుడు మోహించాడని కథ. శివుడు అగ్ని తత్వం కాగా, నారాయణుడు జల త...

దత్తం దత్తం పునర్దత్తం యోవదేత్ భక్తి సంయుతః ! తస్య పాపాని సర్వాణి క్షయం యాంతి న సంశయః !!

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీదత్తాయ నమః🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ దత్తం దత్తం పునర్దత్తం యోవదేత్ భక్తి సంయుతః ! తస్య పాపాని సర్వాణి క్షయం యాంతి న సంశయః !! 🌹ఎవరైతే శ్రీ దత్తాత్రేయుని భక్తితో స్మరిస్తారో వారి సమస్త పాపములు నశిస్తాయి. దీనిలో సందేహం లేదని "దత్త హృదయం" నందు చెప్పబడినది. 🍁🍁🍁🍁🍁 శ్రీ దత్తాత్రేయుడు కేవలం స్మరణ మాత్ర్ర సంతుష్టుడు. తీవ్రమైన పూజాదికాలు చేయకపోయినా "అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ" అనే పవిత్ర భావనతో, భక్తితో దత్త, దత్త అని స్మరిస్తే చాలు ఏదో ఒక రూపంలో వచ్చి, రక్షించి కోరిన కోరికలు తీర్చు దయామయుడు శ్రీదత్తాత్రేయుడు. శ్రీభాగవత గ్రంథమునందు ప్రథమస్కంధ, తృతీయాధ్యాయములో భగవంతుని 21 అవతారములలో ఆరవ అవతారం దత్తాత్రేయుని అవతారమని చెప్పబడినది. స్వామి స్మరణ రోగాలను పటాపంచలు చేస్తుంది. భూత, ప్రేత, పిశాచ, గ్రహబాధలను దూరం చేస్తుంది. పీడకలలు దరిరావు. సర్ప,వృశ్చికాది జనిత విషబాధలు, కుష్టు మొదలైన వ్యాధులు నశిస్తాయి. త్రికరణశుద్ధి కలుగుతుంది. కోరిన కోర్కెలు నెరవేరి జీవితము ధన్యమవుతుంది. 💥శ్రీ దత్తుని రూపంలో అంతరార్థం... శ్రీ దత్తమూర్తి మూడు శిరస్సులతో, ఆరు భుజములతో, ఆయుధములతో,...

💥అంతర్వేది నరసింహుడు...

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ లక్ష్మి నృసింహస్వామినే నమః 🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ 💥 అంతర్వేది నరసింహుడు... దక్షిణ కాశీగా పిలుచుకునే "అంతర్వేది" గోదావరి, సాగర సంగమ పవిత్ర ప్రదేశం. సృష్టికర్త "చతుర్ముఖుడు" ఈ స్థల మహత్యమును గ్రహించి లోక శాంతి కోసం మహరుద్ర యాగం మనసారా ముగించి ఈశ్వరానుగ్రహమునకు పాత్రులై బ్రహ్మదేవుడే క్షేత్ర పాలకుని చేసి నీలకంఠేశ్వరుని ప్రతిష్టించాడని ప్రతీతి. అందువల్లనే అంతర్వేది "దక్షిణ కాశీ"గా ఖ్యాతి గడించింది. 🌹స్థల పురాణం: నారద మహర్షికి బ్రహ్మ తెలిపినట్టు పురాణాలు ఉటంకించే ఉదంతాన్ని పరిశీలిస్తే అంతర్వేది క్షేత్ర ఔన్నత్యం ప్రస్పుటమవుతుంది. పవిత్రతకు పరాకాష్ఠగా ఉన్న అంతర్వేదిని "బ్రహ్మర్షి వశిష్ఠ మహర్షి" ఆశ్రమానికి తగిన స్థలమని ఎంపిక చేసుకున్నారు. ఎన్నెన్నో యజ్ఞయాగాదులను నిరంతరం నిరాటంకంగా నిర్వహించుకున్నారు. అంతటి మహామునికి ముప్పు వాటిల్లకపోలేదు.  ఈశ్వరదత్త వరప్రసాద గర్వితుడైన హిరణ్యాక్ష కుమారుడు రత్నలోచనుడు విధ్వంసకాండకు పూనుకున్నాడు. ఈ కిరాత కృత్యాలు ఆశ్రమ వాటికకు ఆవేదన ఆందోళన కలిగించాయి. వశిష్టుని అర్ధాంగి అరుంధతిని హింసించాడు. ముని వనితలను చెర...

💥శ్రీ గజాననస్తోత్రం... (దేవర్షికృతం)

Image
 ⚜️🕉️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏 🏵️🌼❄️🏵️🌼❄️🏵️ 💥శ్రీ గజాననస్తోత్రం... (దేవర్షికృతం) దేవర్షయ ఊచుః | విదేహరూపం భవబన్ధహారం సదా స్వనిష్ఠం స్వసుఖప్రదమ్ తమ్ | అమేయసాంఖ్యేన చ లభ్యమీశం గజాననం భక్తియుతం భజామః || ౧ || మునీన్ద్రవన్ద్యం విధిబోధహీనం సుబుద్ధిదం బుద్ధిధరం ప్రశాన్తమ్ | వికారహీనం సకలాంమకం వై గజాననం భక్తియుతం భజామః || ౨ || అమేయ రూపం హృది సంస్థితం తం బ్రహ్మాఽహమేకం భ్రమనాశకారమ్ | అనాదిమధ్యాన్తమపారరూపం గజాననం భక్తియుతం భజామః || ౩ || జగత్ప్రమాణం జగదీశమేవ- -మగమ్యమాద్యం జగదాదిహీనమ్ | అనాత్మనాం మోహప్రదం పురాణం గజాననం భక్తియుతం భజామః || ౪ || న పృథ్విరూపం న జలప్రకాశం  న తేజసిస్థం న సమీరసంస్థమ్ | న ఖే గతం పంచవిభూతిహీనం గజాననం భక్తియుతం భజామః || ౫ || న విశ్వగం తైజసగం న ప్రాజ్ఞం సమష్టివ్యష్టిస్థమనన్తగం తమ్ | గుణైర్విహీనం పరమార్థభూతం గజాననం భక్తియుతం భజామః || ౬ || గణేశగం నైవ చ బిన్దుసంస్థం న దేహినం బోధమయం న ఢుణ్ఢీ | సంయోగహీనం ప్రవదన్తి తత్స్థం గజాననం భక్తియుతం భజామః || ౭ || అనాగతం గ్రైవగతం గణేశం కథం తదాకారమయం వదామః | తథాపి సర్వం ప్రతిదేహసంస్థం గజాననం భక్తియుతం భజామః || ౮ || యది త్వయా నాథ...

💥అగస్త్యుడు చేసిన స్కందస్తుతి స్తోత్రమ్... 🌹 షడాననాష్టకం🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యస్వామినే నమః 🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ శరవణభవ శరవణభవ శరవణభవ పాహిమాం శరవణభవ శరవణభవ శరవణభవ రక్షమాం🌹🙏 💥 అగస్త్యుడు చేసిన స్కందస్తుతి స్తోత్రమ్...    🌹 షడాననాష్టకం🌹🙏 అగస్త్య ఉవాచ నమోఽస్తు బృందారక బృందవంద్య పాదారవిందాయ సుధాకరాయ । షడాననాయామితవిక్రమాయ గౌరీ హృదానన్ద సముద్భవాయ || 1 || నమోఽస్తు తుభ్యం ప్రణతార్తి హన్త్రే కర్త్రే సమస్తస్య మనోరథానామ్ । దాత్రే రథానాం పరతారకస్య హన్త్రే ప్రచణ్డాసురతారకస్య || 2 || అమూర్తమూర్తాయ సహస్రమూర్తయే గుణాయ గణ్యాయ పరాత్పరాయ । అపారపారాయ పరాపరాయ నమోఽస్తు తుభ్యం శిఖివాహనాయ || 3 || నమోఽస్తు తే బ్రహ్మవిదాంవరాయ దిగమ్బరాయామ్బరసంస్థితాయ । హిరణ్యవర్ణాయ హిరణ్యబాహవే నమోహిరణ్యాయ హిరణ్యరేతసే || 4 || తపః స్వరూపాయ తపోధనాయ తపః ఫలానాం ప్రతిపాదకాయ । సదా కుమారాయ హి మార మారిణే తృణీకృతైశ్వర్య విరాగిణే నమః || 5 || నమోఽస్తు తుభ్యం శరజన్మనే విభో ప్రభాతసూర్యారుణదన్తపంక్తయే । బాలాయ చ బాలపరాక్రమాయ షాణ్మాతురాయాఖిల మనాతురాయ || 6 || మీఢుష్టమాయోత్తరమీఢుషే నమో నమో గణానాం పతయే గణాయ । నమోఽస్తు తే జన్మజరాతిగాయ నమో విశాఖాయ సుశక్తిపాణయే...

💥శ్రీ హనుమాల్లాంగూలాస్త్ర స్తోత్రం...

Image
 ⚜️🕉️🚩 శ్రీ ఆంజనేయం 🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ 💥శ్రీ హనుమాల్లాంగూలాస్త్ర స్తోత్రం. .. జ్వలత్ కాంచన వర్ణాయ దీర్ఘలాంగూల ధారిణే సౌమిత్రే జయదాత్రేచ రామదూతాయతే నమః ॥ పంచవక్త్రం మహభీమం త్రిపంచనీయ నైయ నైర్యుతం దశభిర్భాహుభిర్యుక్తం సర్వకామార్ధ సిద్ధిదమ్ || 🌹లంకా దహనం చేసి, లక్ష్మణుని కాపాడిన రామదూత హనుమంతుని ప్రార్థిస్తూ తులసీదాసు "హనుమాన్ లాంగులాస్త్ర స్తోత్రం" రచించాడు.  తులసీదాసు కాశీలో ఉండగా ఆయన భైరవస్వామిని పూజించ లేదు. ఆ అపచారానికి భైరవస్వామి తులసీ దాసు భుజాన్ని గాయపరిచాడు. బాధను తాళలేక తులసీదాసు హనుమంతుని తన తోకతో ఒక్కసారి ఆ గాయాన్ని నిమిరి తనను అక్కున చేర్చుకొమ్మని ప్రార్థించాడు.  హనుమంతుడు తులసీదాసు ప్రార్థన విని అతని భుజాన్ని తన తోకతో స్పర్శించి బాధను తొలగించాడు. 🍁🍁🍁🍁🍁 💥"హనుమాల్లాంగూలాస్త్ర స్తోత్రం" ఎంతో మహిమాన్వితమైనది. ఈ స్తోత్రాన్ని నిత్యం పఠించడం వల్ల అన్నింటిలోనూ విజయం సాధిస్తారని నమ్మకం. ఈ స్తోత్రాన్ని రావి చెట్టు క్రింద కూర్చుని చదవటం మూలన పుణ్య ఫలాన్ని పొందవచ్చు. 🌹🌹#హనుమాల్లాంగూలాస్త్ర_స్తోత్రం🌹🌹 శ్రీమంతం హనుమంత మాత్త రిపుభి ర్భూభృత్తరు భ్రాజితం| చా...

వైశాఖ శుద్ధ పంచమి "జగద్గురు" ఆదిశంకరాచార్య జయంతి...

Image
 ⚜️🕉️🚩ధర్మోద్ధారకులు #శంకరాచార్యులు🌹🙏 జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర 🌹 వైశాఖ శుద్ధ పంచమి "జగద్గురు" ఆదిశంకరాచార్య జయంతి..⚜️🕉️🚩ధర్మోద్ధారకులు శంకరాచార్యులు🌹🙏 జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర 🌹 వైశాఖ శుద్ధ పంచమి "జగద్గురు" ఆదిశంకరాచార్య జయంతి... శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరమ్‌ !! మన భారత ఖండంలో అనేకానేక కొత్త కొత్త సిద్ధాంతాలు, మతాలూ పుట్టుకొచ్చి, ప్రజలకి సనాతన ధర్మం పట్ల, భగవంతుని పట్ల విశ్వాసం సన్నగిల్లుతున్న సమయంలో మన సనాతన ధర్మ పరిరక్షణకై అవతరించిన అపర శంకరావతారమే "ఆది శంకరాచార్య" దుష్టాచార వినాశాయ ప్రాతుర్భూతో మహీతలే ! స ఏవ శంకరాచార్యః సాక్షాత్ కైవల్య నాయకః !! 🌹దుష్టాచారములను నశింప చేయటానికి కైవల్య నాయకుడైన శంకరుడే ఆది శంకరుని రూపంలో అవతరించాడు. (శివరహస్యము నుండి) కరిష్యత్స్యవతారం స్వం శంకరో నీలలోహితః!  శౌత స్మార్త ప్రతిష్ఠార్థం భక్తానాం హిత కామ్యాయా !! 🌹శ్రౌత, స్మార్త క్రియలను సుప్రతిష్ఠితం చేసి, వైదిక మార్గాన్ని సక్రమంగా నిలబెట్టడానికి నీలలోహితుడు (శివుడు) స్వయంగా శంకరుల రూపంలో అ...

💥వందే శివం శంకరం స్తోత్రము... తాత్పర్యము.

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 🔱 హర హర మహాదేవ శంభో శంకర 🔱 🏵️🌼❄️🏵️🌼❄️🏵️ 💥వందే శివం శంకరం స్తోత్రము... తాత్పర్యము. వందే శంభు ముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం 🌹తాత్పర్యము:   ఆనందానికి మూలము (శంభు), ఉమాపతి, దేవతలకు అధిపతి, జగత్తుకు కారణమైన వాడు, సర్పములు ఆభరణములుగా కలవాడు, జింకను చేత కలవాడు, జీవ గణములకు అధిపతి (పశుపతి), సూర్య చంద్రులు, అగ్ని మూడు నేత్రములుగా కలవాడు, విష్ణువునకు ప్రియుడు, భక్త జనులకు ఆశ్రయుడు, వరములిచ్చే వాడు అయిన శివునకు, శంకరునకు నా పరి పరి వందనములు. వందే సర్వజగద్విహారమతులం వందేఽంధకధ్వంసినం వందే దేవశిఖామణిం శశినిభం వందే హరేర్వల్లభం వందే నాగభుజంగభూషణధరం వందే శివం చిన్మయం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం 🌹తాత్పర్యము:   జగత్తు అంతా విహరించే వాడు, సాటి లేని వాడు, అంధకాసురుని నాశనము చేసిన వాడు, దేవతలలో ఉత్తమమైన వాడు, చంద్రుని ధరించిన వాడు, విష్ణువునకు ప్రియుడు, సర్పములు, నాగరాజు ఆభరణములుగా కలవాడు, చిదానందుడు, శుద్ధ ప...

💥అక్షయపాత్ర

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ సూర్య నారాయణ స్వామినే నమః 🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ 💥 అక్షయపాత్ర ... అనుద్యూతంలో కూడా ఓడిపోయాకా అన్నమాట ప్రకారం పాండవులు రాజభోగాలన్నీ విడిచిపెట్టారు. నారచీరలూ, కృష్ణజినమూ ధరించారు. కందమూల ఫలాలు తింటూ పన్నెండేళ్ళు అరణ్యవాసమూ, ఒక ఏడాది అజ్ఞాతవాసమూ చేయడానికి సంసిద్ధులయ్యారు. అలా వెళ్తున్న వాళ్ళను చూసి – "ఏమున్నా ఏం లేకపోయినా ఈ పరమదుష్టుడు దుర్యోధనుడి రాజ్యంలో మాత్రం మనం వుండలేం. అసలు వాడే దుర్మార్గుడు. పైగా వాడికి జర, వ్యాది, మృత్యుపుల్లగా కర్ణుడు, సైంధవుడు , శకుని తోడయ్యారు. ఇటువంటి పుణ్యపురుషుడు రాజ్యం చేస్తుంటే ఇంక ఈ దేశంలో ధర్మం ఏం నిలుస్తుంది కనుక! పదండి, మనం కూడా పాండవులతో వెళ్ళి వాళ్ళెక్కడుంటే అక్కడే వుందాం” అని ఆక్రోశిస్తూ పౌరులంతా పాండవుల వెంట పరుగెత్తారు. "నాయనలారా! మేము సర్వమూ పోగొట్టుకున్నాం. కందమూలాలే తింటూ అరణ్యవాసం చేయబోతున్నాం. మాతో పాటు మీరు కూడా కష్టపడటమెందుకు? మామీద అనుగ్రహముంచి వెనెక్కి వెళ్ళిపోండి” అని పాండవులు బ్రతిమాలారు. "ధర్మరాజా! నీవున్న అరణ్యమే మాకు శరణ్యం. ఆశ్రయించినవాళ్ళు శత్రువులైనా విడిచి పెట్టకూడదంటారు. అలాంటప్పుడు మీ మీద భక్తి కలి...

💥వటపత్రశాయి.. (అరణ్యపర్వము)

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం | వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి || 🌹కలువల వంటి చేతులతో పద్మముల వంటి పాదములు పట్టుకొని తన కలువ వంటి ముఖము వద్దకు తీసుకువచ్చి మనలను అలరించే, వట పత్ర శాయి అయిన ఆ బాల ముకుందుని (మొక్షానందాన్ని కలిగించే వాడు) మనసులో స్మరిస్తున్నాను. 🍁🍁🍁🍁🍁 💥వటపత్రశాయి.. (అరణ్యపర్వము) ధర్మజా! ఈ కల్పాంతంలో నేను దిక్కుతోచక తిరిగాను. జలప్రళయంలో పెద్ద మర్రి చెట్టు కనపడింది. ఆ మర్రి ఆకు మీద నీలమేఘశ్యాముడైన శ్రీమహావిష్ణువు చిన్ని బాలుని వలె పడుకుని ఉన్నాడు. ఈ మహాప్రళయంలో ఈ చిన్ని బాలుడు ఎలా ఉన్నాడా అని ఆశ్చర్య పోయాను. నేను ఆ బాలుని దగ్గరగా పోయాను. ఆ బాలుడు నన్ను చూసి నవ్వుతూ "మహానుభావా ! నీకు విశ్రాంతి లేక అలసి పోయి ఉన్నావు. నా దేహంలో ప్రవేశించి కొంచెం విశ్రాంతి తీసుకో" అంటూ తన నోరు తెరిచాడు. నేను ఆ నోట్లోకి బలవంతంగా నెట్టబడ్డాను. ఆ బాలుని నోట్లో గంగ లాంటి మహానదులూ, మేరు పర్వతం లాంటి పర్వతాలు, సముద్రాలు, నగరాలు, జనపదాలు, ప్రజలు, పశుపక్ష్యాదులూ, సువిశాల భాగాలూ సూర్య చంద్రులూ, నక్షత్ర సముదాయాల...

🕉️🚩 ఓం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామినే నమః 🙏

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామినే నమః 🙏 🏵️🌼🏵️🌼🏵️ గంగధార సమం తీర్థం క్షైత్రం సింహాద్రి నాసమం నారసింహ సమోదేవో త్రైలోక్యే నాస్తి నిశ్చయః  🌹గంగధారకి సరియైన తీర్థం, సింహగిరికి సమమైన క్షేత్రం, నారసింహుని వంటి దైవం ముల్లోకాల్లోనూ లేదన్నది తథ్యం.  🍁🍁🍁🍁🍁 💥త్రేతాయుగంలో భారతావనిని పరిపాలిస్తున్న చంద్ర వంశీయుడైన "పురూరవ" చక్రవర్తి ఒకనాడు ప్రేయసి ఊర్వశితో కలిసి ఆకాశయానం చేస్తూ సింహగిరి పరిసరాలకు రాగానే వారి పుష్పక విమానం నిలిచిపోయింది. విషయం తెలియక పురూరవుడు దిగులు చెందాడు. ఊర్వశి తన దివ్యదృష్టితో తామున్నది పరమ పవిత్రమైన సింహగిరి ప్రాంతమని గ్రహిస్తుంది. ఇక్కడ వరాహ నృసింహుడు కొలువైనాడనీ, స్వామిని దర్శించి తరిద్దామని పురూరవునికి సూచిస్తుంది. పురూరవుడు స్వామి వెదుకులాటలో మూడు రోజులు గడుపుతాడు. ఎంతకీ స్వామి కానరాకపోవడంతో ప్రాయోపవేశానికి సిద్ధపడతాడు. రాత్రి స్వప్నంలో స్వామి సాక్షాత్కరిస్తాడు. తాను పక్కనే ఉన్న పుట్టలో ఉన్నానని గంగధారని ఆనవాలుగా చూపుతాడు. స్వామి ఆదేశానుసారం పురూరవుడు వేయి కడవల నీటితోనూ, పంచమృతాలతో అభిషేకం చేసి స్వామి దర్శనాన్ని పొందుతాడు. అయినను స్వా...