దత్తం దత్తం పునర్దత్తం యోవదేత్ భక్తి సంయుతః ! తస్య పాపాని సర్వాణి క్షయం యాంతి న సంశయః !!

 ⚜️🕉️🚩 ఓం శ్రీదత్తాయ నమః🌹🙏

🏵️🌼🏵️🌼🏵️


దత్తం దత్తం పునర్దత్తం యోవదేత్ భక్తి సంయుతః !

తస్య పాపాని సర్వాణి క్షయం యాంతి న సంశయః !!


🌹ఎవరైతే శ్రీ దత్తాత్రేయుని భక్తితో స్మరిస్తారో వారి సమస్త పాపములు నశిస్తాయి.

దీనిలో సందేహం లేదని "దత్త హృదయం" నందు చెప్పబడినది.

🍁🍁🍁🍁🍁


శ్రీ దత్తాత్రేయుడు కేవలం స్మరణ మాత్ర్ర సంతుష్టుడు.

తీవ్రమైన పూజాదికాలు చేయకపోయినా

"అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ" అనే పవిత్ర భావనతో, భక్తితో దత్త, దత్త అని స్మరిస్తే చాలు ఏదో ఒక రూపంలో వచ్చి, రక్షించి కోరిన కోరికలు తీర్చు దయామయుడు శ్రీదత్తాత్రేయుడు.


శ్రీభాగవత గ్రంథమునందు ప్రథమస్కంధ, తృతీయాధ్యాయములో భగవంతుని 21 అవతారములలో ఆరవ అవతారం దత్తాత్రేయుని అవతారమని చెప్పబడినది.


స్వామి స్మరణ రోగాలను పటాపంచలు చేస్తుంది.

భూత, ప్రేత, పిశాచ, గ్రహబాధలను దూరం చేస్తుంది. పీడకలలు దరిరావు.

సర్ప,వృశ్చికాది జనిత విషబాధలు, కుష్టు మొదలైన వ్యాధులు నశిస్తాయి.

త్రికరణశుద్ధి కలుగుతుంది.

కోరిన కోర్కెలు నెరవేరి జీవితము ధన్యమవుతుంది.


💥శ్రీ దత్తుని రూపంలో అంతరార్థం...


శ్రీ దత్తమూర్తి మూడు శిరస్సులతో, ఆరు భుజములతో, ఆయుధములతో, నాలుగు కుక్కలతో, ఆవుతో ఉన్నట్టు చిత్రించబడి ఉంటుంది. వీటికి గల అర్థాలను పరిశీలిస్తే


🌹మూడు శిరస్సులు: 


బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, సృష్టి, స్థితి, లయములు, ఓంకారములోని అ, ఉ, మ లు త్రిమూర్త్యాత్మక పరబ్రహ్మము.


🌹నాలుగు కుక్కలు:


నాలుగు వేదములు ఇవి.

శ్రీ దత్తమూర్తి సకల వేదవిజ్ఞానమును అధిగమించిన జ్ఞానసాగరుడు.


🌹ఆవు:


మనసే మాయాశక్తి. సంకల్ప, వికల్పములకు, సుఖదుఃఖములకు కారణమైన మాయను యోగబలముచే శ్రీదత్తమూర్తి కామధేనువుగా మార్చాడు.


🌹మాల:


అక్షరమాల, సర్వమంత్రమయము, సమస్త వైఖరి, వాగ్జాలమునకు,సాహిత్యసంగీతములకు సర్వ వ్యవహారములకు మూలము.


🌹త్రిశూలము :


ఆచారము, వ్యవహారము, ధర్మార్థ కామముల సంపుటి.


🌹చక్రము:


అవిద్యా నాశకము, ఆత్మావలోకన, సామర్థ్యమును, వివేకమును కలుగచేయును.


🌹డమరు:


సర్వవేదములు దీనినుంచి ప్రాదుర్భవించినవి.


🌹కమండలము:


సమస్త బాధలను పోగొట్టును.

శుభములను సమకూర్చును.

🔸🔹🔸🔹🔸


దిగంబరం భస్మవిలేపితాంగం !

బోధాత్మకం ముక్తితరం ప్రసన్నం !

నిర్మానసం శ్యామల తనుంభజేహమ్ !

దత్తాత్రేయం బ్రహ్మ సమాధియుక్తం !!


అనసూయాత్రి సంభూతా దత్తాత్రేయో దిగంబరః !

స్మర్తృగామి స్వభక్తాన ముద్ధార్థ భవసంకటాత్ !!


🍁పై రెండు శ్లోకాలు నిత్యం 108 సార్లు పఠిస్తే కష్టాల బాధలుండవు.


నమస్తే భగవాన్ దేవ దత్తాత్రేయ జగత్ ప్రభో !

సర్వరోగ ప్రశమనం కురుశాన్తిం ప్రయచ్చమే !!


🍁ఈ శ్లోక జపంవల్ల రోగభయం ఉండదు. దీర్ఘకాలిక రోగాలు నిదానిస్తాయి.


అత్రేరాత్మ ప్రధానేన యోముక్తో భగవాన్ ఋణాత్ !

దత్తత్రేయం తమీశానం నమామి ఋణవిముక్తయే !!


🍁ఈ శ్లోకజపం అప్పులబాధను నివారిస్తుంది.


విద్యుత్సుత మవిద్యం యత్ ఆగతం లోకనిందితం !

భిన్న జిహ్వం బుధం చక్రే శ్రీ దత్తం శరణం మమ !!


🍁ఈ శ్లోక పఠనం వలన ఉన్నత విద్య లబిస్తుంది.


దరిద్ర విప్రగే హేయః శాకం భుక్త్యోత్త మశ్రియం !

దదౌ శ్రీ దత్త దేవః సదాదారిద్ర్యాత్ శ్రీ పదో2వతు !!


🍁ఈ శ్లోకం దరిద్రం నుంచి విముక్తి కలిగిస్తుంది.


దూరీకృత్య పిశాచార్తిం జీవయిత్వామృతం సుతమ్ !

యో భూదభీష్టదః పాతునః సంతాన వృద్ధికృత్ !! 


🍁ఈ శ్లోకం సత్సంతానాన్ని అనుగ్రహిస్తుంది.


అచింత్యా వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే !

సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః !!


🍁ప్రతి నిత్యం పై శ్లోకాలన్నీ కానీ లేదా మీకవసరమైనవిగానీ పఠించి శ్రీ దత్తాత్రేయుని అనుగ్రహం పొందండి.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు